Register as a Reviewer

Movie Reviews

Professional reviews and ratings from top critics and publications worldwide

1218
Total Reviews
81
Movies Reviewed
24
Reviewer Categories
Active filters:
Showing 661-672 of 1218 reviews

Kara movie Review

కర (Kara) 2026 Youtube Channel
6.0
out of 10
‘కర’ సినిమా గురించి ఒక్క లైన్‌ లో చెప్పాలంటే… “కాన్సెప్ట్ బాగుంది… కానీ ప్రెజెంటేషన్ కాస్త మిస్ అయింది. కోలీవుడ్ స్టార్ Dhanush నుంచి ఎప్పుడూ ఏదో డిఫరెంట్ ఎక్స్‌పెక్ట్ చేస్తాం. ఈసారి కూడా రైతులు, బ్యాంక్ లోన్స్, అన్యాయాలు లాంటి సాలిడ్ టాపిక్ తీసుకున్నాడు. కానీ సినిమా చూసేటప్పుడు ఆ ఎమోషన్ మనకి పూర్తిగా కనెక్ట్ అవుతుందా అంటే… అక్కడే కాస్త లాగ్ ఫీల్ అవుతుంది. డైరెక్టర్ Vignesh Raja కథను ఎమోషనల్‌...

‘కర’ సినిమా గురించి ఒక్క లైన్‌ లో చెప్పాలంటే… “కాన్సెప్ట్ బాగుంది… కానీ ప్రెజెంటేషన్ కాస్త మిస్ అయింది. కోలీవుడ్ స్టార్ Dhanush నుంచి ఎప్పుడూ ఏదో డిఫరెంట్ ఎక్స్‌పెక్ట్ చేస్తాం. ఈసారి కూడా రైతులు, బ్యాంక్ లోన్స్, అన్యాయాలు లాంటి సాలిడ్ టాపిక్ తీసుకున్నాడు. కానీ సినిమా చూసేటప్పుడు ఆ ఎమోషన్ మనకి పూర్తిగా కనెక్ట్ అవుతుందా అంటే… అక్కడే కాస్త లాగ్ ఫీల్ అవుతుంది. 


డైరెక్టర్ Vignesh Raja కథను ఎమోషనల్‌ గా తీసుకెళ్లాలని ట్రై చేశాడు… కానీ కొన్ని చోట్ల ఓవర్‌ డోస్ అయ్యింది. కొన్ని సీన్స్ బాగానే హిట్ అవుతాయి. కానీ వెంటనే వచ్చే సీన్స్ వల్ల ఆ ఫీల్ కట్ అయిపోతుంది.

టెక్నికల్‌గా మాత్రం సినిమా సాలిడ్. థెని ఈశ్వర్ విజువల్స్ 90’s ఫీల్‌ ని బాగా తీసుకొచ్చాయి. అలాగే జివి ప్రకాష్ కుమార్ బీజీఎమ్ కొన్ని సీన్స్‌ను బాగా లిఫ్ట్ చేసింది. సాంగ్స్ మాత్రం పర్లేదు. ఓవరాల్ గా కర సినిమాను ఇంకాస్త షార్ప్‌ గా, ఎంగేజింగ్‌ గా తీసి ఉంటే… ఇది నెక్స్ట్ లెవెల్ మూవీ అయ్యేది. 

May 04, 2026 Telugu

Kara movie Review

కర (Kara) 2026 News Channel
6.0
out of 10
తమిళ్ స్టార్ హీరో ధనుష్, మమిత బైజు జంటగా తెరకెక్కిన సినిమా ‘కర’. వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్‌‌‌‌ పై ఐషరి కె గణేష్ నిర్మాణంలో విఘ్నేశ్ రాజా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. తాజాగా థియేటర్లలో విడుదలైన కర సినిమా ఆడియన్స్ నుండి మిశ్రమ స్పందన అందుకుంది. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. జీవి ప్రకాష్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టాడు. రెండు పాటలు బాగుండగా మిగిలిన బిట్ సాంగ్స్ మాత్రం అంతగా మెప్ప...

తమిళ్ స్టార్ హీరో ధనుష్, మమిత బైజు జంటగా తెరకెక్కిన సినిమా ‘కర’. వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్‌‌‌‌ పై ఐషరి కె గణేష్ నిర్మాణంలో విఘ్నేశ్ రాజా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. తాజాగా థియేటర్లలో విడుదలైన కర సినిమా ఆడియన్స్ నుండి మిశ్రమ స్పందన అందుకుంది. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. జీవి ప్రకాష్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టాడు. రెండు పాటలు బాగుండగా మిగిలిన బిట్ సాంగ్స్ మాత్రం అంతగా మెప్పించలేదు. సినిమా అంతా 90 స్ బ్యాక్ డ్రాప్ లో జరగడంతో దాని తగ్గట్టు ఆర్ డిపార్ట్మెంట్ బాగానే పని చేసింది. 


