Register as a Reviewer

Movie Reviews

Professional reviews and ratings from top critics and publications worldwide

233
Total Reviews
88
Movies Reviewed
24
Reviewer Categories
Active filters: Category: News Channel ×
Showing 85-96 of 233 reviews
Clear all filters

DC Movie Review

డీసీ (DC) 2026 News Channel
6.0
out of 10
తీసింది కొన్ని సినిమాలైనా మంచి స్టార్ డైరెక్టర్ గా తమిళనాట ఓ వెలుగువెలుగుతున్న కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ హీరోగా నటించిన తొలి చిత్రం ‘డిసి’ ఈ వారం థియేటర్లలో విడుదలైంది. అరుణ్ మాదేశ్వరన్ తెరకెక్కించిన ఈ యాక్షన్ డ్రామాకు మిశ్రమ స్పందన లభిస్తున్నప్పటికీ, స్క్రీన్‌ప్లే సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది.చిన్న కథను ఆసక్తికరమైన ట్రీట్‌మెంట్‌తో, సాలిడ్ యాక్షన్ మూమెంట్స్‌తో దర్శకుడు ఆకట్టుకునే...

తీసింది కొన్ని సినిమాలైనా మంచి స్టార్ డైరెక్టర్ గా తమిళనాట ఓ వెలుగువెలుగుతున్న కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ హీరోగా నటించిన తొలి చిత్రం ‘డిసి’ ఈ వారం థియేటర్లలో విడుదలైంది. అరుణ్ మాదేశ్వరన్ తెరకెక్కించిన ఈ యాక్షన్ డ్రామాకు మిశ్రమ స్పందన లభిస్తున్నప్పటికీ, స్క్రీన్‌ప్లే సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది.


చిన్న కథను ఆసక్తికరమైన ట్రీట్‌మెంట్‌తో, సాలిడ్ యాక్షన్ మూమెంట్స్‌తో దర్శకుడు ఆకట్టుకునేలా తెరకెక్కించాడు. హీరోగా లోకేష్ కనకరాజ్ తన పాత్రలో మెప్పించడంతో పాటు యాక్షన్ సన్నివేశాల్లో మంచి ఇంపాక్ట్ చూపించాడు. అనిరుధ్ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరో ప్లస్‌గా నిలిచాయి.


కథలో కొన్ని చిన్న లోపాలు ఉన్నప్పటికీ, దర్శకుడి స్క్రీన్‌ప్లే ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తుంది. మొత్తంగా ‘డిసి’ మంచి మాస్ యాక్షన్ డ్రామాగా నిలిచింది. లోకేష్ కనకరాజ్‌కు ఇది ఇంప్రెసివ్ డెబ్యూ అని చెప్పొచ్చు. ఫైనల్ గా డిసి ఎంగేజింగ్ మూవ్మెంట్స్ ఉన్న ఒక రెగ్యులర్ గ్యాంగ్ స్టర్ డ్రామా అని చెప్పొచ్చు. 

Aug 08, 2026 Tamil +1

DC Movie Review

డీసీ (DC) 2026 News Channel
Sakshi

By Sakshi

6.0
out of 10
ఈ వారం థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాల్లో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ హీరోగా నటించిన ‘డిసి’ కూడా ఒకటి. దర్శకుడు అరుణ్ మాదేశ్వరన్ తెరకెక్కించిన ఈ యాక్షన్ డ్రామా ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనను అందుకుంటోంది. అయితే సినిమాను తెరకెక్కించిన విధానం, స్క్రీన్‌ప్లే విషయంలో దర్శకుడు తన మార్క్ చూపించాడు.చిన్న కథాంశాన్నే తీసుకుని దానికి ఆసక్తికరమైన మలుపులు, యాక్షన్ ఎలిమెంట్స్ జోడించ...

ఈ వారం థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాల్లో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ హీరోగా నటించిన ‘డిసి’ కూడా ఒకటి. దర్శకుడు అరుణ్ మాదేశ్వరన్ తెరకెక్కించిన ఈ యాక్షన్ డ్రామా ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనను అందుకుంటోంది. అయితే సినిమాను తెరకెక్కించిన విధానం, స్క్రీన్‌ప్లే విషయంలో దర్శకుడు తన మార్క్ చూపించాడు.


