Register as a Reviewer

Movie Reviews

Professional reviews and ratings from top critics and publications worldwide

233
Total Reviews
88
Movies Reviewed
24
Reviewer Categories
Active filters: Category: News Channel ×
Showing 49-60 of 233 reviews
Clear all filters

Sahaa movie review

సహ (Sahaa) 2026 News Channel
6.0
out of 10
సహా అనే చిన్న సినిమాకు మొదట్లో పెద్ద బజ్ లేకపోయినా ప్రమోషన్స్ కి కిరణ్ అబ్బవరం, బన్నీ వాసు, వంశీ నందిపాటి రావడం, సినిమా నచ్చకపోతే హీరోయిన్ గుండు కొట్టించుకుంటా అనడంతో ఒక్కసారిగా ఈ సినిమా వైరల్ అయింది. రిలీజ్ కి ముందు టీజర్, ట్రైలర్, సాంగ్స్ అయితే బాగున్నాయి. అయితే ఇది మాములు లవ్ స్టోరీనే అని ముందునుంచే అనిపించింది. అయితే ఈ కథ అంతా నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే లో నడుస్తుంది. ముందుకు, వెనక్కి కథ వెళ్త...

సహా అనే చిన్న సినిమాకు మొదట్లో పెద్ద బజ్ లేకపోయినా ప్రమోషన్స్ కి కిరణ్ అబ్బవరం, బన్నీ వాసు, వంశీ నందిపాటి రావడం, సినిమా నచ్చకపోతే హీరోయిన్ గుండు కొట్టించుకుంటా అనడంతో ఒక్కసారిగా ఈ సినిమా వైరల్ అయింది. రిలీజ్ కి ముందు టీజర్, ట్రైలర్, సాంగ్స్ అయితే బాగున్నాయి. అయితే ఇది మాములు లవ్ స్టోరీనే అని ముందునుంచే అనిపించింది. అయితే ఈ కథ అంతా నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే లో నడుస్తుంది. ముందుకు, వెనక్కి కథ వెళ్తూ ఉంటుంది.


నటీనటులు అక్కడక్కడా కామెడితో నవ్వించారు. క్లైమాక్స్ లో మాత్రం ఏడిపించారు. ఇదేమి కొత్త కథ, కథనం అయితే కాదు. చాలా చోట్ల సన్నివేశాలను బాగా సాగదీశారు. కాకపోతే మరీ బోరింగ్ ఫీల్ రాకుండా కథనంతో మెప్పించారు. ఈ సినిమా చాలా చోట్ల ఒక మంచి షార్ట్ ఫిలిం, నిడివి ఎక్కువ ఉన్న షార్ట్ ఫిలిం చూసినట్టు అనిపిస్తుంది. కొన్ని చోట్ల 7/G బృందావన కాలనీ, లాంటి పలు సినిమా ఛాయలు కనిపిస్తాయి. ఇక ఇలాంటి లవ్ సీన్స్ బోలెడన్ని సినిమాల్లో ఉన్నవే. ఒకసారి చూడొచ్చు. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. మొత్తంగా ‘సహా’ ఒక అబ్బాయి జీవితాంతం ఒకే అమ్మాయిని ప్రేమించడం, వాళ్ళ మధ్య జరిగే సంఘటనలతో ఏం జరిగింది అనే సినిమా.


Sep 09, 2026 Telugu
6.0
out of 10
ధర్మస్థల నియోజకవర్గం అనే టైటిల్ తో, పొలిటికల్ సినిమా, వరుణ్ సందేశ్ భార్య వితిక షేరు రీ ఎంట్రీ సినిమా అని ఈ సినిమాపై రిలీజ్ కి ముందే కాస్త బజ్ నెలకొంది. ఇక స్టోరీ లైన్ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే... ఒక నియోజకవర్గాన్ని తన చేతిలో పెట్టుకొని జనాల్ని భయపెడుతూ విర్రవీగుతున్న ఓ రాజకీయనాయకుడిని ఎలా ఎదురించారు అనే కథతో ఈ సినిమాని తెరకెక్కించారు. అలాగే డ్రగ్స్ తో యువత ఎలా పాడైపోతుంది అనే మెసేజ్ ని, ఓటు...

