Movie Reviews
Professional reviews and ratings from top critics and publications worldwide
సందేశాన్ని చేదు గుళికలా కాకుండా షుగర్ కోటింగ్ ఇచ్చి చెప్పిన సినిమాలు అన్నీ దాదాపుగా విజయాలు సాధించాయి. ఈ 'వాలా 2' కూడా ఆ కోవలోకి వస్తుంది. కథగా చూస్తే ఇదేమీ కొత్త కాదు. కానీ, ప్రతి స్టూడెంట్ కనెక్ట్ అయ్యేలా ఉంది. మలయాళంలో 200 కోట్ల రూపాయలు వసూలు చేయడానికి కారణం అదే అయ్యి ఉంటుంది. నేటివిటీని పక్కన పెడితే... తెలుగు యువత సైతం కనెక్ట్ అయ్యే అంశాలు 'వాలా 2'లో పుష్కలంగా ఉన్నాయ్.
'వాలా 2' స్పెషాలిటీ ఏమిటంటే... నేటివిటీకి, సహజత్వానికి దగ్గరగా సినిమా తీశారు. ఎక్కడా గీత దాటలేదు. ఇందులో యువతకు స్కూల్, కాలేజ్ లైఫ్ గుర్తు చేసే నోస్టాల్జియా మూమెంట్స్ చాలా ఉన్నాయి. సినిమాలకు ఓవర్సీస్ మార్కెట్ చాలా కీలకం. ఇండియా నుంచి విదేశాలకు చదువు (అమెరికా) లేదా ఉద్యోగం (దుబాయ్) కోసం వెళ్లిన యువత సినిమాలు చూడటం వల్ల ఓవర్సీస్ కలెక్షన్స్ వస్తున్నాయి. అయితే విదేశాల్లో వాళ్ళు పడే కష్టాలను వినోదాత్మకంగా చూపించారు దర్శక రచయితలు శివన్ ఎస్ఏ, విపిన్ దాస్. పరోక్షంగా సందేశం కూడా ఇచ్చారు.
అయితే 'వాలా' చూడని ప్రేక్షకులకు 'వాలా 2' చాలా కొత్తగా అనిపిస్తుంది. ఆ సినిమా చూసిన ప్రేక్షకులకు మరోసారి నోస్టాల్జియా మూమెంట్స్ గుర్తు చేస్తుంది. అక్కడక్కడా కాస్త డౌన్ అయినట్టు అనిపించినా... యూత్‌కి మాత్రం తప్పకుండా కనెక్ట్ అవుతుంది. వినోదంతో పాటు చక్కటి సందేశం ఇస్తుంది. యువతకు తమను తాము తెరపై చూసుకున్నట్టు అనిపిస్తుంది.
ఈ వారం తెలుగులో థియేటర్లలో విడుదలైన ‘వాలా 2’ థియేటర్లలో మంచి రెస్పాన్స్ అందుకోగా, దర్శకుడు సావిన్ ఎస్ఏ ఒక చిన్న కథను తీసుకుని, దానికి యూత్ ఎంటర్టైన్మెంట్‌తో పాటు ఎమోషన్స్‌ను జోడించి ఆసక్తికరంగా మలిచారు. హషీర్, అలన్, వినాయక్, అజిన్ తమ పాత్రల్లో సహజంగా నటిస్తూ సినిమాకు బలం చేకూర్చారు. ముఖ్యంగా వారి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
ఫస్ట్ హాఫ్ మొత్తం సరదా కామెడీతో వేగంగా సాగిపోతూ, కాలేజ్ రోజుల జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది. సెకండ్ హాఫ్‌లో విదేశాల్లో ఎదురయ్యే సమస్యలను చూపిస్తూ కథలో కొంత ఎమోషనల్ టచ్ ఇచ్చారు. క్లైమాక్స్‌లో వచ్చే భావోద్వేగ సన్నివేశాలు హృదయాన్ని తాకుతాయి.
