Movie Reviews
Professional reviews and ratings from top critics and publications worldwide
అనుమానం పాత రోగం, అనుమానం పెనుభూతం అంటుంటారు. సరిగ్గా ఇదే పాయింట్ పై నడిచే మూవీ ఈ రావు బహదూర్. కథగా ఇది చాలా చిన్నపాయింట్. ఒక పెద్ద సినిమా చేసేంత బలమైన పాయింట్ అయితే కాదు, కానీ దాన్ని సినిమాగా తెరకెక్కించడంలో దర్శకుడు వెంకటేష్ మహా చేసిన ప్రయత్నం, ఆయన్ని నిర్మాతలు, హీరోహీరోయిన్లు నమ్మడం ఇక్కడ గొప్ప విషయం. ఒక కొత్తరకమైన పాయింట్ తో ఈ మూవీ తీయడాన్ని అభినందించాలి. కానీ తీసిన విధానం, చెప్పిన తీరుని మాత్రం ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది.
రామప్ప రావు బహదూర్‌గా సత్యదేవ్ ఇరగదీశాడు. విభిన్నమైన షేడ్స్ లో ఆయన అదరగొట్టారు. యంగ్ కుర్రాడిగా, మిడిల్ ఏజ్ వ్యక్తిగా, వృద్ధుడిగా పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు. దర్శకుడు వెంకటేష్ మహా మంచి కథలను తెరపై ఆవిష్కరిస్తూ ఆకట్టుకుంటారు. కానీ ఈ సారి మాత్రం ఆయన మెప్పించలేపోయాయి. ప్రయోగం మాత్రం చేశారని చెప్పొచ్చు. ప్రయోగం బాగుంది, కానీ ఆడియెన్స్ కి ఆకట్టుకునేలా చేయడంలో విఫలమయ్యారు. అనుమానం పెనుభూతం అన్నట్టు, ఇది ఆడియెన్స్ సహనాన్ని పరీక్షించే మూవీ అవుతుందని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు.
"అనుమానం పెనుభూతం" అనే సామెతను దర్శకుడు వెంకటేష్ మహా రెండు గంటలకు పైగా నిడివి ఉన్న రావు బహదూర్ సినిమాగా మలిచారు. సాధారణంగా మనిషిని బతికించేది గాలి, నీరు, ఆహారం అని అంటారు. కానీ ఈ సినిమాలో మాత్రం ఒక అనుమానం కూడా మనిషిని ఎలా బతికిస్తుందో, అదే సమయంలో లోపల నుంచి ఎలా నెమ్మదిగా చంపేస్తుందో దర్శకుడు చాలా లోతుగా చూపించాడు.
ప్లస్ పాయింట్స్.. సత్యదేవ్ అద్భుతమైన నటన వెంకటేష్ మహా రచన, దర్శకత్వం క్లైమాక్స్ ట్విస్ట్ బలమైన భావోద్వేగాలు కులం, వంశం, అనుమానం వంటి అంశాలపై లోతైన చర్చ సినిమాటోగ్రఫీ నేపథ్య సంగీతం నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్.. నెమ్మదిగా సాగే ఫస్ట్ హాఫ్ కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం DNA పరీక్షలకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు సినిమాటిక్‌గా అనిపించడం సాధారణ ప్రేక్షకులకు పూర్తిగా కనెక్ట్ కాకపోవచ్చు కొంత నిడివి ఎక్కువగా అనిపిస్తుంది. ఓవరాల్ గా ఒకసారి ట్రై చేయొచ్చు.
సాధారణ కమర్షియల్ సినిమాలకు పూర్తి భిన్నంగా తెరకెక్కిన 'రావు బహదూర్' ప్రేక్షకులను పరీక్షించే చిత్రంగా నిలుస్తుంది. ప్రారంభం నుంచే మిస్టరీతో కథను నడిపించిన దర్శకుడు, ప్రతి పాత్ర వెనుక ఒక రహస్యాన్ని దాచిపెడతాడు. అయితే ఆ ఆసక్తిని కొనసాగించే క్రమంలో కథనం మరీ క్లిష్టంగా మారిపోవడంతో ఫస్ట్ హాఫ్‌లోనే చాలా మందికి కన్ఫ్యూజన్ కలిగించే అవకాశం ఉంది.