ధర్మస్థల నియోజకవర్గం అనే టైటిల్ తో, పొలిటికల్ సినిమా, వరుణ్ సందేశ్ భార్య వితిక షేరు రీ ఎంట్రీ సినిమా అని ఈ సినిమాపై రిలీజ్ కి ముందే కాస్త బజ్ నెలకొంది. ఇక స్టోరీ లైన్ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే... ఒక నియోజకవర్గాన్ని తన చేతిలో పెట్టుకొని జనాల్ని భయపెడుతూ విర్రవీగుతున్న ఓ రాజకీయనాయకుడిని ఎలా ఎదురించారు అనే కథతో ఈ సినిమాని తెరకెక్కించారు. అలాగే డ్రగ్స్ తో యువత ఎలా పాడైపోతుంది అనే మెసేజ్ ని, ఓటు హక్కు మెసేజ్ ని చూపించారు. 


అయితే ఫస్ట్ హాఫ్ ని రొటీన్ ఫైట్స్, సాంగ్స్ తో సాగదీసినా సెకండ్ హాఫ్ సీన్స్ పరిగెడతాయి. అయితే రాజకీయ నాయకులపై సామాన్యులు పోటీకి నిలబడి గెలిచినా సినిమాలు అనేకం ఉన్నాయి. ఇది కూడా అలాంటిదే. కాకపోతే కొన్ని మెసేజ్ లు ఇస్తూ పొలిటికల్ యాక్షన్ గా తెరకెక్కించారు. ఇక సినిమాలో సాయికుమార్, సుమన్ తో పాటు, వరుణ్ సందేశ్, వితిక షేరు కూడా బాగా నటించారు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. మొత్తంగా ‘ధర్మస్థల నియోజకవర్గం’ యూత్ కి, జనాలకు మెసేజ్ ఇస్తూ సాగిన పొలిటికల్ యాక్షన్ సినిమా. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.


Sep 08, 2026 Telugu
7.0
out of 10
సమాజంలో ఒక స్త్రీ గట్టిగా నిర్ణయించుకుంటే ఎంతటి మార్పునైనా తీసుకురాగలదు అనే బలమైన సందేశాన్ని దర్శకుడు జై జ్ఞాన ప్రభ తోట తెరపై ఆవిష్కరించారు. ప్రస్తుత రాజకీయ నాయకులు ధనం కోసం ఎంతటి నీచానికైనా ఎలా దిగజారుతున్నారో చాలా సున్నితంగా, ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా చూపించిన విధానం మెచ్చుకోదగ్గది. పైగా ఇది కేవలం ఒక ఊరికి సంబంధించిన కథ కాదు, నేటి యువత, ముఖ్యంగా విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు చూడాల్సిన సామ...

సమాజంలో ఒక స్త్రీ గట్టిగా నిర్ణయించుకుంటే ఎంతటి మార్పునైనా తీసుకురాగలదు అనే బలమైన సందేశాన్ని దర్శకుడు జై జ్ఞాన ప్రభ తోట తెరపై ఆవిష్కరించారు. ప్రస్తుత రాజకీయ నాయకులు ధనం కోసం ఎంతటి నీచానికైనా ఎలా దిగజారుతున్నారో చాలా సున్నితంగా, ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా చూపించిన విధానం మెచ్చుకోదగ్గది. పైగా ఇది కేవలం ఒక ఊరికి సంబంధించిన కథ కాదు, నేటి యువత, ముఖ్యంగా విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు చూడాల్సిన సామాజిక అంశాలు ఈ సినిమాలో డిస్కస్ చేసాడు దర్శకుడు ప్రభ. 


అలాగే ఎలాంటి అసభ్యత లేకుండా చాలా క్లీన్‌గా, ఒక అద్భుతమైన సామాజిక ప్రయోజనంతో ఒక మంచి ప్రయత్నమే చేసారు. సీనియర్ నటులు సుమన్, సాయికుమార్ తమ అద్భుత నటనతో ఒకరికొకరు గట్టి పోటీ ఇచ్చారు. అలాగే వితిక షేరు కి కూడా మంచి రోల్ పడింది. ఇక మొదటి చిత్రంతోనే ఇంతటి బరువైన కథాంశాన్ని ఎంచుకోవడం దర్శకుడు జై చేసిన సాహసమే. తను ఎంచుకున్న రెండు ప్రధాన సమస్యలకు సరైన ముగింపు ఇచ్చే ప్రయత్నం చేసాడు. తొలి ప్రయత్నంలోనే చాలా మంది సీనియర్స్‌ను హ్యాండిల్ చేసారు. ఓవరాల్‌ గా ధర్మస్థల నియోజకవర్గం.. పొలిటికల్ ఎంటర్‌టైనర్ విత్ మెసేజ్..!

