Register as a Reviewer

Movie Reviews

Professional reviews and ratings from top critics and publications worldwide

1218
Total Reviews
81
Movies Reviewed
24
Reviewer Categories
Active filters:
Showing 709-720 of 1218 reviews
7.0
out of 10
అంతా కొత్తవాళ్ళతో తెరకెక్కిన తిమ్మరాజు పల్లి TV తాజాగా థియేటర్లలో విడుదలైంది. ఇక సినిమా గురించి చెప్పుకుంటే... దర్శకుడు వి. మునిరాజు ఎంచుకున్న పాయింట్ చాలా చిన్నదైనా, దాని చుట్టూ అల్లిన డ్రామా ప్రేక్షకులను 90ల నాటి నాస్టాల్జియాలోకి తీసుకెళ్తుంది. అయితే ప్రధాన కథలోకి వెళ్లడానికి చాలా సమయం తీసుకోవడం వల్ల ఫస్ట్ హాఫ్ కాస్త సాగదీసినట్లు అనిపిస్తుంది. బలమైన సంఘర్షణ లేకపోవడం వల్ల కథనం కాస్త మెల్లగా సాగుత...

అంతా కొత్తవాళ్ళతో తెరకెక్కిన తిమ్మరాజు పల్లి TV తాజాగా థియేటర్లలో విడుదలైంది. ఇక సినిమా గురించి చెప్పుకుంటే... దర్శకుడు వి. మునిరాజు ఎంచుకున్న పాయింట్ చాలా చిన్నదైనా, దాని చుట్టూ అల్లిన డ్రామా ప్రేక్షకులను 90ల నాటి నాస్టాల్జియాలోకి తీసుకెళ్తుంది. అయితే ప్రధాన కథలోకి వెళ్లడానికి చాలా సమయం తీసుకోవడం వల్ల ఫస్ట్ హాఫ్ కాస్త సాగదీసినట్లు అనిపిస్తుంది. బలమైన సంఘర్షణ లేకపోవడం వల్ల కథనం కాస్త మెల్లగా సాగుతున్న భావన ప్రేక్షకుడికి కలుగుతుంది. కానీ పల్లెటూరి ఎమోషన్స్ అయితే ఎక్కడా మిస్ చేయలేదు దర్శకుడు మునిరాజ్. 


ఇక ద్వితీయార్థంలో సినిమా అసలు వేగం పుంజుకుంటుంది. టీవీ చుట్టూ జరిగే మిస్టరీ, ఆ తప్పు ఎవరు చేశారు అనే కోణంలో సాగే కథనం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. పల్లెటూరి వాతావరణంలో ఒక చిన్న సమస్య ఎంత పెద్ద ఎమోషనల్ డ్రామాకు దారి తీస్తుందో దర్శకుడు చాలా సహజంగా చూపించాడు. టెక్నికల్‌గా ఈ సినిమాకు ప్రధాన బలం వంశీకాంత్ రేఖన అందించిన నేపథ్య సంగీతం. సాధారణ సన్నివేశాలకు కూడా తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో ప్రాణం పోశాడు. సుధీర్ మాచర్ల ఆర్ట్ వర్క్ 90స్ నాటి పల్లెటూరి వాతావరణాన్ని అద్భుతంగా కళ్లకు కట్టింది. అక్షయ్ రామ్ కెమెరా పనితనం సినిమా మూడ్‌కు తగ్గట్టుగా చాలా నేచురల్‌గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. మునిరాజు దర్శకత్వం కూడా మెప్పించింది. ఓవరాల్‌గా తిమ్మరాజుపల్లి టీవీ.. 90ల్లోని జ్ఞాపకాలు.. స్వచ్ఛమైన పల్లెటూరి కథ

Apr 18, 2026 Telugu
6.0
out of 10
కిరణ్ అబ్బవరం ప్రొడ్యూస్ చేసిన మూవీ తిమ్మరాజు పల్లి TV ఫైనల్ గా థియేటర్లలో రిలీజ్ అయింది. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ మూవీ ఆడియన్స్ ని మెజారిటీ వారికి బానే నచ్చుతుంది. కొత్త నటులతో చేసినందువల్ల ఫ్రెష్ ఫీల్ కూడా వస్తుంది. దీనికి తోడు 90స్ బ్యాక్ డ్రాప్ కాబట్టి మరింత నచ్చే ఛాన్స్ ఉంది. మెయిన్లి పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో మూవీస్ ఇష్టపడే వాళ్లకు తిమ్మరాజు పల్లి టివి బాగానే నచ్చుతుందని అనిపిస్తుంది.&...

