Register as a Reviewer

Movie Reviews

Professional reviews and ratings from top critics and publications worldwide

531
Total Reviews
47
Movies Reviewed
24
Reviewer Categories
Active filters:
Showing 337-348 of 531 reviews
ప్రియదర్శి నటించిన ప్రేమంటే సినిమా ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. కథలో కొత్తదనం లేకపోవడం, నెమ్మదిగా సాగే కథనం ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. ప్రేమకథగా భావోద్వేగాలు బలంగా ఉండాల్సిన చోట చాలా సన్నివేశాలు ఫ్లాట్‌గా అనిపిస్తాయి. ప్రియదర్శి తన వంతు ప్రయత్నం చేసినప్పటికీ, పాత్రకు సరైన డెప్త్ లేకపోవడం వల్ల నటన పూర్తిగా మెరగలేదు. దర్శకుడు నవనీత్ రియలిస్టిక్ అప్రోచ్ తీసుకున్నా, స్క్రీన్‌ప్లే ప...

ప్రియదర్శి నటించిన ప్రేమంటే సినిమా ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. కథలో కొత్తదనం లేకపోవడం, నెమ్మదిగా సాగే కథనం ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. ప్రేమకథగా భావోద్వేగాలు బలంగా ఉండాల్సిన చోట చాలా సన్నివేశాలు ఫ్లాట్‌గా అనిపిస్తాయి. ప్రియదర్శి తన వంతు ప్రయత్నం చేసినప్పటికీ, పాత్రకు సరైన డెప్త్ లేకపోవడం వల్ల నటన పూర్తిగా మెరగలేదు. దర్శకుడు నవనీత్ రియలిస్టిక్ అప్రోచ్ తీసుకున్నా, స్క్రీన్‌ప్లే పేసింగ్‌పై పట్టులేకపోయినట్టు కనిపిస్తుంది. కొన్ని సీన్స్ అనవసరంగా లాగబడినట్టు అనిపిస్తాయి. పాటలు వినడానికి బాగున్నా కథను ముందుకు నడిపించడంలో పెద్దగా ఉపయోగపడలేదు. సినిమాటోగ్రఫీ, టెక్నికల్ విభాగాలు ఓకే అనిపించినా ప్రత్యేకంగా గుర్తుండిపోవు. నిర్మాతలు క్వాలిటీ మూవీ ఇవ్వాలనే ఉద్దేశంతో చేసిన ప్రయత్నం స్పష్టంగా ఉన్నా, మొత్తం మేకర్స్ టీమ్ కథ ఎంపిక, స్క్రీన్‌ప్లే మీద మరింత శ్రద్ధ పెట్టి ఉంటే ఫలితం భిన్నంగా ఉండేదేమో అన్న భావన మిగులుతుంది.

Jan 24, 2026 Telugu
5.0
out of 10
ఎలాగైనా ఈసారి సక్సెస్ కొట్టాలని మంచి లవ్ స్టోరీ తో ప్లస్ రోమ్ కామ్ డ్రామాతో "ప్రేమంటే" ఏంటో చెప్పాలని ఆడియన్స్ ముందుకు వచ్చాడు. అయితే సినిమాని చూస్తే మెయిన్ లీడ్స్ అయిన ప్రియదర్శి, ఆనంది పెర్ఫార్మన్స్ బాగానే ఉన్నా, మిగతా పాత్రలు తేలిపోతాయి. ప్రేమంటే మూవీ ఆడియన్స్ నుండి నెగిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. సినిమా కథ బానే అనిపిస్తుంది, నటీనటుల పెర్ఫార్మన్స్ బానే ఉంటుంది. కానీ స్టోరీ ఏం లేదనిపిస్తుంది. డ...