సెకండాఫ్‌లో కథ కాస్త స్పష్టతకు వచ్చినా, ప్రేక్షకుడు అంతవరకు ఓపికగా ప్రయాణించాల్సిందే. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టులు సినిమాకు కొంత బలం చేకూర్చినా, మొత్తం ప్రయాణాన్ని పూర్తిగా సంతృప్తికరంగా మార్చలేవు. సత్యదేవ్ తన నటనతో మరోసారి ఆకట్టుకోగా, దర్శకుడు వెంకటేష్ మహా కొత్త తరహా కథ చెప్పాలనే ప్రయత్నం చేసిన విషయం స్పష్టంగా కనిపిస్తుంది.
మొత్తంగా, రెగ్యులర్ ఎంటర్‌టైనర్‌ను ఆశించే వారికి 'రావు బహదూర్' అంతగా నచ్చకపోవచ్చు. కానీ ప్రయోగాత్మక కథలు, నెమ్మదిగా విప్పుకునే మిస్టరీ డ్రామాలను ఇష్టపడే ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా ఒక విభిన్న అనుభూతిని అందిస్తుంది. ఫైనల్ గా టాలీవుడ్ లో ఇప్పటివరకు ట్రై చేయని రియలిజం మ్యాజిక్ తో కూడిన ఒక ఎంగేజింగ్ సైకలాజికల్ డ్రామా ఈ రావు బహదూర్.
సూపర్ స్టార్ మహేష్ బాబు రావు బహదూర్ సినిమాకు వెన్నుదన్నుగా నిలవడంతో ఉన్నట్టుండి క్రేజ్ పెరిగింది. మూవీ రిలీజ్ కు ముందు ఆయన వేసిన ట్వీట్ తో అంచనాలు పెరిగాయి. అయితే తెలుగు సినిమా చూడని కథ అంటూ చెప్పడంతో రావు బహదూర్ సినిమాపై క్యూరియాసిటీ పెరిగింది. తీరా చూస్తే చివరి 10 నిమిషాల క్లైమాక్స్ కోసం రెండున్నర గంటలపాటు సినిమాను సాగదీయడం అత్యంత నిరాశను, అసంతృప్తిని కలిగించే అంశంగా కనిపిస్తుంది. పేలవమైన సన్నివేశాలు ఉన్నప్పటికీ.. సత్యదేవ్ తన పెర్ఫార్మెన్స్‌తో సినిమా కంటెంట్‌ను కొంత మెరుగుపరిచాడు.
రావు బహదూర్ సినిమా గురించి ఫైనల్ గా చెప్పాలంటే.. డైరెక్టర్ ఆలోచించిన పాయింట్ బాగుంది. సమాజాన్ని ఆలోచింపజేసేలా ఉంది. కానీ ఆ పాయింట్ ను పూర్తిస్థాయి కథగా మార్చడంలో తడబాటు కనిపిస్తుంది. సినిమా కథ చెప్పడంలో తెలివి ఉండాలి. కానీ ఎక్కువ మేధావితనం ప్రదర్శించకూడదనే విషయం ఈ సినిమా చెబుతుంది. ఈ సినిమా ఫిలాసఫికల్ గా ఎమోషనల్ డ్రామా, ఈ డాక్టర్, పేషెంట్ డ్రామాను చూడాలంటే ఎక్కువ పెషన్స్ తప్పనిసరి. కేవలం సత్యదేవ్ పెర్ఫార్మెన్స్ కోసం ఈ సినిమాను చూడొచ్చు.
Director Venkatesh Maha earned widespread critical acclaim with films like C/o Kancharapalem and Uma Maheswara Ugra Roopasya. His reunion with Satyadev for Rao Bahadur, presented by Mahesh Babu, naturally generated considerable curiosity. Mahesh Babu even claimed that Telugu cinema had never seen a film made in this manner before.
