Movie Reviews
Professional reviews and ratings from top critics and publications worldwide
యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ హీరోగా నటించిన రూరల్ లవ్, ఫ్యామిలీ డ్రామా ‘గోదారి గట్టుపైన’ తాజాగా థియేటర్లలో రిలీజ్ కాగా, మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. సుభాష్ చంద్ర దర్శకత్వంలో రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించింది. అయితే రొటీన్ కథా కథనాలతో సినిమా ఆడియన్స్ ని అంతగా మెప్పించలేదు. గోదావరి నేటివిటీ బాగానే చూపించినా ఇంట్రెస్టింగ్ సీన్స్ తో ఆసక్తిగా చూపించలేకపోయారు.
ఓవరాల్ గా “గోదారి గట్టుపైన’’ అంటూ ఎమోషనల్ లవ్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ చిత్రంలో.. మెయిన్ థీమ్, ప్రేమ సన్నివేశాలు అండ్ ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. సుమంత్ ప్రభాస్, జగపతి బాబు నటన కూడా చాలా బాగుంది. ఐతే, కొన్ని రెగ్యులర్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ సినిమాలో కొన్ని లవ్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ మాత్రమే ఆకట్టుకుంటాయి.
లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ "సతీ లీలావతి". లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ తాజాగా థియేటర్లలో విడుదలైంది. ఇక సినిమా విషయానికి వస్తే... రొటీన్ కథా కథనాలతో దర్శకుడు తాతినేని సత్య ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించాడు. పెర్ఫార్మన్స్ పరంగా లావణ్య త్రిపాఠి వన్ విమెన్ షోగా నడిపించింది.
ఓవరాల్ గా చూసుకుంటే, ‘సతీ లీలావతి’ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయింది. లావణ్య త్రిపాఠి పెర్ఫార్మెన్స్ మరియు పర్వాలేదనిపించే ఫస్టాఫ్ సినిమాకు ప్లస్ అయ్యాయి. సెకండాఫ్ లో వచ్చే కామెడీ ట్రాక్స్, మెయిన్ ప్లాట్ నుంచి కథ డీవియేట్ కావడం మైనస్. ఈ వీకెండ్ ఏదైనా ఫ్యామిలీ డ్రామా చూడాలనుకునే వారు తక్కువ అంచనాలతో ఈ చిత్రాన్ని చూడటం బెటర్.
తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన గాయపడ్డ సింహం తాజాగా థియేటర్లలో విడుదల కాగా థియేటర్లలో మిక్స్డ్ రెస్పన్స్ అందుకుంది. కాగా ఈ సినిమా ప్రమోషన్లలో ట్రంప్ అంశాన్ని వినియోగించడం వల్ల ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఫస్ట్ హాఫ్ లో ప్రేమ కథ, అమెరికా ప్రయాణం, ట్రంప్ పై ప్రతీకారం వంటి అంశాలు ప్రధానంగా చూపించారు. సెకండ్ హాఫ్ లో పోలీస్ అంశాలు, ధర్మ పాత్ర, భైరవ్ దాస్ కథ ప్రధానంగా సాగుతుంది. శ్రీ విష్ణు పాత్ర గెస్ట్ రోల్ గా కాకుండా సెకండ్ హీరోలా కనిపించడం విశేషం. అతని పాత్రకు ప్రత్యేకంగా కథను రూపొందించడం కొత్తగా అనిపించింది.
అయితే ఈ ప్రయోగం మెయిన్ స్టోరీని కొంతవరకు డామినేట్ చేసినట్లు అనిపిస్తుంది. భైరవ్ దాస్ పాత్ర ఆధారంగా భవిష్యత్తులో ప్రత్యేక సినిమా వచ్చే అవకాశం ఉందని క్లైమాక్స్ తో హింట్ ఇచ్చారు టీమ్. ట్రంప్‌కు సంబంధించిన సన్నివేశాలు హాస్యాన్ని అందిస్తాయి. అమెరికాకు వెళ్లాలని ఆశపడే ప్రేక్షకులకు ఈ కథ కనెక్ట్ అవుతుంది. కొన్ని చోట్ల కథ నెమ్మదిగా సాగినప్పటికీ, కామెడీ సీన్స్ కడుబుబ్బా నవ్విస్తాయి. ఓవరాల్ గా సినిమా గురించి సింపుల్ గా చెప్పేస్తే... “గాయపడ్డ సింహం” సినిమా అమెరికా వెళ్లాలన్న ఓ వ్యక్తి కల నెరవేరకపోవడంతో అతను తీసుకున్న నిర్ణయాలు, వాటి ప్రభావం చుట్టూ తిరిగే కథ. కామెడీ, యాక్షన్, ఎమోషనల్ అంశాలతో సినిమా రూపొందించబడింది. హ్యాపీగా నవ్వుకోవాలి అనుకునేవారికి గాయపడ్డ సింహం సినిమా మంచి ఆప్షన్.