సాంకేతికంగా కూడా సినిమా పర్వాలేదనిపిస్తుంది. సంగీతం, నిర్మాణ విలువలు కథకు అనుగుణంగా ఉన్నాయి. అయితే కొత్త నటీనటులు మాత్రమే ఉండి, పెద్దగా పేరున్న నటులు లేకపోవడం చిన్న వెలితి. మొత్తంగా ‘వాలా 2’ యూత్‌ను టార్గెట్ చేసిన కమింగ్ ఆఫ్ ఏజ్ ఎంటర్టైనర్. ఫ్రెండ్స్‌తో కలిసి వీకెండ్‌లో చూసేందుకు ఓ సరదా చిత్రం. ఫైనల్ గా "ఇది బిలియన్ బాయ్స్ బయోపిక్. అంటే నాది నీది మనందరిది".
తెలుగులో ఈ వారం రిలీజ్ అయిన మూవీస్ లో 'వాలా 2' ఒకటి. మలయాళం లో పెద్ద హిట్ అయిన ఈ సినిమా తాజాగా తెలుగులో విడుదలైంది. పెద్ద స్టార్ కాస్ట్ లేకపోయినా, కొత్త నటుల ఎనర్జీ ఈ సినిమాకి మెయిన్ హైలైట్‌గా నిలిచింది.
దర్శకుడు సావిన్ ఎస్ఏ చిన్న కథను తీసుకుని, దానిలో ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫ్రెండ్షిప్ వైబ్స్, ఎమోషన్స్ అన్నీ కలిపి బాగా ప్రెజెంట్ చేశాడు. హషీర్, అలన్, వినాయక్, అజిన్ లాంటి లీడ్ యాక్టర్స్ తమ పాత్రల్లో నేచురల్‌గా లివ్ చేశారు. వారి మధ్య కెమిస్ట్రీనే సినిమాను ముందుకు నడిపించే ప్రధాన బలం.
ఫస్ట్ హాఫ్ మొత్తం ఫన్ రైడ్ లా సాగిపోతూ, కాలేజ్ డేస్‌ను రీక్రియేట్ చేస్తుంది. సెకండ్ హాఫ్‌లో విదేశాల్లో ఫేస్ చేసే స్ట్రగుల్స్‌ను చూపిస్తూ, నవ్వుల మధ్య ఒక ఫీలింగ్ కూడా ఇస్తుంది. క్లైమాక్స్ మాత్రం సైలెంట్‌గా హార్ట్‌ని టచ్ చేసేలా డిజైన్ చేశారు. మ్యూజిక్, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా కథకి సపోర్ట్ అయ్యాయి. కొన్ని చోట్ల స్లోగా అనిపించినా, ఓవరాల్‌గా ‘వాలా 2’ యూత్‌తో పాటు ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేసే ఫీల్ గుడ్ మూవీ.
ఫైనల్ వర్డ్: ఫ్రెండ్షిప్ + ఫన్ + ఎమోషన్ కావాలంటే ఈ వీకెండ్ కి పర్ఫెక్ట్ ఛాయిస్
మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన "వాఘా 2" మూవీ తాజాగా "వాలా 2" పేరిట తెలుగులో రిలీజ్ అవగా, థియేటర్లలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. నటీనటులు అందరూ చిన్నవాళ్ళే అయినా అందరూ బాగా నటించారు. చిన్న కథని ఎంతో ఎంటర్టైనింగ్ గా మంచి ఎమోషన్స్ తో తెరకెక్కించాడు దర్శకుడు సావిన్ ఎస్ఏ. మ్యూజిక్ పరంగా నిర్మాణ విలువల పరంగా కూడా టీం ని మెచ్చుకోవాలి.
ఇక ఓవరాల్ గా చూసుకుంటే, ‘వాలా 2’ అనేది ప్రతి ఒక్కరూ తమ కాలేజీ రోజులను గుర్తు చేసుకునేలా చేసే ఒక మంచి కమింగ్-ఆఫ్-ఏజ్ డ్రామా. నేచురల్ పెర్ఫార్మెన్స్, రిలేటబుల్ కామెడీ, మరియు ఎమోషనల్ క్లైమాక్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణలు. అక్కడక్కడా సాగతీత సీన్లు ఉన్నప్పటికీ, మీ స్నేహితులతో కలిసి ఈ వీకెండ్ కి హ్యాపీగా చూడదగ్గ సినిమా ఇది.
జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస చిత్రాలు చేసుకుంటూ పోతున్నాడు హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఐదేళ్లలోనే పది చిత్రాలు పూర్తి చేశాడు. తన కథల ఎంపిక బాగా ఉన్నా ఏదో కలిసి రావడం లేదు. గతేడాది ‘క’ తో సూపర్ హిట్ అందుకున్న, ఇప్పుడు ‘కె-ర్యాంప్’ అంటూ వచ్చాడు. యుక్తి తరేజా (Yukti Tareja)కథానాయికగా జైన్స్ నాని (Jains Nani) దర్శకత్వంలో రాజేష్ దండా-శివ బొమ్మకు నిర్మించిన ఈ చిత్రం తాజాగా శనివారం ప్రేక్షకుల ముందుకొచ్చింది
మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ రొటీన్ లవ్ స్టోరీ ని దర్శకుడు తెరకెక్కించిన విధానం బాగుంది. ఇక వినోదాన్ని, భావోద్వేగాలను మేళవిస్తూ సినిమా జైన్స్ నాని సినిమా తీసిన విధానం అందరినీ అలరిస్తుందనే చెప్పవచ్చు. నిజానికి ఇది తనకు మంచి పరిచయ చిత్రం అవుతుంది. లోపాలు, లాజిక్కులు వెతక్కుండా ఓసారి ఈ సినిమా చూసేయవచ్చు.
Kantara Chapter 1 Movie Review
కన్నడ స్టార్ రిషబ్ శెట్టి నుంచి వచ్చిన కాంతార: చాప్టర్-1… మళ్లీ అదే వరల్డ్‌లోకి తీసుకెళ్తూ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ పార్ట్ ఎక్కడ ఎండ్ అయిందో అక్కడ్నుంచే కథ పికప్ అవ్వడం మంచి ప్లస్.
స్టోరీ సింపుల్ అయినా… ప్రెజెంటేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్! 🎯
హీరోగా కంటే డైరెక్టర్‌గా రిషబ్ శెట్టి చేసిన వర్క్ నిజంగా హైలైట్. ప్రతి సీన్‌లో ఆయన విజన్ క్లియర్‌గా కనిపిస్తుంది.
టెక్నికల్‌గా సినిమా టాప్ నాచ్
అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ & BGM – goosebumps level
సినిమాటోగ్రఫీ, విజువల్స్ – అద్భుతం
ఎడిటింగ్ కూడా క్రిస్ప్‌గా ఉంది
డివోషనల్ టచ్, ఫోక్ ఎలిమెంట్స్ కలిపి సినిమా మంచి ఇమర్సివ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. క్లైమాక్స్ అయితే major highlight
రిషబ్‌తో పాటు రుక్మణి వసంత్ కూడా అక్కడ strong impact ఇస్తుంది.
ఎండింగ్ మాత్రం… next part కోసం wait చేయించేలా hook పెడుతుంది!
హీరో కిరణ్ అబ్బవరం నిర్మించిన లేటెస్ట్ మూవీ తిమ్మరాజుపల్లి టివి. అంతా కొత్తనటులతో తెరకెక్కించిన ఈ మూవీ మంచి రెస్పాన్స్ ని అందుకుంటుంది. 90స్ బ్యాక్ డ్రాప్ లో ఓ టివి నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ కథ చిన్నగా ఉన్నా, స్క్రీన్ ప్లే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. హీరోహీరోయిన్లుగా నటించిన సాయితేజ, వేద జలంధర్ సహా, కీ రోల్స్ లో నటించిన వారందరూ చక్కగా నటించారు. అలాగే దర్శకుడు మునిరాజు సినిమాని చక్కగా హ్యాండిల్ చేసాడు. ఎడిటింగ్ కూడా తానే కావడం విశేషం.
