Register as a Reviewer

Movie Reviews

Professional reviews and ratings from top critics and publications worldwide

1218
Total Reviews
81
Movies Reviewed
24
Reviewer Categories
Active filters:
Showing 637-648 of 1218 reviews

Sathi Leelavathi Movie Review

5.0
out of 10
లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ "సతీ లీలావతి". లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ తాజాగా థియేటర్లలో విడుదలైంది. ఇక సినిమా విషయానికి వస్తే... రొటీన్ కథా కథనాలతో దర్శకుడు తాతినేని సత్య ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించాడు. పెర్ఫార్మన్స్ పరంగా లావణ్య త్రిపాఠి వన్ విమెన్ షోగా నడిపించింది. ఓవరాల్‌ గా చూసుకుంటే, ‘సతీ లీలావతి’ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ గా ప్రేక...

లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ "సతీ లీలావతి". లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ తాజాగా థియేటర్లలో విడుదలైంది. ఇక సినిమా విషయానికి వస్తే... రొటీన్ కథా కథనాలతో దర్శకుడు తాతినేని సత్య ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించాడు. పెర్ఫార్మన్స్ పరంగా లావణ్య త్రిపాఠి వన్ విమెన్ షోగా నడిపించింది. 


ఓవరాల్‌ గా చూసుకుంటే, ‘సతీ లీలావతి’ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ గా ప్రేక్షకులను పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయింది. లావణ్య త్రిపాఠి పెర్ఫార్మెన్స్ మరియు పర్వాలేదనిపించే ఫస్టాఫ్ సినిమాకు ప్లస్ అయ్యాయి. సెకండాఫ్ లో వచ్చే కామెడీ ట్రాక్స్, మెయిన్ ప్లాట్ నుంచి కథ డీవియేట్ కావడం మైనస్. ఈ వీకెండ్ ఏదైనా ఫ్యామిలీ డ్రామా చూడాలనుకునే వారు తక్కువ అంచనాలతో ఈ చిత్రాన్ని చూడటం బెటర్.

May 08, 2026 Telugu

Gayapadda Simham Movie Review

4.0
out of 10
గాయపడ్డ సింహం గురించి చెప్పాలంటే... ఇంట్రెస్టింగ్ ఐడియా. బోరింగ్ స్టోరీ. ఈ మూవీకి ఒక విలక్షణమైన కథాంశం ఉంది. ఇది ఒక ఎంటర్టైనింగ్ కామెడీగా మారే అవకాశం ఉంది. కానీ స్క్రీన్ ప్లే చాలా బోరింగ్ గా అనిపిస్తుంది, ఎట్ ది సేమ్ టైం సెకండ్ హాఫ్ లో ఏవేవో సన్నివేశాలను కలిపి కుట్టినట్లుగా అనిపిస్తుంది. ఈ ఫార్స్ స్పూఫ్ కామెడీ చాలా వరకు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కొన్ని నవ్వులు తప్ప, చివరికి ఇది ఒక బోరింగ్ మ...

గాయపడ్డ సింహం గురించి చెప్పాలంటే... ఇంట్రెస్టింగ్ ఐడియా. బోరింగ్ స్టోరీ. ఈ మూవీకి ఒక విలక్షణమైన కథాంశం ఉంది. ఇది ఒక ఎంటర్టైనింగ్ కామెడీగా మారే అవకాశం ఉంది. కానీ స్క్రీన్ ప్లే చాలా బోరింగ్ గా అనిపిస్తుంది, ఎట్ ది సేమ్ టైం సెకండ్ హాఫ్ లో ఏవేవో సన్నివేశాలను కలిపి కుట్టినట్లుగా అనిపిస్తుంది. ఈ ఫార్స్ స్పూఫ్ కామెడీ చాలా వరకు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కొన్ని నవ్వులు తప్ప, చివరికి ఇది ఒక బోరింగ్ మూవీగా నిలుస్తుంది. 


#GaayaPaddaSimham Interesting Idea, Boring Execution!


The film has an unconventional storyline that had potential to be a wacky comedy. But the screenplay turns out to be exhausting and feels like random scenes stitched together especially in the second half. The farce/spoof comedy fails to land for the most part. 


Ends up being a tiring experience with just a few laughs!