Sep 08, 2026 Telugu
6.0
out of 10
సాయికుమార్, సుమన్ ప్రధాన పాత్రల్లో జై జ్ఞాన ప్రభ దర్శకత్వంలో తెరకెక్కిన రూరల్ పొలిటికల్ డ్రామా 'ధర్మస్థల నియోజకవర్గం'. సినిమా స్టోరీ పరంగా బాగానే రాసుకున్నా, దానికి తగ్గ మంచి స్క్రీన్ ప్లే రాసుకోవడంలో డైరెక్టర్ తడబడ్డాడు. డ్రగ్స్ మాఫియా, రాజకీయాల చుట్టూ తిరిగే ఈ కథలో సాయికుమార్ విలనిజం, డైలాగ్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అండ్ చాలా రోజుల తర్వాత సుమన్ కి కూడా స్ట్రాంగ్ రోల్ పడింది. అండ్ కీ రోల్...

సాయికుమార్, సుమన్ ప్రధాన పాత్రల్లో జై జ్ఞాన ప్రభ దర్శకత్వంలో తెరకెక్కిన రూరల్ పొలిటికల్ డ్రామా 'ధర్మస్థల నియోజకవర్గం'. సినిమా స్టోరీ పరంగా బాగానే రాసుకున్నా, దానికి తగ్గ మంచి స్క్రీన్ ప్లే రాసుకోవడంలో డైరెక్టర్ తడబడ్డాడు. 


డ్రగ్స్ మాఫియా, రాజకీయాల చుట్టూ తిరిగే ఈ కథలో సాయికుమార్ విలనిజం, డైలాగ్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అండ్ చాలా రోజుల తర్వాత సుమన్ కి కూడా స్ట్రాంగ్ రోల్ పడింది. అండ్ కీ రోల్ లో నటించిన వితికా షేరుకి కూడా మంచి రోల్ వచ్చింది. 


అయితే, నెమ్మదించిన కథనం, పాత సీన్లు నిరాశపరుస్తాయి. మంచి మెసేజ్ ఉన్నా స్క్రీన్‌ప్లే వీక్‌గా ఉండటంతో సాధారణ చిత్రంగా మిగిలిపోయింది. ఓవరాల్ గా ఒక్కసారి చూసేలా ఉంది. 

Sep 08, 2026 Telugu

Ramba Oorvasi menaka movie review

6.0
out of 10
రంభ ఊర్వశి మేనక : మంచి రోల్‌ తో కమ్‌బ్యాక్ ఇస్తాడనుకుంటే, అల్లరి నరేష్ మళ్లీ అదే రొటీన్ ట్రాప్‌లో పడిపోయాడు. రంభ ఊర్వశి మేనక థియేటర్ ఎక్స్‌పీరియన్స్ మాత్రం కంప్లీట్ హెడేక్!దేవలోకం డ్రామాలు, యముడి సీన్లు, దానికి తోడు కాలం చెల్లిన సుడిగాడు స్పూఫ్‌లు.. అబ్బో! ఏమాత్రం వర్కవుట్ అవ్వని ఐడియాలని కలిపి తిప్పి కొట్టారు. ఆడియెన్స్‌ని సర్ ప్రైజ్ చేసే ఒక్క ఎలిమెంట్ కూడా లేదు.నరేష్ ఎనర్జీ ఓకే కానీ, రాసిన రైటిం...

రంభ ఊర్వశి మేనక : మంచి రోల్‌ తో కమ్‌బ్యాక్ ఇస్తాడనుకుంటే, అల్లరి నరేష్ మళ్లీ అదే రొటీన్ ట్రాప్‌లో పడిపోయాడు. రంభ ఊర్వశి మేనక థియేటర్ ఎక్స్‌పీరియన్స్ మాత్రం కంప్లీట్ హెడేక్!