అలాగే మ్యూజిక్ డైరెక్టర్ వంశీకాంత్ గురించి చెప్పుకుంటే... సినిమాలో చాలా సాధారణంగా అనిపించే సన్నివేశాల్లో కూడా ఏదో జరిగిపోతున్న ఫీలింగ్ కలిగించి జనాలు ఉత్కంఠగా తెర వైపు చూసేలా చేశాడతను. వంశీకాంత్ బీజీఎం అంత ఎఫెక్టివ్ గా సాగింది. పాటలు కూడా బాగానే అనిపిస్తాయి. అక్షయ్ రామ్ ఛాయాగ్రహణం కూడా బాగుంది. 90ల నాటి పల్లెటూరి వాతావరణాన్ని చాలా బాగా చూపించాడు. ఆర్ట్ వర్క్ కూడా ఓకే. ఇలాంటి కథకు సపోర్ట్ చేయడం ద్వారా కిరణ్ అబ్బవరం తన అభిరుచిని చాటుకున్నాడు. మునిరాజు రచయితగా-దర్శకుడిగా కొంతమేర ఆకట్టుకున్నాడు. అతను ఎంచుకున్న కాన్సెప్ట్ బాగుంది. కానీ ఎగ్జిక్యూషన్లో కొంత తడబడ్డాడు. పాత్రల చిత్రణ ఇంకా బాగా ఉండుంటే.. కథనాన్ని మరింత బిగితో రాసుకుని ఉంటే ‘తిమ్మరాజుపల్లి టీవీ’ ఇంపాక్ట్ వేరుగా ఉండేది.
ThimmarajuPalli TV Movie Review
తిమ్మరాజుపల్లి టివి అంటూ ఈ వారం థియేటర్లలో విడుదలైన ఈ సినిమాలో హీరోహీరోయిన్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ వరకూ అందరూ కొత్తవారే. థియేటర్లలో మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకోగా, సింగిల్ స్క్రీన్స్ లో మంచి రెస్పాన్స్ స్లో గా అందుకుంటుంది. ఇక మెయిన్ లీడ్ లో సాయితేజ్, వేదా జలంధర్ చక్కగా నటించగా, ప్రదీప్ కొట్టెది కూడా కీ రోల్ లో అదరగొట్టాడు. ఇక తిమ్మరాజుపల్లి అందాలను అద్భుతంగా చూపించారు డిఓపీ అక్షయ్ రామ్ పొదిరెడ్డి. 1990ల నేపథ్యంలో పల్లె అందాల్ని చక్కగా చూపించారు. ఎక్కువ శాతం ఒరిజినల్ లొకేషన్లలో చిత్రీకరించడం కథకు కలిసొచ్చిందనే చెప్పాలి.
అలాగే వంశీకాంత్ రేఖన బాణీలు ఆకట్టుకునేల ఉన్నాయి. పాటలతో పాటు నేపథ్య సంగీతం బాగుంది. దర్శకుడే ఎడిటర్ కావడం ప్లస్ అయినా.. సెకండాఫ్ లో కొన్ని చోట్ల సాగదీతగా అనిపించింది. నిర్మాత కిరణ్ అబ్బవరం కథకు తగ్గ బడ్జెట్ లో గ్రాండ్ గా తీశారు. లాజిక్కులు, భారీ అంచనాలు లేకుండా సినిమాకు వెళ్తే హ్యాపీగా ఎంజాయ్ చేసి బయటకు రావచ్చు. అయితే ఈ తరహా సినిమాలకు ఓపెనింగ్స్ బాగా వచ్చినపుడే జనాల్లోకి ఫాస్ట్ గా వెళ్ళగలుగుతుంది. లేదంటే సినిమాను జనాల్లోకి తీసుకు వెళ్ళడానికి శ్రమ పడక తప్పదు.
ThimmarajuPalli TV movie Review
అంతా కొత్తవాళ్లతో తెరకెక్కించిన తిమ్మరాజుపల్లి టివి తాజాగా థియేటర్లలో విడుదలై అలరిస్తుంది. 90స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ మూవీలో అందరూ కొత్తవాళ్ళైనా బానే నటించగా, కిరణ్ అబ్బవరం స్వయంగా నిర్మించిన ఈ మూవీకి వి.మునిరాజు డైరెక్ట్ చేసాడు. ఇక కథ పరంగా చిన్న కథే అయినా, దాన్ని ఆసక్తి కరంగా తెరకెక్కించాడు దర్శకుడు. మ్యూజిక్ పరంగానూ మంచి ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. అలాగే చాలా సీన్లని ఆర్‌ఆర్ మరో స్థాయికి తీసుకెళ్లిందని చెప్పొచ్చు.