ఎడిటింగ్ పరంగా ఫస్టాఫ్ లో కొన్ని లాగ్ సీన్స్ కట్ చేస్తే బాగుండేది. రైతుల కష్టాలు, బ్యాంకు లోన్లు అనే పాత కథ తీసుకొని దానికి దొంగ, నాన్న ఎమోషన్ లను కలిపి ఆసక్తికర స్క్రీన్ ప్లేతో రాసుకొని బాగానే తెరకెక్కించాడు దర్శకుడు. డైరెక్టర్ మొదటి సినిమాకి దీనికి సంబంధం ఉండదు. అసలు ఆ డైరెక్టరేనా ఈ సినిమా తీసింది అనిపిస్తుంది. నిర్మాణ పరంగా మాత్రం సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై బాగానే కనిపిస్తుంది. మొత్తంగా ధనుష్ మరోసారి తండ్రి ఎమోషన్ తో పాటు దొంగతనాల సస్పెన్స్ కథాంశంతో ‘కర’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఓవరాల్ గా డీసెంట్ అనిపించుకుంది. 


May 04, 2026 Telugu

Kara movie Review

కర (Kara) 2026 News Channel
6.0
out of 10
సహజ నటనకు పెట్టింది పేరైన ధనుష్.. ఆ మధ్య ఇడ్లి కొట్టు తో డీసెంట్ సినిమా ఇవ్వగా, ఈసారి "కర" అంటూ ఒక దొంగగా ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఈసారి కూడా తన పెర్ఫార్మన్స్ తో మెప్పించే ప్రయత్నం చేయగా, క్యూట్ లుక్స్‌ తో అలరించే మమిత బైజు ఈ సినిమాలో పూర్తి డీ గ్లామర్ పాత్రలో మెరిసింది. వృద్ధుడి పాత్రలో కేఎస్ రవికుమార్ నటన కంటతడి పెట్టిస్తుంది. సూరజ్ వెంజర్మూడు, జయరాం, కరుణాస్, పృథ్వీ రాజన్ తమ పాత్రల పరిధి...

సహజ నటనకు పెట్టింది పేరైన ధనుష్.. ఆ మధ్య ఇడ్లి కొట్టు తో డీసెంట్ సినిమా ఇవ్వగా, ఈసారి "కర" అంటూ ఒక దొంగగా ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఈసారి కూడా తన పెర్ఫార్మన్స్ తో మెప్పించే ప్రయత్నం చేయగా, క్యూట్ లుక్స్‌ తో అలరించే మమిత బైజు ఈ సినిమాలో పూర్తి డీ గ్లామర్ పాత్రలో మెరిసింది. వృద్ధుడి పాత్రలో కేఎస్ రవికుమార్ నటన కంటతడి పెట్టిస్తుంది. సూరజ్ వెంజర్మూడు, జయరాం, కరుణాస్, పృథ్వీ రాజన్ తమ పాత్రల పరిధి మేరకు పూర్తి న్యాయం చేశారు.


టెక్నికల్ గా కర సినిమా చాలా బెస్ట్ గా ఉంది. జీవి ప్రకాష్ నేపథ్య సంగీతం ఈ సినిమాకు ప్రాణం పోసింది. పాటలు ఓకే అనిపించినా, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా బాగుంది. 90స్ కాలం నాటి వాతావరణాన్ని ఆర్ట్ విభాగం అద్భుతంగా రీక్రియేట్ చేసింది. దానికి తోడు సినిమాటోగ్రఫీ విజువల్స్‌కు మరింత అందాన్ని తెచ్చింది. ఎడిటింగ్ విషయంలో మొదటి సగంలో ఉన్న కొన్ని సాగతీత సీన్లను కట్ చేసి ఉంటే సినిమా ఇంకాస్త పకడ్బందీగా ఉండేది. ఓవరాల్‌గా కర.. ఇటు రైతు కష్టం.. అటు థ్రిల్లింగ్ రాబరీ.. మిక్స్డ్ బ్యాగేజ్ అన్నట్టుంటుంది. అంటే సినిమా ఓసారైతే బానే ట్రై చేయొచ్చు. 