ఎలాగైనా ఈసారి సక్సెస్ కొట్టాలని మంచి లవ్ స్టోరీ తో ప్లస్ రోమ్ కామ్ డ్రామాతో "ప్రేమంటే" ఏంటో చెప్పాలని ఆడియన్స్ ముందుకు వచ్చాడు. అయితే సినిమాని చూస్తే మెయిన్ లీడ్స్ అయిన ప్రియదర్శి, ఆనంది పెర్ఫార్మన్స్ బాగానే ఉన్నా, మిగతా పాత్రలు తేలిపోతాయి. ప్రేమంటే మూవీ ఆడియన్స్ నుండి నెగిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. సినిమా కథ బానే అనిపిస్తుంది, నటీనటుల పెర్ఫార్మన్స్ బానే ఉంటుంది. కానీ స్టోరీ ఏం లేదనిపిస్తుంది. డైరెక్టర్ నవనీత్ శ్రీరామ్ స్టోరీ, స్క్రీన్ ప్లే పరంగా అస్సలు ఆకట్టుకోలేదు. అయినా సినిమా టెక్నిషియన్స్, సినిమాలో కమెడియన్స్ మూవీని కాపాడడానికి ట్రై చేస్తారు. కానీ థియేటర్లలో ఆడలేదు. నిర్మాతల కృషికి తగ్గ ఫలితం దక్కలేదని చెప్పాలి. అయితే ప్రేమంటే ఏంటో ఆడియన్స్ కి చెప్పాలని ప్రయత్నించినా మేకర్స్ ని ఆడియన్స్ మాత్రం ఆదుకోలేదు.

Jan 24, 2026 Telugu
టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ హీరోల్లో ఒకరైన ప్రియదర్శి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ప్రేమంటే థియేటర్లో విడుదలై నెగిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. మెయిన్ లీడ్స్ అయిన ప్రియదర్శి, ఆనంది పెర్ఫార్మన్స్ పరంగా మెప్పించినా, డైరెక్టర్ స్టోరీ స్క్రీన్ ప్లే పరంగా ఆకట్టుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఇతర పాత్రలు కూడా సినిమాలో పేలవంగా అనిపిస్తాయి. విశ్వనాథ్ రెడ్డి, లియోన్ జేమ్స్ పనితీరు ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన...

టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ హీరోల్లో ఒకరైన ప్రియదర్శి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ప్రేమంటే థియేటర్లో విడుదలై నెగిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. మెయిన్ లీడ్స్ అయిన ప్రియదర్శి, ఆనంది పెర్ఫార్మన్స్ పరంగా మెప్పించినా, డైరెక్టర్ స్టోరీ స్క్రీన్ ప్లే పరంగా ఆకట్టుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఇతర పాత్రలు కూడా సినిమాలో పేలవంగా అనిపిస్తాయి. విశ్వనాథ్ రెడ్డి, లియోన్ జేమ్స్ పనితీరు ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా కనిపిస్తుంది. కానీ పాటలు అంతగా ఆకట్టుకొనేలా ఉండవు. సెకండాఫ్‌లో ఎడిటర్ రాఘవేంద్ర చాలా సీన్స్ ని ఎడిట్ చేయాల్సింది. ఇక నిర్మాతలు జాన్వీ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు అనుసరించిన నిర్మాణ విలువలు భారీగా ఉన్నా, వాటికి తగ్గ ఫలితం తెర మీద కనిపించదు. మెదడుకు పనిపెట్టకుండా సినిమాను నార్మల్ గా చూస్తే ఏమైనా నచ్చుతుందేమో గాని, కొత్తదనం కోరుకునే ఆడియన్స్ కి ప్రేమంటే రెండు గంటలపాటు ప్రేక్షకుడికి కఠిన పరీక్షే.

Jan 24, 2026 Telugu
ప్రియదర్శి ,ఆనంది జంటగా నటించిన ప్రేమంటే థియేటర్లలో నెగిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. కామెడీ డ్రామా బాగానే ఉన్నా, కొత్తదనం లేకపోవడంతో ఆడియన్స్ పెదవి విరిచారు. ముఖ్యంగా దర్శకుడు నవనీత్ శ్రీరామ్ బలమైన కథా కథనాలు రాసుకోవడంలో విఫలమయ్యారు. స్క్రీన్ ప్లే పరంగా ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాడు డైరెక్టర్. ఇటు లియోన్స్ జేమ్స్ సంగీతం బానే ఉన్నా, బీజీఎమ్ ఇంప్రెస్ చేయలేదు. విశ్వనాథ్‌ రెడ్డి కెమెరా వర్క్ ఆకట...