చిన్న కథాంశాన్నే తీసుకుని దానికి ఆసక్తికరమైన మలుపులు, యాక్షన్ ఎలిమెంట్స్ జోడించి ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా సినిమాను రూపొందించాడు. ముఖ్యంగా సినిమా సాగుతున్న కొద్దీ వచ్చే కొన్ని సాలిడ్ మూమెంట్స్ మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటాయి. కథలో పెద్దగా కొత్తదనం కనిపించకపోయినా, దర్శకుడు ఎంచుకున్న ట్రీట్‌మెంట్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది.


ఇక ఈ సినిమాతో హీరోగా డెబ్యూ చేసిన లోకేష్ కనకరాజ్ తన పాత్రకు న్యాయం చేశాడు. యాక్షన్ సన్నివేశాలతో పాటు కీలకమైన ఎమోషనల్ సీన్స్‌లోనూ తనదైన పెర్ఫార్మెన్స్‌తో మెప్పించాడు. మరోవైపు అనిరుధ్ అందించిన సంగీతం సినిమాకు అదనపు బలంగా నిలిచింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పలు సన్నివేశాల ఇంపాక్ట్‌ను మరింత పెంచింది.


ఓవరాల్‌గా ‘డిసి’ సినిమా సాలిడ్ యాక్షన్ మూమెంట్స్, ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లేతో ఆకట్టుకునే మాస్ డ్రామాగా నిలుస్తుంది. అక్కడక్కడా కనిపించే చిన్న లోపాలను పక్కన పెడితే, థియేటర్లలో ఒకసారి చూడదగ్గ సినిమాగా అనిపిస్తుంది.

Aug 08, 2026 Tamil +1

Korean Kanakaraju movie Review

6.0
out of 10
వరుస ఫ్లాప్స్ లో ఉన్న వరుణ్ తేజ్ కి కొరియన్ కనకరాజు టీజర్, ట్రైలర్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొనడంతో హిట్ కొడతాడు అనే ఆశలు చిగురించాయి. సత్య కామెడీ కూడా ఉండటంతో ఈసారి వరుణ్ హిట్ కొడతాడని అంత ఫిక్స్ అయ్యారు. ఒక ఆత్మ ఎక్కడ్నుంచో వచ్చి ఒకరి శరీరంలోకి దూరడం, తన ప్లేస్ కి వెళ్లడం.. లాంటి కథ చాలా పాతదే. కానీ దానికి పెనుగొండ, కొరియా బ్యాక్ డ్రాప్ తీసుకొని కొత్తగా రాసుకున్నారు. సత్య కామెడీ ట్రాక్...

వరుస ఫ్లాప్స్ లో ఉన్న వరుణ్ తేజ్ కి కొరియన్ కనకరాజు టీజర్, ట్రైలర్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొనడంతో హిట్ కొడతాడు అనే ఆశలు చిగురించాయి. సత్య కామెడీ కూడా ఉండటంతో ఈసారి వరుణ్ హిట్ కొడతాడని అంత ఫిక్స్ అయ్యారు. ఒక ఆత్మ ఎక్కడ్నుంచో వచ్చి ఒకరి శరీరంలోకి దూరడం, తన ప్లేస్ కి వెళ్లడం.. లాంటి కథ చాలా పాతదే. కానీ దానికి పెనుగొండ, కొరియా బ్యాక్ డ్రాప్ తీసుకొని కొత్తగా రాసుకున్నారు. 


సత్య కామెడీ ట్రాక్స్ కి మాత్రం ఫుల్ గా నవ్వుకుంటాం. కొరియాకు సంబంధించిన సీన్స్, హీరోయిన్ పాత్ర సెటప్ అన్ని బాగా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఈ సినిమాకు పార్ట్ 2 కి లీడ్ ఇవ్వడం గమనార్హం. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఫుల్ గా నవ్వుకోడానికి థియేటర్ కి వెళ్లి చూడొచ్చు ఈ సినిమాని. మొత్తంగా ‘కొరియన్ కనకరాజు’ ఓ కొరియన్ గ్యాంగ్ స్టర్ ఆత్మ పెనుగొండలో ఉండే కనకరాజు అనే వ్యక్తి శరీరంలోకి వస్తే ఏం జరిగింది అని కామెడీ యాక్షన్ తో తెరకెక్కిన సినిమా.

