Register as a Reviewer

Movie Reviews

Professional reviews and ratings from top critics and publications worldwide

1647
Total Reviews
112
Movies Reviewed
24
Reviewer Categories
Active filters:
Showing 961-972 of 1647 reviews

Peddi Movie Review

5.0
out of 10
పెద్ది మూవీ ఎలా ఉందిరా అంటే నాకైతే నచ్చలేదు.. సినిమా గురించి చెప్పాలంటే సెట్టు సినిమా అనిపించింది.. అనే ప్రతి సీన్ న్యాచురల్ అని చెప్పి సెట్స్ వేసి తీశారు... అది మేజర్ మైనస్. రామ్ చరణ్ లాంటి స్టార్ ని పెట్టుకుని పాన్ ఇండియా మూవీ అని 300 కోట్లు పెట్టి తీసారని చెప్తే నమ్మేట్టు లేదు మూవీ క్వాలిటీ. నా ఫ్రస్టేషన్ ఏంటంటే గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేసి మరి ఎక్కువ టికెట్ రేట్లకు పర్మిషన్ తెచ్చుకున్నార...

పెద్ది మూవీ ఎలా ఉందిరా అంటే నాకైతే నచ్చలేదు.. సినిమా గురించి చెప్పాలంటే సెట్టు సినిమా అనిపించింది.. అనే ప్రతి సీన్ న్యాచురల్ అని చెప్పి సెట్స్ వేసి తీశారు... అది మేజర్ మైనస్. రామ్ చరణ్ లాంటి స్టార్ ని పెట్టుకుని పాన్ ఇండియా మూవీ అని 300 కోట్లు పెట్టి తీసారని చెప్తే నమ్మేట్టు లేదు మూవీ క్వాలిటీ. నా ఫ్రస్టేషన్ ఏంటంటే గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేసి మరి ఎక్కువ టికెట్ రేట్లకు పర్మిషన్ తెచ్చుకున్నారు. మరి ఆ రేంజ్ క్వాలిటీ ఇచ్చారా అంటే లేదు. సినిమా మొత్తం ఎలివేషన్లు, బోల్డ్ సీన్లు అస్సలు నచ్చలేదు. 


ఇక సినిమాలో హీరో చేత కొన్ని బోల్డ్ డైలాగ్స్ చెప్పించారు అది చాలా వల్గర్ గా అనిపించింది. అండ్ నాకు తెలిసిన నార్త్ ఛానెల్ లో సినిమాలో వల్గారిటీ ఎక్కువ ఉందని హీరోహీరోయిన్లను అడిగితే మాకు తెలీదు అన్నారు అది మరింత నచ్చలేదు. ఎందుకంటే హీరోహీరోయిన్లు ఫైనల్ ఔట్ పుట్స్ చూడరా? ఆ మాత్రం తెలీదా? దీనికి బుచ్చిబాబు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అండ్ సినిమాలో హీరో అన్ని స్పోర్ట్స్ ఎంట్రీ ఇవ్వగానే అలా గెలిచేస్తూ ఉంటాడు. అది కూడా అస్సలు నచ్చలేదు. ఎందుకంటే చిన్నప్పట్నుంచి చాలా మంది వాళ్లకిష్టమైన స్పోర్ట్స్ లో సాధించాలని ట్రై చేస్తుంటే, హీరో మాత్రం ఎంట్రీ ఇవ్వగానే కొన్ని రోజులకే గెలిచేస్తుంటాడు. ప్రాక్టికల్ గా అలా ఎలా కుదురుతుంది. సో ఫైనల్లి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ సినిమాలో ఊరి ఎమోషన్ ని వాడుకుని రొటీన్ కమర్షియల్ ని దించారు అనిపిస్తుంది. అందుకే నాకస్సలు నచ్చలేదు.