ప్రియదర్శి ,ఆనంది జంటగా నటించిన ప్రేమంటే థియేటర్లలో నెగిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. కామెడీ డ్రామా బాగానే ఉన్నా, కొత్తదనం లేకపోవడంతో ఆడియన్స్ పెదవి విరిచారు. ముఖ్యంగా దర్శకుడు నవనీత్ శ్రీరామ్ బలమైన కథా కథనాలు రాసుకోవడంలో విఫలమయ్యారు. స్క్రీన్ ప్లే పరంగా ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాడు డైరెక్టర్. ఇటు లియోన్స్ జేమ్స్ సంగీతం బానే ఉన్నా, బీజీఎమ్ ఇంప్రెస్ చేయలేదు. విశ్వనాథ్‌ రెడ్డి కెమెరా వర్క్ ఆకట్టుకునేలా కలర్‌ఫుల్‌ గా ఉంది. రాఘవేంద్ర తిరున్‌ ఎడిటింగ్‌ వర్క్ తగ్గింది. పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు, జాన్వీ నారంగ్‌ నిర్మాణ విలువలు బాగున్నాయి. అయితే ఇందులో హీరోహీరోయిన్ల లవ్ కి కనెక్ట్ కానీ ఆడియన్స్ కనీసం కామెడీ వర్కౌట్‌ అయితే అయినా కనెక్ట్ అవుతారా అంటే, అందులోనూ కొత్తదనం లేకపోవడంతో ఆడియన్స్ కి నిరాశ తప్పదు. ఓవరాల్ గా దర్శకుడు నవనీత్‌ శ్రీరామ్‌ తీసుకున్న పాయింట్‌ ఫర్వాలేదు, కానీ దాన్ని తెరపై ఆవిష్కరించడంలో ఆయన తడబాటు కనిపిస్తుంది. ఆడియెన్స్ ని ఎంటర్‌టైన్‌ చేసేలా? ఎంగేజ్‌ చేసేలా ఈ మూవీని తెరకెక్కించలేకపోయారు.

Jan 24, 2026 Telugu
బలగం, కోర్ట్ లాంటి సినీమాల్లో హీరోగా మెప్పించిన ప్రియదర్శి ఈసారి ఒక రోమ్ కామ్ డ్రామా మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. "ప్రేమంటే" అనే టైటిల్ తో రిలీజ్ అయిన ఈ సినిమాలో ఆనంది హీరోయిన్ గా నటించింది. అయితే ఆడియన్స్ ని మెప్పించడంలో పూర్తిగా విఫలమైంది. దర్శకుడు నవనీత్ శ్రీరామ్ స్టోరీ, స్క్రీన్ ప్లే పరంగా పూర్తిగా విఫలమయ్యాడని చెప్పాలి. ప్రియదర్శి, ఆనంది పెర్ఫార్మన్స్ తో మెప్పించినా, అసలు వాళ్ళ మధ్యలో లవ్...

బలగం, కోర్ట్ లాంటి సినీమాల్లో హీరోగా మెప్పించిన ప్రియదర్శి ఈసారి ఒక రోమ్ కామ్ డ్రామా మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. "ప్రేమంటే" అనే టైటిల్ తో రిలీజ్ అయిన ఈ సినిమాలో ఆనంది హీరోయిన్ గా నటించింది. అయితే ఆడియన్స్ ని మెప్పించడంలో పూర్తిగా విఫలమైంది. దర్శకుడు నవనీత్ శ్రీరామ్ స్టోరీ, స్క్రీన్ ప్లే పరంగా పూర్తిగా విఫలమయ్యాడని చెప్పాలి. ప్రియదర్శి, ఆనంది పెర్ఫార్మన్స్ తో మెప్పించినా, అసలు వాళ్ళ మధ్యలో లవ్ ఉందా అన్న డౌట్ కొన్ని సిల్లీ సీన్స్ చూస్తే అనిపిస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ లియోన్ జేమ్స్ సంగీతం బాగుంది. విశ్వంత్ రెడ్డి సినిమాటోగ్రఫీ నీట్‌గా బాగుంది. ఎడిటింగ్ అంతగా ఏం లేదు. దర్శకుడు నవనీత్ శ్రీరామ్ ఆలోచన బాగున్నా ఆచరణ మాత్రం అస్సలు ఆకట్టుకోలేదు. అనుకున్న కథను ఎస్టాబ్లిష్ చేయడంలో బాగా తడబడ్డారు. ఓవరాల్ గా ఆడియన్స్ ని మెప్పించలేదు.