గాయపడ్డ సింహం కథ విషయానికి వస్తే... డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడు అయినప్పటి నుంచి తన నిర్ణయాలతో ప్రపంచాన్ని ఎలా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడో తెలిసిందే. అలాంటి నిర్ణయాల్లో వీసా రద్దు నిబంధనలు కూడా ఒకటి. దీనివల్ల అందరికంటే ఎక్కువగా ఇండియన్సే ఇబ్బంది పడ్డారు. ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకుని కామెడీ ప్రధానంగా తెరకెక్కిన గాయపడ్డ సింహం ఆడియన్స్ ని బానే మెప్పిస్తుంది. కామెడీ బాగా రాయగలిగిన రైటర్ అయితే దీని మీద మంచి కామెడీ సీన్లతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించేవాడు.
కానీ కొత్త దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్. ఒరిజినల్ కామెడీని పండించలేక ఎక్కువగా స్పూఫుల మీద ఆధారపడ్డాడు. ఈ క్రమంలో అక్కడక్కడా కొన్ని నవ్వులు పండాయి కానీ.. ఆ డోస్ సరిపోలేదు. తనను డిపోర్ట్ చేయించిన ట్రంప్ మీద ప్రతీకారం తీర్చుకునే హీరో, ఈ పాయింట్ మీదే ఈ కథను నడిపిస్తే అది హిలేరియస్ గా వర్కవుట్ అయ్యేదేమో. కానీ ఇందులోకి క్రైమ్ రాకెట్ ట్రాక్ ను తీసుకొచ్చి మిక్స్ చేయడంతో ఈ కథ రొటీన్ క్రైమ్ కామెడీలా రూట్ తీసుకుంది. ఇక జేడీ చక్రవర్తి పాత్ర గురించి ప్రోమోల్లో ఇచ్చిన బిల్డప్ కి సినిమాలో ఉన్నదానికి పొంతన లేదు. అసలు ‘గాయపడ్డ సింహం’ టైటిల్ కే న్యాయం జరగలేదు. ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా అక్కడక్కడా కొన్ని నవ్వులతో సరిపెట్టుకుంటాం అంటే ఈ చిత్రంపై ఒక లుక్కేయొచ్చు. అంతకుమించి ఆశిస్తే కష్టం.
తరుణ్ భాస్కర్‌కి దర్శకుడిగా మంచి విజయాలున్నాయి. కానీ నటుడిగా, హీరోగా మాత్రం ఆ రేంజ్ సక్సెస్‌ని ఇంకా అందుకోలేదు. తరుణ్ భాస్కర్ నుంచి ఆడియెన్స్ ఎక్కువగా డైరెక్షన్ కోరుకుంటున్నారు. కానీ తరుణ్ భాస్కర్ మాత్రం ఎక్కువగా నటన మీద ఫోకస్ పెట్టినట్టు అనిపిస్తుంది.యాక్టర్‌గానూ తరుణ్ భాస్కర్ కి మంచి పేరు అయితే ఉంది కానీ సరైన సక్సెస్ లేదు. ఇపుడు ‘గాయపడ్డ సింహం’తో మరోసారి ఆడియన్స్ ముందుకు వచ్చాడు. అయితే సినిమాకు ఆడియన్స్ నుండి ఊహించిన రేంజ్ లో అయితే రెస్పాన్స్ రాలేదు.