కిరణ్ అబ్బవరం ప్రొడ్యూస్ చేసిన మూవీ తిమ్మరాజు పల్లి TV ఫైనల్ గా థియేటర్లలో రిలీజ్ అయింది. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ మూవీ ఆడియన్స్ ని మెజారిటీ వారికి బానే నచ్చుతుంది. కొత్త నటులతో చేసినందువల్ల ఫ్రెష్ ఫీల్ కూడా వస్తుంది. దీనికి తోడు 90స్ బ్యాక్ డ్రాప్ కాబట్టి మరింత నచ్చే ఛాన్స్ ఉంది. మెయిన్లి పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో మూవీస్ ఇష్టపడే వాళ్లకు తిమ్మరాజు పల్లి టివి బాగానే నచ్చుతుందని అనిపిస్తుంది. 


అలాగే డైరెక్టర్ మునిరాజు ఈ సినిమాతో మంచి సక్సెస్ కొట్టే ఛాన్స్ బానే ఉందనిపిస్తుంది. ఇక ఈ సినిమాకు మా రేటింగ్ 3.7 ఫైనల్ గా తిమ్మరాజుపల్లి టివి గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే... టివి కి సంబంధించి అయితే బానే ఆడింది, కానీ థియేటర్లలో ఎంతవరకు ఆడుతుందో అనేది ఆడియన్స్ డిసైడ్ చేయాలి. కానీ ఇలాంటి సినిమాలు చూడాలి. ఎందుకంటే ఎన్నో చెత్త ఏ రేటెడ్ సినిమాల మధ్య ఇలాంటి డీసెంట్ థ్రిల్లర్ మూవీస్ ఉంటె ఆ మాత్రం హిట్ అవ్వాల్సిన అవసరం ఈ సినిమాలకుంది. ఫైనల్ గా తిమ్మరాజు పల్లి టివి మూవీ రెగ్యులర్ మూవీ లవర్స్ ని అయితే బానే ఆకట్టుకుంటుంది. 

Apr 18, 2026 Telugu
7.0
out of 10
హీరో కిరణ్ అబ్బవరం తొలిసారి ప్రొడ్యూస్ చేసిన మూవీ తిమ్మరాజు పల్లి TV. ఈ వారం థియేటర్లలో విడుదలైన ఈ మూవీ డీసెంట్ రెస్పాన్స్ అందుకుంది. కథ రొటీన్ గానే ఉన్నా, డీసెంట్ స్క్రీన్ ప్లే తో అలరించింది. హీరోగా సాయి తేజ్ కొత్తవాడైనా తన పాత్రకు తగ్గట్టుగా సహజంగా నటించాడు. ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాల్లో అతని నటన ప్రేక్షకులను ఆకట్టుకునే స్థాయిలో ఉంది. హీరోయిన్ వేద పాత్ర చిన్నదే అయినా, కథకు అవసరమైన భ...

హీరో కిరణ్ అబ్బవరం తొలిసారి ప్రొడ్యూస్ చేసిన మూవీ తిమ్మరాజు పల్లి TV. ఈ వారం థియేటర్లలో విడుదలైన ఈ మూవీ డీసెంట్ రెస్పాన్స్ అందుకుంది. కథ రొటీన్ గానే ఉన్నా, డీసెంట్ స్క్రీన్ ప్లే తో అలరించింది. హీరోగా సాయి తేజ్ కొత్తవాడైనా తన పాత్రకు తగ్గట్టుగా సహజంగా నటించాడు. ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాల్లో అతని నటన ప్రేక్షకులను ఆకట్టుకునే స్థాయిలో ఉంది. హీరోయిన్ వేద పాత్ర చిన్నదే అయినా, కథకు అవసరమైన భావోద్వేగాన్ని అందించింది. రాజప్ప పాత్రలో నటించిన ఆర్టిస్ట్ సినిమాకు ప్రధాన బలం. మొత్తానికి, కొత్తవారైనా తమ పరిధిలో మంచి ప్రయత్నం చేశారు. 