May 04, 2026 Telugu

Kara Movie Review

కర (Kara) 2026 News Channel
Sakshi

By Sakshi

6.0
out of 10
కోలీవుడ్ స్టార్ Dhanush నటించిన ‘కర’ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా థియేటర్లలో విడుదలకాగా, మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. దర్శకుడు Vignesh Raja ఎంపిక చేసిన కథలో బలం ఉన్నప్పటికీ, దాన్ని స్క్రీన్‌పై ప్రెజెంట్ చేసిన విధానం మాత్రం అంతగా ఆకట్టుకోలేదు. కానీ విలేజ్ నేటివిటీ నేపథ్యం, నటీనటుల పెర్ఫార్మన్స్ ఆకట్టుకుంటుంది. రైతులు, బ్యాంక్ లోన్ల సమస్యల వంటి సీరియస్ అంశాలను టచ్ చేసినా…...

కోలీవుడ్ స్టార్ Dhanush నటించిన ‘కర’ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా థియేటర్లలో విడుదలకాగా, మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. దర్శకుడు Vignesh Raja ఎంపిక చేసిన కథలో బలం ఉన్నప్పటికీ, దాన్ని స్క్రీన్‌పై ప్రెజెంట్ చేసిన విధానం మాత్రం అంతగా ఆకట్టుకోలేదు. కానీ విలేజ్ నేటివిటీ నేపథ్యం, నటీనటుల పెర్ఫార్మన్స్ ఆకట్టుకుంటుంది. 


రైతులు, బ్యాంక్ లోన్ల సమస్యల వంటి సీరియస్ అంశాలను టచ్ చేసినా… కథనం కొంత అసంబద్ధంగా సాగడం, ఎమోషనల్ సన్నివేశాలు అతిగా ఉండడం వల్ల ప్రేక్షకులు పూర్తిగా కనెక్ట్ కాలేకపోయారు. కానీ నటీనటులు తమ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకుంటారు. మొత్తంగా ‘కర’ చిత్రం మంచి కాన్సెప్ట్‌ తో తెరకెక్కినప్పటికీ, కథనం బలహీనతలు, ఎమోషన్ ఓవర్‌ డోస్ కారణంగా పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. రైతు సమస్యలను ప్రతిబింబించిన డీసెంట్ ప్రయత్నంగా చెప్పుకోవచ్చు. 

May 04, 2026 Telugu

Kara movie Review

కర (Kara) 2026 Website
5.0
out of 10
కోలీవుడ్ స్టార్ లాస్ట్ ఇయర్ కుబేర తో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయగా, ఇడ్లి కడై తో డీసెంట్ మూవీ ఇచ్చాడు. తెలుగులో ఇడ్లి కొట్టు పేరిట రిలీజ్ అయింది గాని ఓటిటి లోనే మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇపుడు "కర" అంటూ సైలెంట్ గా థియేటర్లలోకి వచ్చేసాడు. విఘ్నేష్‌ రాజా డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ ఆడియన్స్ ని మెప్పించలేకపోయింది. తెలుగు నేటివిటీకి దూరంగా ఉన్న ఈ మూవీ లో సహజత్వంతో కూడిన వాతావరణం ఉన్నా, అతిగా ఉన్న ఎమోషనల్...

కోలీవుడ్ స్టార్ లాస్ట్ ఇయర్ కుబేర తో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయగా, ఇడ్లి కడై తో డీసెంట్ మూవీ ఇచ్చాడు. తెలుగులో ఇడ్లి కొట్టు పేరిట రిలీజ్ అయింది గాని ఓటిటి లోనే మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇపుడు "కర" అంటూ సైలెంట్ గా థియేటర్లలోకి వచ్చేసాడు. విఘ్నేష్‌ రాజా డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ ఆడియన్స్ ని మెప్పించలేకపోయింది. తెలుగు నేటివిటీకి దూరంగా ఉన్న ఈ మూవీ లో సహజత్వంతో కూడిన వాతావరణం ఉన్నా, అతిగా ఉన్న ఎమోషనల్ సీన్స్ కి పొంతనలేని కథనం ఆడియన్స్ ని సీట్లో కూర్చోబెట్టలేకపోయింది. 


అలాగే టెక్నికల్ గా థెని ఈశ్వర్‌ కెమెరా వర్క్ బాగుంది. విజువల్‌ గా 1990ని తలపించేలా ఉంది. జీవీ ప్రకాష్‌ కుమార్‌ సంగీతం ఫర్వాలేదు. బీజీఎం ఆకట్టుకునేలా ఉంది. శ్రీజిత్‌ సారంగ్‌ ఎడిటింగ్‌ ఇంకా షార్ప్ చేయాల్సింది. దర్శకుడు విఘ్నేష్‌ రాజా ఎంచుకున్న కథ బాగుంది. దాన్ని అంతే ఎమోషనల్‌గా, అంతే ఎంగేజింగ్‌ గా తెరకెక్కించారు. బ్యాంక్‌ లోన్ల విషయంలో జరిగే అన్యాయాలకు సంబంధించిన అంశాలను కళ్లకి కట్టినట్టు చూపించారు. ముల్లుని ముల్లుతోనే తీయాలనే కాన్సెప్ట్ బాగుంది. ఇంకా షార్ప్ గా, ఎంగేజింగ్‌గా, ఎమోషనల్‌గా తీసుకెళ్తే సినిమా అదిరిపోయేది. ఓవరాల్ గా రైతు సమస్యలు, లోన్ల పేరుతో బ్యాంకులు చేసే అన్యాయాలను ఆడియన్స్ కి చూపించిన డీసెంట్ మూవీ `కర`. 