Jun 06, 2026 Hindi +4

Peddi Movie Review

6.0
out of 10
పెద్ది మూవీ ఇప్పుడే చూసాను. ఈ సినిమాలో రామ్ చరణ్ గారు, రెహమాన్ గారు లేకపోతే ఈ సినిమా వేరే లెవెల్ డౌన్ అయ్యేది. ప్రాబ్లెమ్ ఏంటంటే సినిమాలో అంత కథ మెటీరియల్ ఇవ్వలేదు. ముందుగా ప్లస్ పాయింట్స్ చెప్పాలంటే బిగ్గెస్ట్ ప్లస్ రామ్ చరణ్. చాలా చాలా కష్టపడ్డారు. సినిమాకి బ్యాక్ బోన్ అయ్యారు. యాక్టింగ్ పరంగానే కాకుండా, ఫిజికల్ గా కూడా బెస్ట్ ఇచ్చారు. అండ్ రెహమాన్ కూడా అదిరిపోయే బీజీఎమ్ తో ప్రతి ఫ్రేమ్ ని ఎలివే...

పెద్ది మూవీ ఇప్పుడే చూసాను. ఈ సినిమాలో రామ్ చరణ్ గారు, రెహమాన్ గారు లేకపోతే ఈ సినిమా వేరే లెవెల్ డౌన్ అయ్యేది. ప్రాబ్లెమ్ ఏంటంటే సినిమాలో అంత కథ మెటీరియల్ ఇవ్వలేదు. ముందుగా ప్లస్ పాయింట్స్ చెప్పాలంటే బిగ్గెస్ట్ ప్లస్ రామ్ చరణ్. చాలా చాలా కష్టపడ్డారు. సినిమాకి బ్యాక్ బోన్ అయ్యారు. యాక్టింగ్ పరంగానే కాకుండా, ఫిజికల్ గా కూడా బెస్ట్ ఇచ్చారు. అండ్ రెహమాన్ కూడా అదిరిపోయే బీజీఎమ్ తో ప్రతి ఫ్రేమ్ ని ఎలివేట్ చేసాడు. బట్ ఫస్ట్ హాఫ్ లో మూడు నాలుగు సీన్లు మాత్రమే బాగున్నాయి. అండ్ ఆర్టిస్టులు ఒక్కరికి కూడా లిప్ సింక్స్ కుదరలేదు.


సెకండ్ హాఫ్ లో సినిమా ఒక రకంగా వెళ్తా ఉంటది. అండ్ జాన్వికపూర్ క్యారెక్టర్ వరెస్ట్ గా డిజైన్ చేసారు. అండ్ రామ్ బుజ్జి క్యారెక్టర్ లో దివ్యేన్దు ని ఎందుకు తీసుకున్నారో కూడా తెలీదు. ఓవరాల్ గా మంచి స్పోర్ట్స్ డ్రామాగా ఉండాల్సిన ఈ సినిమాని పెద్ద హీరో ఉన్నాడని, కమర్షియల్ ఎలిమెంట్స్ ఆడ్ చేసి చెడగొచ్చారు బుచ్చిబాబు. littirally రామ్ చరణ్ సినిమాని కాపాడాడు. అలాగే జగపతి బాబు, శివన్న చాలా ప్లస్ అయ్యారు. బుచ్చిబాబు ఏం చెప్పాలనుకొన్నాడో తెలీదు గాని అంతా సగం సగం కనెక్ట్ అయ్యింది. ఓవరాల్ గా నాకు యావరేజ్ గా అనిపించింది. 

Jun 05, 2026 Hindi +4

Peddi Movie Review

9.0
out of 10
ఇప్పుడే పెద్ది చూసొచ్చా. హార్ట్ ఫుల్ గా నాకనిపించింది చెప్తా.. ఫస్ట్ ఈ సినిమా చూసిన తర్వాత ఎవరైనా వాంటెడ్ గా ఒక వేళ వేరే హీరో ఫ్యాన్స్, రామ్ చరణ్ అంటే నచ్చని ఫ్యాన్స్ కి కూడా ఈ సినిమాలో రామ్ చరణ్ యాక్టింగ్ చూసిన తర్వాత, వాంటెడ్ గా నెగిటివ్ చేద్దామని అనుకున్నవాళ్ళు కూడా నెగిటివ్ చేయలేకపోతారు. ప్రతి జెన్యూన్ మూవీ లవర్స్ కి ఈ సినిమా తెగ నచ్చేస్తుంది. సో సినిమా విషయానికి వస్తే ఒక మంచి మెసేజ్ ఓరియెంటెడ...

