Movie Reviews
Professional reviews and ratings from top critics and publications worldwide
Enugu Thondam Ghatikachalam movie Review
By Cinemexplore
ఎనుగు తొండం – ఘటికాచలం రవిబాబు కెరీర్‌లో మరో ప్రయోగాత్మక చిత్రం. గతంలో పార్టీ, ఆడవాళ్లు మీకు జోహార్లు లాంటి విభిన్న సినిమాలు చేసిన ఆయన, ఈసారి పూర్తిగా సీరియస్ నోట్లోకి వెళ్లాడు. నరేష్ లీడ్ రోల్‌లో తన అనుభవాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించాడు. కొన్ని సీన్స్‌లో ఆయన ఎక్స్‌ప్రెషన్స్ సినిమాకే హైలైట్. కథ నెమ్మదిగా సాగినా, కొన్ని కీలక ఘట్టాలు బలంగా ఉంటాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి మంచి ఇంపాక్ట్ ఇస్తుంది. కానీ ఫస్ట్ హాఫ్‌లో ల్యాగ్ స్పష్టంగా కనిపిస్తుంది. కొన్ని సీన్స్ ఎడిట్ చేసి ఉంటే పేస్ మెరుగయ్యేది. రవిబాబు గత సినిమాల్లో ఉన్న సర్ప్రైజ్ ఫ్యాక్టర్ ఇక్కడ కొంచెం తక్కువ. అయినప్పటికీ, కంటెంట్ బేస్డ్ సినిమాలు ఇష్టపడేవారు ఓసారి చూడవచ్చు.
Enugu Thondam Ghatikachalam Movie Review
రవిబాబు దర్శకత్వంలో వచ్చిన ఎనుగు తొండం – ఘటికాచలం ఆయన పాత సినిమాల మాదిరిగానే డార్క్, రియలిస్టిక్ టోన్‌లో సాగుతుంది. అనసూయ, అమరావతి, అవును లాంటి సినిమాల్లో కనిపించిన ఇంటెన్సిటీ ఇక్కడ కూడా కనిపిస్తుంది. సీనియర్ నటుడు నరేష్ మెయిన్ లీడ్‌లో చాలా మెచ్యూర్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కథ పెద్దగా కొత్తగా లేకపోయినా, పాత్రలోని భావోద్వేగాలను నరేష్ బాగా పండించాడు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ సినిమాకి సరైన మూడ్‌ని సెట్ చేశాయి. అయితే రవిబాబు మార్క్ షాకింగ్ సీన్స్ కొన్ని చోట్ల ఓవర్‌గా అనిపిస్తాయి. స్క్రీన్‌ప్లే స్లోగా మారి ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. సపోర్టింగ్ క్యాస్ట్‌కి తక్కువ స్కోప్ ఉంది. క్లైమాక్స్ ఇంకాస్త షార్ప్‌గా ఉంటే బాగుండేది. మొత్తానికి, ఇది రవిబాబు స్టైల్ ఇష్టపడేవారికి నచ్చే సినిమా.
Enugu Thondam Ghatikachalam movie Review
రవిబాబు దర్శకత్వంలో వచ్చిన ఎనుగు తొండం – ఘటికాచలం ఒక సీరియస్, రా టోన్‌తో తెరకెక్కిన సినిమా. సీనియర్ నటుడు నరేష్ మెయిన్ లీడ్‌గా కనిపించడం ఈ సినిమాకు పెద్ద ప్లస్. ఆయన నటనలో సహజత్వం, అనుభవం స్పష్టంగా కనిపిస్తాయి. ముఖ్యంగా ఎమోషనల్ మరియు ఇంటెన్స్ సీన్స్‌లో నరేష్ క్యారీ చేసిన విధానం ప్రశంసనీయం. రవిబాబు తన స్టైల్‌లో కథను నేరుగా చెప్పే ప్రయత్నం చేశాడు, కానీ కొన్ని చోట్ల అదే స్టైల్ భారంగా అనిపిస్తుంది. కథ కొత్తదేమీ కాకపోయినా, ట్రీట్‌మెంట్ కొంతవరకు ఆకట్టుకుంటుంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని కీలక సన్నివేశాలకు బలం ఇచ్చింది. సినిమాటోగ్రఫీ కూడా వాతావరణాన్ని బాగా చూపించింది. అయితే స్క్రీన్‌ప్లే స్లోగా సాగడం, కొన్ని సీన్స్ అనవసరంగా లాగినట్టు అనిపిస్తాయి. సపోర్టింగ్ క్యారెక్టర్స్‌కు సరైన డెవలప్‌మెంట్ లేకపోవడం మైనస్. క్లైమాక్స్ ఇంకా బలంగా ఉండి ఉంటే ఇంపాక్ట్ పెరిగేది. మొత్తం మీద, లోపాలు ఉన్నప్పటికీ నటనను ఇష్టపడే వారికి ఓసారి చూడదగిన సినిమా.