ఇక టెక్నికల్ గా దర్శకుడు మునిరాజు ఈ సినిమాతో సహజమైన గ్రామీణ వాతావరణాన్ని చూపించాలని ప్రయత్నించాడు. 90ల కాలాన్ని తిరిగి తెరపైకి తీసుకురావడంలో విజయం సాధించాడు. కానీ కథనం విషయంలో అదే రియలిజం కొన్నిసార్లు నెమ్మదితనంగా మారింది. ఆర్ట్ డిపార్ట్‌మెంట్ 90ల సెటప్‌ను బాగా రీక్రియేట్ చేసింది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని చోట్ల ఎమోషన్‌ను బాగా ఎలివేట్ చేసింది. కానీ పాటలు మాత్రం థియేటర్ నుంచి బయటకు వచ్చాక గుర్తుండేలా లేవు. చిత్తూరు యాసలో డైలాగ్స్ ఉండటం ఈ సినిమాకు రియలిస్టిక్ టచ్ ఇచ్చింది. ప్లస్ పాయింట్స్.. 90ల నాటి గ్రామీణ వాతావరణం సింపుల్ కాన్సెప్ట్‌లో మిస్టరీ ఎలిమెంట్ సహజమైన నటన కొన్ని ఎమోషనల్ సీన్స్ మైనస్ పాయింట్స్ స్లో నరేషన్ చిన్న కథను ఎక్కువగా లాగడం యాస వల్ల కనెక్ట్ సమస్య గుర్తుండని సంగీతం ఫైనల్ వర్డిక్ట్... గ్రామీణ కథలను ఇష్టపడే వారికి నచ్చే సినిమా.

Apr 18, 2026 Telugu
6.0
out of 10
కిరణ్ అబ్బవరం ప్రొడ్యూస్ చేసిన తిమ్మరాజుపల్లి టీవీ ఈ వారం థియేటర్లలో విడుదల కాగా, బీలో యావరేజ్ టాక్ అందుకుంది. సాయి తేజ్, వేదా జలంధర్ మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చారు. అయితే కథ ప్రకారం ద్వితీయార్థం తప్పిపోయిన టీవీ చుట్టూ అల్లుకున్న 'హూడన్నిట్' (హత్య ఎవరు చేశారు?) డ్రామాగా మారుతుంది. ఇక్కడే దర్శకుడు తడబడ్డాడు. హీరో, హీరోయిన్ల వేదనను లోతుగా అన్వేషించలేదు. కథనం ఒక మూస పద్ధతిని అనుసరిస్తుంది – చాలా మందిపై అ...

కిరణ్ అబ్బవరం ప్రొడ్యూస్ చేసిన తిమ్మరాజుపల్లి టీవీ ఈ వారం థియేటర్లలో విడుదల కాగా, బీలో యావరేజ్ టాక్ అందుకుంది. సాయి తేజ్, వేదా జలంధర్ మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చారు. అయితే కథ ప్రకారం ద్వితీయార్థం తప్పిపోయిన టీవీ చుట్టూ అల్లుకున్న 'హూడన్నిట్' (హత్య ఎవరు చేశారు?) డ్రామాగా మారుతుంది. ఇక్కడే దర్శకుడు తడబడ్డాడు. హీరో, హీరోయిన్ల వేదనను లోతుగా అన్వేషించలేదు. కథనం ఒక మూస పద్ధతిని అనుసరిస్తుంది – చాలా మందిపై అనుమానాలు రేకెత్తించి, చివరికి ఊహించని వ్యక్తిపై దృష్టి పెడుతుంది. సాధారణంగా, 'హూడన్నిట్' కథలు ఇలాగే పనిచేస్తాయి, అదే ఫార్ములా. కానీ అది ప్రేక్షకులకు అంత సుస్పష్టంగా తెలియకుండా చూసుకోవాల్సిన బాధ్యత చిత్రనిర్మాతలదే.


అయినప్పటికీ, ఇది మనం తేలికగా తీసిపారేయగలిగే సినిమా కాదు. దీని ప్రతి అణువులోనూ ఒక ఉద్దేశం, నిజాయితీతో కూడిన ప్రయత్నం ఉన్నాయని మనం గ్రహించగలం. టీవీ సన్నివేశాలు మరియు గ్రామ నేపథ్యం కచ్చితంగా ఒక సరికొత్త అనుభూతినిస్తాయి. ఈ లోపాలు ఉన్నప్పటికీ, ఈ కథాంశాన్ని అనుభవించి, ప్రయత్నించడానికి మీరు దీన్ని ఒక్కసారి చూడవచ్చు.