అక్షయ్ రామ్ పొదిశెట్టి కెమెరా వర్క్ సైతం బాగుంది. విజువల్‌గా కనువిందు చేస్తుంది. ఆర్ట్ వర్క్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఎడిటింగ్ పరంగా ఇంకాస్త ట్రిమ్ చేయోచ్చు. ఇక దర్శకుడు మునిరాజు మంచి కథని ఎంచుకోవడంతోపాటు, దాన్ని అంతే బాగా తెరపై ఆవిష్కరించడంలో సక్సెస్ అయ్యాడు. చాలా నేచురల్‌గా తెరకెక్కించారు. సహజత్వం పరంగా ఎక్కడా తగ్గలేదు. అదే ఈమూవీ సక్సెస్‌గా చెప్పొచ్చు. నిర్మాణ విలువలకు కొదవ లేదు. కిరణ్ అబ్బవరం రాజీపడకుండా నిర్మించారు. టీమ్‌కి అండగా నిలిచాడని ప్రతి ఫ్రేమ్‌లోనూ తెలుస్తోంది. తిమ్మరాజుపల్లి టీవీ ఒక ఫ్రెష్ అటెంప్ట్. మళ్లీ పాత రోజుల్లోకి తీసుకెళ్లి, నవ్వించి, అలరించే మూవీ. మంచి అనుభూతిని పంచుతుంది. 90కిడ్స్ కి బాగా నచ్చుతుంది.
ThimmarajuPalli TV movie Review
By 10TV Telugu
ఈ వారం విడుదలైన క్రేజీ సినిమాల్లో తిమ్మరాజుపల్లి టివి ఒకటి. అంతా కొత్త నటులతో తెరకెక్కిన ఈ మూవీ మంచి రెస్పాన్స్ అందుకుంది. రొటీన్ కథే అయినా ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే తో బాగా తెరకెక్కించాడు డైరెక్టర్ మునిరాజు. ఇక ఈ సినిమాలో నటించిన చాలా మంది కొత్తవాళ్ళైనా అదరగొట్టేసారు. హీరో సాయి తేజ్ చాలా బాగా నటించాడు. హీరోయిన్ వేద జలంధర్ క్యూట్ గా కనిపిస్తూనే చక్కగా నటించింది. ప్రదీప్ కొట్టె సినిమాకు హైలెట్. మిగిలిన నటీనటులు అంతా వారి పాత్రల్లో బాగా నటించారు. సినిమా మొదట్లో కిరణ్ అబ్బవరం వాయిస్ ఓవర్ ఇవ్వడం గమనార్హం.
టెక్నికల్ గా సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగా ప్లస్ అయింది. పోరాటాలు కూడా బాగున్నాయి. ఈ సినిమాకు లొకేషన్స్ చాలా ప్లస్ అయ్యాయి. 1996 విలేజ్ బ్యాక్ డ్రాప్ కావడంతో దానికి తగ్గట్టు లొకేషన్స్ చాలా బాగా వెతికి పట్టుకున్నారు. కొత్త కథని రొటీన్ లవ్ స్టోరీతో ఆసక్తికర స్క్రీన్ ప్లే తో బాగానే రాసుకొని తెరకెక్కించాడు దర్శకుడు. ఎడిటింగ్ లో అక్కడక్కడా కొన్ని ల్యాగ్ సీన్స్ కట్ చేస్తే బాగుండు. మొత్తంగా ‘తిమ్మరాజుపల్లి టీవీ’ సినిమా ఓ క్యూట్ లవ్ స్టోరీతో పాటు టీవీ దొంగతనం అనే సస్పెన్స్ తో ఆసక్తికరంగా తెరకెక్కించారు. ఫ్యామిలీతో కలిసి ఈ సినిమా చూడొచ్చు. ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు.
కిరణ్ అబ్బవరం నిర్మించిన కొత్త సినిమా తిమ్మరాజుపల్లి TV తాజాగా థియేటర్లలో విడుదల కాగా, మిక్స్డ్ రెస్పాన్స్ అందుకున్నప్పటికీ ఆ సినిమాకి ఆఫ్ లైన్ లో మంచి స్పందన వస్తుంది. కొత్త నటీనటులతో ఈ మూవీ తెరకెక్కగా నటీనటులు అందరూ చక్కగా చేశారు. ప్రదీప్ కొట్టెకి మంచి రోల్ దక్కింది. పాత్ర తాలూకూ మార్పులను బాగా చూపించారు. తెరపై సాయి తేజ్ మన పల్లెల్లో కనిపించే అబ్బాయిలా ఉన్నారు. ఎమోషనల్ సీన్స్ బాగా చేశారు. మిగతా ఆర్టిస్టులు అందరూ తమ తమ పాత్రలకు తగ్గట్టు నటించారు.