దేవలోకం డ్రామాలు, యముడి సీన్లు, దానికి తోడు కాలం చెల్లిన సుడిగాడు స్పూఫ్‌లు.. అబ్బో! ఏమాత్రం వర్కవుట్ అవ్వని ఐడియాలని కలిపి తిప్పి కొట్టారు. ఆడియెన్స్‌ని సర్ ప్రైజ్ చేసే ఒక్క ఎలిమెంట్ కూడా లేదు.


నరేష్ ఎనర్జీ ఓకే కానీ, రాసిన రైటింగ్‌లోనే అసలు దమ్ము లేదు. సీన్లలో పంచ్‌లు పేలక నవ్వులు అస్సలు రావు. ఫస్టాఫ్ ఎటో వెళ్తే, సెకండాఫ్ ఇంకాస్త సాగదీసి ఆడియెన్స్ ఓపికకి పెద్ద పరీక్షే పెట్టారు.


Sep 08, 2026 Telugu

Ramba oorvasi menaka movie review

6.0
out of 10
ఈ మధ్య సీరియస్ సినిమాలు ఎక్కువగా చేస్తున్న అల్లరి నరేష్.. చాలా రోజుల తర్వాత చేసిన కామెడీ సినిమా రంభ ఊర్వశి మేనక. దానికితోడు దేవకన్యలు భూమ్మీదకు వస్తే అనే ఫాంటసీ పాయింట్‌తో ఈ సినిమాను చంద్రమోహన్ తెరకెక్కించారు. కానీ ఈ పాయింట్‌ను తీసుకుని వినోదాన్ని పంచాలని దర్శకుడు చేసిన ప్రయత్నం తెరపై మాత్రం బెడిసికొట్టింది. ఎక్కడా ఎలాంటి కొత్తదనం లేని రొటీన్ ఫార్ములాతో సాగడం వల్ల తర్వాత ఏం జరగబోతోందో ప్రేక్షకుడు...

ఈ మధ్య సీరియస్ సినిమాలు ఎక్కువగా చేస్తున్న అల్లరి నరేష్.. చాలా రోజుల తర్వాత చేసిన కామెడీ సినిమా రంభ ఊర్వశి మేనక. దానికితోడు దేవకన్యలు భూమ్మీదకు వస్తే అనే ఫాంటసీ పాయింట్‌తో ఈ సినిమాను చంద్రమోహన్ తెరకెక్కించారు. కానీ ఈ పాయింట్‌ను తీసుకుని వినోదాన్ని పంచాలని దర్శకుడు చేసిన ప్రయత్నం తెరపై మాత్రం బెడిసికొట్టింది. ఎక్కడా ఎలాంటి కొత్తదనం లేని రొటీన్ ఫార్ములాతో సాగడం వల్ల తర్వాత ఏం జరగబోతోందో ప్రేక్షకుడు ఈజీగా ఊహించేయవచ్చు. 


చాలా గ్యాప్ తర్వాత తన మార్క్ పూర్తి స్థాయి కామెడీ రోల్‌లో అల్లరి నరేష్ చక్కగా నటించాడు. కానీ ఏం చేస్తాం కథ సహకరించకపోతే నరేష్ ఎంత బాగా చేసినా ప్రయోజనం అయితే ఉండదు. దర్శకుడు చంద్రమోహన్ రాసుకున్న కాన్సెప్ట్‌కు బలమైన స్క్రిప్ట్ తోడై ఉంటే రిజల్ట్ మరోలా ఉండేది. కానీ సరైన ఎగ్జిక్యూషన్ లేకపోవడంతో సినిమా నిరాశపరుస్తుంది. నిర్మాణ విలువలు మాత్రం సినిమా స్థాయికి తగ్గట్టుగా చాలా బాగున్నాయి. ఓవరాల్‌ గా రంభ ఊర్వశి మేనక.. ఆకట్టుకోని ఫాంటసీ డ్రామా..!