కథా కథనాలు చాలా ఆర్డినరీగా ఉండి కాస్త డిస్సపాయింట్ చేసింది. ఎంటర్టైన్మెంట్ బానే చేసినా ఫ్రెష్ కామెడీ రిపీటెడ్ కామెడీలా అనిపించలేదు. టెక్నికల్ గా చూసుకుంటే గాయపడ్డ సింహం ఓకే అనిపిస్తుంది. పాటలు అంత గుర్తు పెట్టుకునేలా ఉండకపోయినా ఆర్ఆర్ బాగుంటుంది. విజువల్స్ కూడా రిచ్ గా అనిపిస్తాయి. ఈ మూవీని లిమిటెడ్ బడ్జెట్ లో, తక్కువ లొకేషన్లలోనే చుట్టేసినట్టుగా అనిపిస్తుంది. కొన్ని చోట్ల డైలాగ్స్, మీమ్స్ రిఫరెన్స్ బాగుంటాయి. ఎడిటింగ్, ఆర్ట్ ఇలా అన్ని డిపార్మెంట్స్ పర్వాలేదనిపిస్తాయి. అలాగే క్లైమాక్స్ లో పోరాట సింహం అంటూ సీక్వెల్ కూడా అనౌన్స్ చేస్తారు. దానికన్నా ముందు ఫస్ట్ పార్ట్ ఆడియన్స్ ని ఎంతవరకు మెప్పిస్తోందో ఫైనల్ గా చూడాలి.
గాయపడ్డ సింహం అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన తరుణ్ భాస్కర్ ఎప్పట్లానే తన న్యాచురల్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నాడు.
ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే అందరి లానే హీరో కూడా అమెరికా వెళ్ళాలని అనుకుంటాడు, కానీ తన విసా రిజక్ట్ అవ్వడంతో ఏకంగా ట్రంప్ మీదే పగ తీర్చుకోవాలని డిసైడ్ అవుతాడు. దాంతో హీరో ఏం చేశాడు, ఆ తర్వాత కథేంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఓవరాల్ గా కథ సిల్లీగా అనిపించినా కూడా కామెడీ పరంగా బానే వర్కౌట్ అయ్యే స్కోప్ ఉన్న పాయింట్ ను కొంచెం కన్ఫ్యూజన్ స్క్రీన్ ప్లే తో డైరెక్టర్ పూర్తిగా అనుకున్న రేంజ్ లో తీయలేకపోయాడు.
అయితే ఉన్నంతలో సినిమాలో ఎంటర్టైన్మెంట్ బానే మెప్పించింది. తరుణ్ భాస్కర్ తన వరకు బాగా నటించి మెప్పించగా టాప్ స్టార్ మూవీస్ రిఫరెన్స్ లు సినిమాలో బాగానే వర్కౌట్ అయ్యాయి అని చెప్పాలి. అన్నిటికి మించి కొంత గ్యాప్ తర్వాత జేడీ చక్రవర్తి పర్వాలేదు అనిపించేలా నటించగా స్పెషల్ క్యామియో చేసిన శ్రీ విష్ణు ఉన్న సీన్స్ అన్నీ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. ఓవరాల్ గా ఆడియన్స్ ముందే తక్కువ అంచనాలతో థియేటర్స్ కి వెళితే చాలా వరకు ఎంజాయ్ చేసి పర్వాలేదు, మంచి సినిమానే చూశాం అన్న ఫీలింగ్ తో థియేటర్స్ బయటికి రావొచ్చు.
క్రైమ్ కామెడీ సినిమాలకు పెద్దగా లాజిక్‌లు వెతకకూడదు, చూసినంత సేపు నవ్వుకుంటే చాలు. ఇదే విధంగా గాయపడ్డ సింహం సినిమాలో కూడా ట్రంప్ మీద హీరో పగ తీర్చుకోవాలనుకునే సిల్లీ పాయింట్ లోనే కావాల్సినంత కామెడీ పుట్టింది. తరుణ్ భాస్కర్ హీరోగా బానే చేసినా, కొత్త తరహాలో చేసిందేమి లేదు. అందరికీ సిల్లీగా అనిపించే విషయాన్ని హీరో చాలా సీరియస్‌గా తీసుకోవడం బాగుంది. అయితే, కథనం చాలా నెమ్మదిగా సాగడం వల్ల సినిమా ముందుకు సాగకుండా అక్కడే తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. కథలోకి వెళ్లడానికి చాలా సమయం తీసుకున్నారు. అందులోనూ వచ్చే పాటలు కథకు అడ్డం తగిలి బ్రేకులు వేస్తూ ఉంటాయి.