Enugu Thondam Ghatikachalam movie Review
ఫిలిం మేకర్ గా తనకంటూ ఓ బ్రాండ్ వాల్యూ ఏర్పరచుకున్న రవిబాబు డైరెక్టర్ గా కొన్నాళ్లుగా ఫామ్ లో లేకపోగా, తాజాగా ఏనుగు తొండం ఘటికాచలంతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. కానీ ఈ సినిమా ఆడియన్స్ ని ఆకట్టుకోవడంలో పూర్తిగా విఫలమైంది. రవిబాబు లాంటి ఫిల్మ్ మేకర్ నుంచి రావాల్సిన సినిమా అసలు కాదిది. ఓవరాల్ గా నరేష్ ఎప్పటిలానే సహజనటనతో మెప్పించాడు. పైగా తన వయసుకి తగ్గ పాత్రది. వర్షిణి పాత్రలో కొన్ని డబుల్ మీనింగ్ డైలాగులు ఉన్నా, ఆ పాత్ర ఈ డ్రామాలో చలాకీగా ఉంటుంది. మిగతా పాత్రలన్నీ తేలిపోయాయి. దాదాపు సింగిల్ లొకేషన్ కథ ఇది. ప్రొడక్షన్ డిజైన్‌లో రవిబాబుదీ ప్రత్యేకమైన స్టైల్. ఇందులోనూ ఒక యూనిఫామ్ టోన్ కనిపిస్తుంది. మ్యూజిక్, కెమెరా వర్క్ ఓటీటీ సినిమాకి తగ్గట్టుగానే ఉంటాయి. పెద్దగా నవ్వురాని, ఎమోషన్‌గా కనెక్ట్ కాని సినిమా ఇది. రవిబాబు ఏదో మ్యాజిక్ చేస్తాడనే అంచనాతో చూస్తే మరింత నిరుత్సాహపడాల్సి వస్తుంది.
Enugu Thondam Ghatikachalam Movie Review
By 123telugu
దర్శకుడు రవిబాబు తన మార్క్ కామెడీ ఇంకా థ్రిల్లర్ చిత్రాలతో మంచి బెంచ్ మార్క్ ని సెట్ చేసుకున్నారు. ఇప్పుడొస్తున్న డిఫరెంట్ థ్రిల్లర్ మూవీస్ ని ఇరవైఏళ్ళ కిందటే రవిబాబు ఎప్పుడో తాను టచ్ చేశారు. కానీ కొన్నేళ్లుగా ఫామ్ కోల్పోయిన రవిబాబు మరోసారి తన సత్తా చాటాలని ‘ఏనుగు తొండం ఘటికాచలం’ అంటూ కామెడీ ఎంటర్టైనర్ తో ఓటిటి ద్వారా ఆడియన్స్ ని పలకరించాడు. కానీ ఈసారి కూడా నిరాశే మిగిలింది. పూర్తి స్థాయిలో ఆకట్టుకోని కామెడీ డ్రామాగా ఈ సినిమా నిలిచింది. దర్శకుడు రవిబాబు తాలూకా గత సినిమాలు తన క్రియేటివిటీ కోసం మినిమమ్ ఐడియా ఉన్నవారికి కూడా ఈ సినిమా నిరుత్సాహాన్నే మిగులుస్తుంది. ఇక ఏ అంచనాలు లేని ఆడియెన్స్ అయితే కనెక్ట్ అయ్యే అవకాశాలు కూడా తక్కువే. సో ఈ చిత్రం కేవలం రవిబాబు సినిమా ఎలా ఉన్నా పర్వాలేదు కొత్త సినిమా చూడాలి అనుకునే వారినే చాలా తక్కువ స్థాయిలో ఆకట్టుకుంటుంది.