ఇక ట్రెండీ కథలు, ప్రేమలు మధ్య ప్రేక్షకులను 90వ దశకంలోకి తీసుకు వెళ్లడంలో 'తిమ్మరాజుపల్లి టీవీ' సక్సెస్ అయ్యింది. కథ కాస్త కిందకు మీదకు పడుతూ లేస్తూ వెళ్లినట్టు అనిపించినా... మంచి నోస్టాల్జియా మూమెంట్స్ అందిస్తుందీ సినిమా. సహజత్వానికి దగ్గరగా తీశారు. కొత్త వాళ్ళందరూ కలిసి చేసిన ప్రయత్నాన్ని అభినందించవచ్చు. సరదాగా రెండు గంటలు పల్లెలోకి వెళ్లి వచ్చినట్టు ఉంటుంది. ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా వెళితే థియేటర్లలో చివరి వరకు ప్రేక్షకుల్ని కూర్చోబెడుతుంది.
ThimmarajuPalli TV Movie Review
By Thyview
ఈ వారం మన ముందుకొచ్చిన తిమ్మరాజుపల్లి TV… basically ఒక నాస్టాల్జిక్ విలేజ్ డ్రామా! ముందుగా స్టోరీ పాయింట్ చూస్తే… చిన్నదే. కానీ డైరెక్టర్ వి. మునిరాజు దాన్ని 90స్ ఫీల్‌తో బానే ప్రెజెంట్ చేయడానికి ట్రై చేశాడు. ఇక్కడే కాస్త ఇష్యూ మొదలవుతుంది.
మెయిన్ స్టోరీకి వెళ్లడానికి టైమ్ తీసుకుంటుంది… కొంచెం స్లోగా అనిపిస్తుంది. పెద్దగా కాన్ఫ్లిక్ట్ లేకపోవడం వల్ల “ఏమవుతోంది?” అనే ఫీల్ వస్తుంది. కానీ… పల్లెటూరి ఎమోషన్స్ మాత్రం neatగా work అవుతాయి
అసలు సినిమా ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే… Second half!
టీవీ చుట్టూ తిరిగే మిస్టరీ angle, “ఈ తప్పు ఎవరు చేశారు?” అన్న థ్రాక్‌తో కథ కాస్త ఇంట్రెస్టింగ్ అవుతుంది. అక్కడ నుంచి ఎంగేజ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. టెక్నికల్‌గా చూస్తే.. వంశీకాంత్ రేఖన BGM – scenes కి soul ఇచ్చింది. ఆర్ట్ వర్క్ (సుధీర్ మాచర్ల) – 90s village vibes on point, తో పాటు అక్షయ్ రామ్ కెమెరా – very natural & pleasant visuals గా అనిపించాయి.మునిరాజు simple storyని emotionalగా చెప్పాడు. పెద్దగా high moments లేకపోయినా, grounded narration తో connect అయ్యేలా ట్రై చేశాడు. ఫైనల్ గా తిమ్మరాజు పల్లి టివి ఒక soft, nostalgic village drama. ఇక క్లైమాక్స్ లో ఒక మంచి సీన్ రివీల్ తో సీన్ ఎండ్ అవుతుంది. అండ్ కొత్త ఆడియన్స్ తో చేయడం వల్ల ఫ్రెష్ ఫీల్ వస్తుంది. ఇక వాళ్ళ పెర్ఫార్మన్స్ కూడా అదరగొట్టేసారు.
Browse by Reviewer Category
Discover reviews from different types of critics and publications
News Channel
Movie-specific media and publications
Twitter Channel
Website
Youtube Channel
CA/Advocate
Corporate (Non IT) Employee
Doctor/Health Worker
Freelancer & Consultant
Homemaker / Housewives
Women managing households
Influencer
IT Employee
Journalists & Critics
Private Employee
Small Business Owner
Less than 20 team size
Students & Youth
School students, college students, young viewers