ఇక తరుణ్ భాస్కర్, జేడీ చక్రవర్తి నటన ఈ సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్‌గా నిలిచింది. అక్కడక్కడా కామెడీ అద్భుతంగా పేలింది. ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ సెకండాఫ్. సెకండాఫ్ అభిమానులను ఆకట్టుకునేలా తీశారు. అయితే ఫస్టాఫ్ లో కథాంశం స్లోగా సాగుతుంది. ఉడికీ ఉడకని కథ, కథనంతో దర్శకుడు ప్రేక్షకులను కాస్త కన్‌ఫ్యూజ్ చేశాడు. సీరియస్ అంశాల వల్ల తికమక జరిగింది. ఓవరాల్ గా 'గాయపడిన సింహం' పెద్దగా అంచనాలు లేకుండా ఓసారి చూడదగ్గ క్రైమ్ కామెడీ చిత్రం. అయితే టైటిల్ కు తగ్గట్టుగానే కొన్నిసార్లు ఆ 'గాయపడిన సింహం' ప్రేక్షకులను కూడా కాస్త గాయపరిచే ప్రయత్నమే చేసింది.
స్పూఫ్ లేదా పేరడీ ప్రధాన ఉద్దేశం ప్రేక్షకులను నవ్వించడం. స్పూఫ్ సీన్ వచ్చినప్పుడు థియేటర్లలో విజిల్స్, క్లాప్స్, నవ్వులు వినిపించ లేదంటే రైటింగ్ పరంగా మేజిక్ మిస్ అయినట్టే. 'గాయపడ్డ సింహం' విషయంలో జరిగింది అదే. 'జల్సా' నుంచి మొదలు పెడితే... 'కేజీఎఫ్', 'అర్జున్ రెడ్డి', 'బొమ్మరిల్లు' వంటి పలు సినిమాలను స్పూఫ్ చేశాడు. ఒక్క స్పూఫ్ కూడా వర్కవుట్ అవ్వలేదు. కథగా చూస్తే... 'గాయపడ్డ సింహం' పాయింట్ లో మంచి పొటెన్షియల్ ఉంది. ట్రంప్ మీద రివేంజ్ తీర్చుకోవాలని అనుకోవడం, అదీ చేతబడి చేయాలని హీరో ట్రై చేయడంలో తెలియని అమాయకత్వం ఉంది. అయితే స్పూఫ్స్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యారు. కానీ, వర్కవుట్ అవ్వలేదు.
ఇటు డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్ సిట్యువేషనల్ హ్యూమర్ మాత్రమే కాదు... పంచ్ డైలాగ్ కామెడీని కూడా మిస్ చేశారు. అయితే రైటింగ్ పరంగా ఫెయిల్ అయినా... స్టయిలిష్ ఫిల్మ్ మేకింగ్ కొంత బావుంది. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ కొంత మేరకు ఆకట్టుకున్నాయి. ఇక తరుణ్ భాస్కర్ తన పాత్రకు తగ్గట్టు నటించారు. పెర్ఫార్మన్స్ స్కోప్ ఉన్న రోల్ కాదు. హీరోయిన్లు మానసా చౌదరి, ఫరియా అబ్దుల్లా... కథలో ఇద్దరి పాత్రలు పరిమితమే. బ్రూటల్ ధర్మగా జేడీ చక్రవర్తి పాత్రకు విపరీతమైన బిల్డప్ ఇచ్చారు. కానీ ఆయన్ను సరిగ్గా వాడుకోలేదు. శ్రీ విష్ణు కనిపించే సన్నివేశాలు తక్కువ. కథగా చూస్తే 'గాయపడ్డ సింహం'లో పాయింట్ బావుంది. కానీ, ఎగ్జిక్యూషన్ ఫెయిల్ అయ్యింది. కామెడీ వర్కవుట్ కాలేదు. డ్రామా పండలేదు. సరదాగా నవ్వుకోవచ్చని వినోదం ఆశించి థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకుల ఆశలకు గాయం చేస్తుందీ సినిమా.