Santhana Prapthirasthu movie Review
By Great Andhra
సంతాన ప్రాప్తిరస్తు అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన విక్రాంత్, చాందిని చౌదరి ఈ మూవీతో మంచి సక్సెస్ కొట్టాలని ఆడియన్స్ ముందుకు వచ్చారు. డైరెక్టర్ సంజీవ్ రెడ్డి రేర్ అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్ ని తీసుకున్నాడు. దానికి ముందు అతడ్ని అభినందించాలి. సినిమాలో కూడా పెద్దగా కమర్షియల్ ఎలిమెంట్స్ ఓవర్ గా లేకుండా చెప్పాల్సిందాన్ని నీట్ గా చెప్పడంలో సక్సెస్ అయ్యాడు. బట్ అందులోనే ఆడియన్స్ కి ఇంట్రెస్టింగ్ గా స్క్రిప్ట్ ని అందించడం లో తడబడ్డాడు. క్లైమాక్స్ ఇంకా ఆసక్తిగా ఉంటె కనెక్ట్ అయ్యేవారు. కానీ సెకండ్ హాఫ్ లో బాగా ల్యాగ్ ఫీల్ వచ్చింది. అయితే నటీనటుల పెర్ఫార్మన్స్ కోసం, ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ చూసే ఒక వర్గం ఆడియన్స్ కి సంతాన ప్రాప్తిరస్తు సినిమా నచ్చే అవకాశం ఉంది. బట్ రెగ్యులర్ ఆడియన్స్ అంతగా ఇంప్రెస్ అవకపోవచ్చు.
Santhana Prapthirasthu Movie Review
By Cinema Picha
ప్రెసెంట్ జెనరేషన్ లో యూత్ లో ఉన్న సాధారణ ప్రాబ్లెమ్ సంతాన లేమి, లేదా స్పెర్మ్ కౌంట్ తగ్గుదల. ఇలాంటి సమస్యల్లో ఎక్కువ మానసిక ఒత్తిడికి గురైన వాళ్ళకి, ముఖ్యంగా సాఫ్ట్ వేర్ ఎంప్లొయ్స్ ఈ ప్రాబ్లెమ్ తో సఫర్ అవుతున్నారు. అలాంటి వాళ్ళని అలర్ట్ చేయడానికి సంతాన ప్రాప్తిరస్తు సినిమా బాగా యూస్ అవుతుంది. ఇక మెయిన్ లీడ్ విక్రాంత్, చాందిని చౌదరి డీసెంట్ పెర్ఫార్మన్స్ తో మెప్పించారు. అండ్ సంజీవ్ రెడ్డి తీసుకున్న స్టోరీ పాయింట్ బాగున్నా, స్క్రీన్ ప్లే పరంగా ల్యాగ్ అయింది. ఫస్ట్ హాఫ్ ఎంటర్టైన్ చేస్తుంది. అండ్ సెకండ్ హాఫ్ కూడా ఎంటర్టైనింగ్ గా ఉన్నా కూడా, ల్యాగ్ ఫీల్ వస్తుంది. క్లైమాక్స్ విషయంలో డైరెక్టర్ ఇంకొంచెం ఇంట్రస్టింగ్ గా రాసుంటే ఆడియన్స్ మంచి ఫీల్ తో బయిటికి వచ్చేవారు.
Santhana Prapthirasthu Movie Review
ప్రస్తుత కాలంలో తీసుకునే ఆహారం, పని ఒత్తిడి లాంటి సమస్యలే సంతాన లేమికి కారణం అవుతున్నాయి. దాన్ని ప్రధానాంశంగా తీసుకుని లవ్, కామెడీ ఎంటర్‌టైనర్‌గా 'సంతాన ప్రాప్తిరస్తు' సినిమాని తెరకెక్కించాడు దర్శకుడు సంజీవ్ రెడ్డి. ఇది కాస్త సీరియస్ సబ్జెక్టే అయినా ఎక్కడా లిమిట్స్ క్రాస్ చేయకుండా, ఎవరినీ నొప్పించకుండా లైటర్ వేలో దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే లవ్‌స్టోరీ పరంగా రొటీన్‌గానే అనిపిస్తుంది. పిల్లల్ని కోరుకోవడం, ఆ తరుణంలో సాగే భావోద్వేగ సన్నివేశాలు, పతాక సన్నివేశం కదిలించేలా ఉన్నాయి. కథ పరంగా మంచిదే అయినా కాస్త ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్ట్‌లతో తీసుంటే ఈ సినిమా జనాల్లోకి బాగా వెళ్లేది. సినిమాలో నటీనటులు బాగానే పెర్ఫార్మ్ చేసినా, బలమైన పెద్ద ఆర్టిస్టులతో సినిమాని తీసుంటే, అప్పుడు ప్రమోషన్ బలంగా చేస్తే జనాలకు చేరువయ్యే అవకాశం ఉంది. ఓవరాల్ గా ఒకసారి చూసేలా అయితే ఉంది.