May 06, 2026 Telugu

Gayapadda Simham movie Review

5.0
out of 10
తరుణ్ భాస్కర్ చాలా రోజుల తర్వాత మళ్ళీ హీరోగా ట్రై చేసిన ‘గాయపడ్డ సింహం’ ఫైనల్ గా థియేటర్లకు వచ్చేసింది. ఇక సినిమా స్టార్ట్ అయిన పదిహేను నిమిషాల్లోనే క్లారిటీ వచ్చేస్తుంది… “ఇది ఏ జానర్ బాస్?” అసలు కామెడీనా? సీరియస్ స్టోరీనా? లేక ఎక్స్‌పెరిమెంటా? అని — ఏదీ ఫుల్‌ గా వర్క్ అవ్వలేదు. హీరోగా తరుణ్ భాస్కర్ బానే సెట్టయ్యాడు, కానీ తన రోల్ స్ట్రాంగ్ రాసుకోలేదు. తన స్టైల్ అఫ్ డైలాగ్స్, నేచురల్ యాక్టింగ్ ఉంద...

తరుణ్ భాస్కర్ చాలా రోజుల తర్వాత మళ్ళీ హీరోగా ట్రై చేసిన ‘గాయపడ్డ సింహం’ ఫైనల్ గా థియేటర్లకు వచ్చేసింది. ఇక సినిమా స్టార్ట్ అయిన పదిహేను నిమిషాల్లోనే క్లారిటీ వచ్చేస్తుంది… “ఇది ఏ జానర్ బాస్?” అసలు కామెడీనా? సీరియస్ స్టోరీనా? లేక ఎక్స్‌పెరిమెంటా? అని — ఏదీ ఫుల్‌ గా వర్క్ అవ్వలేదు. హీరోగా తరుణ్ భాస్కర్ బానే సెట్టయ్యాడు, కానీ తన రోల్ స్ట్రాంగ్ రాసుకోలేదు. తన స్టైల్ అఫ్ డైలాగ్స్, నేచురల్ యాక్టింగ్ ఉంది, కానీ ఫ్రెష్ నెస్ లేదు.


సెకండాఫ్‌లో అయినా స్టోరీ పికప్ అవుద్దేమో అనుకుంటే మళ్ళీ రిపీట్ మోడ్ లోకి వెళ్తుంది. ఎటొచ్చి శ్రీ విష్ణు ఎంట్రీ చ్చినప్పుడే కాస్త ఎంటర్టైన్మెంట్ పెరిగి మంచి ఫీల్ ఇస్తుంది. ఓవరాల్ గా ఒక డిఫెరెంట్ కాన్సెప్ట్ ని, డిఫెరెంట్ పాయింట్ తో, డిఫెరెంట్ గానే మేకర్స్ చూపించడానికి ట్రై చేశారన్నమాట. సింపుల్ గా లో ఎక్స్పెక్టేషన్స్ తో చూస్తే మంచి ఫీల్ రావొచ్చు గాని, గాయపడ్డ సింహం పై కన్ఫ్యూజన్ ఎక్కువ.

May 06, 2026 Telugu

Gayapadda Simham movie Review

5.0
out of 10
'గాయపడ్డ సింహం' అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన తరుణ్ భాస్కర్ ఈసారి అరకొర అన్నట్టుగా ఇంప్రెస్ చేయడానికి ట్రై చేసాడు. అయితే సినిమా చూస్తే ఒక క్లియర్ ఫీలింగ్ అయితే వస్తుంది. ఐడియా ఉంది, కానీ ఎగ్జిక్యూషన్ మిస్ అయింది. తరుణ్ భాస్కర్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకున్నా, హీరోగా ఎక్స్‌పెక్ట్ చేసిన ఇంపాక్ట్ రాలేదు. ఫస్ట్ హాఫ్‌ లోనే సినిమా టోన్ సెటిల్ అవ్వదు. సెకండాఫ్‌లో కథ ముందుకు వెళ్లాలని చూస్తుంది, కానీ మళ్లీ...

'గాయపడ్డ సింహం' అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన తరుణ్ భాస్కర్ ఈసారి అరకొర అన్నట్టుగా ఇంప్రెస్ చేయడానికి ట్రై చేసాడు. అయితే సినిమా చూస్తే ఒక క్లియర్ ఫీలింగ్ అయితే వస్తుంది. ఐడియా ఉంది, కానీ ఎగ్జిక్యూషన్ మిస్ అయింది. తరుణ్ భాస్కర్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకున్నా, హీరోగా ఎక్స్‌పెక్ట్ చేసిన ఇంపాక్ట్ రాలేదు. ఫస్ట్ హాఫ్‌ లోనే సినిమా టోన్ సెటిల్ అవ్వదు. సెకండాఫ్‌లో కథ ముందుకు వెళ్లాలని చూస్తుంది, కానీ మళ్లీ అదే లూప్‌లో తిరిగినట్టు అనిపిస్తుంది. ఎమోషన్, కామెడీ రెండింట్లోనూ క్లారిటీ లేకపోవడం వల్ల ఆడియెన్స్ కనెక్ట్ అవ్వడం కష్టమే. 