ఇప్పుడే పెద్ది చూసొచ్చా. హార్ట్ ఫుల్ గా నాకనిపించింది చెప్తా.. ఫస్ట్ ఈ సినిమా చూసిన తర్వాత ఎవరైనా వాంటెడ్ గా ఒక వేళ వేరే హీరో ఫ్యాన్స్, రామ్ చరణ్ అంటే నచ్చని ఫ్యాన్స్ కి కూడా ఈ సినిమాలో రామ్ చరణ్ యాక్టింగ్ చూసిన తర్వాత, వాంటెడ్ గా నెగిటివ్ చేద్దామని అనుకున్నవాళ్ళు కూడా నెగిటివ్ చేయలేకపోతారు. ప్రతి జెన్యూన్ మూవీ లవర్స్ కి ఈ సినిమా తెగ నచ్చేస్తుంది. సో సినిమా విషయానికి వస్తే ఒక మంచి మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ. 


ఫస్ట్ ఈ మూవీలో ఇద్దరు హీరోలు. ఒకరు రామ్ చరణ్ గారు, నెంబర్ 2 హీరో ఎఆర్ రహ్మాన్ గారు, సోషల్ మీడియాలో రహ్మాన్ మీద వచ్చిన నెగిటివ్ చూసి ఏదో అనుకున్నాం, గాని, సినిమాలో ప్రతి సీన్ కి అదిరిపోయే ఎలివేషన్లతో పర్ఫెక్ట్ బీజీఎమ్ ఇచ్చాడు రెహమాన్. సినిమాలో నచ్చని పార్ట్ ఏదైనా ఉందంటే అది హీరోయిన్ పార్ట్. అండ్ సినిమాలో జగపతిబాబు, శివరాజ్ కుమార్ క్యారెక్టర్స్ కూడా చాలా బాగున్నాయి. అసలు సినిమాలో హీరోయిన్ రోల్ తప్ప, ఇది బాగాలేదని ఏం చెప్పలేం అంత బాగుంది పెద్ది సినిమా. కానీ డిస్సపాయింట్ ఏంటంటే ఒక 10 పెర్సెంట్ మూవీలో సీన్స్ గురించి ఇన్ఫర్మేషన్ లీక్ అయ్యాయి. అందువల్ల కొన్ని సీన్స్ ముందే తెలిసిపోయి ఫీల్ మిస్ అయ్యాను. అవి తప్పితే అన్ని బాగున్నాయి మావ. ఓవరాల్ గా సినిమాని తప్పకుండా మీ ఫ్యామిలీతో చూసేయండి. 

Jun 05, 2026 Hindi +4

Peddi Movie Review

8.0
out of 10
పెద్ది గాడు ఆడాడు, పోరాడాడు, ఖచ్చితంగా గెలిచాడు. ఇది చాలా రూటెడ్ స్టోరీ అండ్ చాలా ఎమోషన్స్ తో కూడుకున్న జెన్యూన్ ఈ మూవీ. ఈ సినిమాలో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మన బుచ్చిబాబు, రామ్ చరణ్, రహ్మాన్, రత్నవేలు వాళ్ళ బెస్ట్ వర్క్ తో మనకు కనిపిస్తే వుంటారన్నమాట. సినిమాలో కొన్ని బోరింగ్ సీన్స్ కూడా ఉంటాయి, అలాగే జాన్వికపూర్ రోల్ కూడా అంతగా ఎక్కలేదు. అలాగే స్టోరీ కూడా చాలా సింపుల్ గా తీసుకున్నాడు బుచ్చి. ఇవి తప...

పెద్ది గాడు ఆడాడు, పోరాడాడు, ఖచ్చితంగా గెలిచాడు. ఇది చాలా రూటెడ్ స్టోరీ అండ్ చాలా ఎమోషన్స్ తో కూడుకున్న జెన్యూన్ ఈ మూవీ. ఈ సినిమాలో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మన బుచ్చిబాబు, రామ్ చరణ్, రహ్మాన్, రత్నవేలు వాళ్ళ బెస్ట్ వర్క్ తో మనకు కనిపిస్తే వుంటారన్నమాట. సినిమాలో కొన్ని బోరింగ్ సీన్స్ కూడా ఉంటాయి, అలాగే జాన్వికపూర్ రోల్ కూడా అంతగా ఎక్కలేదు. అలాగే స్టోరీ కూడా చాలా సింపుల్ గా తీసుకున్నాడు బుచ్చి. ఇవి తప్ప మిగతా అన్నిటికి ఆడియన్స్ కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. 