May 04, 2026 Telugu

Jetlee movie Review

జెట్లీ (Jetlee) 2026 Youtube Channel
4.0
out of 10
జెట్‌లీ’ సినిమా స్టార్ట్ అయ్యిన 10 నిమిషాల్లోనే మీకు ఒక ఫీలింగ్ వస్తుంది… “ఏం జరుగుతోంది బాస్?” అనిపిస్తది. అదే ఫీలింగ్ సినిమా అయిపోయే వరకు కంటిన్యూ అవుతుంది. దర్శకుడు Ritesh Rana ఈసారి ఫుల్ కన్ఫ్యూజన్‌ తో ఒక ఎక్స్‌పెరిమెంట్ ట్రై చేశాడు. కానీ ఆడియెన్స్ మాత్రం స్టోరీ కన్నా… “ఇది ఏంటి?” అన్న డౌట్‌ తోనే కూర్చోవాల్సి వస్తుంది. హీరోగా సత్య మళ్లీ తన కామెడీ టైమింగ్ చూపించడానికి ట్రై చేశాడు. కొన్ని వన్‌లై...

జెట్‌లీ’ సినిమా స్టార్ట్ అయ్యిన 10 నిమిషాల్లోనే మీకు ఒక ఫీలింగ్ వస్తుంది… “ఏం జరుగుతోంది బాస్?” అనిపిస్తది. అదే ఫీలింగ్ సినిమా అయిపోయే వరకు కంటిన్యూ అవుతుంది. దర్శకుడు Ritesh Rana ఈసారి ఫుల్ కన్ఫ్యూజన్‌ తో ఒక ఎక్స్‌పెరిమెంట్ ట్రై చేశాడు. కానీ ఆడియెన్స్ మాత్రం స్టోరీ కన్నా… “ఇది ఏంటి?” అన్న డౌట్‌ తోనే కూర్చోవాల్సి వస్తుంది. హీరోగా సత్య మళ్లీ తన కామెడీ టైమింగ్ చూపించడానికి ట్రై చేశాడు. కొన్ని వన్‌లైనర్స్, పంచ్‌లు బాగానే పేలుతాయి. కానీ ఫుల్ మూవీని మోయడానికి మాత్రం సరిపోలేదు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఫ్లాష్‌బ్యాక్‌లు, పేర్లు, సిట్యుయేషన్స్ అన్నీ కలిపి ఒక గందరగోళం. నవ్వాలో, ఆలోచించాలో, లేక పక్క వాళ్లను అడగాలో అనిపించే పరిస్థితి. 


ఇక సెకండ్ హాఫ్‌ లోకి వచ్చేసరికి “ఓహ్… ఇది రివేంజ్ స్టోరీనా!” అని క్లారిటీ వస్తుంది. కానీ అప్పటికి ఆడియెన్స్ పేషెన్స్ ఆల్రెడీ టెస్ట్ అయిపోయి ఉంటుంది. బట్ ఏమాత్రం సాటిస్ఫై అయినట్టు అనిపించదు. ఫైనల్ గా జెట్లీ ఒక ఫుల్ కన్ఫ్యూషన్ ప్యాకెజీ అనిపిస్తది. ఓవరాల్ గా కొత్తగా ట్రై చేసారు గాని, సినిమా మాత్రం అంత లేదు. సినిమా నేరేషన్ లో ఏమాత్రం బలం లేదు. ఇట్స్ ఎ డిస్సపాయింటింగ్ ఫిలిం ఫర్ ఆడియన్స్. 