Aug 07, 2026 Telugu

Korean kanakaraju movie review

6.0
out of 10
దెయ్యాలు, ఆత్మలు తదితర అంశాల నేపథ్యంలో భయపెడుతూనే నవ్వించే చిత్రాలు తెలుగు తెరకు కొత్త కాదు. ఒకరి దేహంలోకి మరొకరి ఆత్మ ప్రవేశించడం కూడా మనం చాలాసార్లు చూసిందే. కానీ ఇక్కడ దర్శకుడు ఎంచుకున్న విదేశీ ఆత్మ అనే పాయింట్ కొత్తగా అనిపిస్తుంది. సినిమా మొదలైన చాలాసేపటి వరకు కథనం చాలా సాదాసీదాగా సాగుతుంది. అయితే ప్రేక్షకుడు కాస్త బోర్ ఫీలయ్యే సమయంలో ఇంటర్వెల్ దగ్గర వచ్చే ట్విస్ట్ సినిమా స్వరూపాన్నే మార్చేస్త...

దెయ్యాలు, ఆత్మలు తదితర అంశాల నేపథ్యంలో భయపెడుతూనే నవ్వించే చిత్రాలు తెలుగు తెరకు కొత్త కాదు. ఒకరి దేహంలోకి మరొకరి ఆత్మ ప్రవేశించడం కూడా మనం చాలాసార్లు చూసిందే. కానీ ఇక్కడ దర్శకుడు ఎంచుకున్న విదేశీ ఆత్మ అనే పాయింట్ కొత్తగా అనిపిస్తుంది. సినిమా మొదలైన చాలాసేపటి వరకు కథనం చాలా సాదాసీదాగా సాగుతుంది. అయితే ప్రేక్షకుడు కాస్త బోర్ ఫీలయ్యే సమయంలో ఇంటర్వెల్ దగ్గర వచ్చే ట్విస్ట్ సినిమా స్వరూపాన్నే మార్చేస్తుంది. ఎప్పుడైతే హీరో శరీరంలోకి ఆత్మ వస్తుందో అక్కడి నుంచి కథ ఊపు అందుకుంటుంది.


లాజిక్ లను పూర్తిగా పక్కనపెట్టి కేవలం నవ్వించడమే లక్ష్యంగా దర్శకుడు అడుగులు వేశాడు. ముఖ్యంగా స్నేహితుడి పాత్రలో సత్య చేసే హడావిడి, ఇచ్చే ఎక్స్ ప్రెషన్స్ అంతా ఇంతా కాదు. అయితే వినోదానికి ఇచ్చిన ప్రాధాన్యత కథా గమనానికి ఇవ్వకపోవడం కొంత లోపం. కథలో బలమైన ఫ్లో ఉండదు. ఇక క్లైమాక్స్ సన్నివేశాలు మరీ కార్టూన్ నెట్వర్క్ తరహాలో సాగడం కొంచెం నిరాశపరుస్తుంది. ఫస్టాఫ్ లో ఉన్న సాగతీతను తగ్గించి ఉంటే సినిమా స్థాయి మరింత పెరిగేది. లాజిక్స్ వెతక్కుండా కేవలం నవ్వుకోవడానికి వెళ్లే వారికి ఈ సినిమా వినోదాన్ని పంచుతుంది. ఓవరాల్ గా కొరియన్ కనకరాజు.. లాజిక్స్ తో పనిలేకుండా కాసేపు హాయిగా నవ్వుకునేలా ఉంది. 

Aug 07, 2026 Telugu

Korean kanakaraju movie review

Sakshi

By Sakshi

7.0
out of 10
వరుణ్ తేజ్ నటించిన కొరియన్ కనకరాజు మూవీ తాజాగా థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. వరుణ్ తేజ్ తన డీసెంట్ పెర్ఫార్మన్స్ తో మెప్పిస్తాడు. సత్య కామెడీ సినిమాకే హైలెట్. డైరెక్టర్ మేర్లపాక గాంధీ ఎంటర్టైనింగ్ స్క్రీన్ ప్లే తో మెప్పించాడు. కానీ కథ ఇంకా బలంగా రాసుకోవాల్సింది. థమన్ మ్యూజిక్ చాలా బలమైంది. ఇక ఫస్ట్ హాఫ్ రొటీన్ గానే ఉన్నా, సెకండ్ హాఫ్ హిలేరియస్ గా నవ్విస్తుంది. కాకపోత...