నా వరకు చెప్పాలంటే ఆడియన్స్ ఇందులో ఉన్న ఎమోషన్స్ కి కనెక్ట్ అయితే సినిమా ఎంత ల్యాగ్ ఉన్నా కనెక్ట్ అవుతుంది. అయితే సెకండ్ హాఫ్ లో కాస్త ల్యాగ్ అయి ఫ్లో దెబ్బతింటుంది అనుకున్నా, ఈ సినిమా క్లైమాక్స్ వరకు చాలా ఎమోషనల్ గా, ఎంగేజింగ్ గా పట్టుకెళ్ళాడు బుచ్చిబాబు. అండ్ సినిమాలో రామ్ చరణ్ చితక్కొట్టి, ఉతికారేసాడు అని చెప్పొచ్చు. every సీన్ లో తన బెస్ట్ వర్క్ ఇచ్చాడు. అండ్ జగపతి బాబు రోల్ సినిమాలో story టర్న్ చేసే రోల్. అలాగే శివన్న రోల్ ఇంపాక్ట్ చాలా ఉంటుంది. ఎఆర్ రెహమాన్ కూడా తన బెస్ట్ వర్క్ ఇచ్చారు. ఓవరాల్ గా బుచ్చిబాబు టెక్నిషియన్స్, అండ్ యాక్టర్స్ నుండి అన్ని రకాలుగా టాలెంట్ ని పిండుకుని ది బెస్ట్ రూటెడ్ స్టోరీ ఉన్న మూవీ ఇచ్చాడు డైరెక్టర్. సింగల్ వర్డ్ లో చెప్పాలంటే ఈ మూవీలో ఎమోషన్ కి కనెక్ట్ అయితే పెద్ది గాడ్ని గుండెలలో పెట్టుకుని ఆడియన్స్ థియేటర్ బైటికి వస్తారు. 

Jun 05, 2026 Hindi +4

Peddi movie Review

8.0
out of 10
పెద్ది సినిమా గురించి చెప్పాలంటే గుడ్ బాగుంది సినిమా. మంచి కమర్షియల్ సినిమా, మంచి ఎమోషన్స్ ఉన్న సినిమా. స్పెషల్లీ క్లైమాక్స్ చాలా ఎమోషనల్ గా కనెక్టివ్ గా ఉంటది. ఇక సాంగ్స్ కూడా బాగున్నాయి. కానీ ఐటెం సాంగ్ సినిమాకి అవసరం లేదనిపిస్తుంది. సినిమాలో హీరో తన ఆత్మగౌరవం కోసం ఎంతవరకైనా వెళ్తాడు. కథ కోర్ పాయింట్ కూడా ఇదే. ఇక బుచ్చిబాబు స్క్రీన్ ప్లే కూడా బాగుంటది. బేసిగ్గా ఇదంతా ఒక రైలు కథ. సినిమాలో చాలా థి...

పెద్ది సినిమా గురించి చెప్పాలంటే గుడ్ బాగుంది సినిమా. మంచి కమర్షియల్ సినిమా, మంచి ఎమోషన్స్ ఉన్న సినిమా. స్పెషల్లీ క్లైమాక్స్ చాలా ఎమోషనల్ గా కనెక్టివ్ గా ఉంటది. ఇక సాంగ్స్ కూడా బాగున్నాయి. కానీ ఐటెం సాంగ్ సినిమాకి అవసరం లేదనిపిస్తుంది. సినిమాలో హీరో తన ఆత్మగౌరవం కోసం ఎంతవరకైనా వెళ్తాడు. కథ కోర్ పాయింట్ కూడా ఇదే. ఇక బుచ్చిబాబు స్క్రీన్ ప్లే కూడా బాగుంటది. బేసిగ్గా ఇదంతా ఒక రైలు కథ. సినిమాలో చాలా థింగ్స్ ఉంటాయి. కానీ సెకండ్ హాఫ్ లో ల్యాగ్ ఎక్కువైందనిపిస్తుంది. ఎండింగ్ మాత్రం పర్ఫెక్ట్ గా ఉంటది. 


