Movie Reviews
Professional reviews and ratings from top critics and publications worldwide
తమిళ్ స్టార్ హీరో ధనుష్, మమిత బైజు జంటగా తెరకెక్కిన సినిమా ‘కర’. వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై ఐషరి కె గణేష్ నిర్మాణంలో విఘ్నేశ్ రాజా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. తాజాగా థియేటర్లలో విడుదలైన కర సినిమా ఆడియన్స్ నుండి మిశ్రమ స్పందన అందుకుంది. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. జీవి ప్రకాష్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టాడు. రెండు పాటలు బాగుండగా మిగిలిన బిట్ సాంగ్స్ మాత్రం అంతగా మెప్పించలేదు. సినిమా అంతా 90 స్ బ్యాక్ డ్రాప్ లో జరగడంతో దాని తగ్గట్టు ఆర్ డిపార్ట్మెంట్ బాగానే పని చేసింది.
ఎడిటింగ్ పరంగా ఫస్టాఫ్ లో కొన్ని లాగ్ సీన్స్ కట్ చేస్తే బాగుండేది. రైతుల కష్టాలు, బ్యాంకు లోన్లు అనే పాత కథ తీసుకొని దానికి దొంగ, నాన్న ఎమోషన్ లను కలిపి ఆసక్తికర స్క్రీన్ ప్లేతో రాసుకొని బాగానే తెరకెక్కించాడు దర్శకుడు. డైరెక్టర్ మొదటి సినిమాకి దీనికి సంబంధం ఉండదు. అసలు ఆ డైరెక్టరేనా ఈ సినిమా తీసింది అనిపిస్తుంది. నిర్మాణ పరంగా మాత్రం సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై బాగానే కనిపిస్తుంది. మొత్తంగా ధనుష్ మరోసారి తండ్రి ఎమోషన్ తో పాటు దొంగతనాల సస్పెన్స్ కథాంశంతో ‘కర’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఓవరాల్ గా డీసెంట్ అనిపించుకుంది.
సహజ నటనకు పెట్టింది పేరైన ధనుష్.. ఆ మధ్య ఇడ్లి కొట్టు తో డీసెంట్ సినిమా ఇవ్వగా, ఈసారి "కర" అంటూ ఒక దొంగగా ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఈసారి కూడా తన పెర్ఫార్మన్స్ తో మెప్పించే ప్రయత్నం చేయగా, క్యూట్ లుక్స్ తో అలరించే మమిత బైజు ఈ సినిమాలో పూర్తి డీ గ్లామర్ పాత్రలో మెరిసింది. వృద్ధుడి పాత్రలో కేఎస్ రవికుమార్ నటన కంటతడి పెట్టిస్తుంది. సూరజ్ వెంజర్మూడు, జయరాం, కరుణాస్, పృథ్వీ రాజన్ తమ పాత్రల పరిధి మేరకు పూర్తి న్యాయం చేశారు.
టెక్నికల్ గా కర సినిమా చాలా బెస్ట్ గా ఉంది. జీవి ప్రకాష్ నేపథ్య సంగీతం ఈ సినిమాకు ప్రాణం పోసింది. పాటలు ఓకే అనిపించినా, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా బాగుంది. 90స్ కాలం నాటి వాతావరణాన్ని ఆర్ట్ విభాగం అద్భుతంగా రీక్రియేట్ చేసింది. దానికి తోడు సినిమాటోగ్రఫీ విజువల్స్‌కు మరింత అందాన్ని తెచ్చింది. ఎడిటింగ్ విషయంలో మొదటి సగంలో ఉన్న కొన్ని సాగతీత సీన్లను కట్ చేసి ఉంటే సినిమా ఇంకాస్త పకడ్బందీగా ఉండేది. ఓవరాల్‌గా కర.. ఇటు రైతు కష్టం.. అటు థ్రిల్లింగ్ రాబరీ.. మిక్స్డ్ బ్యాగేజ్ అన్నట్టుంటుంది. అంటే సినిమా ఓసారైతే బానే ట్రై చేయొచ్చు.