ఓవరాల్ గా సినిమా గురించి చెప్పాలంటే..జస్ట్ ఒకే. సోది లేకుండా ఒక్క ముక్కలో చెప్పాలంటే..కొత్తదనం కోసం వెళ్ళేవాళ్లకి మిస్, టైమ్‌పాస్ కోసం వెళ్లేవాళ్లకి కూడా మిక్స్డ్ ఫీలింగ్ మాత్రమే. రేటింగ్ విషయానికి వస్తే... ఫైవ్ అవుట్ అఫ్ టెన్ వరకు ఇవ్వొచ్చు.. లేదంటే టు పాయింట్ ఫైవ్ వరకు ఇవ్వొచ్చు. 

May 06, 2026 Telugu

Gayapadda Simham movie Review

5.0
out of 10
సమ్మర్ లో పెద్ద సినిమాలు లేక డీలా పడితే, చిన్న సినిమాలైనా ఊరట కలిగిస్తాయనుకుంటే అవి కూడా దెబ్బేస్తున్నాయి. లేటెస్ట్ గా రిలీజ్ అయిన ‘గాయపడ్డ సింహం’ కూడా ఇదే కోవలోకి వచ్చేలా కనిపిస్తుంది. ఈ సినిమా ఒక క్లియర్ ఐడియా లేకుండా తీసిన ఎక్స్‌పెరిమెంట్‌ లా అనిపిస్తుంది. తరుణ్ భాస్కర్ దర్శకుడిగా తనదైన స్టైల్‌ తో మంచి సినిమాలు ఇచ్చాడు. కానీ హీరోగా ఈసారి ఆయన తీసుకున్న రిస్క్ పూర్తిగా వర్క్ కాలేదు. ట్రైలర్‌ లో క...

సమ్మర్ లో పెద్ద సినిమాలు లేక డీలా పడితే, చిన్న సినిమాలైనా ఊరట కలిగిస్తాయనుకుంటే అవి కూడా దెబ్బేస్తున్నాయి. లేటెస్ట్ గా రిలీజ్ అయిన ‘గాయపడ్డ సింహం’ కూడా ఇదే కోవలోకి వచ్చేలా కనిపిస్తుంది. ఈ సినిమా ఒక క్లియర్ ఐడియా లేకుండా తీసిన ఎక్స్‌పెరిమెంట్‌ లా అనిపిస్తుంది. తరుణ్ భాస్కర్ దర్శకుడిగా తనదైన స్టైల్‌ తో మంచి సినిమాలు ఇచ్చాడు. కానీ హీరోగా ఈసారి ఆయన తీసుకున్న రిస్క్ పూర్తిగా వర్క్ కాలేదు. ట్రైలర్‌ లో కనిపించిన ఎంటర్టైన్మెంట్ సినిమా మొత్తంలో కనబడకపోవడం పెద్ద డిసప్పాయింట్.


ఫస్ట్ హాఫ్ మొత్తం లాజిక్ లేకుండా, సిల్లీ సిట్యుయేషన్స్‌ తో సాగిపోతుంది. కామెడీ కోసం పెట్టిన రిఫరెన్సులు కూడా పెద్దగా పేలవు. ప్రేక్షకుడు ఎక్కడ కనెక్ట్ అవ్వాలి, ఎక్కడ నవ్వాలి అన్న క్లారిటీ లేకుండా సినిమా ముందుకు సాగుతుంది. సెకండాఫ్‌లో కూడా కథలో పెద్దగా ట్విస్టులు ఉండవు. నటీనటుల పరంగా చూస్తే తరుణ్ భాస్కర్ తన పాత్రలో ఓకే అనిపించినా, సినిమాలోని బలహీన రైటింగ్ వల్ల ఆయన పర్ఫార్మెన్స్ కూడా లిఫ్ట్ కాలేదు. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి పాత్రలు కూడా పరిమితంగానే ఉన్నాయి. జెడి చక్రవర్తి పాత్రకు ఉన్న బిల్డప్ స్క్రీన్‌ పై కనిపించదు. అయితే శ్రీ విష్ణు ఎంట్రీ మాత్రం కొంతవరకు సినిమాకు ఎనర్జీ ఇస్తుంది. ఓవరాల్ గా ‘గాయపడ్డ సింహం’ కంఫ్యూజ్డ్ రైటింగ్ + వీక్ ఎక్స్యూగుషన్. 