అయితే ఇండియాలో చాలా ఊళ్లలో సినిమాలో చూపించిన ప్రాబ్లెమ్ ఉంటది. అందుకే ఊరి వాళ్లకు ఈ సినిమా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ సినిమాలో చాలా సీన్స్ ఊహించినట్టే ఉంటాయి, కానీ కొన్ని సీన్స్ అన్ ఎక్స్పెటెడ్ గా ఉంటాయి. ఇక మ్యూజిక్ మీద కూడా ఏఆర్ రెహమాన్ గట్టి ఎఫర్ట్ పెట్టారు. రామ్ చరణ్ నెవర్ బిఫోర్ రేంజ్ లో బాగా చేసారు. ఇక శివన్న, జగపతి బాబుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జాన్వీ కపూర్ కె సరైన రోల్ లేదు. డైరెక్షన్ పరంగా సింపుల్ కథనే తీసుకున్నా, బుచ్చిబాబు బాగానే హ్యాండిల్ చేసారు. అయితే హిందీలో ప్రాపర్ రిలీజ్ ఉంటె సినిమా రేంజ్ వేరేలా ఉండేది. అయినా లాంగ్ రన్ లో క్లిక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక పెద్ది కి నా రేటింగ్ 4.3/5

Jun 05, 2026 Hindi +4

Peddi Movie Review

Thyview

By Thyview

7.0
out of 10
పెద్ది ఎలా అనిపించిందంటే... ముందుగా ఫస్ట్ షోల్డర్ మీద గద మోసినట్టు సినిమాని మోశాడు రామ్ చరణ్. మూవీ నుండి బయటికొచ్చాక కూడా చరణ్ మాత్రమే గుర్తొస్తాడు. ఎంతలా అంటే చరణ్ పెర్ఫార్మన్స్ గురించి వేలెత్తి మాట్లాడరు. కాకపోతే సినిమా కథలో కొత్తదనం లేదు. పలానా ఇలాంటి సీన్సే ఉండాలి, ఇలాగే కథ ఉండాలి అన్నట్టు చేసినట్టు ఉంది కానీ, ఆడియన్స్ ని ఇంపాక్ట్ చేసేలా లేదు. ఇక సీన్స్ గురించి చెప్పుకుంటే ఇంట్రో సీన్, సాంగ్స్...

పెద్ది ఎలా అనిపించిందంటే... ముందుగా ఫస్ట్ షోల్డర్ మీద గద మోసినట్టు సినిమాని మోశాడు రామ్ చరణ్. మూవీ నుండి బయటికొచ్చాక కూడా చరణ్ మాత్రమే గుర్తొస్తాడు. ఎంతలా అంటే చరణ్ పెర్ఫార్మన్స్ గురించి వేలెత్తి మాట్లాడరు. కాకపోతే సినిమా కథలో కొత్తదనం లేదు. పలానా ఇలాంటి సీన్సే ఉండాలి, ఇలాగే కథ ఉండాలి అన్నట్టు చేసినట్టు ఉంది కానీ, ఆడియన్స్ ని ఇంపాక్ట్ చేసేలా లేదు. ఇక సీన్స్ గురించి చెప్పుకుంటే ఇంట్రో సీన్, సాంగ్స్, ఫైట్స్ కూడా బానే ఉంటాయి. కానీ ఏదో మిస్ అవుతుందనిపిస్తుంది. 


ఇక సెకండ్ హాఫ్ లో కుస్తీ ఫైట్ సీన్ స్టార్ట్ అవగానే ఇక్కడినుండి సినిమా రియలిస్టిక్ గా ఉందనిపిస్తుంది. ఒక డివైన్ ఫీల్ వస్తుంది. బట్ బుచ్చిబాబు తన ఐడియాస్ స్క్రీన్ పై సరిగా చెప్పలేదు ఏదో మిస్ అయిందనిపిస్తుంది. పైగా కొన్ని విఎఫెక్స్ షాట్స్ కూడా బాగాలేవు. లిప్ సింక్స్ అయితే కొంతమంది కి అస్సలు సెట్ అవలేదు. అండ్ 350 cr బడ్జెట్ అంటే నమ్మేలా లేదు. ఎందుకంటే చాలా వరకు సెట్స్ వేసి తీశారు. ఇక జాన్వీ కపూర్ అచ్చియమ్మ ట్రాక్ కూడా అంత లేదు. ఇక విజువల్స్ గా సినిమా బాగుంది. జగపతి బాబు, శివన్న కూడా షైన్ అయ్యారు. అయితే బుచ్చిబాబు ఐడియాస్ బాగున్నా దాని ఎక్స్యూగుషన్ అంత లేదు. కానీ సినిమాలో ఒక హానెస్టీ ఉంటది. కొంచెం లైట్ ఎక్స్పెక్టేషన్స్ తో మూవీకి వెళ్తే మంచి సినిమా అన్న సంతృప్తితో బైటికొస్తారు. 