కోలీవుడ్ స్టార్ Dhanush నటించిన ‘కర’ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా థియేటర్లలో విడుదలకాగా, మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. దర్శకుడు Vignesh Raja ఎంపిక చేసిన కథలో బలం ఉన్నప్పటికీ, దాన్ని స్క్రీన్‌పై ప్రెజెంట్ చేసిన విధానం మాత్రం అంతగా ఆకట్టుకోలేదు. కానీ విలేజ్ నేటివిటీ నేపథ్యం, నటీనటుల పెర్ఫార్మన్స్ ఆకట్టుకుంటుంది.
రైతులు, బ్యాంక్ లోన్ల సమస్యల వంటి సీరియస్ అంశాలను టచ్ చేసినా… కథనం కొంత అసంబద్ధంగా సాగడం, ఎమోషనల్ సన్నివేశాలు అతిగా ఉండడం వల్ల ప్రేక్షకులు పూర్తిగా కనెక్ట్ కాలేకపోయారు. కానీ నటీనటులు తమ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకుంటారు. మొత్తంగా ‘కర’ చిత్రం మంచి కాన్సెప్ట్ తో తెరకెక్కినప్పటికీ, కథనం బలహీనతలు, ఎమోషన్ ఓవర్ డోస్ కారణంగా పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. రైతు సమస్యలను ప్రతిబింబించిన డీసెంట్ ప్రయత్నంగా చెప్పుకోవచ్చు.
కమెడియన్ సత్య మెయిన్ లీడ్ గా నటించిన ‘జెట్‌లీ’ మూవీ ఆడియన్స్ నుండి డివైడ్ టాక్ తెచ్చుకుంది. విభిన్నమైన కథనంతో సినిమాను రూపొందించిన దర్శకుడు Ritesh Rana ఈసారి ఆడియన్స్ ని మరింత నవ్వించాలని ట్రై చేసినా, ఆ ప్రయోగం ప్రేక్షకులకు పూర్తిగా చేరలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సినిమా ఫస్ట్ హాఫ్ నుంచే కథ ఏ దిశగా సాగుతుందో స్పష్టత లేకుండా కన్ఫ్యూజన్ నెలకొంటుంది. హీరో పాత్రలో సత్య ఎలా గందరగోళానికి గురవుతాడో… అదే పరిస్థితి ఆడియెన్స్ కి కూడా ఎదురవుతుంది.
చివరికి కథ రివేంజ్ డ్రామా వైపు మళ్లినా… ఆ భావోద్వేగం ప్రేక్షకులకు బలంగా చేరలేదు. కామెడీ పరంగా కొన్ని సన్నివేశాలు నవ్వించినా, మొత్తం సినిమా స్థాయిలో ఎంటర్టైన్‌మెంట్ తక్కువగానే అనిపిస్తుంది. మొత్తంగా ‘జెట్‌లీ’ ఒక కొత్త ప్రయత్నం అయినప్పటికీ, స్పష్టమైన కథనం లేకపోవడం, కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉండడం వల్ల ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఆర్ట్ డిపార్ట్మెంట్ ని మాత్రం మెచ్చుకోవచ్చు. విమాన వాతావరణాన్ని రియలిస్టిక్ గా చూపించడానికి బాగానే కష్టపడ్డారు. కానీ ఓవరాల్ గా జెట్లీ ప్రయోగం వర్కౌట్ కాలేదు.
టాలీవుడ్ లో కమెడియన్ గా మంచి క్రేజ్ సొంతం చేసుకున్న వారిలో సత్య ఒకరు. సత్య కామెడీ టైమింగ్ కి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. గతంలో అలీ లాంటి కమెడియన్లు హీరోలుగా నటించారు. సత్య కూడా తొలిసారి హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ జెట్లీ అనే మూవీలో నటించారు. ఈ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రితేష్ రానా దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. రియా సింఘా, వెన్నెల కిషోర్, అజయ్ ఇతర పాత్రల్లో నటించారు. అయితే కథ కొంచెం యావరేజ్ గా ఉన్నా తెరకెక్కించిన విధానం ఆకట్టుకునేలా ఉంటే ప్రేక్షకులు సంతృప్తి చెందుతారు. కానీ ఈ చిత్రంలో ఆ రెండూ మైనస్ అయ్యాయి.