Jan 24, 2026 Telugu
ప్రియదర్శి హీరోగా ఆనంది హీరోయిన్ గా నటించిన ప్రేమంటే రీసెంట్ గా థియేటర్లలో రిలీజ్ అయి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. హీరోహీరోయిన్లు బాగానే నటించినా, కమెడియన్స్ మిగతా ఆర్టిస్టులు అతిగా చేసినట్టనిపిస్తుంది. యాక్షన్ బదులు ఓవరాక్షన్ చేశారు. ఒక్కరి నుంచి కూడా సరైన నటన రాబట్టుకోలేదు దర్శకుడు నవనీత్. హైపర్ ఆది, ఆటో రామ్ ప్రసాద్ కామెడీ బాగున్నా, ఇరికించినట్టు అనిపిస్తుంది. ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాలకి...

ప్రియదర్శి హీరోగా ఆనంది హీరోయిన్ గా నటించిన ప్రేమంటే రీసెంట్ గా థియేటర్లలో రిలీజ్ అయి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. హీరోహీరోయిన్లు బాగానే నటించినా, కమెడియన్స్ మిగతా ఆర్టిస్టులు అతిగా చేసినట్టనిపిస్తుంది. యాక్షన్ బదులు ఓవరాక్షన్ చేశారు. ఒక్కరి నుంచి కూడా సరైన నటన రాబట్టుకోలేదు దర్శకుడు నవనీత్. హైపర్ ఆది, ఆటో రామ్ ప్రసాద్ కామెడీ బాగున్నా, ఇరికించినట్టు అనిపిస్తుంది. ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాలకి సినిమాలో మంచి సీన్స్ ఉన్నా, ఆ సీన్స్ స్ట్రాంగ్ గా అనిపించవు. ఓవరాల్ గా డైరెక్టర్ ఈ సినిమాకు మేకింగ్ క్వాలిటీ విషయంలో తప్ప, కథా కథనాల విషయంలో మెప్పించలేదు. ఒకసారి చూడొచ్చు గాని, నవ్వుల కోసం చూస్తే ఏమాత్రం నచ్చదు, సరికదా చికాకు తెప్పిస్తుంది. ఒక్కటంటే ఒక్క సీన్ కూడా నవ్వించకపోగా మొత్తం మీద ప్రేమంటే... నవ్వులు అస్సలు లేవంతే!

Jan 24, 2026 Telugu
కమెడియన్ కం హీరో ప్రియదర్శి హీరోగా ఆనంది హీరోయిన్ గా నటించిన ప్రేమంటే రీసెంట్ గా థియేటర్లలో విడుదలై అంతగా ఆకట్టుకోలేకపోయింది. పెర్ఫామెన్స్ పరంగా ప్రియదర్శి ఆకట్టుకున్నప్పటికీ, ఇంపాక్ట్ అంతగా లేదు. అలాగే ఆనంది కూడా తన వరకూ బాగానే నటించినా ఎక్కడో ఏదో మిస్ అయిందనిపిస్తుంది. వీళ్ళ తర్వాత కీలక పాత్రలో నటించిన సుమ పాత్ర కూడా చాలా తేలిపోయింది. చాలా వరకు ఆ పాత్ర విసిగిస్తుంది. ఇక టెక్నికల్ గా కూడా "ప్రేమం...

కమెడియన్ కం హీరో ప్రియదర్శి హీరోగా ఆనంది హీరోయిన్ గా నటించిన ప్రేమంటే రీసెంట్ గా థియేటర్లలో విడుదలై అంతగా ఆకట్టుకోలేకపోయింది. పెర్ఫామెన్స్ పరంగా ప్రియదర్శి ఆకట్టుకున్నప్పటికీ, ఇంపాక్ట్ అంతగా లేదు. అలాగే ఆనంది కూడా తన వరకూ బాగానే నటించినా ఎక్కడో ఏదో మిస్ అయిందనిపిస్తుంది. వీళ్ళ తర్వాత కీలక పాత్రలో నటించిన సుమ పాత్ర కూడా చాలా తేలిపోయింది. చాలా వరకు ఆ పాత్ర విసిగిస్తుంది. ఇక టెక్నికల్ గా కూడా "ప్రేమంటే" బీలో యావరేజ్ గా కనిపిస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ లియోన్ జేమ్స్ పాటలు బాగా లేకున్నా, బీజీఎమ్ పర్లేదు. నవనీత్ శ్రీరామ్.. క్రేజీగా ఉండే కథను సెలెస్ట్ చేసుకున్నా, స్క్రీన్ ప్లే బాగా రాసుకోవడంలో తడబడ్డాడు. ప్రతివారం రెగ్యులర్ గా సినిమాలు చూసేవారు, కామెడీ సినిమాలు ఇష్టపడే వారు ఒక్కసారి ట్రై చేయొచ్చు.