Highlights
Satyadev’s terrific performance
The final twists and payoff
The portions after the police officer’s entry
Drawbacks
Uneven and slow-moving first half
Lengthy runtime
Self-indulgent narration in several stretches
Overall, Rao Bahadur is a sincere attempt to tell a story in a distinctive manner. The idea is admirable, and the climax justifies much of the film’s thematic ambition, with Satyadev delivering a performance worthy of applause. However, the painfully slow narration, overstretched screenplay and self-indulgent storytelling make it a tiresome watch. Those willing to invest patience may appreciate its intent, but for many viewers, the film’s pacing will prove to be a major hurdle.
'రావు బహదూర్' ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ప్రయోగాత్మక చిత్రం. రంగు, రూపం చూసి మనుషులను అంచనా వేయకూడదనే సందేశాన్ని చెప్పే ప్రయత్నం చేసింది. అయితే క్లిష్టమైన స్క్రీన్‌ప్లే, కన్ఫ్యూజింగ్ నేరేషన్ కారణంగా ఫస్ట్ హాఫ్ సాధారణ ప్రేక్షకులకు కనెక్ట్ కావడం కష్టమే.
సెకండాఫ్ లో కథ కాస్త పుంజుకుని, క్లైమాక్స్ లో వచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి. సత్యదేవ్ నటన సినిమాకు ప్రధాన బలం. మొత్తంగా, అందరికీ నచ్చే సినిమా కాకపోయినా... కొత్త తరహా కథలను ఇష్టపడే వారికి ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్ అందిస్తుంది. వెంకటేష్ మహా డైరెక్షన్ బావున్నా, స్క్రీన్ ప్లే ఒకింత డిస్సపాయింట్ చేస్తుంది. ఎంటర్టైన్మెంట్ మాత్రమే కావాలనుకునే ఆడియన్స్ ఈ సినిమాపై తక్కువ అంచనాలు పెట్టుకుని వెళ్తే మంచిది.
రావు బహదూర్ సినిమా గురించి చెప్పాలంటే... కథ పాయింట్ బాగుంటుంది. మెరిసేదంతా బంగారం కాదు.. నలుపు, తెలుపు అన్న తేడాతో వ్యక్తుల్ని భిన్నంగా చూడకూడదు.. అనే పాయింట్లను చెప్పే ప్రయత్నాన్ని వెంకటేష్ మహా చేసినట్టుగా అనిపిసిస్తుంది. కాకపోతే ఆ పాయింట్ ని కథగా మలిచి, సినిమా కోసం రాసుకున్న బ్యాక్ డ్రాప్, తీసిన విధానం మాత్రం మినిమం డిగ్రీ చదివిన వాళ్లకి కూడా అర్థం కాదేమో. అలా ఉంది సినిమా. అయితే తెలుగులో ఇలాంటి టేకింగ్, స్క్రీన్ ప్లే మాత్రం కొత్త అని చెప్పుకోవచ్చు.
భువనాలయం అనే రాజ కోట.. అందులో రామప్ప ఒకే గదిలో 8 ఏళ్ల పాటుగా ఉండటం.. ఇదంతా కూడా ప్రారంభంలో ఓ రకంగా అనిపించొచ్చు. అసలేం చేస్తున్నాడు.. ఏమై ఉంటుంది.. ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు.. అనే ప్రశ్నలు కలుగుతాయి. ఇక కుసుమప్ప, రామప్ప, రేణుక, ఆచారి, లవణప్ప, అచ్చమ్మ పాత్రలతో ఫస్ట్ హాఫ్ అంతా కాస్త గందరగోళంగానే సాగుతుంది. ద్వితీయార్దం పర్వాలేదనిపిస్తుంది. అయితే క్లైమాక్స్ లో మాత్రం ఎవ్వరూ ఊహించని ట్విస్ట్ వస్తుంది. ఓవరాల్ గా ఇది సత్య దేవ్ వన్ మెన్ షో అని చెప్పుకోవచ్చు. ఇందులో వెంకటేష్ మహా చెప్పాలని అనుకున్నది, చూపించింది ఏంటో.. సామాన్య ప్రేక్షకులకు అర్థం కాక.. ఫస్ట్ హాఫ్‌లోనే బయటకు వెళ్లే ప్రమాదం ఉంది. ఇక సహనంగా, ఓపికతో భరిద్దాం అని చివరి వరకు చూసిన ప్రేక్షకుడికి కాస్త రిలీఫ్‌గా ఓ రెండు ట్విస్టులు ఉంటాయి. ఆ చివరి ఐదు నిమిషాలు మాత్రమే కాస్త ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. ఇదొక వినూత్న ప్రయోగం, ప్రయత్నం అని మాత్రం చెప్పుకోవచ్చు.