May 06, 2026 Telugu

Gayapadda Simham movie Review

4.0
out of 10
'గాయపడ్డ సింహం' అంటూ థియేటర్లోకి వచ్చిన తరుణ్ భాస్కర్ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే… అంచనాలు ఎక్కువ, అవుట్‌పుట్ తక్కువ. డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్ ఈసారి హీరోగా ఆడియెన్స్‌ను పూర్తిగా డిస్సపాయింట్ చేసాడు. ట్రైలర్‌ లో కనిపించిన కామెడీ, ఎంటర్టైన్మెంట్ సినిమా మొత్తంలో కనిపించకపోవడం పెద్ద మైనస్. ఫస్ట్ హాఫ్ అంతా సిల్లీ సీన్స్, లాజిక్ లేకుండా సాగిపోతుంది. కొన్ని రిఫరెన్సులు,...

'గాయపడ్డ సింహం' అంటూ థియేటర్లోకి వచ్చిన తరుణ్ భాస్కర్ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే… అంచనాలు ఎక్కువ, అవుట్‌పుట్ తక్కువ. డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్ ఈసారి హీరోగా ఆడియెన్స్‌ను పూర్తిగా డిస్సపాయింట్ చేసాడు. ట్రైలర్‌ లో కనిపించిన కామెడీ, ఎంటర్టైన్మెంట్ సినిమా మొత్తంలో కనిపించకపోవడం పెద్ద మైనస్. ఫస్ట్ హాఫ్ అంతా సిల్లీ సీన్స్, లాజిక్ లేకుండా సాగిపోతుంది. కొన్ని రిఫరెన్సులు, మీమ్‌ లను పెట్టినా అవి నవ్వు తెప్పించలేవు. సెకండాఫ్‌ లో కూడా కథ ముందుకు వెళ్లకుండా అదే చుట్టూ తిరుగుతున్న ఫీలింగ్ వస్తుంది.


ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి రోల్స్ పరిమితంగానే ఉంటాయి. జెడి చక్రవర్తి పాత్రకు హైప్ ఇచ్చినా, స్క్రీన్‌ పై పెద్దగా ఇంపాక్ట్ లేదు. సినిమా మొత్తం బోర్‌ గా సాగుతున్న టైం లో శ్రీ విష్ణు ఎంట్రీ కొద్దివరకు రిలీఫ్ ఇస్తుంది. టెక్నికల్‌ గా పర్వాలేదనిపించినా, కంటెంట్ పరంగా సినిమా బలహీనంగా ఉంది. మొత్తంగా ‘గాయపడ్డ సింహం’ అనే టైటిల్ లాగా… ఈ సినిమా చూసిన ఆడియెన్స్‌ కి కూడా ‘గాయం’ మిగులుతుంది. కామెడీ కోసం వచ్చినవాళ్లకు నిరాశ, కొత్తదనం కోరుకున్నవాళ్లకు పూర్తిగా మిస్ అయ్యే సినిమా ఇది. ఓవరాల్ గా గాయపడ్డ సింహాన్ని చూసి జాలిపడితే థియేటర్ నుంచి వచ్చిన ఆడియన్స్ ని చూసి మరొకరు జాలిపడతారు అన్నట్టుంది. 

May 06, 2026 Telugu
6.0
out of 10
తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన గాయపడ్డ సింహం తాజాగా థియేటర్లలో విడుదల కాగా థియేటర్లలో మిక్స్డ్ రెస్పన్స్ అందుకుంది. కాగా ఈ సినిమా ప్రమోషన్లలో ట్రంప్ అంశాన్ని వినియోగించడం వల్ల ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఫస్ట్ హాఫ్‌ లో ప్రేమ కథ, అమెరికా ప్రయాణం, ట్రంప్‌ పై ప్రతీకారం వంటి అంశాలు ప్రధానంగా చూపించారు. సెకండ్ హాఫ్‌ లో పోలీస్ అంశాలు, ధర్మ పాత్ర, భైరవ్ దాస్ కథ ప్రధానంగా సాగుతుంది. శ్రీ విష్ణు పాత్ర గె...

తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన గాయపడ్డ సింహం తాజాగా థియేటర్లలో విడుదల కాగా థియేటర్లలో మిక్స్డ్ రెస్పన్స్ అందుకుంది. కాగా ఈ సినిమా ప్రమోషన్లలో ట్రంప్ అంశాన్ని వినియోగించడం వల్ల ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఫస్ట్ హాఫ్‌ లో ప్రేమ కథ, అమెరికా ప్రయాణం, ట్రంప్‌ పై ప్రతీకారం వంటి అంశాలు ప్రధానంగా చూపించారు. సెకండ్ హాఫ్‌ లో పోలీస్ అంశాలు, ధర్మ పాత్ర, భైరవ్ దాస్ కథ ప్రధానంగా సాగుతుంది. శ్రీ విష్ణు పాత్ర గెస్ట్ రోల్‌ గా కాకుండా సెకండ్ హీరోలా కనిపించడం విశేషం. అతని పాత్రకు ప్రత్యేకంగా కథను రూపొందించడం కొత్తగా అనిపించింది.


అయితే ఈ ప్రయోగం మెయిన్ స్టోరీని కొంతవరకు డామినేట్ చేసినట్లు అనిపిస్తుంది. భైరవ్ దాస్ పాత్ర ఆధారంగా భవిష్యత్తులో ప్రత్యేక సినిమా వచ్చే అవకాశం ఉందని క్లైమాక్స్ తో హింట్ ఇచ్చారు టీమ్. ట్రంప్‌కు సంబంధించిన సన్నివేశాలు హాస్యాన్ని అందిస్తాయి. అమెరికాకు వెళ్లాలని ఆశపడే ప్రేక్షకులకు ఈ కథ కనెక్ట్ అవుతుంది. కొన్ని చోట్ల కథ నెమ్మదిగా సాగినప్పటికీ, కామెడీ సీన్స్ కడుబుబ్బా నవ్విస్తాయి. ఓవరాల్ గా సినిమా గురించి సింపుల్ గా చెప్పేస్తే... “గాయపడ్డ సింహం” సినిమా అమెరికా వెళ్లాలన్న ఓ వ్యక్తి కల నెరవేరకపోవడంతో అతను తీసుకున్న నిర్ణయాలు, వాటి ప్రభావం చుట్టూ తిరిగే కథ. కామెడీ, యాక్షన్, ఎమోషనల్ అంశాలతో సినిమా రూపొందించబడింది. హ్యాపీగా నవ్వుకోవాలి అనుకునేవారికి గాయపడ్డ సింహం సినిమా మంచి ఆప్షన్.


May 06, 2026 Telugu

Gayapadda Simham movie Review

Tupaki

By Tupaki

5.0
out of 10
గాయపడ్డ సింహం కథ విషయానికి వస్తే... డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడు అయినప్పటి నుంచి తన నిర్ణయాలతో ప్రపంచాన్ని ఎలా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడో తెలిసిందే. అలాంటి నిర్ణయాల్లో వీసా రద్దు నిబంధనలు కూడా ఒకటి. దీనివల్ల అందరికంటే ఎక్కువగా ఇండియన్సే ఇబ్బంది పడ్డారు. ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకుని కామెడీ ప్రధానంగా తెరకెక్కిన గాయపడ్డ సింహం ఆడియన్స్ ని బానే మెప్పిస్తుంది. కామెడీ బాగా రాయగలిగిన రైటర్...

గాయపడ్డ సింహం కథ విషయానికి వస్తే... డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడు అయినప్పటి నుంచి తన నిర్ణయాలతో ప్రపంచాన్ని ఎలా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడో తెలిసిందే. అలాంటి నిర్ణయాల్లో వీసా రద్దు నిబంధనలు కూడా ఒకటి. దీనివల్ల అందరికంటే ఎక్కువగా ఇండియన్సే ఇబ్బంది పడ్డారు. ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకుని కామెడీ ప్రధానంగా తెరకెక్కిన గాయపడ్డ సింహం ఆడియన్స్ ని బానే మెప్పిస్తుంది. కామెడీ బాగా రాయగలిగిన రైటర్ అయితే దీని మీద మంచి కామెడీ సీన్లతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించేవాడు. 