Sep 08, 2026 Telugu

I'm Game movie review

5.0
out of 10
వరుసగా తెలుగులో స్ట్రెయిట్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న దుల్కర్ సల్మాన్ ఇప్పుడు ఐమ్ గేమ్ అనే మలయాళ డబ్బింగ్ సినిమాతో వచ్చాడు. గ్యాంబ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌తో వచ్చిన ఐమ్ గేమ్ సినిమాను దుల్కర్ స్వయంగా తన నిర్మాణంలో తీసుకొచ్చాడు. ఇక సినిమా గురించి చెప్పాలంటే... కథ పరంగా మంచి పాయింట్ నే తీసుకున్నాడు. కాకపోతే ఈ స్టోరీ లైన్ తెలుగు మూవీ సవ్యసాచికి దగ్గరగా ఉంటుంది. అయితే సినిమాలో చాలా సీన్లు అన్నీ మ...

వరుసగా తెలుగులో స్ట్రెయిట్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న దుల్కర్ సల్మాన్ ఇప్పుడు ఐమ్ గేమ్ అనే మలయాళ డబ్బింగ్ సినిమాతో వచ్చాడు. గ్యాంబ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌తో వచ్చిన ఐమ్ గేమ్ సినిమాను దుల్కర్ స్వయంగా తన నిర్మాణంలో తీసుకొచ్చాడు. ఇక సినిమా గురించి చెప్పాలంటే... కథ పరంగా మంచి పాయింట్ నే తీసుకున్నాడు. కాకపోతే ఈ స్టోరీ లైన్ తెలుగు మూవీ సవ్యసాచికి దగ్గరగా ఉంటుంది. 


అయితే సినిమాలో చాలా సీన్లు అన్నీ మూస పద్ధతిలోనే సాగుతాయి. ఒక అద్భుతమైన ఫాంటసీ థ్రిల్లర్‌లా మొదలైన సినిమా, కాస్తా చివరికి రొటీన్ రివెంజ్ డ్రామాగా మారిపోవడం ప్రేక్షకుడికి కొంత అసంతృప్తిని మిగులుస్తుంది. దానం చేసిన వ్యక్తి గతం ఏంటో తెలిశాక, కథ ముగింపు ఎలా ఉండబోతుందో ఎవరైనా ఇట్టే ఊహించేయవచ్చు. ఓవరాల్ గా దర్శకుడు నహాస్ హిదాయత్ తనకున్న మంచి కాన్సెప్ట్‌ను పూర్తి స్థాయిలో వాడుకోవడంలో తడబడ్డాడు. అద్భుతమైన ఐడియాతో కథను మొదలుపెట్టిన అతను, ద్వితీయార్థంలో మాత్రం కొత్తగా రిస్క్ తీసుకోలేక పాత ఫార్ములాతోనే సేఫ్ గేమ్‌ ఆడాడు.


Sep 08, 2026 Telugu +1

I'm Game movie review

Sakshi

By Sakshi

5.0
out of 10
దుల్కర్ సల్మాన్ హీరోగా నహాస్ హిదాయత్ తెరకెక్కించిన యాక్షన్ ఫాంటసీ థ్రిల్లర్ ‘ఐయామ్ గేమ్’. గ్యాంబ్లింగ్, క్రికెట్ బెట్టింగ్ నేపథ్యంలో మొదలయ్యే కథ.. ఊహించని మలుపులతో సాగుతుంది. కొత్త కాన్సెప్ట్‌తో దర్శకుడు సినిమాను ఆసక్తికరంగా ప్రారంభించినా.. సెకండాఫ్‌లో కథనం కొంత గాడి తప్పుతుంది.దుల్కర్ సల్మాన్ తన పాత్రలో మరోసారి మంచి పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా పాత్రలో వచ్చే మార్పులను ఆయన ఎక్స్‌ప్రె...

దుల్కర్ సల్మాన్ హీరోగా నహాస్ హిదాయత్ తెరకెక్కించిన యాక్షన్ ఫాంటసీ థ్రిల్లర్ ‘ఐయామ్ గేమ్’. గ్యాంబ్లింగ్, క్రికెట్ బెట్టింగ్ నేపథ్యంలో మొదలయ్యే కథ.. ఊహించని మలుపులతో సాగుతుంది. కొత్త కాన్సెప్ట్‌తో దర్శకుడు సినిమాను ఆసక్తికరంగా ప్రారంభించినా.. సెకండాఫ్‌లో కథనం కొంత గాడి తప్పుతుంది.