సరైన కథ లేదు, తెరకెక్కించిన విధానం కూడా గొప్పగా లేదు. ఈ చిత్రం చూశాక అంత రన్ టైం ఏమాత్రం అవసరం లేదు అని అనిపిస్తుంది. ఎడిటింగ్ చాలా పూర్ గా ఉంది. చాలా సన్నివేశాలు షార్ప్ గా ట్రిమ్ చేసి రన్ టైం తగ్గించి ఉండొచ్చు. కానీ అది జరగలేదు. సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. సినిమాటోగ్రఫీ చాలా బావుంది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అక్కడక్కడా మెప్పించింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇలా టెక్నికల్ గా ఎన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నా, కథ, కథనాల విషయంలో ప్రేక్షకులు డిస్సపాయింట్ అయితే నిర్మొహమాటంగా తిరస్కరించే అవకాశం ఉంది. ఓవరాల్ గా... దర్శకుడు రితేష్ రానా, కమెడియన్ సత్య హీరోగా 'జెట్లీ'తో చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. కథ, కామెడీ ఏదీ ఆకట్టుకునే విధంగా లేదు. ఓవరాల్‌గా జెట్లీ.. కాస్త కామెడీ.. కాస్త కదుపులు అన్నట్టుగా ఉంది.
కామెడీతో గుర్తింపు తెచ్చుకున్న Satya ప్రధాన పాత్రలో నటించిన ‘జెట్‌లీ’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మత్తు వదలరా ఫ్రాంఛైజెస్ దర్శకుడు Ritesh Rana దర్శకత్వం వహించిన ఈ మూవీ థియేటర్లలో మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. మొదటి రెండు మూవీస్ తో ఇంప్రెస్ చేసిన డైరెక్టర్ జెట్లీ మూవీతో ఏమాత్రం మెప్పించలేకపోయాడు. ముఖ్యంగా కథ కథనంలో అంతగా పూర్తిగా డిస్సపాయింట్ చేసాడు. ఇక ఈసారి కొత్త స్టైల్‌లో ట్రై చేసినా, అది ప్రేక్షకులకు పూర్తిగా కనెక్ట్ కాలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
సినిమా మొదటి భాగం నుంచే కథ ఏ దిశగా సాగుతుందో అర్థం కాకుండా కన్ఫ్యూజన్ కొనసాగుతుంది. సెకండ్ హాఫ్ లో కథ కొంత క్లారిటీకి వస్తూ, ఇది రివేంజ్ డ్రామా అని తెలుస్తుంది. అయితే అప్పటికి ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గే అవకాశం ఉంది. కామెడీ పరంగా కొన్ని చోట్ల సత్య పంచ్‌లు నవ్విస్తాయి కానీ మొత్తం సినిమా స్థాయిలో ఆ మేజిక్ కనిపించదు. కనీసం స్క్రీన్‌ప్లే లో మరింత క్లారిటీ ఉంటే ఫలితం వేరేలా ఉండేదనే అభిప్రాయం వినిపిస్తోంది. మొత్తంగా ‘జెట్‌లీ’ ఒక విభిన్న ప్రయత్నం అయినప్పటికీ, ఎంటర్టైన్‌మెంట్ పరంగా మాత్రం ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోలేకపోయింది.
తమిళ స్టార్ Dhanush సినిమాలకు తెలుగులో మంచి మార్కెట్ ఉందన్న విషయం తెలిసిందే. అదే ట్రెండ్‌ను కొనసాగిస్తూ ఆయన నటించిన ‘కర’ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళంలో గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమా, తెలుగులో కూడా అదే స్థాయిలో రిలీజ్ కావడం విశేషం.
ఈ సినిమాలో కరసామి పాత్రలో ధనుష్ తనదైన నటనతో మెప్పించాడు. అలాగే హీరోయిన్‌గా నటించిన Mamitha Baiju సహజమైన నటనతో ఆకట్టుకుంది. పాత్రలకు తగ్గట్టుగా ఇద్దరూ మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడం సినిమాకు ప్లస్‌గా మారింది.