కానీ కొత్త దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్. ఒరిజినల్ కామెడీని పండించలేక ఎక్కువగా స్పూఫుల మీద ఆధారపడ్డాడు. ఈ క్రమంలో అక్కడక్కడా కొన్ని నవ్వులు పండాయి కానీ.. ఆ డోస్ సరిపోలేదు. తనను డిపోర్ట్ చేయించిన ట్రంప్ మీద ప్రతీకారం తీర్చుకునే హీరో, ఈ పాయింట్ మీదే ఈ కథను నడిపిస్తే అది హిలేరియస్ గా వర్కవుట్ అయ్యేదేమో. కానీ ఇందులోకి క్రైమ్ రాకెట్ ట్రాక్ ను తీసుకొచ్చి మిక్స్ చేయడంతో ఈ కథ రొటీన్ క్రైమ్ కామెడీలా రూట్ తీసుకుంది. ఇక జేడీ చక్రవర్తి పాత్ర గురించి ప్రోమోల్లో ఇచ్చిన బిల్డప్ కి సినిమాలో ఉన్నదానికి పొంతన లేదు. అసలు ‘గాయపడ్డ సింహం’ టైటిల్ కే న్యాయం జరగలేదు. ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా అక్కడక్కడా కొన్ని నవ్వులతో సరిపెట్టుకుంటాం అంటే ఈ చిత్రంపై ఒక లుక్కేయొచ్చు. అంతకుమించి ఆశిస్తే కష్టం. 

May 06, 2026 Telugu
5.0
out of 10
తరుణ్ భాస్కర్‌కి దర్శకుడిగా మంచి విజయాలున్నాయి. కానీ నటుడిగా, హీరోగా మాత్రం ఆ రేంజ్ సక్సెస్‌ని ఇంకా అందుకోలేదు. తరుణ్ భాస్కర్ నుంచి ఆడియెన్స్ ఎక్కువగా డైరెక్షన్ కోరుకుంటున్నారు. కానీ తరుణ్ భాస్కర్ మాత్రం ఎక్కువగా నటన మీద ఫోకస్ పెట్టినట్టు అనిపిస్తుంది.యాక్టర్‌గానూ తరుణ్ భాస్కర్‌ కి మంచి పేరు అయితే ఉంది కానీ సరైన సక్సెస్ లేదు. ఇపుడు ‘గాయపడ్డ సింహం’తో మరోసారి ఆడియన్స్ ముందుకు వచ్చాడు. అయితే సినిమాకు...

తరుణ్ భాస్కర్‌కి దర్శకుడిగా మంచి విజయాలున్నాయి. కానీ నటుడిగా, హీరోగా మాత్రం ఆ రేంజ్ సక్సెస్‌ని ఇంకా అందుకోలేదు. తరుణ్ భాస్కర్ నుంచి ఆడియెన్స్ ఎక్కువగా డైరెక్షన్ కోరుకుంటున్నారు. కానీ తరుణ్ భాస్కర్ మాత్రం ఎక్కువగా నటన మీద ఫోకస్ పెట్టినట్టు అనిపిస్తుంది.యాక్టర్‌గానూ తరుణ్ భాస్కర్‌ కి మంచి పేరు అయితే ఉంది కానీ సరైన సక్సెస్ లేదు. ఇపుడు ‘గాయపడ్డ సింహం’తో మరోసారి ఆడియన్స్ ముందుకు వచ్చాడు. అయితే సినిమాకు ఆడియన్స్ నుండి ఊహించిన రేంజ్ లో అయితే రెస్పాన్స్ రాలేదు. 


కథా కథనాలు చాలా ఆర్డినరీగా ఉండి కాస్త డిస్సపాయింట్ చేసింది. ఎంటర్టైన్మెంట్ బానే చేసినా ఫ్రెష్ కామెడీ రిపీటెడ్ కామెడీలా అనిపించలేదు. టెక్నికల్ గా చూసుకుంటే గాయపడ్డ సింహం ఓకే అనిపిస్తుంది. పాటలు అంత గుర్తు పెట్టుకునేలా ఉండకపోయినా ఆర్ఆర్ బాగుంటుంది. విజువల్స్ కూడా రిచ్‌ గా అనిపిస్తాయి. ఈ మూవీని లిమిటెడ్ బడ్జెట్‌ లో, తక్కువ లొకేషన్లలోనే చుట్టేసినట్టుగా అనిపిస్తుంది. కొన్ని చోట్ల డైలాగ్స్, మీమ్స్ రిఫరెన్స్ బాగుంటాయి. ఎడిటింగ్, ఆర్ట్ ఇలా అన్ని డిపార్మెంట్స్ పర్వాలేదనిపిస్తాయి. అలాగే క్లైమాక్స్ లో పోరాట సింహం అంటూ సీక్వెల్ కూడా అనౌన్స్ చేస్తారు. దానికన్నా ముందు ఫస్ట్ పార్ట్ ఆడియన్స్ ని ఎంతవరకు మెప్పిస్తోందో ఫైనల్ గా చూడాలి. 