Santhana Prapthirasthu movie Review
By Filmi Beat
సంతాన వైఫల్యం, అంగస్థంభన లాంటి అంశాలను పాయింట్లుగా చేసుకొని రూపొందించిన యూత్‌ఫుల్, కామెడీ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ సంతాన ప్రాప్తిరస్తు. తండ్రి కూతురు మధ్య డ్రామా, క్యూట్ లవ్ స్టోరి, ఆర్గానిక్ కామెడీ అంశాలు ఈ సినిమాకు ప్లస్‌గా మారాయి. విక్రాంత్, చాందిని చౌదరి తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు. ఇక కథలో మురళీధర్ గౌడ్ ట్రాక్ చాలా రొటీన్ గా, రెగ్యులర్‌గా ఉంటుంది. ఇక వెన్నెల కిషోర్, అభినవ్, తరుణ్ భాస్కర్ కామెడీ హాయిగా నవ్వుకొనేలా ఉంటుంది. ఓవరాల్ గా కాన్సెప్ట్ పరంగా మెప్పిస్తుంది కానీ, రెగ్యులర్ మూవీ లవర్స్ ని కమర్షియల్ గా ఆకట్టుకోదు. కొత్త కాన్సెప్ట్ ఆశించే ఆడియన్స్ కి ఓ మోస్తరు కనెక్ట్ అవుతుంది. ఓవరాల్ గా పెద్దగా అంచనాలు లేకుండా వెళ్తే రెండు గంటలపాటు హాయిగా నవ్వుకొని వచ్చేలా డీసెంట్ గా సంతాన ప్రాప్తిరస్తు ఉంటుంది.
Santhana Prapthirasthu movie Review
చిన్న చిన్న కాన్సెప్టులతో సినిమాలు చేయడం అంత ఈజీ ఏం కాదు. కథనంలో దమ్ముండాలి. క్యారెక్టరైజేషన్లు కొత్తగా ఉండాలి. అప్పుడే కాన్సెప్టులు కథలవుతాయి. కథలు సినిమాలుగా మారతాయి. ‘సంతాప ప్రాప్తిరస్తు’ కూడా కాన్సెప్టుని నమ్ముకొన్న కథే. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ చాలా సున్నితమైనది. దాన్ని ఎక్కడా అసభ్యత లేకుండా చూపించగలిగాడు దర్శకుడు. ఈ విషయంలో మాత్రం మెచ్చుకోవాల్సిందే. రైటింగ్ పరంగా ఇంకాస్త స్ట్రాంగ్ గా ఉండాల్సింది. ముఖ్యంగా ఎంటర్‌టైన్‌మెంట్ సీన్లపై బాగా కసరత్తు చేయాల్సింది. విక్కీ డోనర్ సినిమా వచ్చి పుష్కరం దాటింది. ఇలాంటప్పుడు మళ్లీ అలాంటి కథతో ఓ సినిమా చేస్తున్నామంటే.. కథనంలో, పాత్రల చిత్రణలో వైవిధ్యం చూపించాల్సిందే. ఈ విషయంలో ‘సంతాన ప్రాప్తిరస్తు’ కాస్త వెనకబడింది. అయితే విక్రాంత్, చాందిని సహా ఇతర నటీనటులు తమ వంతు న్యాయం చేసారు. ఓవరాల్ గా అక్కడక్కడ కొన్ని నవ్వుల కోసం, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు తమపై తాము వేసుకొనే సెటైర్ల కోసమైతే ఈ సినిమా చూడొచ్చు.