దుల్కర్ సల్మాన్ తన పాత్రలో మరోసారి మంచి పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా పాత్రలో వచ్చే మార్పులను ఆయన ఎక్స్‌ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్‌తో చక్కగా చూపించారు. ఆంటోని వర్గీస్, మిస్కిన్ తమ పాత్రలకు న్యాయం చేయగా.. కయాదు లోహర్ ఆకట్టుకున్నారు.

సినిమాకు జేక్స్ బిజోయ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రధాన బలం. జిమ్షి ఖాలీద్ సినిమాటోగ్రఫీ విజువల్‌గా రిచ్‌గా ఉంది. అయితే లాంగ్ రన్‌టైమ్, సెకండాఫ్‌లో స్లో నెరేషన్, కొన్ని ప్రెడిక్టబుల్ సీన్స్ మైనస్‌గా నిలిచాయి.


ఓవరాల్‌ గా.. డిఫరెంట్ కాన్సెప్ట్, దుల్కర్ పెర్ఫార్మెన్స్, టెక్నికల్ వాల్యూస్ కోసం ‘ఐయామ్ గేమ్’ను ఓసారి ట్రై చేయొచ్చు.

Sep 08, 2026 Telugu +1

Ramba Oorvasi menaka movie review

Sakshi

By Sakshi

5.0
out of 10
ఈ మధ్యకాలంలో విభిన్నమైన కథలతో మెప్పించిన అల్లరి నరేష్, మళ్లీ తనదైన మార్క్ సోషియో-ఫాంటసీ కామెడీతో ముందుకు వచ్చిన చిత్రం 'రంభ ఊర్వశి మేనక'. దేవలోక నేపథ్యంతో తెరకెక్కిన ఈ కథలో దర్శకుడు చంద్రమోహన్ 'సుడిగాడు' తరహా స్పూఫ్‌లు, హాస్యాన్ని జోడించి అలరించే ప్రయత్నం చేశారు. అల్లరి నరేష్ తనదైన ఈజీ మేనరిజమ్, కామెడీ టైమింగ్‌తో సినిమాను నడిపించేందుకు శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ, స్క్రిప్ట్‌లో కొత్తదనం లేకపోవడ...

ఈ మధ్యకాలంలో విభిన్నమైన కథలతో మెప్పించిన అల్లరి నరేష్, మళ్లీ తనదైన మార్క్ సోషియో-ఫాంటసీ కామెడీతో ముందుకు వచ్చిన చిత్రం 'రంభ ఊర్వశి మేనక'. దేవలోక నేపథ్యంతో తెరకెక్కిన ఈ కథలో దర్శకుడు చంద్రమోహన్ 'సుడిగాడు' తరహా స్పూఫ్‌లు, హాస్యాన్ని జోడించి అలరించే ప్రయత్నం చేశారు.


అల్లరి నరేష్ తనదైన ఈజీ మేనరిజమ్, కామెడీ టైమింగ్‌తో సినిమాను నడిపించేందుకు శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ, స్క్రిప్ట్‌లో కొత్తదనం లేకపోవడం సినిమాకు పెద్ద మైలేజ్ ఇవ్వలేకపోయింది. గతంలో వచ్చిన అనేక ఫాంటసీ సినిమాల ఛాయలు స్పష్టంగా కనిపించడంతో పాటు, ద్వితీయార్థంలో సాగదీత సన్నివేశాలు ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడతాయి.


ప్రొడక్షన్ విలువలు, శేఖర్ చంద్ర సంగీతం పర్వాలేదనిపించినా, బలహీనమైన కథనం వల్ల సినిమా గ్రాఫ్ కిందకే పడిపోయింది. మొత్తంగా చెప్పాలంటే, ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా కేవలం అల్లరి నరేష్ కామెడీ కోసం చూస్తే ఈ పాత ఫార్ములా చిత్రం ఒకసారి ట్రై చేయొచ్చు!