Jun 04, 2026 Hindi +4

Peddi Movie Review

6.0
out of 10
Completed watching the movie: #Peddi’s final portion makes you emotional.It’s about a man who goes to any extent to bring identity and recognition to his village and its people.Ram Charan and the film deserve national awards.This is not an entertainment-oriented film; it’s an emotionally driven, content-rich film.It’s appreciable that a big star like Ram Charan took up such a content-driven projec...

Completed watching the movie:


#Peddi’s final portion makes you emotional.


It’s about a man who goes to any extent to bring identity and recognition to his village and its people.


Ram Charan and the film deserve national awards.


This is not an entertainment-oriented film; it’s an emotionally driven, content-rich film.


It’s appreciable that a big star like Ram Charan took up such a content-driven project.


Loved the English lyrics and the music that play in the background during #Peddi’s elevation sequences! A.R. Rahman’s score is absolutely top-notch.


Technically, #Peddi is brilliant!


On the whole, #Peddi is an inspirational film with solid box-office potential!


Jun 04, 2026 Hindi +4

Peddi Movie Review

6.0
out of 10
#Peddi A watchable commercial entertainer with an honest story that works in parts despite its regular template narration! The first half is fairly average with template commercial elements, and Jahnvi’s track doesn’t work. However, the stretch from the pre-interval to the end of Massa Massa is the film’s biggest highlight and is executed well. Post that, the film drags with ups and downs, though...

#Peddi A watchable commercial entertainer with an honest story that works in parts despite its regular template narration!


The first half is fairly average with template commercial elements, and Jahnvi’s track doesn’t work. However, the stretch from the pre-interval to the end of Massa Massa is the film’s biggest highlight and is executed well. Post that, the film drags with ups and downs, though the climax is wrapped up neatly.


Ram Charan is terrific and clearly carries the film. His transformation and effort are evident throughout. ARR’s music works well and is another highlight. Buchi Babu Sana succeeds in presenting an honest story, but the screenplay and editing could have been better.


Has its share of flaws, but can be watched with expectations in check for Ram Charan’s performance, the music, and the honest story.


Rating: 2.75/5

Jun 04, 2026 Hindi +4

Peddi movie Review

6.0
out of 10
పెద్ది… నా రేటింగ్.…… 3/5పెద్ది…కమర్షియల్ మాస్ ఎంటర్ టైనర్ కాదుసిన్సియర్ స్పోర్ట్స్ పర్సన్ బయోపిక్పెద్ది ఓ సీరియస్ అటెంప్ట్అబౌవ్ యావరేజ్ ఫస్ట్ హాఫ్కథ ఎలా డ్రయివ్ చేస్తే అలా వెళ్లిన సెకండాఫ్.…పెద్ది..రామ్ చరణ్ నమ్మకంపెద్ది...రెహమాన్..రత్నవేలు వర్క్పెద్ది..నిర్మాత ధైర్యంపెద్ది..దర్శకుడు బుచ్చిబాబు స్టామినా…అందరికీ నచ్చుతుందా? అన్నదే ప్రశ్న.పంచ్ లైన్... మళ్లీ చూడగలమా ఏంటీ !

పెద్ది… నా రేటింగ్.…… 3/5


పెద్ది…కమర్షియల్ మాస్ ఎంటర్ టైనర్ కాదు


సిన్సియర్ స్పోర్ట్స్ పర్సన్ బయోపిక్


పెద్ది ఓ సీరియస్ అటెంప్ట్


అబౌవ్ యావరేజ్ ఫస్ట్ హాఫ్


కథ ఎలా డ్రయివ్ చేస్తే అలా వెళ్లిన సెకండాఫ్.