May 04, 2026 Telugu

Jetlee movie Review

జెట్లీ (Jetlee) 2026 Youtube Channel
5.0
out of 10
"జెట్‌లీ" మూవీ ఒక డిఫరెంట్ ఎటెంప్ట్ అని ఫస్ట్ ఫ్రేమ్ నుంచే అర్థమవుతుంది. దర్శకుడు Ritesh Rana ఈసారి లీనియర్ నెరేషన్‌ను వదిలి, మల్టిపుల్ లేయర్స్‌ తో కథను చెప్పాలని ప్రయత్నించాడు. కానీ ఆ ప్రయోగం ఎంగేజింగ్‌ గా కాకుండా కన్ఫ్యూజింగ్‌ గా మారింది.హీరోగా సత్య తన పాత్రలో వేరియేషన్స్ చూపించడానికి ట్రై చేశాడు. అయితే, కథనంలో క్లారిటీ లేకపోవడం వల్ల అతని పర్ఫార్మెన్స్ పూర్తి స్థాయిలో ఇంపాక్ట్ ఇవ్వలేకపోయింది.స్క...

"జెట్‌లీ" మూవీ ఒక డిఫరెంట్ ఎటెంప్ట్ అని ఫస్ట్ ఫ్రేమ్ నుంచే అర్థమవుతుంది. దర్శకుడు Ritesh Rana ఈసారి లీనియర్ నెరేషన్‌ను వదిలి, మల్టిపుల్ లేయర్స్‌ తో కథను చెప్పాలని ప్రయత్నించాడు. కానీ ఆ ప్రయోగం ఎంగేజింగ్‌ గా కాకుండా కన్ఫ్యూజింగ్‌ గా మారింది.

హీరోగా సత్య తన పాత్రలో వేరియేషన్స్ చూపించడానికి ట్రై చేశాడు. అయితే, కథనంలో క్లారిటీ లేకపోవడం వల్ల అతని పర్ఫార్మెన్స్ పూర్తి స్థాయిలో ఇంపాక్ట్ ఇవ్వలేకపోయింది.


స్క్రీన్‌ ప్లే ఈ సినిమాకి మెయిన్ ఇష్యూ. ప్రేక్షకుడు కథలో ఇన్వాల్వ్ అవ్వాలంటే ఒక ఎమోషనల్ లేదా నేరేటివ్ కనెక్షన్ ఉండాలి. కానీ ‘జెట్‌లీ’లో అది మిస్సైంది. సెకండ్ హాఫ్‌లో రివేంజ్ డ్రామా యాంగిల్ రివీల్ అయినా, అప్పటికి ఆడియెన్స్ ఎంగేజ్‌మెంట్ తగ్గిపోయే అవకాశముంది. టెక్నికల్‌గా సినిమా ఓకే అనిపించినా, రైటింగ్ మరియు నెరేషన్‌లో మరింత క్లారిటీ ఉంటే ఫలితం వేరేలా ఉండేది. ఓవరాల్ గా

‘జెట్‌లీ’ ఒక డిఫరెంట్ ఎక్స్‌పెరిమెంట్ అని చెప్పుకోవచ్చు. కానీ ఎగ్జిక్యూషన్ పరంగా మాత్రం తడబడింది. సింపుల్ గా చెప్పాలంటే... టేకాఫ్ బానే అయింది గాని, మధ్యలో కొంచెం ఎక్కువ షేక్ అయింది. లోడింగ్ కూడా కొంచెం అవుట్ డేట్ అయి, క్రాష్ లాండ్ అయింది. కానీ అందరూ సేఫ్ అన్నట్టుంటుంది. అంటే హ్యాపీగా ఎంజాయ్ చేయలేము కానీ, జాగ్రత్తగా బైటికి రావచ్చు. 

May 04, 2026 Telugu

Jetlee movie Review

జెట్లీ (Jetlee) 2026 Youtube Channel
4.0
out of 10
‘జెట్‌లీ’ సినిమా చూస్తుంటే ఇదొక స్ట్రైట్ కథ కాదు… పూర్తిగా కన్ఫ్యూజన్ మీద నడిచే నెరేషన్ అనిపిస్తుంది. దర్శకుడు Ritesh Rana ఈసారి కథను సింపుల్‌గా చెప్పకుండా, గందరగోళంగా ప్రెజెంట్ చేయాలని ట్రై చేశాడు. హీరోగా Satya పలు పేర్లు, పలు ఫ్లాష్‌బ్యాక్‌ల మధ్య తానే కన్ఫ్యూజ్ అవుతూ కనిపిస్తాడు… అదే ఫీలింగ్ ఆడియెన్స్‌ కూ వస్తుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం కథ ఏ దిశగా వెళ్తుందో అర్థం కాకుండా సాగుతుంది. నవ్వాలా, సీరియస్‌...