Sep 08, 2026 Telugu

Romanchakam movie review

Sakshi

By Sakshi

5.0
out of 10
సుమంత్ ప్రభాస్, అనంతిక సనీల్‌కుమార్ జంటగా నటించిన ‘రోమాంచకం’ యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీగా తెరకెక్కింది. డేటింగ్ యాప్ నేపథ్యంలో మొదలయ్యే అన్వేష్, మైథిలి లవ్ స్టోరీకి ఫ్రెండ్స్ గ్యాంగ్ కామెడీ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.సుమంత్ ప్రభాస్ చాలా నేచురల్‌గా నటించారు. కామెడీ సీన్స్‌లోనూ, సెకండాఫ్‌లో వచ్చే ఎమోషనల్ మూమెంట్స్‌లోనూ మెప్పించారు. అనంతికతో అతని కెమిస్ట్రీ ఫ్రెష్‌గా అనిపిస్తుంది. ముఖ్యంగా ఫ్రెండ్స్...

సుమంత్ ప్రభాస్, అనంతిక సనీల్‌కుమార్ జంటగా నటించిన ‘రోమాంచకం’ యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీగా తెరకెక్కింది. డేటింగ్ యాప్ నేపథ్యంలో మొదలయ్యే అన్వేష్, మైథిలి లవ్ స్టోరీకి ఫ్రెండ్స్ గ్యాంగ్ కామెడీ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.

సుమంత్ ప్రభాస్ చాలా నేచురల్‌గా నటించారు. కామెడీ సీన్స్‌లోనూ, సెకండాఫ్‌లో వచ్చే ఎమోషనల్ మూమెంట్స్‌లోనూ మెప్పించారు. అనంతికతో అతని కెమిస్ట్రీ ఫ్రెష్‌గా అనిపిస్తుంది. ముఖ్యంగా ఫ్రెండ్స్ గ్యాంగ్ మధ్య వచ్చే కామెడీ సీన్స్ మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తాయి.

అయితే కథలో కొత్తదనం కంటే స్క్రీన్‌ప్లే కొంత తడబడటం, కొన్ని సన్నివేశాలు స్లోగా అనిపించడం మైనస్. వాసుకి వైభవ్ సంగీతం, పవన్ పప్పుల సినిమాటోగ్రఫీ సినిమాకు మంచి సపోర్ట్ ఇచ్చాయి.

ఓవరాల్‌గా.. మంచి కామెడీ, యూత్‌ఫుల్ లవ్ ట్రాక్‌తో ‘రోమాంచకం’ వన్‌టైమ్ వాచ్‌గా ఓకే అనిపిస్తుంది

Sep 08, 2026 Telugu

I'M Game movie review

5.0
out of 10
దుల్కర్ సల్మాన్ నటించిన ‘ఐ యామ్ గేమ్’ కాసినో, క్రికెట్ బెట్టింగ్ నేపథ్యంలో తెరకెక్కిన స్పోర్ట్స్ క్రైమ్ డ్రామా. దర్శకుడు నివాస్ ఎంచుకున్న కాన్సెప్ట్ డిఫరెంట్‌గా ఉన్నప్పటికీ, కథనం అన్ని చోట్లా ఒకే స్థాయిలో ఆకట్టుకోదు.ఫస్టాఫ్‌లో దుల్కర్ సల్మాన్ పెర్ఫార్మెన్స్ సినిమాకు ప్రధాన బలం. క్రికెట్ బెట్టింగ్ కారణంగా ఆటగాళ్ల జీవితాల్లో వచ్చే సమస్యలను ఆసక్తికరంగా చూపించారు. అయితే కొన్ని సన్నివేశాలు స్లోగా అనిపి...

దుల్కర్ సల్మాన్ నటించిన ‘ఐ యామ్ గేమ్’ కాసినో, క్రికెట్ బెట్టింగ్ నేపథ్యంలో తెరకెక్కిన స్పోర్ట్స్ క్రైమ్ డ్రామా. దర్శకుడు నివాస్ ఎంచుకున్న కాన్సెప్ట్ డిఫరెంట్‌గా ఉన్నప్పటికీ, కథనం అన్ని చోట్లా ఒకే స్థాయిలో ఆకట్టుకోదు.


ఫస్టాఫ్‌లో దుల్కర్ సల్మాన్ పెర్ఫార్మెన్స్ సినిమాకు ప్రధాన బలం. క్రికెట్ బెట్టింగ్ కారణంగా ఆటగాళ్ల జీవితాల్లో వచ్చే సమస్యలను ఆసక్తికరంగా చూపించారు. అయితే కొన్ని సన్నివేశాలు స్లోగా అనిపిస్తాయి.