Santhana Prapthirasthu movie Review
సంతానలేమి అనేది సెన్సిబుల్ సబ్జెక్ట్. ఇదే కాన్సెప్ట్ కి కొంత ఫన్, ఎమోషన్స్ ని జోడించి సంతాన ప్రాప్తిరస్తు మూవీని రూపొందించారు దర్శకుడు సంజీవ్ రెడ్డి. కాంటెంపరరీ అంశాలను ఇందులో బాగా చూపించారు. అయితే డైరెక్టర్ ఈ టాపిక్ ని నీట్ గా ప్రెజెంట్ చేసాడు గాని, ఆడియన్స్ కి కాన్సెప్ట్ బోర్ కొట్టేసింది. ఇంట్రెస్టింగ్ గా సెకండ్ హాఫ్ లేకపోవడం, బోరింగ్ క్లైమాక్స్ వల్ల కొంతవరకు ఆడియన్స్ డిస్సపాయింట్ అవుతారు. టెక్నికల్ గా సినిమాకి సునీల్ కశ్యప్ మ్యూజిక్ ప్లస్‌గా చెప్పొచ్చు. మహిరెడ్డి పండుగుల కెమెరా వర్క్ కలర్‌ఫుల్ గా ఉంది. ఆర్ట్ వర్క్ సైతం ఆకట్టుకుంది. సాయికృష్ణ గనల ఎడిటింగ్ కొంత ట్రిమ్ చేయోచ్చు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ రిచ్‌గా ఉన్నాయి. దర్శకుడు సంజీవ్ రెడ్డి ఎంచుకున్న కథ బాగుంది. కానీ ఆశించిన స్థాయిలో సినిమాలో ఫన్ వర్కౌట్ కాలేదు. ఎమోషన్స్ వరకు వర్కౌట్ అయ్యాయి, కానీ ఇంకా బాగా చెప్పాల్సింది. కాకపోతే లవ్ స్టోరీలో ఎమోషన్ ని, తండ్రికూతుళ్ల మధ్య అనుబంధాన్ని మరింత బలంగా చూపిస్తే బాగుండేది.
Santhana Prapthirasthu Movie Review
పెళ్లి చేసుకున్నామా? పిల్లల్ని కన్నామా? అన్నదే కాకుండా.. సంతానం విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే ఎలాంటి సమస్యలు వస్తాయి అనే విషయాన్ని కళ్లకి కట్టారు. చూడ్డానికి ఫన్‌గానే అనిపించినా కూడా.. తేడా కొడితే స్పెర్మ్ కౌంట్ కొట్టేస్తాది జాగ్రత్త అని అలర్ట్ చేసిన సినిమా ‘సంతాన ప్రాప్తిరస్తు’. సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్‌గా విక్రాంత్ బాగానే సెట్ అయ్యాడు. తెలుగు హీరోయిన్ చాందిని చౌదరి.. తనకి ఏ పాత్ర ఇచ్చినా కూడా బాగా ఓన్ చేసుకుంటుంది. అటు తండ్రికి ఇటు భర్తకి మధ్య నలిగిపోయే పాత్రలో మెప్పించింది చాందినీ చౌదరి. అయితే స్క్రీన్ ప్లే పరంగా బాగా స్లో అయింది. సాంకేతికంగా.. భారీ ఆర్భాటాలు లేకుండా కథకి తగ్గట్టుగానే మ్యూజిక్, కెమెరావర్క్, మిగిలిన సెటప్ అంటా బాగా కుదిరింది. మహిరెడ్డి పండుగల కెమెరా వర్క్, మధుర శ్రీధర్ రెడ్డి నిర్మాణ విలువలు బాగున్నాయి. ఓవరాల్‌గా.. సంతాన సమస్యతో బాధపడే యువ జంటలు ఈ కథకి కనెక్ట్ అవ్వొచ్చు.
Browse by Reviewer Category
Discover reviews from different types of critics and publications
News Channel
Movie-specific media and publications
Twitter Channel
Website
Youtube Channel
CA/Advocate
Corporate (Non IT) Employee
Doctor/Health Worker
Freelancer & Consultant
Homemaker / Housewives
Women managing households
Influencer
IT Employee
Journalists & Critics
Private Employee
Small Business Owner
Less than 20 team size
Students & Youth
School students, college students, young viewers