వరుణ్ తేజ్ నటించిన కొరియన్ కనకరాజు మూవీ తాజాగా థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. వరుణ్ తేజ్ తన డీసెంట్ పెర్ఫార్మన్స్ తో మెప్పిస్తాడు. సత్య కామెడీ సినిమాకే హైలెట్. డైరెక్టర్ మేర్లపాక గాంధీ ఎంటర్టైనింగ్ స్క్రీన్ ప్లే తో మెప్పించాడు. కానీ కథ ఇంకా బలంగా రాసుకోవాల్సింది. థమన్ మ్యూజిక్ చాలా బలమైంది. 


ఇక ఫస్ట్ హాఫ్ రొటీన్ గానే ఉన్నా, సెకండ్ హాఫ్ హిలేరియస్ గా నవ్విస్తుంది. కాకపోతే క్లైమాక్స్ నిరాశపరుస్తుంది. ఓవరాల్ గా కొరియన్ కనకరాజు ఆడియన్స్ ని మెప్పిస్తుంది. కొత్తదనం కోరుకునే వాళ్లకు, లాజిక్ లు వెతికేవాళ్లకు ఈ సినిమా కొంతవరకు నిరాశపరచవచ్చు. 

Aug 07, 2026 Telugu

Korean Kanakaraju Movie Review

7.0
out of 10
మెగా హీరో వరుణ్ తేజ్ చాలా కాలంగా ఓ కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తుండగా latest గా 'కొరియన్ కనకరాజు' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందు క్రేజీ ప్రమోషన్లతో ఆసక్తి పెంచిన ఈ చిత్రం థియేటర్లలో మిశ్రమ స్పందనను అందుకుంటోంది.తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికే పరిచయమైన హారర్ కామెడీ జానర్‌ను ఆధారంగా తీసుకున్న ఈ సినిమా, దయ్యం ప్రధాన పాత్రలోకి ప్రవేశించి జరిగే పరిణామాల చుట్టూ తిరుగుతుంది. కథనం, స్క్రీన్‌ప్ల...

మెగా హీరో వరుణ్ తేజ్ చాలా కాలంగా ఓ కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తుండగా latest గా 'కొరియన్ కనకరాజు' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందు క్రేజీ ప్రమోషన్లతో ఆసక్తి పెంచిన ఈ చిత్రం థియేటర్లలో మిశ్రమ స్పందనను అందుకుంటోంది.

తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికే పరిచయమైన హారర్ కామెడీ జానర్‌ను ఆధారంగా తీసుకున్న ఈ సినిమా, దయ్యం ప్రధాన పాత్రలోకి ప్రవేశించి జరిగే పరిణామాల చుట్టూ తిరుగుతుంది. కథనం, స్క్రీన్‌ప్లేలో కొన్ని లోపాలు కనిపించినప్పటికీ, సినిమా మొత్తంగా ప్రేక్షకులకు బోర్ కొట్టించకుండా సాగుతుంది.


మేర్లపాక గాంధీ తన తొలి రెండు చిత్రాల స్థాయిని అందుకోకపోయినా, ఈసారి ఓ మంచి ఎంటర్‌టైనర్‌ను అందించాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎడిటింగ్ క్రిస్పీగా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఓవరాల్ గా కొరియన్ కనకరాజు అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ విత్ సమ్ హర్రర్ ఎలిమెంట్స్.


Aug 07, 2026 Telugu

Karmakhya Movie Review

6.0
out of 10
జబర్దస్త్ ఫేమ్ అదిరే అభి ఇటీవల దర్శకుడిగా మారి సినిమాలు చేస్తున్నాడు. అస్సాంలోని ఫేమస్ టెంపుల్, శక్తి పీఠాల్లో ఒకటైన కామాఖ్య ఆలయంను లీడ్ గా తీసుకొని అదే టైటిల్ తో సినిమా ప్రకటించడంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. కానీ సెన్సార్ ఇబ్బందులతో సినిమా టైటిల్ రిలీజ్ కి ముందు కర్మాఖ్య అని మార్చారు. సినిమా సగం వరకు ఒకే ఇంట్లో తీశారు. ఒకే ఇంట్లో అన్ని సీన్స్ బాగా డిజైన్ చేసుకున్నారు. ఈ సినిమాని థియేటర...