గాయపడ్డ సింహం అంటూ ఆడియన్స్ ముందుకొచ్చిన తరుణ్ భాస్కర్ ఈసారి వాళ్ళ పల్స్ పట్టుకోవడంలో తడబడ్డాడు. అంటే పూర్తిగా కాదు గాని, తన మార్క్ చూపించడంలో తడబడ్డాడు. అయితే సినిమాలో దరహాస్ గా నటించిన తరుణ్ భాస్కర్ తన పెర్ఫార్మన్స్ వరకు బానే ఇచ్చాడు. కానీ ఆడియన్స్ ఇంకా ఎక్స్పెక్ట్ చేసారు. ఫరియా అబ్దుల్లా కూడా శాలిని పాత్రకు న్యాయం చేసింది. అక్కడక్కడా కాస్త ఓవర్‌గా అనిపిస్తుంది. మానస చౌదరి కనిపించింది రెండు మూడు సీన్లలోనే అయినా మెప్పించింది.
ఇక సినిమాకు ఎంతో కీలకమైన పాత్రగా చెప్పుకొన్న జెడి చక్రవర్తి పాత్ర డిజైన్ బాగానే ఉంది. కానీ ప్రమోషన్స్‌లో ఆయన చెప్పినంతగా ఆ పాత్రలో ఏమీ లేదు. దర్శకుడు కూడా ఈ చిత్రంలో ఓ పాత్ర పోషించారు. యాక్టింగ్ లోనూ డైలాగ్ డెలివరీలోనూ ఆయనకు పేరు పెట్టక్కర్లేదు. భైరవ్ గా శ్రీవిష్ణు ఓ తాంత్రికుడిగా కనిపించారు. ఆ పాత్రకు న్యాయం చేశారు. విద్యాసాగర్ చింతా సినిమాటోగ్రఫీ బావుంది. నేపథ్య సంగీతం అలరించింది. అయితే వినోదాన్ని కోరుకునే వారికి మాత్రం ఈ సినిమా కాస్త ఊరటను ఇస్తుంది. అంతకుమించి ఎక్స్‌పెక్ట్ చేయడానికి ఈ సినిమాలో ఏమీ లేదు. ఇందులో శ్రీవిష్ణు పోషించిన పాత్రను కంటిన్యూ చేస్తూ 'పోరాడే సింహం' టైటిల్‌తో సీక్వెల్ ప్లాన్ చేసినట్లు లీడ్ ఇచ్చారు. కానీ ఆ అవకాశం దర్శక నిర్మాతలకు ప్రేక్షకులు ఇవ్వకపోవచ్చు.
తరుణ్ భాస్కర్ నటించిన గాయపడ్డ సింహం థియేటర్లలో మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. కథా, కథనాలు రొటీన్ గానే ఉన్నా, డైరెక్టర్ జనరంజకంగా తెరకెక్కించడానికి ట్రై చేసాడు. అయితే సినిమాలో కథనంలో వేగం లేకపోవడంతో కాస్త నెమ్మదిగా కథలోకి వెళ్లినట్టు అనిపిస్తుంది. ఎప్పుడైతే బ్రూటల్ ధర్మ క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తుందో అప్పటి నుంచి కథలో వేగంగా కదలికలు చోటు చేసుకొని రకరకాల ట్విస్టులతో ప్రేక్షకుడిని ఎంగేజ్ చేసిన తీరు బాగుంటుంది. ఇక భైరవ దాస్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత సినిమా మరింత ఊపందుకుంది.
అలాగే కథలో భాగంగా క్లైమాక్స్‌ను ముగించిన తీరు ఫీల్ గుడ్‌గా ఉంటుంది. అలాగే పార్ట్ 2 సినిమాకు పోరాట సింహం అంటూ శ్రీవిష్ణు క్యారెక్టర్ కు ఇచ్చిన లీడ్ బాగుంది. ఓవరాల్ గా చిన్న పాయింట్‌ను లాగి లాగి కథను నడిపించినా.. దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్ కంటెంట్ మీద పెట్టిన శ్రద్ద ప్రతీ ఫ్రేమ్‌లోను కనిపిస్తుంంది. ఈ సినిమాకు విద్యా సాగర్ చింతా సినిమాటోగ్రఫి స్టోరీ మూడ్ ను, క్యారెక్టర్ల ఇంపాక్ట్ ను బాగా క్రియేట్ చేసింది. ఓవరాల్ గా ఈ వారం చూడాల్సిన సినిమాల జాబితాలో గాయపడ్డ సింహాం సినిమాను చేర్చుకోవచ్చు. వినోదంతోపాటు యాక్టర్ల పెర్ఫార్మెన్స్‌ను బాగా ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంది.