Apr 18, 2026 Telugu
6.0
out of 10
తిమ్మరాజుపల్లి టీవీ అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన చిన్న సినిమా ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన అందుకుంది. హీరోహీరోయిన్లుగా నటించిన సాయి తేజ్, వేదా జలంధర్ మంచి పెర్ఫార్మన్స్ ఇవ్వగా, ప్రదీప్ కొట్టే, స్వాతి కరిమిరెడ్డి కూడా మెచ్యురిటీతో కూడిన పెర్ఫార్మెన్స్‌ను అందించారు. కిరణ్ అబ్బవరమ్ నుంచి లభించిన ఒకే ఒక్క ఛాన్స్‌‌ను ప్రూవ్ చేసుకోవాలనే తపన కనిపించింది. ఈ సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరు కూడా వందకు వందశా...

తిమ్మరాజుపల్లి టీవీ అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన చిన్న సినిమా ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన అందుకుంది. హీరోహీరోయిన్లుగా నటించిన సాయి తేజ్, వేదా జలంధర్ మంచి పెర్ఫార్మన్స్ ఇవ్వగా, ప్రదీప్ కొట్టే, స్వాతి కరిమిరెడ్డి కూడా మెచ్యురిటీతో కూడిన పెర్ఫార్మెన్స్‌ను అందించారు. కిరణ్ అబ్బవరమ్ నుంచి లభించిన ఒకే ఒక్క ఛాన్స్‌‌ను ప్రూవ్ చేసుకోవాలనే తపన కనిపించింది. ఈ సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరు కూడా వందకు వందశాతం తమ ప్రతిభను చాటుకొన్నారు. ఈ సినిమాను ఫీల్‌గుడ్‌గా మార్చడంలో తమ వంతు సహకారాన్ని అందించారు.


ఇక ఈ మూవీకి అత్యంత బలంగా మారిన సాంకేతిక విభాగాల్లో మ్యూజిక్, సినిమాటోగ్రఫి గురించి చెప్పుకోవాలి. వంశీకాంత్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదరగొట్టింది. అక్షయ్ రామ్ అందించిన సినిమాటోగ్రఫి చాలా బాగుంది. కిరణ్ అబ్బవరం టీమ్ అనుసరించిన ప్రొడక్షన్ వాల్యూస్ ట్రెండ్ సెట్టింగ్‌గా ఉన్నాయి. సరైన కంటెంట్‌ ఉంటే.. భారీ బడ్జెట్‌తో కాకుండా తక్కువ వ్యయంతో ప్రేక్షకులను మెప్పించవచ్చు అని నిరూపించారు. ఈకలు పీకి..లోపాలు వెతకాలనే టార్గెట్‌తో కాకుండా.. ఓ నిజాయితీతో కూడిన అంటెంప్ట్‌ను చూడాలంటే.. తిమ్మరాజుపల్లి టీవీని ఈ వారం మీ ఛాయిస్‌గా ఎంచుకోవచ్చు.

Apr 18, 2026 Telugu
6.0
out of 10
తాజాగా విడుదలైన తిమ్మరాజు పల్లి TV చిత్రం ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనను అందుకుంటోంది. సినిమాలో హీరో సాయితేజ, హీరోయిన్ వేద జలంధర్ తమ నటనతో ఆకట్టుకోగా… రూరల్ తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌ ను బాగా చూపించారు. రాజప్ప పాత్రలో ప్రతీక్ కూడా మంచి నటన కనబరిచారు. మిగతా నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతిక విభాగాల విషయానికి వస్తే… సంగీతం సినిమాకు ప్లస్‌గా నిలిచింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, కొన్ని పాటలు బాగ...

తాజాగా విడుదలైన తిమ్మరాజు పల్లి TV చిత్రం ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనను అందుకుంటోంది. సినిమాలో హీరో సాయితేజ, హీరోయిన్ వేద జలంధర్ తమ నటనతో ఆకట్టుకోగా… రూరల్ తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌ ను బాగా చూపించారు. రాజప్ప పాత్రలో ప్రతీక్ కూడా మంచి నటన కనబరిచారు. మిగతా నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతిక విభాగాల విషయానికి వస్తే… సంగీతం సినిమాకు ప్లస్‌గా నిలిచింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, కొన్ని పాటలు బాగున్నాయి. కెమెరా వర్క్ కూడా విజువల్స్‌ను నేచురల్‌గా చూపించింది.