జబర్దస్త్ ఫేమ్ అదిరే అభి ఇటీవల దర్శకుడిగా మారి సినిమాలు చేస్తున్నాడు. అస్సాంలోని ఫేమస్ టెంపుల్, శక్తి పీఠాల్లో ఒకటైన కామాఖ్య ఆలయంను లీడ్ గా తీసుకొని అదే టైటిల్ తో సినిమా ప్రకటించడంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. కానీ సెన్సార్ ఇబ్బందులతో సినిమా టైటిల్ రిలీజ్ కి ముందు కర్మాఖ్య అని మార్చారు. సినిమా సగం వరకు ఒకే ఇంట్లో తీశారు. ఒకే ఇంట్లో అన్ని సీన్స్ బాగా డిజైన్ చేసుకున్నారు. ఈ సినిమాని థియేటర్లో చూడొచ్చు.


కాకపోతే ఎడిటింగ్ లో మాత్రం కొన్ని సాగదీసిన సీన్స్ కట్ చేస్తే బెటర్. నిర్మాణ పరంగా ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టారు. మొత్తంగా ‘కర్మాఖ్య’ చేతబడుల నేపథ్యంలో ఓ అమ్మాయి బలి నుంచి ఎలా తప్పించుకుంది అని ఆసక్తికరంగా తెరకెక్కించిన సినిమా. 

Aug 04, 2026 Telugu

Karmakhya Movie review

6.0
out of 10
జబర్దస్త్ తర్వాత దర్శకుడిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్న అదిరే అభి తెరకెక్కించిన కర్మాఖ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కామాఖ్య దేవత కాన్సెప్ట్, మూఢనమ్మకాల నేపథ్యంలో సాగే ఈ మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్‌లో హర్రర్ లేదా సూపర్‌నేచురల్ అంశాలు పెద్దగా కనిపించవు.ట్విస్టులు ఆశించిన స్థాయిలో ఇంపాక్ట్ ఇవ్వకపోయినా, ఇటీవల వచ్చిన థ్రిల్లర్‌లతో పోలిస్తే కొత్త తరహా థ్రిల్లింగ్ అనుభూతిని అందించే ప్రయ...

జబర్దస్త్ తర్వాత దర్శకుడిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్న అదిరే అభి తెరకెక్కించిన కర్మాఖ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కామాఖ్య దేవత కాన్సెప్ట్, మూఢనమ్మకాల నేపథ్యంలో సాగే ఈ మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్‌లో హర్రర్ లేదా సూపర్‌నేచురల్ అంశాలు పెద్దగా కనిపించవు.


ట్విస్టులు ఆశించిన స్థాయిలో ఇంపాక్ట్ ఇవ్వకపోయినా, ఇటీవల వచ్చిన థ్రిల్లర్‌లతో పోలిస్తే కొత్త తరహా థ్రిల్లింగ్ అనుభూతిని అందించే ప్రయత్నం చేసింది. భారీ అంచనాలు లేకుండా చూస్తే కర్మాఖ్య ఒక డీసెంట్ మిస్టరీ థ్రిల్లర్‌గా ఆకట్టుకుంటుంది. ఫైనల్ గా కర్మాఖ్య ఒక ఎంగేజింగ్ థ్రిల్లర్. 

Aug 04, 2026 Telugu

Gatta Kusthi 2 movie review

Sakshi

By Sakshi

6.0
out of 10
విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మీ జంటగా నటించిన 'గట్టా కుస్తీ 2' తమిళంలో థియేటర్లలో విడుదలై, తెలుగులో నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తొలి భాగానికి కొనసాగింపుగా వచ్చిన ఈ సినిమాలో భార్యాభర్తల మధ్య అపార్థాలు, భావోద్వేగాలు, కామెడీ ప్రధానంగా సాగుతాయి. విష్ణు విశాల్ తన న్యాచురల్ కామెడీ టైమింగ్‌తో మరోసారి ఆకట్టుకోగా, ఐశ్వర్య లక్ష్మీ కూడా తన పాత్రకు న్యాయం చేసింది. హీరో-హీరోయిన్ల కెమిస్ట్రీతో...

విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మీ జంటగా నటించిన 'గట్టా కుస్తీ 2' తమిళంలో థియేటర్లలో విడుదలై, తెలుగులో నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తొలి భాగానికి కొనసాగింపుగా వచ్చిన ఈ సినిమాలో భార్యాభర్తల మధ్య అపార్థాలు, భావోద్వేగాలు, కామెడీ ప్రధానంగా సాగుతాయి. విష్ణు విశాల్ తన న్యాచురల్ కామెడీ టైమింగ్‌తో మరోసారి ఆకట్టుకోగా, ఐశ్వర్య లక్ష్మీ కూడా తన పాత్రకు న్యాయం చేసింది. హీరో-హీరోయిన్ల కెమిస్ట్రీతో పాటు చైల్డ్ ఆర్టిస్ట్ జారా నటన హైలైట్‌గా నిలిచింది. అయితే కథ పూర్తిగా రొటీన్‌గా ఉండడం, ముందే ఊహించగల స్క్రీన్‌ప్లే, కొన్ని సాగదీత సన్నివేశాలు సినిమాకు మైనస్‌గా మారాయి. మొత్తంగా 'గట్టా కుస్తీ 2' నవ్వులు పంచే టైంపాస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. కొత్త కథ ఆశించే వారికి మాత్రం పెద్దగా మెప్పించకపోవచ్చు. ఓవరాల్ గా మంచి టైం పాస్ మూవీగా ఫ్యామిలీతో ఓసారి చూసేయొచ్చు.


Aug 03, 2026 Tamil +1

Lenin Movie Review

6.0
out of 10
అఖిల్ ఇప్పటివరకు ఒక్క కమర్షియల్ హిట్ కొట్టకపోవడంతో లెనిన్ పైనే అందరూ ఆశలు పెట్టుకున్నారు. ఇక థియేటర్లో ఈరోజే విడుదలైన ఈ సినిమా రొటీన్ స్టోరీ తో తెరకెక్కినా, మంచి స్క్రీన్ ప్లే తో ఎంగేజింగ్ గా ఉండి ఆకట్టుకుంటుంది. చాన్నాళ్ల తర్వాత ఓ పర్ఫెక్ట్ మాస్ కమర్షియల్ సినిమా చుసిన ఫీలింగ్ అయితే వస్తుంది. అనాథగా ఊళ్లోకి వచ్చి ఆ ఊరి పెద్ద కుటుంబంలో ఒకడిగా మారిన వ్యక్తి, అతని ప్రేమకథ, నమ్మినవాళ్ళే అతన్ని మోసం చే...

అఖిల్ ఇప్పటివరకు ఒక్క కమర్షియల్ హిట్ కొట్టకపోవడంతో లెనిన్ పైనే అందరూ ఆశలు పెట్టుకున్నారు. ఇక థియేటర్లో ఈరోజే విడుదలైన ఈ సినిమా రొటీన్ స్టోరీ తో తెరకెక్కినా, మంచి స్క్రీన్ ప్లే తో ఎంగేజింగ్ గా ఉండి ఆకట్టుకుంటుంది. చాన్నాళ్ల తర్వాత ఓ పర్ఫెక్ట్ మాస్ కమర్షియల్ సినిమా చుసిన ఫీలింగ్ అయితే వస్తుంది. అనాథగా ఊళ్లోకి వచ్చి ఆ ఊరి పెద్ద కుటుంబంలో ఒకడిగా మారిన వ్యక్తి, అతని ప్రేమకథ, నమ్మినవాళ్ళే అతన్ని మోసం చేస్తే ఏం చేసాడు అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.


ఇక సినిమాని మహాభారతం రిఫరెన్స్ లో అందులోని పాత్రలతో లింక్ చేస్తూ తెరకెక్కించిన విధానం బాగుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్, పీరియాడిక్ కావడంతో ఆర్ట్ డిపార్ట్మెంట్ కూడా బాగానే కష్టపడ్డారు. కొన్ని డైలాగ్స్ పవర్ ఫుల్ గా చాలా బాగున్నాయి. యాక్షన్ సీక్వెన్స్ బాగా డిజైన్ చేశారు. బస్ ఛేజింగ్, ఫైట్ సీన్, క్లైమాక్స్ ఫైట్ కూడా బాగుంటుంది. మొత్తంగా ‘లెనిన్’ సినిమా ఓ ప్రేమకథ చుట్టూ ట్విస్టులతో సాగే సినిమా. 


Jul 10, 2026 Telugu

Lenin movie Review

7.0
out of 10
లెనిన్ సినిమా గురించి చెప్పుకుంటే... ఈ చిత్ర దర్శకుడు రాసుకున్న స్క్రీన్ ప్లే సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. మహాభారతం స్ఫూర్తితో సాగే సన్నివేశాలు ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తాయి. సినిమా మొదలైనప్పటి నుండి ఇంటర్వెల్ వరకు కథా గమనం ఒక ఎత్తు అయితే.. సెకండాఫ్‌లో సినిమాను నడిపించిన తీరు మరో ఎత్తు. దర్శకుడు ప్రతి పాత్రను చాలా లోతుగా మలిచాడు.అయితే కథ పరంగా రొటీన్ గా ఉండి చాలా సీన్స్ ఊహాజన...