తరుణ్ భాస్కర్, మానస చౌదరి, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘గాయపడ్డ సింహం’ సినిమా తాజాగా థియేటర్లలోకి రాగా… ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. మెయిన్ లీడ్ లో నటించిన తరుణ్ భాస్కర్, కీ రోల్ చేసిన శ్రీ విష్ణు ఎవరి స్టైల్ లో వాళ్ళు బానే నటించారు. ఎంటర్టైన్ చేయడానికి సినిమా మొత్తం ట్రై చేస్తారు. కానీ ఎక్కడో కాస్త బెడిసికొట్టింది. ఇక జెడి చక్రవర్తి సినిమాలో ఉన్నంత వరకు బెస్ట్ ఇచ్చాడు. అలాగే సినిమా రిలీజ్ టైం లో ఆయన చేసిన ప్రమోషన్స్ మెచ్చుకుతీరాలి.
ఇటు కంటెంట్ లో ట్రంప్ పై క్రియేట్ చేసిన కామెడీ సీన్లకు మంచి ఫన్ జనరేట్ అవుతుంది. ఓవరాల్ గా గాయపడ్డ సింహం ఈ సమ్మర్ లో నవనవలాడే మామిడిపండులా అనిపిస్తున్నా, ఆడియన్స్ కి కాస్త పులుపు ఫీలింగ్ నే ఇచ్చింది. సింపుల్ గా చెప్పాలంటే ఇది గాయపడ్డ సింహం అనుకుంటే, సినిమా వరకు గాయపడ్డ కథగా మారింది.
తరుణ్ భాస్కర్, మానస చౌదరి, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘గాయపడ్డ సింహం’ సినిమా తాజాగా థియేటర్లలోకి రాగా… ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దర్శకుడు Kashyap Srinivas తీసుకున్న కథ, స్క్రీన్ ప్లే పూర్తిగా రొటీన్ గా ఉండి పెద్దగా ఇంపాక్ట్ ఇవ్వలేకపోయాయి. సినిమాలో కొన్ని కామెడీ సీన్స్, ముఖ్యంగా Sree Vishnu గెస్ట్ రోల్ ఉన్న ట్రాక్ కాస్త రిలీఫ్ ఇచ్చినా… అవి కూడా మొత్తం సినిమాను మోసేంత బలం చూపించలేకపోయాయి. కథలో కొత్తదనం లేకపోవడం, సింపుల్ స్టోరీని కూడా ఆసక్తికరంగా చెప్పలేకపోవడం పెద్ద మైనస్‌గా మారింది.
టెక్నికల్ గా ప్రొడక్షన్ వాల్యూస్ ఓకే అనిపించినా… సంగీతం పెద్దగా ప్రభావం చూపలేదు. అలాగే సాగదీత సీన్స్ ఎక్కువగా ఉండటం వల్ల సినిమా బోర్ ఫీల్ కలిగిస్తుంది. ఎడిటింగ్‌లో ఇంకా కట్స్ అవసరమనే ఫీలింగ్ వస్తుంది. ఓవరాల్ గా ‘గాయపడ్డ సింహం’ = Routine story + slow narration! కొన్ని కామెడీ సీన్స్ తప్ప… సినిమా మొత్తంగా డిసప్పాయింట్ చేస్తుంది. కొత్తదనం ఆశించే వారికి ఇది పూర్తిగా మిస్ అయ్యే అవకాశం ఉంది.
Browse by Reviewer Category
Discover reviews from different types of critics and publications
News Channel
Movie-specific media and publications
Twitter Channel
Website
Youtube Channel
CA/Advocate
Corporate (Non IT) Employee
Doctor/Health Worker
Freelancer & Consultant
Homemaker / Housewives
Women managing households
Influencer
IT Employee
Journalists & Critics
Private Employee
Small Business Owner
Less than 20 team size
Students & Youth
School students, college students, young viewers