‘జెట్‌లీ’ సినిమా చూస్తుంటే ఇదొక స్ట్రైట్ కథ కాదు… పూర్తిగా కన్ఫ్యూజన్ మీద నడిచే నెరేషన్ అనిపిస్తుంది. దర్శకుడు Ritesh Rana ఈసారి కథను సింపుల్‌గా చెప్పకుండా, గందరగోళంగా ప్రెజెంట్ చేయాలని ట్రై చేశాడు. హీరోగా Satya పలు పేర్లు, పలు ఫ్లాష్‌బ్యాక్‌ల మధ్య తానే కన్ఫ్యూజ్ అవుతూ కనిపిస్తాడు… అదే ఫీలింగ్ ఆడియెన్స్‌ కూ వస్తుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం కథ ఏ దిశగా వెళ్తుందో అర్థం కాకుండా సాగుతుంది. నవ్వాలా, సీరియస్‌ గా తీసుకోవాలా అనే సందేహం కొనసాగుతూనే ఉంటుంది. చివరికి ఇది రివేంజ్ డ్రామా అని క్లియర్ అయినప్పటికీ, అప్పటికి కనెక్షన్ మిస్సయ్యే అవకాశం ఉంది. 


సత్య తన కామెడీ టైమింగ్‌తో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసినా, అది పూర్తిగా వర్కౌట్ అవదు. స్టోరీయే లేనపుడు ఎంత కామెడీ ఉంటే ఎం చేస్తారు. కామెడీని నమ్ముకున్న ప్రతి సినిమా సక్సెస్ అవదు కదా. ఇటు వెన్నెల కిశోర్ కూడా తన వరకు బానే ట్రై చేసాడు గాని, పూర్తి స్థాయిలో సినిమాను మోయలేకపోయాడు. ఓవరాల్ గా డైరెక్టర్ రితేష్ రానా ముందు సినిమాలు చూసి జెట్లీకి ఓటేశారంటే మోసపోతారు. తక్కువ ఎక్స్పెక్టేషన్స్ తో సినిమాకి వెళ్తే కొంచెం నవ్వుకునే ఛాన్స్ ఉంది గాని, సినిమా మొత్తం నచ్చాలి అంటే కుదరని పని. మొత్తంగా ‘జెట్‌లీ’ ఒక ఎక్స్‌పెరిమెంటల్ సినిమా… కానీ ఎంటర్టైన్‌మెంట్ కంటే కన్ఫ్యూజన్ ఎక్కువగా మిగిలిపోతుంది.

May 04, 2026 Telugu

Jetlee movie Review

Sakshi

By Sakshi

4.0
out of 10
కమెడియన్ సత్య మెయిన్ లీడ్ గా నటించిన ‘జెట్‌లీ’ మూవీ ఆడియన్స్ నుండి డివైడ్ టాక్ తెచ్చుకుంది. విభిన్నమైన కథనంతో సినిమాను రూపొందించిన దర్శకుడు Ritesh Rana ఈసారి ఆడియన్స్ ని మరింత నవ్వించాలని ట్రై చేసినా, ఆ ప్రయోగం ప్రేక్షకులకు పూర్తిగా చేరలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సినిమా ఫస్ట్ హాఫ్ నుంచే కథ ఏ దిశగా సాగుతుందో స్పష్టత లేకుండా కన్ఫ్యూజన్ నెలకొంటుంది. హీరో పాత్రలో సత్య ఎలా గందరగోళానికి గురవుతాడో… అ...

కమెడియన్ సత్య మెయిన్ లీడ్ గా నటించిన ‘జెట్‌లీ’ మూవీ ఆడియన్స్ నుండి డివైడ్ టాక్ తెచ్చుకుంది. విభిన్నమైన కథనంతో సినిమాను రూపొందించిన దర్శకుడు Ritesh Rana ఈసారి ఆడియన్స్ ని మరింత నవ్వించాలని ట్రై చేసినా, ఆ ప్రయోగం ప్రేక్షకులకు పూర్తిగా చేరలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సినిమా ఫస్ట్ హాఫ్ నుంచే కథ ఏ దిశగా సాగుతుందో స్పష్టత లేకుండా కన్ఫ్యూజన్ నెలకొంటుంది. హీరో పాత్రలో సత్య ఎలా గందరగోళానికి గురవుతాడో… అదే పరిస్థితి ఆడియెన్స్‌ కి కూడా ఎదురవుతుంది. 


చివరికి కథ రివేంజ్ డ్రామా వైపు మళ్లినా… ఆ భావోద్వేగం ప్రేక్షకులకు బలంగా చేరలేదు. కామెడీ పరంగా కొన్ని సన్నివేశాలు నవ్వించినా, మొత్తం సినిమా స్థాయిలో ఎంటర్టైన్‌మెంట్ తక్కువగానే అనిపిస్తుంది. మొత్తంగా ‘జెట్‌లీ’ ఒక కొత్త ప్రయత్నం అయినప్పటికీ, స్పష్టమైన కథనం లేకపోవడం, కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉండడం వల్ల ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఆర్ట్ డిపార్ట్మెంట్ ని మాత్రం మెచ్చుకోవచ్చు. విమాన వాతావరణాన్ని రియలిస్టిక్ గా చూపించడానికి బాగానే కష్టపడ్డారు. కానీ ఓవరాల్ గా జెట్లీ ప్రయోగం వర్కౌట్ కాలేదు.