లెనిన్ సినిమా గురించి చెప్పుకుంటే... ఈ చిత్ర దర్శకుడు రాసుకున్న స్క్రీన్ ప్లే సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. మహాభారతం స్ఫూర్తితో సాగే సన్నివేశాలు ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తాయి. సినిమా మొదలైనప్పటి నుండి ఇంటర్వెల్ వరకు కథా గమనం ఒక ఎత్తు అయితే.. సెకండాఫ్‌లో సినిమాను నడిపించిన తీరు మరో ఎత్తు. దర్శకుడు ప్రతి పాత్రను చాలా లోతుగా మలిచాడు.


అయితే కథ పరంగా రొటీన్ గా ఉండి చాలా సీన్స్ ఊహాజనితంగానే ఉన్నాయి. ముఖ్యంగా ఫస్టాఫ్‌ లో అఖిల్, భాగ్యశ్రీ మధ్య వచ్చే లవ్ సీన్స్ పరిధి మేరకు ఉన్నాయి. ఎక్కడా కథను పక్కదారి పట్టించుకండా అనుకున్నది అనుకున్నట్లుగా తెరకెక్కించారు మురళీ కిషోర్. పైగా సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాల్లో అఖిల్ నటన కూడా సినిమా రేంజ్‌ను పెంచేసింది. కొన్ని పాత సినిమాల రిఫరెన్సులు కనిపించినా కూడా లెనిన్ ప్రత్యేకత లెనిన్‌ కు ఉంది. అయితే ఓవరాల్ గా సినిమాలో అఖిల్ పెర్ఫార్మన్స్ హైలెట్ గా నిలిచింది. కొత్తదనం కోసం ఆశించకుండా, తక్కువ అంచనాలతో చూస్తే... లెనిన్ ఊహించినదానికంటే ఎక్కువ బాగుంటుంది. 

Jul 10, 2026 Telugu

Lenin Movie Review

Sakshi

By Sakshi

6.0
out of 10
అఖిల్ అక్కినేని నటించిన 'లెనిన్' మొదట్లో మరో రూరల్ యాక్షన్ డ్రామాలానే అనిపిస్తుంది. కానీ కథ ముందుకు సాగే కొద్దీ వచ్చే ట్విస్టులు సినిమాపై ఆసక్తిని పెంచుతాయి. ముఖ్యంగా ఇంటర్వెల్, క్లైమాక్స్ ఎపిసోడ్లు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తాయి.అఖిల్ తన కెరీర్‌లో అత్యంత మెచ్యూర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పొచ్చు. క్లైమాక్స్‌లో ఆయన నటన సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది. భాగ్యశ్రీ బోర్సేతో కెమిస్ట్రీ ఆకట్టుకోగా,...

అఖిల్ అక్కినేని నటించిన 'లెనిన్' మొదట్లో మరో రూరల్ యాక్షన్ డ్రామాలానే అనిపిస్తుంది. కానీ కథ ముందుకు సాగే కొద్దీ వచ్చే ట్విస్టులు సినిమాపై ఆసక్తిని పెంచుతాయి. ముఖ్యంగా ఇంటర్వెల్, క్లైమాక్స్ ఎపిసోడ్లు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తాయి.


అఖిల్ తన కెరీర్‌లో అత్యంత మెచ్యూర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పొచ్చు. క్లైమాక్స్‌లో ఆయన నటన సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది. భాగ్యశ్రీ బోర్సేతో కెమిస్ట్రీ ఆకట్టుకోగా, తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ యాక్షన్ సన్నివేశాలకు మంచి ఎలివేషన్ ఇచ్చింది. కథలో కొత్తదనం తక్కువైనా, స్క్రీన్‌ప్లే ఎంగేజ్‌మెంట్‌తో పాటు అఖిల్ పెర్ఫార్మెన్స్ కోసం 'లెనిన్' ను ఒకసారి ట్రై చేయొచ్చు. అయితే ఈ సినిమా హిట్ అవుతుందా లేదా అనేది ప్రేక్షకులు నిర్ణయిస్తారు.

Jul 10, 2026 Telugu
Why MRO?