Jan 24, 2026 Telugu
కొత్త దర్శకుడు నవనీత్ శ్రీరామ్ దర్శకత్వం వహించిన సినిమా ప్రేమంటే. టాలెంటెడ్ హీరో ప్రియదర్శి, ఆనంది జంటగా నటించిన ఈ సినిమా రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. క్రైమ్ రోమ్ కామ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో హీరోహీరోయిన్లు మంచి నటన కనబరిచారు. కాకపోతే వాళ్ళ మధ్య బలమైన సన్నివేశాలు రాసుకోవడంలో డైరెక్టర్ తడబడ్డాడు. యాంకర్ సుమ పాత్ర అక్కడక్కడా నవ్వించినా, కొత్తదనం లేని నవ్వురాని...

కొత్త దర్శకుడు నవనీత్ శ్రీరామ్ దర్శకత్వం వహించిన సినిమా ప్రేమంటే. టాలెంటెడ్ హీరో ప్రియదర్శి, ఆనంది జంటగా నటించిన ఈ సినిమా రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. క్రైమ్ రోమ్ కామ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో హీరోహీరోయిన్లు మంచి నటన కనబరిచారు. కాకపోతే వాళ్ళ మధ్య బలమైన సన్నివేశాలు రాసుకోవడంలో డైరెక్టర్ తడబడ్డాడు. యాంకర్ సుమ పాత్ర అక్కడక్కడా నవ్వించినా, కొత్తదనం లేని నవ్వురాని కామెడీ సీన్స్ ఎక్కువగా ఉన్నాయి. లియోన్ ఇచ్చిన మ్యూజిక్ కూడా యావరేజ్ గా ఉంది. కానీ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ మేకింగ్ క్వాలిటీ బాగుంది. అయితే రెగ్యులర్ మూవీ లవర్స్ ఒకసారి ట్రై చేయొచ్చు. కానీ అంచనాలు ఎక్కువగా పెట్టుకుంటే అంతగా ఇంప్రెస్ చేయకపోవచ్చు.

Jan 24, 2026 Telugu
నవనీత్ శ్రీరామ్ దర్శకత్వం వహించిన కొత్త సినిమా ప్రేమంటే. ప్రియదర్శి, ఆనంది హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా, ఒక క్రైమ్ రోమ్ కామ్ డ్రామాగా తెరకెక్కింది. అయితే ప్రేమ పెళ్లి కథ గా మొదలైన ఈ సినిమా క్లైమాక్స్ కి వచ్చే సరికి ఒక క్రైమ్ డ్రామాగా మారిపోతుంది. నటీనటులు మంచి పెర్ఫెర్మన్స్ చూపించినా, నాచురాలిటీ మిస్ అయింది. కమెడియన్స్ సుమ, వెన్నెల కిషోర్, హైపర్ ఆది, రామ్ ప్రసాద్ ఫన్ జెనరేట్ చేయడానికి బాగానే...

నవనీత్ శ్రీరామ్ దర్శకత్వం వహించిన కొత్త సినిమా ప్రేమంటే. ప్రియదర్శి, ఆనంది హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా, ఒక క్రైమ్ రోమ్ కామ్ డ్రామాగా తెరకెక్కింది. అయితే ప్రేమ పెళ్లి కథ గా మొదలైన ఈ సినిమా క్లైమాక్స్ కి వచ్చే సరికి ఒక క్రైమ్ డ్రామాగా మారిపోతుంది. నటీనటులు మంచి పెర్ఫెర్మన్స్ చూపించినా, నాచురాలిటీ మిస్ అయింది. కమెడియన్స్ సుమ, వెన్నెల కిషోర్, హైపర్ ఆది, రామ్ ప్రసాద్ ఫన్ జెనరేట్ చేయడానికి బాగానే కష్టపడ్డారు, కానీ అంతగా ఆకట్టుకోలేదు. దర్శకుడు నవనీత్ బోరింగ్ స్క్రీన్ ప్లే తో ఆడియన్స్ కి ల్యాగ్ ఫీల్ అయ్యేలా చేసాడు. అయితే క్వాలిటీ విషయంలో మేకర్స్ బానే కష్టపడ్డారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. లవర్ స్టోరీస్ ఇష్టపడే వాళ్ళు, రెగ్యులర్ మూవీస్ చూసే వారు ఒక్కసారి ట్రై చేయొచ్చు.