May 04, 2026 Telugu

Jetlee Movie Review

5.0
out of 10
టాలీవుడ్ లో కమెడియన్ గా మంచి క్రేజ్ సొంతం చేసుకున్న వారిలో సత్య ఒకరు. సత్య కామెడీ టైమింగ్ కి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. గతంలో అలీ లాంటి కమెడియన్లు హీరోలుగా నటించారు. సత్య కూడా తొలిసారి హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ జెట్లీ అనే మూవీలో నటించారు. ఈ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రితేష్ రానా దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. రియా సింఘా, వెన్నెల కిషోర్, అజయ్ ఇతర పాత్రల్లో నటించారు...

టాలీవుడ్ లో కమెడియన్ గా మంచి క్రేజ్ సొంతం చేసుకున్న వారిలో సత్య ఒకరు. సత్య కామెడీ టైమింగ్ కి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. గతంలో అలీ లాంటి కమెడియన్లు హీరోలుగా నటించారు. సత్య కూడా తొలిసారి హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ జెట్లీ అనే మూవీలో నటించారు. ఈ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రితేష్ రానా దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. రియా సింఘా, వెన్నెల కిషోర్, అజయ్ ఇతర పాత్రల్లో నటించారు. అయితే కథ కొంచెం యావరేజ్ గా ఉన్నా తెరకెక్కించిన విధానం ఆకట్టుకునేలా ఉంటే ప్రేక్షకులు సంతృప్తి చెందుతారు. కానీ ఈ చిత్రంలో ఆ రెండూ మైనస్ అయ్యాయి. 


సరైన కథ లేదు, తెరకెక్కించిన విధానం కూడా గొప్పగా లేదు. ఈ చిత్రం చూశాక అంత రన్ టైం ఏమాత్రం అవసరం లేదు అని అనిపిస్తుంది. ఎడిటింగ్ చాలా పూర్ గా ఉంది. చాలా సన్నివేశాలు షార్ప్ గా ట్రిమ్ చేసి రన్ టైం తగ్గించి ఉండొచ్చు. కానీ అది జరగలేదు. సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. సినిమాటోగ్రఫీ చాలా బావుంది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అక్కడక్కడా మెప్పించింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇలా టెక్నికల్ గా ఎన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నా, కథ, కథనాల విషయంలో ప్రేక్షకులు డిస్సపాయింట్ అయితే నిర్మొహమాటంగా తిరస్కరించే అవకాశం ఉంది. ఓవరాల్ గా... దర్శకుడు రితేష్ రానా, కమెడియన్ సత్య హీరోగా 'జెట్లీ'తో చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. కథ, కామెడీ ఏదీ ఆకట్టుకునే విధంగా లేదు. ఓవరాల్‌గా జెట్లీ.. కాస్త కామెడీ.. కాస్త కదుపులు అన్నట్టుగా ఉంది. 


May 04, 2026 Telugu

Jetlee Movie Review

5.0
out of 10
కమెడియన్ గా అంతకంతా ఎదిగిపోతున్న సత్య ఈసారి హీరోగా ట్రై చేసిన మివై ‘జెట్‌లీ’. మత్తువదలరా ఫేమ్ రితేష్ రానా డైరెక్ట్ చేసిన ఈ సినిమా తాజాగా థియేటర్లలో విడుదలై అంతగా ఆకట్టుకోలేకపోయింది. కథ, కథనాల పరంగా కూడా సినిమా పూర్తిగా గందరగోళమైన నెరేషన్‌ తో ముగిసినట్టుగా అనిపిస్తుంది. కథని కొత్తగా చూపించాలని ప్రయత్నించినా, కానీ ఆ ప్రయోగం ప్రేక్షకులకు అంతగా అర్థమయ్యేలా రూపుదిద్దుకోలేదు.  ఇక సత్య తన వరకు...