అయితే ఎడిటింగ్ విషయంలో లోపాలు కనిపిస్తాయి. రెండు గంటల సినిమా అయినా స్లో నేరేషన్ వల్ల మరింత పొడవుగా అనిపిస్తుంది. ముఖ్యంగా లవ్ ట్రాక్ బలహీనంగా ఉండటం, కొన్ని సన్నివేశాలు కన్ఫ్యూజింగ్‌గా అనిపించడం మైనస్ పాయింట్స్. ఓవరాల్ గా తక్కువ బడ్జెట్‌లో చేసిన ప్రయత్నం కనిపించినా, కథనం బలహీనతల వల్ల సినిమా పూర్తిగా మెప్పించలేకపోయింది. అయితే రూరల్ డ్రామాలు ఇష్టపడే ఆడియన్స్ కి తిమ్మరాజు పల్లి TV నచ్చే ఛాన్స్ ఉంది. 

Apr 18, 2026 Telugu
5.0
out of 10
తిమ్మరాజుపల్లి టీవీ’ అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన కొత్త సినిమా ఆడియన్స్ ని అంతగా ఇంప్రెస్ చేయలేదు. చిన్న కథని ఇంట్రెస్టింగ్ గా మలచడంలో విఫలమయ్యాడు డైరెక్టర్. ఇక నటీనటులు సాయి తేజ్, వేద జలంధర్, ప్రదీప్ కొట్టే తమ పాత్రల్లో మెప్పించారు. హీరోయిన్ వేద కి మంచి రోల్ దక్కగా, రాజప్ప పాత్రధారి ప్రతీక్ కూడా అద్భుత నటనను కనబరిచాడు. మిగిలిన నటీనటులంతా వాళ్ల పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.ఇంతకి చెప్పుకోవాల్సిన వ...

తిమ్మరాజుపల్లి టీవీ’ అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన కొత్త సినిమా ఆడియన్స్ ని అంతగా ఇంప్రెస్ చేయలేదు. చిన్న కథని ఇంట్రెస్టింగ్ గా మలచడంలో విఫలమయ్యాడు డైరెక్టర్. ఇక నటీనటులు సాయి తేజ్, వేద జలంధర్, ప్రదీప్ కొట్టే తమ పాత్రల్లో మెప్పించారు. హీరోయిన్ వేద కి మంచి రోల్ దక్కగా, రాజప్ప పాత్రధారి ప్రతీక్ కూడా అద్భుత నటనను కనబరిచాడు. మిగిలిన నటీనటులంతా వాళ్ల పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.


ఇంతకి చెప్పుకోవాల్సిన విషయం మరొకటుంటే సంగీతోం. ఈ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు సాంగ్స్ గా నిలిచింది. పాటలు ఒకటి బాగుంది. కెమెరా వర్క్ కూడా ఇంట్రెస్టింగ్ గా, న్యూ మ్యూజిక్ మూడ్ కి తగ్గట్టుగా ఉంది. ఎడిటింగ్ ఇంకాస్త ఫాస్ట్ గా ఉండాల్సింది. రెండు గంటల సినిమా అయినా మూడు గంటల భావాన్ని అనిపించింది. దానికి కారణం కొన్ని ఎడిటింగ్ అంశం చెప్పాల్సిందే. సీన్స్ పేస్ లో బాగా ఉంది. సినిమా మొత్తానికి కూడా వర్క్ ఫ్రెండ్ మెంట్ గా ఉంది. ఇంటర్వెల్ కి అప్పుడు కధ మొదలవ్వడం ఫీలింగ్ రావు. అంతే డ్రామాటిక్ గా జంక్ అయ్యింది. హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ కూడా చాలా వీక్ గా ఉంది. ఫోకస్ టీమ్ చెప్పిన అంశాలను అంతగా సక్సెస్ కి నెత్తురం పడ్డ సన్నివేశాలు లో ఏమి చెప్పాలో తెలియని సన్నివేశాలుగా అనిపించింది. ఓవరాల్ గా మూవీ టీవీల్లో చూసేలా ఉంది గాని, థియేటర్ కి హాల్లో చూడాల్సిన మూవీలా లేదు. 

Apr 18, 2026 Telugu
6.0
out of 10
తిమ్మరాజుపల్లి టీవీ’ పేరుతో వచ్చిన ఈ పీరియాడికల్ ఎమోషనల్ డ్రామా ఓ వర్గం ప్రేక్షకులకు నాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తోంది. కథ, అప్పటి టీవీ నేపథ్య సన్నివేశాలు, కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. 90స్ వాతావరణం కట్టిపడేస్తుంది.అయితే కొన్ని సీన్స్ నెమ్మదిగా సాగడం, రొటీన్ స్క్రీన్‌ప్లే, కమర్షియల్ ఎలిమెంట్స్ లోపం సినిమాకు మైనస్‌లుగా మారాయి. నటీనటుల విషయానికి వస్తే… కొత్తవాళ్లే అయిన...