టెక్నికల్ విషయాల్లోకి వెళ్తే, 90వ దశకపు వాతావరణాన్ని రియలిస్టిక్‌గా చూపించడంలో దర్శకుడు విజయం సాధించాడు. సంగీత దర్శకుడు G. V. Prakash Kumar అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలకు బలం ఇచ్చింది. అయితే పాటలు మాత్రం పెద్దగా గుర్తుండేలా లేవు. విజువల్స్ నేచురల్‌గా ఉండగా, యాక్షన్ సన్నివేశాలు సాధారణంగా కనిపిస్తాయి.
కథ విషయానికి వస్తే, రైతులు మరియు బ్యాంకింగ్ వ్యవస్థ మధ్య ఉన్న సమస్యలను టచ్ చేసే ప్రయత్నం దర్శకుడు చేశాడు. అయితే సినిమా నడక కొంత స్లోగా ఉండటం, కొన్ని చోట్ల బోరింగ్‌గా అనిపించడం మైనస్‌గా మారింది.
మొత్తంగా ‘కర’ సినిమా ఒక రెగ్యులర్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ కాకపోయినా, మంచి కంటెంట్‌తో తీసిన ప్రయత్నంగా కనిపిస్తోంది.
మలయాళంలో వచ్చిన వాఝా సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిన వాఝా2 మూవీ తెలుగులో తాజాగా వాలా 2 పేరుతో రిలీజ్ కాగా థియేటర్ల వద్ద మంచి రెస్పాన్స్ అందుకుంది. సినిమాలో పరిచయం లేని నటులే ఉన్నా, అందరూ ఇంప్రెస్ చేసారు. హషీర్ H, అలన్ బిన్ సిరాజ్, అజిన్ జాయ్, వినాయక్ వంటి వారు మూవీకి బ్యాక్ బోన్ గా నిలవగా, మిగతా అన్ని రకాలుగానూ సినిమా యూత్ ని ఆకట్టుకునేలా ఉంది. ఇక సావిన్ SA దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి.
మేకర్స్ కేరళ లోని రియల్ లొకేషన్స్ లో సినిమాని తెరకెక్కించడం వల్ల సహజత్వం ఎంతో నచ్చుతుంది. ఇక మ్యూజిక్, బీజీఎమ్ తో పాటు తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. స్క్రీన్ ప్లే మంచి రేసి గా ఉండి ఎంటర్టైనింగ్ గా ఉంది. మొత్తంగా ‘వాలా 2’ మిడిల్ క్లాస్ కాలేజీ చదివే అబ్బాయిల జీవితంలో ఎదురైన సంఘటనలతో బాధ్యతగా ఎలా మారారు అని కామెడీ ఎమోషనల్ గా తెరకెక్కించిన సినిమాగా చెప్పుకోవచ్చు.
ఈ వారం థియేటర్లలో విడుదలైన వాలా 2 ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. కథ పరంగా పెద్ద కథ కాకపోయినా, కథనం పరంగా మంచి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో ఆడియన్స్ ను ఆకట్టుకున్నారు. ఎంతలా అంటే అసలు ఈ సినిమాకు అసలైన బలం, ప్రాణం.. దీని కథనం. ఒక సింపుల్ పాయింట్‌ను తీసుకొని, ఆడియన్స్‌ను ఎమోషనల్ రోలర్ కోస్టర్ ఎక్కించడంలో డైరెక్టర్ సావిన్ ఎస్.ఏ, రచయిత విపిన్ దాస్ సక్సెస్ అయ్యారు. ఇక ఏ టీమ్ (అంకిత్ మీనన్) అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్రాణం. సీన్‌లోని మూడ్‌ను పర్ఫెక్ట్‌గా ఎలివేట్ చేసింది.