నాగ బంధం సినిమా గురించి చెప్పాలంటే... ట్రైలర్ చూసాను చాలా బాగా అనిపించింది.. సినిమా చూసాక ట్రైలరే బెటర్ అనిపించింది. అంటే చాల చాలా కంప్లీకేటెడ్ కథను మన ముందు పెట్టాలని ట్రై చేద్దామనుకుని, చాలా చిన్న కథను అతుకుల బొంతలా చేసి మన ముందు పెట్టారనిపించింది. కొన్ని కొన్ని సార్లు మనకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. సినిమా చాలా వరకు వేరే సినిమాల రిఫరెన్స్ తో చేసినట్టు అనిపిస్తుంది. మెయిన్ గా అంజి... అంజి సినిమా రిఫరెన్స్ సీన్స్ చాలా ఉంటాయి.
వరెస్ట్ పార్ట్ ఏంటంటే.. ఒక పెద్ద ఆక్షన్ సీక్వెన్ జరుగుతుంటే సడన్ గా పెద్ద ఫ్లాష్ బ్యాక్ సీన్ నడుస్తూ ఉంటది. అది అస్సలు కనెక్ట్ కాలేదు. మే బీ కనెక్ట్ అయ్యుంటే సినిమా నచ్చి ఉండేదేమో. క్యాస్టింగ్ కూడా బాలేదు. ఎందుకంటే ఒక్కరు కూడా యాక్టింగ్ చేసినట్టు ఉండదు. ఆక్షన్ సీన్స్ బాగున్నా, సందర్భం లేకుండా ఉన్నాయనిపిస్తోంది. అండ్ లెంగ్త్ కూడా చాల ఎక్కువైపోయింది. సగం నుండే థియేటర్ లోంచి లేచిపోదాం అనుకున్నా... కానీ ఎదో ఓపిక పట్టి ఉన్నందుకు... పార్ట్ 2 అని చెప్పి కొంప ముంచాడు. ఓవరాల్ గా ప్రెడిక్టబుల్ గా ఉంటుందనిపించినా ఫైనల్ గా ఎం లేదనిపిస్తుంది. నిద్రొచ్చేస్తుంది. కానీ ఓవర్ లౌడ్ మ్యూజిక్ వల్ల థియేటర్లో నిద్ర కూడా పోలేం.
సినిమా చూసాక నాగబంధం రివ్యూ చెప్పాలంటే... డిస్సపాయింట్ చేసింది. ట్రైలర్ చూసాక ఒక డీసెంట్ ఎక్స్పెక్టేషన్స్ వచ్చింది గాని స్క్రీన్ మీద రొటీన్ గా అనిపించింది. కథ విషయానికి వస్తే... సింపుల్ గా నాగబంధం రహస్యం, బ్రహ్మకమలం గురించి ఉంటుంది అంతే. ముందు ప్లస్ పాయింట్ చెప్పుకుంటే అనంతపద్మనాభస్వామి టెంపుల్ సీన్స్, గ్రాఫిక్స్ విజువల్స్, కొన్ని ఆక్షన్ సీన్స్ బాగుంటాయి అంతే.