తిమ్మరాజుపల్లి టీవీ’ పేరుతో వచ్చిన ఈ పీరియాడికల్ ఎమోషనల్ డ్రామా ఓ వర్గం ప్రేక్షకులకు నాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తోంది. కథ, అప్పటి టీవీ నేపథ్య సన్నివేశాలు, కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. 90స్ వాతావరణం కట్టిపడేస్తుంది.


అయితే కొన్ని సీన్స్ నెమ్మదిగా సాగడం, రొటీన్ స్క్రీన్‌ప్లే, కమర్షియల్ ఎలిమెంట్స్ లోపం సినిమాకు మైనస్‌లుగా మారాయి. నటీనటుల విషయానికి వస్తే… కొత్తవాళ్లే అయినప్పటికీ అందరూ సహజంగా నటించారు. ముఖ్యంగా సాయి తేజ్, వేద జలంధర్, ప్రదీప్ కొట్టే తమ పాత్రల్లో మెప్పించారు. దర్శకుడు వి. మునిరాజు బాగా హ్యాండిల్ చేసాడు. అలాగే వంశీ కాంత్ మ్యూజిక్ బాగా ఉంది. నిర్మాతగా కిరణ్ అబ్బవరం కు ఈ మూవీతో మంచి సక్సెస్ దక్కే అవకాశం ఉంది. ఇక ‘తిమ్మరాజుపల్లి టీవీ’ పీరియాడికల్ కథలను ఇష్టపడే వారికి కొంతవరకు కనెక్ట్ అయ్యే సినిమా.

Apr 18, 2026 Telugu
7.0
out of 10
‘తిమ్మరాజుపల్లి టీవీ’ అంటూ వచ్చిన ఈ పీరియాడికల్ ఎమోషనల్ డ్రామా ఓ వర్గం ప్రేక్షకులకు తమ గత అనుభూతిని ఇస్తోంది. ముఖ్యంగా కథ, అప్పటి టీవీ నేపథ్య సన్నివేశాలు, కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్.. ఈ సినిమాలో ఆకట్టుకునే అంశాలు. అయితే, కొన్ని సీన్స్ రెగ్యులర్ గా అండ్ స్లోగా సాగడం, మరియు రొటీన్ స్క్రీన్ ప్లే, అలాగే కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ కావడం వంటి అంశాలు సినిమాకి బలహీనతలుగా నిలుస్తాయి.అంతా కొత్త వాళ్ళతో చేసినప...

‘తిమ్మరాజుపల్లి టీవీ’ అంటూ వచ్చిన ఈ పీరియాడికల్ ఎమోషనల్ డ్రామా ఓ వర్గం ప్రేక్షకులకు తమ గత అనుభూతిని ఇస్తోంది. ముఖ్యంగా కథ, అప్పటి టీవీ నేపథ్య సన్నివేశాలు, కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్.. ఈ సినిమాలో ఆకట్టుకునే అంశాలు. అయితే, కొన్ని సీన్స్ రెగ్యులర్ గా అండ్ స్లోగా సాగడం, మరియు రొటీన్ స్క్రీన్ ప్లే, అలాగే కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ కావడం వంటి అంశాలు సినిమాకి బలహీనతలుగా నిలుస్తాయి.


అంతా కొత్త వాళ్ళతో చేసినప్పటికీ దాదాపుగా నటీనటులందరూ బాగా పెర్ఫార్మ్ చేసారు. ముఖ్యంగా సాయి తేజ్, వేద జలంధర్‌, ప్రదీప్ కొట్టే వారి పాత్రల్లో సహజంగా బాగా నటించారు. ఇక దర్శకుడిగా వి. మునిరాజు మంచి పనితనం కనబరిచాడు. ఓవరాల్ గా పీరియాడికల్ చిత్రాలను ఇష్టపడేవారికి ఈ సినిమాలో కొన్ని అంశాలు కనెక్ట్ అవుతాయి.