May 06, 2026 Telugu

Gayapadda Simham Movie Review

6.0
out of 10
గాయపడ్డ సింహం అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన తరుణ్ భాస్కర్ ఎప్పట్లానే తన న్యాచురల్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నాడు.ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే అందరి లానే హీరో కూడా అమెరికా వెళ్ళాలని అనుకుంటాడు, కానీ తన విసా రిజక్ట్ అవ్వడంతో ఏకంగా ట్రంప్ మీదే పగ తీర్చుకోవాలని డిసైడ్ అవుతాడు. దాంతో హీరో ఏం చేశాడు, ఆ తర్వాత కథేంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఓవరాల్ గా కథ సిల్లీగా అనిపించినా కూడా కామెడీ...

గాయపడ్డ సింహం అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన తరుణ్ భాస్కర్ ఎప్పట్లానే తన న్యాచురల్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నాడు.

ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే అందరి లానే హీరో కూడా అమెరికా వెళ్ళాలని అనుకుంటాడు, కానీ తన విసా రిజక్ట్ అవ్వడంతో ఏకంగా ట్రంప్ మీదే పగ తీర్చుకోవాలని డిసైడ్ అవుతాడు. దాంతో హీరో ఏం చేశాడు, ఆ తర్వాత కథేంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఓవరాల్ గా కథ సిల్లీగా అనిపించినా కూడా కామెడీ పరంగా బానే వర్కౌట్ అయ్యే స్కోప్ ఉన్న పాయింట్ ను కొంచెం కన్ఫ్యూజన్ స్క్రీన్ ప్లే తో డైరెక్టర్ పూర్తిగా అనుకున్న రేంజ్ లో తీయలేకపోయాడు. 


అయితే ఉన్నంతలో సినిమాలో ఎంటర్టైన్మెంట్ బానే మెప్పించింది. తరుణ్ భాస్కర్ తన వరకు బాగా నటించి మెప్పించగా టాప్ స్టార్ మూవీస్ రిఫరెన్స్ లు సినిమాలో బాగానే వర్కౌట్ అయ్యాయి అని చెప్పాలి. అన్నిటికి మించి కొంత గ్యాప్ తర్వాత జేడీ చక్రవర్తి పర్వాలేదు అనిపించేలా నటించగా స్పెషల్ క్యామియో చేసిన శ్రీ విష్ణు ఉన్న సీన్స్ అన్నీ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. ఓవరాల్ గా ఆడియన్స్ ముందే తక్కువ అంచనాలతో థియేటర్స్ కి వెళితే చాలా వరకు ఎంజాయ్ చేసి పర్వాలేదు, మంచి సినిమానే చూశాం అన్న ఫీలింగ్ తో థియేటర్స్ బయటికి రావొచ్చు. 

May 06, 2026 Telugu

Gayapadda simham Movie Review

6.0
out of 10
క్రైమ్ కామెడీ సినిమాలకు పెద్దగా లాజిక్‌లు వెతకకూడదు, చూసినంత సేపు నవ్వుకుంటే చాలు. ఇదే విధంగా గాయపడ్డ సింహం సినిమాలో కూడా ట్రంప్ మీద హీరో పగ తీర్చుకోవాలనుకునే సిల్లీ పాయింట్‌ లోనే కావాల్సినంత కామెడీ పుట్టింది. తరుణ్ భాస్కర్ హీరోగా బానే చేసినా, కొత్త తరహాలో చేసిందేమి లేదు. అందరికీ సిల్లీగా అనిపించే విషయాన్ని హీరో చాలా సీరియస్‌గా తీసుకోవడం బాగుంది. అయితే, కథనం చాలా నెమ్మదిగా సాగడం వల్ల సినిమా ముందుక...

క్రైమ్ కామెడీ సినిమాలకు పెద్దగా లాజిక్‌లు వెతకకూడదు, చూసినంత సేపు నవ్వుకుంటే చాలు. ఇదే విధంగా గాయపడ్డ సింహం సినిమాలో కూడా ట్రంప్ మీద హీరో పగ తీర్చుకోవాలనుకునే సిల్లీ పాయింట్‌ లోనే కావాల్సినంత కామెడీ పుట్టింది. తరుణ్ భాస్కర్ హీరోగా బానే చేసినా, కొత్త తరహాలో చేసిందేమి లేదు. అందరికీ సిల్లీగా అనిపించే విషయాన్ని హీరో చాలా సీరియస్‌గా తీసుకోవడం బాగుంది. అయితే, కథనం చాలా నెమ్మదిగా సాగడం వల్ల సినిమా ముందుకు సాగకుండా అక్కడే తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. కథలోకి వెళ్లడానికి చాలా సమయం తీసుకున్నారు. అందులోనూ వచ్చే పాటలు కథకు అడ్డం తగిలి బ్రేకులు వేస్తూ ఉంటాయి.