ఫస్ట్ హాఫ్ ఒకే ఒకే అన్నట్టుంది. సెకండ్ హాఫ్ మాత్రం వరెస్ట్ ఉంటది. సనాతన ధర్మ డైలాగ్స్ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. మెయిన్ గా సినిమా బిగ్గెస్ట్ డ్రా బ్యాక్ స్క్రీన్ ప్లే. రన్ టైం కూడా 3 గంటలు ఉండడం వల్ల చాలా ల్యాగ్ అనిపించింది. హీరోగా విరాట్ కర్ణ ఏం ఇంప్రెస్ చేయలేదు. ఓవరాల్ గా డైరెక్టర్ అభిషేక్ నామా తీసుకున్న స్టోరీ లైన్, అండ్ స్క్రీన్ ప్లే కొత్తగా లేకపోవడం వల్ల ఎక్కడా ఎంగేజ్ చేయలేదు. స్టోరీలో ఉండే ఎమోషన్ కనెక్ట్ అయ్యేలా లేకపోతే ఎంత ఖర్చు పెట్టినా యూస్ ఉండదు.
ఇప్పుడే నాగబంధం మూవీ చూసొచ్చా... ఫస్ట్ అఫ్ అల్ దేవుడి మీద సినిమా తీస్తే జనాలొస్తారు అనుకోవడం పెద్ద తప్పు. తీసిన దాంట్లో ఎంతో కొంత సెన్స్ ఉంటె బాగుండేది. ఇటు బ్రహ్మ కమలం అంటారు, నాగ బంధం అంటారు... వీటి గురించి సరైన కథే చెప్పలేదు. అండ్ సినిమాలో జనాల్ని ఎలా చంపాలో దాని మీద ఎక్కువ ఫోకస్ చేసినట్టుంటది. అండ్ ఫస్ట్ హాఫ్ అయితే అసలేం లేనట్టు ఉంటది. హీరో హీరోయిన్లు అయితే ఒకటే సీన్ కి లవ్ ట్రాక్ మొదలెడతారు.
ముందు సినిమాలో ఒక నటుడు హీరో ఎప్పుడవుతాడంటే... అన్యాయం జరిగేటప్పుడు కాపాడడానికి వచ్చినపుడే హీరో అవుతాడు. కానీ ఈ సినిమాలో మొత్తం కూడా అన్యాయం జరిగిపోయాక ఫైట్ చేస్తాడు.. అప్పుడేమాత్రం ఫీల్ కూడా రాదు. అండ్ సినిమాలో డైలాగులు కూడా వరెస్ట్ గా ఉంటాయి. ఎందుకంటే అవి సందర్భం లేకుండా వస్తాయి. ట్విస్టులు ఎదో ఓ రేంజ్ లో ఉంటాయనుకుంటే.. అసలేమాత్రం ఎక్కవు. ఓపెన్ గా చెప్పాలంటే మూడు గంటల పదహరు నిమిషాల ఈ సినిమాలో నేను చూసింది రెండున్నర గంటలే... ఏదైనా బెటర్ ఉంది అంటే... అది గ్రాఫిక్స్ మాత్రమే. ట్రెజర్ హంట్ సినిమా అని చెప్పి... నరకడం చంపడం తప్ప ఎం లేదు.
ఇప్పుడే నాగబంధం మూవీ చూసి రావడం జరిగిందన్నమాట. ఈ మూవీ గురించి సెటిల్డ్ గానే చెప్దామనుకుంటున్నా. ఎందుకంటే మేకర్స్ ఈ మూవీకి ఖర్చు పెట్టిందేమైతే ఉందొ... అది స్క్రీన్ పై ఖచ్చితంగా బాగా కనిపించింది. కానీ ఆ నాగబంధం, బ్రహ్మకమలం, ఆలయం గాని, స్టోరీ టెల్లింగ్ ఏదైతే ఉంటదో, అది మాత్రం కొంచెం డల్ గా కొంచెం అడ్వెంచరెస్ గా, ఇంట్రెస్టింగ్ గా లేదేమో అన్నట్టుంటుంది. ఇక ఫస్ట్ హాఫ్ లో ఈ సినిమా స్టార్ట్ అయ్యే విధానం గాని, టెంపుల్ సెట్ అయితే చాలా బాగున్నాయి. ఈ ఫస్ట్ హాఫ్ చూసి సినిమా మొత్తం చించి లేపేస్తారేమో అని అనుకున్నా.