ఈ సినిమాకి మెయిన్ పిల్లర్స్ ఈ నలుగురు కుర్రాళ్లే. హాషిర్, అలెన్, అజిన్, వినాయక్ పాత్రల్లో నటించిన వాళ్లంతా మలయాళంలో సోషల్ మీడియా స్టార్లు. వాళ్లకు ఇది నిజజీవితానికి దగ్గరగా ఉండే క్యారెక్టర్స్ కావడంతో కెమెరా ముందు యాక్ట్ చేసినట్లు అస్సలు అనిపించదు, క్యారెక్టర్లలో పరకాయ ప్రవేశం చేశారు. వాళ్ల మధ్య ఆన్-స్క్రీన్ కెమెస్ట్రీ, కామెడీ టైమింగ్ సినిమాకు హైలైట్.డబ్బింగ్ క్వాలిటీ, లోకలైజేషన్ చాలా నీట్‌గా ఉన్నాయి. విపిన్ దాస్ రైటింగ్ చాలా షార్ప్ అండ్ రిలేటబుల్. దర్శకుడు సావిన్ ఎస్.ఏ తన ఫస్ట్ సినిమా అయినా కూడా, యూత్ పల్స్ పట్టుకొని ఎక్కడా డీవియేట్ అవ్వకుండా సినిమాను ప్రెజెంట్ చేశాడు.
ఓవరాల్ గా వాలా 2.. సగటు మిడిల్ క్లాస్ కుర్రాడి బయోపిక్..!
ఈ వారం తెలుగులో థియేటర్లలో విడుదలైన ‘వాలా 2’ థియేటర్లలో మంచి రెస్పాన్స్ అందుకోగా, దర్శకుడు సావిన్ ఎస్ఏ ఒక చిన్న కథను తీసుకుని, దానికి యూత్ ఎంటర్టైన్మెంట్‌తో పాటు ఎమోషన్స్‌ను జోడించి ఆసక్తికరంగా మలిచారు. హషీర్, అలన్, వినాయక్, అజిన్ తమ పాత్రల్లో సహజంగా నటిస్తూ సినిమాకు బలం చేకూర్చారు. ముఖ్యంగా వారి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
ఫస్ట్ హాఫ్ మొత్తం సరదా కామెడీతో వేగంగా సాగిపోతూ, కాలేజ్ రోజుల జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది. సెకండ్ హాఫ్‌లో విదేశాల్లో ఎదురయ్యే సమస్యలను చూపిస్తూ కథలో కొంత ఎమోషనల్ టచ్ ఇచ్చారు. క్లైమాక్స్‌లో వచ్చే భావోద్వేగ సన్నివేశాలు హృదయాన్ని తాకుతాయి.
సాంకేతికంగా కూడా సినిమా పర్వాలేదనిపిస్తుంది. సంగీతం, నిర్మాణ విలువలు కథకు అనుగుణంగా ఉన్నాయి. అయితే కొత్త నటీనటులు మాత్రమే ఉండి, పెద్దగా పేరున్న నటులు లేకపోవడం చిన్న వెలితి. మొత్తంగా ‘వాలా 2’ యూత్‌ను టార్గెట్ చేసిన కమింగ్ ఆఫ్ ఏజ్ ఎంటర్టైనర్. ఫ్రెండ్స్‌తో కలిసి వీకెండ్‌లో చూసేందుకు ఓ సరదా చిత్రం. ఫైనల్ గా "ఇది బిలియన్ బాయ్స్ బయోపిక్. అంటే నాది నీది మనందరిది".
తెలుగులో ఈ వారం రిలీజ్ అయిన మూవీస్ లో 'వాలా 2' ఒకటి. మలయాళం లో పెద్ద హిట్ అయిన ఈ సినిమా తాజాగా తెలుగులో విడుదలైంది. పెద్ద స్టార్ కాస్ట్ లేకపోయినా, కొత్త నటుల ఎనర్జీ ఈ సినిమాకి మెయిన్ హైలైట్‌గా నిలిచింది.
దర్శకుడు సావిన్ ఎస్ఏ చిన్న కథను తీసుకుని, దానిలో ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫ్రెండ్షిప్ వైబ్స్, ఎమోషన్స్ అన్నీ కలిపి బాగా ప్రెజెంట్ చేశాడు. హషీర్, అలన్, వినాయక్, అజిన్ లాంటి లీడ్ యాక్టర్స్ తమ పాత్రల్లో నేచురల్‌గా లివ్ చేశారు. వారి మధ్య కెమిస్ట్రీనే సినిమాను ముందుకు నడిపించే ప్రధాన బలం.