…


పెద్ది..రామ్ చరణ్ నమ్మకం


పెద్ది...రెహమాన్..రత్నవేలు వర్క్


పెద్ది..నిర్మాత ధైర్యం


పెద్ది..దర్శకుడు బుచ్చిబాబు స్టామినా


…


అందరికీ నచ్చుతుందా? అన్నదే ప్రశ్న.


పంచ్ లైన్... మళ్లీ చూడగలమా ఏంటీ !

Jun 04, 2026 Hindi +4

Peddi Movie Review

7.0
out of 10
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంగా తెరకెక్కిన 'పెద్ది' భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'ఉప్పెన'తో దర్శకుడిగా తన ముద్ర వేసిన బుచ్చిబాబు సాన, ఈసారి పూర్తిగా భిన్నమైన కథను ఎంచుకుని ఒక గ్రామం ఆత్మగౌరవ పోరాటాన్ని స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఆవిష్కరించాడు. అయితే 'పెద్ది'ని కేవలం స్పోర్ట్స్ డ్రామాగా చెప్పడం సరైంది కాదు. ఇది ఒక గ్రామం ఆత్మగౌరవం కోసం పోరాడిన యు...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంగా తెరకెక్కిన 'పెద్ది' భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'ఉప్పెన'తో దర్శకుడిగా తన ముద్ర వేసిన బుచ్చిబాబు సాన, ఈసారి పూర్తిగా భిన్నమైన కథను ఎంచుకుని ఒక గ్రామం ఆత్మగౌరవ పోరాటాన్ని స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఆవిష్కరించాడు. అయితే 'పెద్ది'ని కేవలం స్పోర్ట్స్ డ్రామాగా చెప్పడం సరైంది కాదు. ఇది ఒక గ్రామం ఆత్మగౌరవం కోసం పోరాడిన యువకుడి కథ. అయితే బుచ్చిబాబు కథ రొటీన్ గా రాసుకున్నా, కొన్ని చోట్ల కథనం కాస్త నెమ్మదించిన భావన కలిగించినా, ప్రేక్షకుడు పాత్రలతో కనెక్ట్ అయ్యేలా స్క్రీన్‌ ప్లే సాగుతుంది.


ఇక ఇంటర్వెల్ బ్లాక్ సినిమాకు పెద్ద బలం. సెకండాఫ్‌లో కుస్తీ, అథ్లెటిక్స్, ఢిల్లీ ఎపిసోడ్స్, రాజకీయ వ్యవస్థతో పోరాటం, గ్రామ భవిష్యత్తు కోసం చేసే ప్రయత్నాలు ఎమోషనల్‌గా సాగుతాయి. ఇక సినిమాకి రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ నటన, బుచ్చిబాబు ఎమోషనల్ కథనం, 40 నిమిషాల క్లైమాక్స్, జగపతిబాబు, శివరాజ్‌కుమార్ పాత్రలతో పాటు ఏఆర్ రెహమాన్ నేపథ్య సంగీతం కూడా బిగ్ ప్లస్ అయింది. ఓవరాల్ గా "పెద్ది.. కేవలం ఒక ఆటగాడి కథ కాదు.. ఒక ఊరి గౌరవం కోసం సాగిన పోరాట గాథగా ఆడియన్స్ తప్పక చూడాల్సిన సినిమా ఇది. 

Jun 04, 2026 Hindi +4

Peddi Movie Review

7.0
out of 10
మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ పెద్ది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఇక ఊరి కోసం పోరాడే హీరో కథే ఈ పెద్ది. ఇక సినిమా మొత్తం రామ్ చరణ్ వన్ మ్యాన్ షోగా నడిపించాడు. పెద్ది పాత్రకి సంపూర్ణ న్యాయం చేసిన చరణ్ పెద్దిగా జీవించేసాడు. తనదైన హావభావాలతో భావోద్వేగమైన నటనతో మెప్పించాడు. ఇక జాన్వికపూర్ పాటలకే పరిమితమైంది. మిగతా నట...

మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ పెద్ది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఇక ఊరి కోసం పోరాడే హీరో కథే ఈ పెద్ది. ఇక సినిమా మొత్తం రామ్ చరణ్ వన్ మ్యాన్ షోగా నడిపించాడు. పెద్ది పాత్రకి సంపూర్ణ న్యాయం చేసిన చరణ్ పెద్దిగా జీవించేసాడు. తనదైన హావభావాలతో భావోద్వేగమైన నటనతో మెప్పించాడు. ఇక జాన్వికపూర్ పాటలకే పరిమితమైంది. మిగతా నటీనటులందరూ మెప్పించారు.


ఇక తెరపై హీరో రామ్ చరణ్ అయితే తెరవెనక నడిపించిన హీరో AR రెహ్మాన్. ఆయన రీ రికార్డింగ్ చాలా రీఫ్రెషింగ్‌గా అనిపించింది.. సినిమా స్థాయిని పెంచేసింది. రత్నవేలు సినిమాటోగ్రఫీ కూడా ఈ సినిమాకు ప్రాణం. నవీన్ నూలి ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్ గా ఉంటే బాగుండేది.. కానీ దర్శకుడు నిర్ణయం కాబట్టి అతడిని తప్పు పట్టడానికి లేదు. బుచ్చిబాబు తన వంతు ప్రయత్నం చాలా సిన్సియర్‌గా చేసాడు.. హీరో దొరికాడు కదా అని కమర్షియల్‌గా కాకుండా మంచి కథ చెప్పాడు. గ్రాఫిక్స్ విషయాల్లో అక్కడక్కడా చూసుకోవాల్సిందే. వృద్ధి సినిమాస్ నిర్మాణ విలువలు బాగున్నాయి. ఓవరాల్‌గా పెద్ది.. మనసును కదిలించే కొండ కింద ఊరోడి కథ..!


Jun 04, 2026 Hindi +4

Peddi Movie Review

Sakshi

By Sakshi

7.0
out of 10
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెద్ది’ భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ స్పోర్ట్స్ డ్రామా, తన ఊరి గుర్తింపు కోసం పోరాడే ఓ యువకుడి కథను భావోద్వేగంగా చూపించే ప్రయత్నం చేస్తుంది. ఇక సినిమాలో రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ పరంగా తన పాత్రకు పూర్తి న్యాయం చేస్తూ, యాక్షన్ మరియు ఎమోషనల్ సన్నివేశాల్లో ఆకట్టుకుంటాడు. ముఖ్యంగా క్లైమాక్స్ మ...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెద్ది’ భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ స్పోర్ట్స్ డ్రామా, తన ఊరి గుర్తింపు కోసం పోరాడే ఓ యువకుడి కథను భావోద్వేగంగా చూపించే ప్రయత్నం చేస్తుంది. ఇక సినిమాలో రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ పరంగా తన పాత్రకు పూర్తి న్యాయం చేస్తూ, యాక్షన్ మరియు ఎమోషనల్ సన్నివేశాల్లో ఆకట్టుకుంటాడు. ముఖ్యంగా క్లైమాక్స్ మరియు స్పోర్ట్స్ ఎపిసోడ్స్‌లో చరణ్ నటన ప్రేక్షకులను కదిలిస్తుంది. 


అయితే కథ పరంగా చూస్తే ఇది కొత్త కథ కాదు. కొన్ని సన్నివేశాలు ముందే ఊహించగలిగేలా ఉండగా, స్క్రీన్‌ప్లే కూడా కొంతవరకు రొటీన్‌గా అనిపిస్తుంది. టెక్నికల్‌గా ఎ.ఆర్. రెహమాన్ సంగీతం సినిమాకు పెద్ద బలంగా నిలిచింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఎమోషనల్ బ్లాక్స్‌ను మరింత ఎలివేట్ చేస్తుంది. ఓవరాల్‌గా ‘పెద్ది’ కొత్త కథ చెప్పకపోయినా, బలమైన ఎమోషన్స్, రామ్ చరణ్ అద్భుత నటన, స్పోర్ట్స్ డ్రామా ఎలిమెంట్స్‌తో మెప్పించే కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుంది.

Jun 04, 2026 Hindi +4
Why MRO?