ఇక తరుణ్ భాస్కర్, జేడీ చక్రవర్తి నటన ఈ సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్‌గా నిలిచింది. అక్కడక్కడా కామెడీ అద్భుతంగా పేలింది. ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ సెకండాఫ్. సెకండాఫ్ అభిమానులను ఆకట్టుకునేలా తీశారు. అయితే ఫస్టాఫ్ లో కథాంశం స్లోగా సాగుతుంది. ఉడికీ ఉడకని కథ, కథనంతో దర్శకుడు ప్రేక్షకులను కాస్త కన్‌ఫ్యూజ్ చేశాడు. సీరియస్ అంశాల వల్ల తికమక జరిగింది. ఓవరాల్ గా 'గాయపడిన సింహం' పెద్దగా అంచనాలు లేకుండా ఓసారి చూడదగ్గ క్రైమ్ కామెడీ చిత్రం. అయితే టైటిల్‌ కు తగ్గట్టుగానే కొన్నిసార్లు ఆ 'గాయపడిన సింహం' ప్రేక్షకులను కూడా కాస్త గాయపరిచే ప్రయత్నమే చేసింది. 


May 06, 2026 Telugu

Gayapadda Simham Movie Review

6.0
out of 10
గాయపడ్డ సింహం అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన తరుణ్ భాస్కర్ ఈ సినిమాతో తన ఫ్యాన్స్ ని బానే మెప్పించడని చెప్పాలి. ఇక సినిమా ఫస్ట్ హాఫ్ అంతా ధరహాస్ ప్రేమకథ, అమెరికా ప్రయాణం, ట్రంప్ మీద రివెంజ్, భైరవ్ దాస్ కథతో సాగుతుంది. సెకండ్ హాఫ్ అంతా ధరహాస్ జీవితంలోకి పోలీసులు, ధర్మ ఎలా వచ్చాడు, భైరవ్ దాస్ కథతో సాగుతుంది. ఈ మధ్యలో శ్రీ విష్ణు పాత్ర భైరవ్ దాస్ ని గెస్ట్ అప్పీరెన్స్ లా కాకుండా, సెకండ్ హీరోలా దానికి ఇ...

గాయపడ్డ సింహం అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన తరుణ్ భాస్కర్ ఈ సినిమాతో తన ఫ్యాన్స్ ని బానే మెప్పించడని చెప్పాలి. ఇక సినిమా ఫస్ట్ హాఫ్ అంతా ధరహాస్ ప్రేమకథ, అమెరికా ప్రయాణం, ట్రంప్ మీద రివెంజ్, భైరవ్ దాస్ కథతో సాగుతుంది. సెకండ్ హాఫ్ అంతా ధరహాస్ జీవితంలోకి పోలీసులు, ధర్మ ఎలా వచ్చాడు, భైరవ్ దాస్ కథతో సాగుతుంది. ఈ మధ్యలో శ్రీ విష్ణు పాత్ర భైరవ్ దాస్ ని గెస్ట్ అప్పీరెన్స్ లా కాకుండా, సెకండ్ హీరోలా దానికి ఇంకో కథ రాసుకొని, అతని ఫ్యామిలీ, అతని కథ చెప్పడం గమనార్హం. 


అంతే కాదు క్లైమాక్స్ లో శ్రీవిష్ణు, జెడి చక్రవర్తి పాత్రలని చూపించడంతో పాటు పార్ట్ 2 అని ‘పోరాట సింహం’ టైటిల్ అనౌన్స్ చేసారు కాబట్టి అది శ్రీవిష్ణు మీదే ఫుల్ సినిమా ఉండొచ్చు అని తెలుస్తుంది. ఇక ఈ సినిమా గురించి ఓవరాల్ గా సింపుల్ గా చెప్పాలంటే... ఓవరాల్ గా ‘గాయపడ్డ సింహం’ సినిమా అమెరికా వెళ్లాలన్న ఓ వ్యక్తి కల ఆగిపోవడంతో ట్రంప్ మీద కోపంతో ఏం చేసాడు, దాంతో అతని చుట్టూ ఏం జరిగింది అని కామెడీగా తెరకెక్కించారు. ఫ్రెష్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేస్తే నిరాశ చెందొచ్చుగాని, తక్కువ అంచనాలతో సినిమాకి వెళ్తే ఓ మోస్తరు ఎంజాయ్ చేయొచ్చు. 


May 05, 2026 Telugu
Why MRO?