కమెడియన్ గా అంతకంతా ఎదిగిపోతున్న సత్య ఈసారి హీరోగా ట్రై చేసిన మివై ‘జెట్‌లీ’. మత్తువదలరా ఫేమ్ రితేష్ రానా డైరెక్ట్ చేసిన ఈ సినిమా తాజాగా థియేటర్లలో విడుదలై అంతగా ఆకట్టుకోలేకపోయింది. కథ, కథనాల పరంగా కూడా సినిమా పూర్తిగా గందరగోళమైన నెరేషన్‌ తో ముగిసినట్టుగా అనిపిస్తుంది. కథని కొత్తగా చూపించాలని ప్రయత్నించినా, కానీ ఆ ప్రయోగం ప్రేక్షకులకు అంతగా అర్థమయ్యేలా రూపుదిద్దుకోలేదు.  


ఇక సత్య తన వరకు బానే నటించాడు. ఇందులో చాలా మంది హీరోల్ని ఇమిటేట్ చేసాడు. సెకండ్ హాఫ్‌ లో కథ కాస్త క్లారిటీకి వచ్చినప్పటికీ, అప్పటికి ప్రేక్షకుల ఆసక్తి తగ్గిపోయే అవకాశముంది. అసలు ఇది రివేంజ్ డ్రామా అనే విషయం చివర్లో తెలుస్తుంది. కానీ ఆ ఎమోషన్‌ను బలంగా ఎలివేట్ చేయడంలో సినిమా విఫలమైంది.

వన్‌లైనర్స్, పంచ్‌లు ఉన్నప్పటికీ, అవి విభిన్నంగా కాకుండా సాధారణంగానే అనిపిస్తాయి. మొత్తంగా ‘జెట్‌లీ’ ఒక ఎక్స్‌పెరిమెంటల్ సినిమా. ఓవరాల్ గా జెట్ స్పీడ్ లో జెట్లీ విమానం ఎగురుతుంటే.. బ్రూస్ లీ టైపు పంచులతో సత్య చేసే కామెడీ ఒక టైప్ అఫ్ ఆడియన్స్ కి కాస్త మెప్పించొచ్చు, గాని అర్ధం కానీ వారికి ఇదో గందరగోళం సినిమాలా అనిపిస్తుంది.  

May 04, 2026 Telugu

Jetlee movie Review

4.0
out of 10
టాలీవుడ్ లో కమెడియన్ గా మంచి క్రేజ్ సొంతం చేసుకున్న వారిలో సత్య ఒకరు. సత్య కామెడీ టైమింగ్ కి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. గతంలో అలీ లాంటి కమెడియన్లు హీరోలుగా నటించారు. సత్య కూడా తొలిసారి హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ జెట్లీ అనే మూవీలో నటించారు. ఈ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రితేష్ రానా దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. రియా సింఘా, వెన్నెల కిషోర్, అజయ్ ఇతర పాత్రల్లో నటించారు...

టాలీవుడ్ లో కమెడియన్ గా మంచి క్రేజ్ సొంతం చేసుకున్న వారిలో సత్య ఒకరు. సత్య కామెడీ టైమింగ్ కి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. గతంలో అలీ లాంటి కమెడియన్లు హీరోలుగా నటించారు. సత్య కూడా తొలిసారి హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ జెట్లీ అనే మూవీలో నటించారు. ఈ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రితేష్ రానా దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. రియా సింఘా, వెన్నెల కిషోర్, అజయ్ ఇతర పాత్రల్లో నటించారు. అయితే కథ కొంచెం యావరేజ్ గా ఉన్నా తెరకెక్కించిన విధానం ఆకట్టుకునేలా ఉంటే ప్రేక్షకులు సంతృప్తి చెందుతారు. కానీ ఈ చిత్రంలో ఆ రెండూ మైనస్ అయ్యాయి. 


సరైన కథ లేదు, తెరకెక్కించిన విధానం కూడా గొప్పగా లేదు. ఈ చిత్రం చూశాక అంత రన్ టైం ఏమాత్రం అవసరం లేదు అని అనిపిస్తుంది. ఎడిటింగ్ చాలా పూర్ గా ఉంది. చాలా సన్నివేశాలు షార్ప్ గా ట్రిమ్ చేసి రన్ టైం తగ్గించి ఉండొచ్చు. కానీ అది జరగలేదు. సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. సినిమాటోగ్రఫీ చాలా బావుంది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అక్కడక్కడా మెప్పించింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇలా టెక్నికల్ గా ఎన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నా, కథ, కథనాల విషయంలో ప్రేక్షకులు డిస్సపాయింట్ అయితే నిర్మొహమాటంగా తిరస్కరించే అవకాశం ఉంది. ఓవరాల్ గా... దర్శకుడు రితేష్ రానా, కమెడియన్ సత్య హీరోగా 'జెట్లీ'తో చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. కథ, కామెడీ ఏదీ ఆకట్టుకునే విధంగా లేదు.

May 04, 2026 Telugu
Why MRO?