Jan 24, 2026 Telugu
ప్రియదర్శి, ఆనంది హీరో హీరోయిన్లుగా నటించిన ప్రేమంటే. కొత్త దర్శకుడు నవనీత్ శ్రీరామ్ తెరకెక్కించిన ఈ సినిమా ఒకక్రైమ్ రోమ్ కామ్ డ్రామాగా ఆడియన్స్ ని అలరిస్తుంది. లీడ్ జంట మంచి పెర్ఫామెన్స్ కనబరచగా, సుమ, వెన్నెల కిషోర్ తదితరులు కూడా ఆకట్టుకున్నారు. అయితే ఫస్ట్ హాఫ్ లో చూపించిన ఫన్ సెకండ్ హాఫ్ లో మైంటైన్ చేయలేకపోయారు మేకర్స్. స్క్రీన్ ప్లే బాగా లేకపోవడం వల్ల ఆడియన్స్ కి ల్యాగ్ ఫీలింగ్ వస్తుంది. మ్యూజ...

ప్రియదర్శి, ఆనంది హీరో హీరోయిన్లుగా నటించిన ప్రేమంటే. కొత్త దర్శకుడు నవనీత్ శ్రీరామ్ తెరకెక్కించిన ఈ సినిమా ఒకక్రైమ్ రోమ్ కామ్ డ్రామాగా ఆడియన్స్ ని అలరిస్తుంది. లీడ్ జంట మంచి పెర్ఫామెన్స్ కనబరచగా, సుమ, వెన్నెల కిషోర్ తదితరులు కూడా ఆకట్టుకున్నారు. అయితే ఫస్ట్ హాఫ్ లో చూపించిన ఫన్ సెకండ్ హాఫ్ లో మైంటైన్ చేయలేకపోయారు మేకర్స్. స్క్రీన్ ప్లే బాగా లేకపోవడం వల్ల ఆడియన్స్ కి ల్యాగ్ ఫీలింగ్ వస్తుంది. మ్యూజిక్ పరంగా లియోన్ పనితనం పర్లేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. పైగా కొత్తదనం లేకపోవడంతో రెగ్యులర్ మూవీ లవర్స్ ఇష్టపడే అవకాశం లేదు. మొత్తానికి ప్రియదర్శికి ఈ సినిమాతో కూడా సరైన సక్సెస్ దొరకడం కష్టమైపోయింది. కేవలం కామెడీ కోసం ఒకసారి ట్రై చేయాలనుకునే వారు ప్రేమంటే మూవీ ఒకసారి ట్రై చేయొచ్చు.

Jan 24, 2026 Telugu

Revolver Rita Movie Review

M

By Movies4U

4.0
out of 10
కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన రివాల్వర్ రీటా క్రైమ్ కామెడీ డ్రామాగా ఆడియన్స్ ముందుకు వచ్చింది. అయితే బలమైన కథా, కథనాలు లేకపోవడంతో అంతగా మెప్పించలేకపోయింది.

కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన రివాల్వర్ రీటా క్రైమ్ కామెడీ డ్రామాగా ఆడియన్స్ ముందుకు వచ్చింది. అయితే బలమైన కథా, కథనాలు లేకపోవడంతో అంతగా మెప్పించలేకపోయింది.

Jan 23, 2026 Telugu

Revolver Rita Movie Review

3.0
out of 10
ఎలాగైనా సక్సెస్ కొట్టాలని ఈసారి రివాల్వర్ రీటా గా ఆడియన్స్ ముందుకొచ్చింది కీర్తి సురేష్. క్రైమ్ థ్రిల్లర్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ ని మెప్పించలేకపోయింది.

ఎలాగైనా సక్సెస్ కొట్టాలని ఈసారి రివాల్వర్ రీటా గా ఆడియన్స్ ముందుకొచ్చింది కీర్తి సురేష్. క్రైమ్ థ్రిల్లర్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ ని మెప్పించలేకపోయింది.

Jan 23, 2026 Telugu
Why MRO?