కానీ ఆ లెంగ్తి ఇంటర్వెల్ బ్లాక్ ఏమి ఎక్కదు. ఇక సెకండ్ హాఫ్ లో జరిగే ఫ్లాష్ బ్యాక్ సూపర్ గా ఉంటది అనుకుంటే.. చాలా ల్యాగ్ చేసి చాలా బోర్ కొట్టించారు. ఇంకా చెప్పాలంటే సినిమా సెకండ్ హాఫ్ మొత్తం కూడా చాలా లెంగ్తి సీన్స్ తో బోర్ కొట్టించడం వల్ల కొన్ని మంచి సీన్స్ ఉన్నా కూడా అవి మార్చిపోతాం. అండ్ నాగసాధు ఎపిసోడ్స్ బాగానే ఉన్నా, హై గూస్బంప్స్ వచ్చే సీన్స్ ఉన్నా, ఆ లెంగ్త్ వల్ల మనం రిసీవ్ చేసుకోలేము. ఇక సినిమా గురించి చెప్పుకోవడానికి అంత ఎం లేదు ఎందుకంటే... సినిమా ఆడియన్స్ ని ఎంత ఫ్రస్టేట్ చేస్తదో దానికోసం మరో వీడియో చేయొచ్చు అలా ఉంది.
నాగ బంధం... సినిమా చూసాక ఎలా అనిపించిందంటే.. నాగబంధం మూవీ ఫస్ట్ హాఫ్ చూసి అడ్వెంచర్స్ గా ఉండి, మంచి విజువల్స్ గా రిచ్ గా ఉండడంతో ఇంటర్వెల్ కి సాటిస్ఫై అయ్యాను. కానీ సెకండ్ హాఫ్ ఎప్పుడైతే మొదలవుద్దో, కంప్లీట్ గా అసలేం అనిపించలేదు. ఎప్పుడైపోద్దా ఎప్పుడెళ్ళిపోదామా అనిపించింది. ఇక బేసిక్ స్టోరీ ఏంటంటే... బ్రహ్మకమలం చుట్టూనే ఉంటది.. ఈ ఒక్క లైన్ ఎక్కువే అన్నట్టుంది. సినిమా మొత్తం గ్రాఫిక్స్, విజువల్స్, బీజీఎమ్ రాంప్ ఆడించారు.
ఎప్పుడైతే సినిమా సెకండ్ హాఫ్ లో ఫైట్ మధ్యలో సినిమా ఆపేసి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లారో అప్పుడే సినిమా దొబ్బింది. ఇక హీరోహీరోయిన్ల ట్రాక్ కూడా బాలేదు. అలాగే హీరో యాక్టింగ్ లో చాలా ఇంప్రెప్ అవ్వాలి. కథ, స్క్రీన్ ప్లే విషయంలో డైరెక్టర్ చాలా డిస్సపాయింట్ చేసారు. ఓవరాల్ గా వన్ టైం వాచబుల్ అనడం ఎక్కువే అనిపిస్తుంది. కానీ ఓసారి చూడొచ్చు ఆ విజువల్స్ కోసం.
Browse by Reviewer Category
Discover reviews from different types of critics and publications
News Channel
Movie-specific media and publications
Twitter Channel
Website
Youtube Channel
CA/Advocate
Corporate (Non IT) Employee
Doctor/Health Worker
Freelancer & Consultant
Homemaker / Housewives
Women managing households
Influencer
IT Employee
Journalists & Critics
Private Employee
Small Business Owner
Less than 20 team size
Students & Youth
School students, college students, young viewers