Apr 18, 2026 Telugu

Papam Prathap Movie Review

5.0
out of 10
అయ్యో… పాపం అంటూనే.. ఈ వారం వచ్చిన పాపం ప్రతాప్ గురించే మాట్లాడుకుందాం! ముందుగా చెప్పాలంటే… స్టోరీ పాయింట్ చిన్నదే కానీ డైరెక్టర్ దానికి విలేజ్ కామెడీ, ఎమోషన్స్ కలిపి ఓ ఫీల్ గుడ్ సినిమా చేయాలని ట్రై చేశాడు.సినిమా కొంచెం స్లో గా అనిపిస్తోస్తుంది. పల్లెటూరు వాతావరణం, క్యారెక్టర్స్, వాళ్ల మాటలు—all fun. హీరో ప్రాబ్లమ్ రివీల్ చేసే సీన్ కూడా బాగుంటుంది. ఇంటర్వెల్ దగ్గర “ఇంకేమైనా ఉంటుందా?” అనే ఫీల్...

అయ్యో… పాపం అంటూనే.. ఈ వారం వచ్చిన పాపం ప్రతాప్ గురించే మాట్లాడుకుందాం! ముందుగా చెప్పాలంటే… స్టోరీ పాయింట్ చిన్నదే కానీ డైరెక్టర్ దానికి విలేజ్ కామెడీ, ఎమోషన్స్ కలిపి ఓ ఫీల్ గుడ్ సినిమా చేయాలని ట్రై చేశాడు.


సినిమా కొంచెం స్లో గా అనిపిస్తోస్తుంది. పల్లెటూరు వాతావరణం, క్యారెక్టర్స్, వాళ్ల మాటలు—all fun. హీరో ప్రాబ్లమ్ రివీల్ చేసే సీన్ కూడా బాగుంటుంది. ఇంటర్వెల్ దగ్గర “ఇంకేమైనా ఉంటుందా?” అనే ఫీల్ వస్తుంది. ఇక సెకండాఫ్ విషయానికి వస్తే.. అక్కడే సినిమా కాస్త దారి తప్పింది బాస్! తిరువీర్ మాత్రం సినిమా మొత్తాన్ని మోసేశాడు. కానీ వేరే వాళ్ళు పెద్దగా హెల్ప్ అవలేదు. ఫైనల్‌గా చెప్పాలంటే…

పాపం ప్రతాప్ ఒక సింపుల్ విలేజ్ డ్రామా. ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండాఫ్ కాస్త బోర్… కానీ క్లైమాక్స్ ఎమోషన్ కొంతమందికి connect అవుతుంది. ఓవరాల్ గా ఇంటర్వెల్ సీక్వెన్స్ దగ్గర చెప్పే పాయింట్, క్లైమాక్స్ బాగుంటాయి. కానీ మూవీ ఓవరాల్ గా అంతగా ఎక్కదు. సో అదండీ పాయింట్. 

Apr 18, 2026 Telugu

Papam Prathap Movie Review

Thyview

By Thyview

5.0
out of 10
ఇవాళ మనం మాట్లాడుకోబోయేది పాపం ప్రతాప్ గురించి… ముందుగా స్టోరీ పాయింట్ చూస్తే… చాలా చిన్న ఐడియా. కానీ డైరెక్టర్ ఎస్‌పి దుర్గా నరేష్ దానికి విలేజ్ కామెడీ + ఎమోషన్స్ కలిపి ఒక సింపుల్ ఫీల్ గుడ్ కథలా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. పల్లెటూరు సెటప్, క్యారెక్టర్స్ అమాయకత్వం, డైలాగ్స్—all work nicely. హీరో ప్రాబ్లమ్ రివీల్ చేసే సీన్, ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంటాయి… అక్కడికే “అరే సెకండాఫ్ లో ఏదో ఉంది” అనిప...

ఇవాళ మనం మాట్లాడుకోబోయేది పాపం ప్రతాప్ గురించి… 

ముందుగా స్టోరీ పాయింట్ చూస్తే… చాలా చిన్న ఐడియా. కానీ డైరెక్టర్ ఎస్‌పి దుర్గా నరేష్ దానికి విలేజ్ కామెడీ + ఎమోషన్స్ కలిపి ఒక సింపుల్ ఫీల్ గుడ్ కథలా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. పల్లెటూరు సెటప్, క్యారెక్టర్స్ అమాయకత్వం, డైలాగ్స్—all work nicely. హీరో ప్రాబ్లమ్ రివీల్ చేసే సీన్, ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంటాయి… అక్కడికే “అరే సెకండాఫ్ లో ఏదో ఉంది” అనిపిస్తుంది. కానీ అసలు ప్రాబ్లమ్ ఎక్కడంటే… సెకండాఫ్! పేస్ స్లో అవుతుంది… కొన్ని డబుల్ మీనింగ్ జోక్స్ కాస్త అవుట్ ఆఫ్ ప్లేస్ ఫీల్ ఇస్తాయి. ఇంకొంచెం క్రిస్ప్‌గా రాస్తే సినిమా లెవెల్ ఇంకాస్త పెరిగేది.


 పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే…

తిరువీర్ literally carries the film!

అతని ఎమోషన్స్, కళ్లతో చేసే యాక్టింగ్ చాలా నేచురల్‌గా ఉంటుంది.

పాయల్ రాధాకృష్ణ కూడా బుజ్జమ్మ పాత్రలో క్యూట్‌గా, జెన్యూన్‌గా కనిపిస్తుంది.


 టెక్నికల్‌గా కేఎం రాధాకృష్ణన్ మ్యూజిక్, సురేష్ బొబ్బిలి BGM సీన్స్ కి good support. విశ్వేశ్వర్ సినిమాటోగ్రఫీ – గోదావరి visuals super fresh ఫైనల్‌గా… పాపం ప్రతాప్ పెద్ద సినిమా కాదు… కానీ ఒక సింపుల్, హార్ట్‌ఫెల్ట్ విలేజ్ డ్రామా. కొన్ని ఫ్లాజ్ ఉన్నా… క్లైమాక్స్ ఎమోషన్ connect అయితే, ఓవరాల్ గా One-time watch for its feel-good vibes..

Apr 18, 2026 Telugu
4.0
out of 10
పాపం ప్రతాప్ మూవీ గురించి చెప్పుకుంటే.. గ్రామీణ నేపథ్యంలో సాగే సైకలాజికల్ థ్రిల్లర్ లవ్ స్టోరీ ఇది. ఓ చిన్న పాయింట్ తీసుకుని దాదాపు రెండున్నర గంటల సినిమాగా సాగదీయడమే ఈ సినిమా విషయంలో జరిగిన అతి పెద్ద పొరపాటు. ఓ తీవ్రమైన సమస్యను వినోదాత్మకగా చెప్పాలని దర్శకుడు ఎస్. పి. దుర్గ నరేశ్ భావించాడు. కానీ దానిని అంత ఎఫెక్టివ్‌గా తెర మీద చూపించలేకపోయాడు. గతంలోనూ గురక, నిద్రలో నడిచే అలవాటు నేపథ్యంలో కొన్ని సి...

పాపం ప్రతాప్ మూవీ గురించి చెప్పుకుంటే.. గ్రామీణ నేపథ్యంలో సాగే సైకలాజికల్ థ్రిల్లర్ లవ్ స్టోరీ ఇది. ఓ చిన్న పాయింట్ తీసుకుని దాదాపు రెండున్నర గంటల సినిమాగా సాగదీయడమే ఈ సినిమా విషయంలో జరిగిన అతి పెద్ద పొరపాటు. ఓ తీవ్రమైన సమస్యను వినోదాత్మకగా చెప్పాలని దర్శకుడు ఎస్. పి. దుర్గ నరేశ్ భావించాడు. కానీ దానిని అంత ఎఫెక్టివ్‌గా తెర మీద చూపించలేకపోయాడు. గతంలోనూ గురక, నిద్రలో నడిచే అలవాటు నేపథ్యంలో కొన్ని సినిమాలు వచ్చాయి. కానీ ఇందులో హీరో సమస్య దానికంటే చాలా పెద్దది. 


టెక్నికల్ గా కె. ఎం. రాధాకృష్ణన్ స్వరాలు సమకూర్చిన ఈ సినిమాకు సురేశ్ బొబ్బిలి (Suresh Bobbili) నేపథ్య సంగీతం అందించారు. ఆర్. ఆర్. బాగుంది. ఈటీవీ విన్ లాంటి సంస్థ నుండి వస్తున్న సినిమా కావడం, తిరువీర్ హీరోగా నటించడం వంటి అంశాల వల్ల 'పాపం ప్రతాప్'ను చూద్దాం అనుకుంటే తప్పు చేసినట్టే. ఎలానూ రెండు మూడు వారాల తర్వాత ఓటీటీలో వస్తుంది కాబట్టి... అప్పటి వరకూ వేచి ఉండటం బెటర్. లేకపోతే... ఆడియెన్స్‌ను 'పాపం' అనుకోవాల్సి వస్తుంది!

Apr 18, 2026 Telugu
Why MRO?