సెకండాఫ్‌లో మిస్కిన్, ఆంటోని వర్గీస్ ఎంట్రీతో కథలో ఇంటెన్సిటీ పెరుగుతుంది. కాయదు లోహర్ తన పాత్ర పరిధిలో ఆకట్టుకున్నారు.

యాక్షన్, స్పోర్ట్స్ కొరియోగ్రఫీ బాగున్నాయి. జేక్స్ బిజోయ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, జిమ్‌షి ఖాలీద్ సినిమాటోగ్రఫీ సినిమాకు మంచి సపోర్ట్ ఇచ్చాయి.


ఓవరాల్‌గా.. డిఫరెంట్ కాన్సెప్ట్, మంచి పెర్ఫార్మెన్స్ ఉన్నప్పటికీ, కథనం మరింత గ్రిప్పింగ్‌గా ఉంటే సినిమా రేంజ్ మరో స్థాయిలో ఉండేది. వన్‌టైమ్ వాచ్‌గా ‘ఐ యామ్ గేమ్’ ఓకే అనిపిస్తుంది.

Sep 08, 2026 Telugu +1
7.0
out of 10
ఒక సినిమాను మనం టెక్నికల్ అంశాలు, బడ్జెట్, భారీతనం కంటే ప్రేక్షకుల మనసుకు హత్తుకునే భావోద్వేగాలే సినిమాను నిలబెడతాయని బెత్లేహెం కుడుంబ యూనిట్ సినిమాతో దర్శకుడు గిరీష్ ఏ.డి మరోసారి నిరూపించాడు. ప్రేమ అనేది అప్పటికప్పుడు పుట్టే ఆకర్షణలా కాకుండా, ఓ విత్తనం పడే రోజు నుంచి అది పువ్వులా మారేంత సున్నితంగా, సహజంగా చూపించిన విధానం కట్టిపడేస్తుంది. ప్రతి పాత్రకు ఒక లోతైన, బలమైన నేపథ్యం ఉంటుంది.ఇక ఈ మూవీలో ప...

ఒక సినిమాను మనం టెక్నికల్ అంశాలు, బడ్జెట్, భారీతనం కంటే ప్రేక్షకుల మనసుకు హత్తుకునే భావోద్వేగాలే సినిమాను నిలబెడతాయని బెత్లేహెం కుడుంబ యూనిట్ సినిమాతో దర్శకుడు గిరీష్ ఏ.డి మరోసారి నిరూపించాడు. ప్రేమ అనేది అప్పటికప్పుడు పుట్టే ఆకర్షణలా కాకుండా, ఓ విత్తనం పడే రోజు నుంచి అది పువ్వులా మారేంత సున్నితంగా, సహజంగా చూపించిన విధానం కట్టిపడేస్తుంది. ప్రతి పాత్రకు ఒక లోతైన, బలమైన నేపథ్యం ఉంటుంది.


ఇక ఈ మూవీలో ప్రపోజల్ సీన్ అయితే ఈ మధ్య కాలంలో వచ్చిన బెస్ట్ రొమాంటిక్ సన్నివేశాల్లో ఒకటిగా నిలుస్తుంది. కాలేజీ వార్షికోత్సవంలో జరిగే హంగామా కడుపుబ్బా నవ్విస్తుంది. సంభాషణల్లోని పంచ్‌లు బాగా పేలాయి. అయితే అక్కడక్కడా కొన్ని మైనస్‌లు లేకపోలేదు. జోయెల్ ప్రియురాలి అన్నయ్య క్యారెక్టర్ కథలో అంతగా ఇమడలేదు. అలాగే వినయ్ ఫోర్ట్ చిన్న పాత్ర, పదే పదే వచ్చే మద్యపాన సన్నివేశాలు కాస్త శృతి మించినట్లు అనిపిస్తాయి. సింపుల్ అండ్ బ్యూటీఫుల్ లవ్ స్టోరీ చూడాలనుకుంటే బెత్లెహెం కుటుంబ యూనిట్ బెస్ట్ ఛాయిస్..


ఓవరాల్‌గా బెత్లెహెం కుటుంబ యూనిట్.. సింపుల్ అండ్ బ్యూటీఫుల్..!


Sep 05, 2026 Telugu +1
Why MRO?