ఫస్ట్ హాఫ్ మొత్తం ఫన్ రైడ్ లా సాగిపోతూ, కాలేజ్ డేస్‌ను రీక్రియేట్ చేస్తుంది. సెకండ్ హాఫ్‌లో విదేశాల్లో ఫేస్ చేసే స్ట్రగుల్స్‌ను చూపిస్తూ, నవ్వుల మధ్య ఒక ఫీలింగ్ కూడా ఇస్తుంది. క్లైమాక్స్ మాత్రం సైలెంట్‌గా హార్ట్‌ని టచ్ చేసేలా డిజైన్ చేశారు. మ్యూజిక్, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా కథకి సపోర్ట్ అయ్యాయి. కొన్ని చోట్ల స్లోగా అనిపించినా, ఓవరాల్‌గా ‘వాలా 2’ యూత్‌తో పాటు ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేసే ఫీల్ గుడ్ మూవీ.
ఫైనల్ వర్డ్: ఫ్రెండ్షిప్ + ఫన్ + ఎమోషన్ కావాలంటే ఈ వీకెండ్ కి పర్ఫెక్ట్ ఛాయిస్
ThimmarajuPalli TV movie Review
By 10TV Telugu
ఈ వారం విడుదలైన క్రేజీ సినిమాల్లో తిమ్మరాజుపల్లి టివి ఒకటి. అంతా కొత్త నటులతో తెరకెక్కిన ఈ మూవీ మంచి రెస్పాన్స్ అందుకుంది. రొటీన్ కథే అయినా ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే తో బాగా తెరకెక్కించాడు డైరెక్టర్ మునిరాజు. ఇక ఈ సినిమాలో నటించిన చాలా మంది కొత్తవాళ్ళైనా అదరగొట్టేసారు. హీరో సాయి తేజ్ చాలా బాగా నటించాడు. హీరోయిన్ వేద జలంధర్ క్యూట్ గా కనిపిస్తూనే చక్కగా నటించింది. ప్రదీప్ కొట్టె సినిమాకు హైలెట్. మిగిలిన నటీనటులు అంతా వారి పాత్రల్లో బాగా నటించారు. సినిమా మొదట్లో కిరణ్ అబ్బవరం వాయిస్ ఓవర్ ఇవ్వడం గమనార్హం.
టెక్నికల్ గా సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగా ప్లస్ అయింది. పోరాటాలు కూడా బాగున్నాయి. ఈ సినిమాకు లొకేషన్స్ చాలా ప్లస్ అయ్యాయి. 1996 విలేజ్ బ్యాక్ డ్రాప్ కావడంతో దానికి తగ్గట్టు లొకేషన్స్ చాలా బాగా వెతికి పట్టుకున్నారు. కొత్త కథని రొటీన్ లవ్ స్టోరీతో ఆసక్తికర స్క్రీన్ ప్లే తో బాగానే రాసుకొని తెరకెక్కించాడు దర్శకుడు. ఎడిటింగ్ లో అక్కడక్కడా కొన్ని ల్యాగ్ సీన్స్ కట్ చేస్తే బాగుండు. మొత్తంగా ‘తిమ్మరాజుపల్లి టీవీ’ సినిమా ఓ క్యూట్ లవ్ స్టోరీతో పాటు టీవీ దొంగతనం అనే సస్పెన్స్ తో ఆసక్తికరంగా తెరకెక్కించారు. ఫ్యామిలీతో కలిసి ఈ సినిమా చూడొచ్చు. ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు.
Browse by Reviewer Category
Discover reviews from different types of critics and publications
News Channel
Movie-specific media and publications
Twitter Channel
Website
Youtube Channel
CA/Advocate
Corporate (Non IT) Employee
Doctor/Health Worker
Freelancer & Consultant
Homemaker / Housewives
Women managing households
Influencer
IT Employee
Journalists & Critics
Private Employee
Small Business Owner
Less than 20 team size
Students & Youth
School students, college students, young viewers