Movie Reviews
Professional reviews and ratings from top critics and publications worldwide
దేశం కోసం ప్రాణాలర్పించే సీక్రెట్ సోల్జర్స్, డిఫెన్స్ మిషన్ లీక్, అండ్ ఫ్రెండ్‌షిప్ కాన్సెప్ట్‌తో వచ్చిన సినిమా ‘సీక్రెట్ సోల్జర్’. కొత్త యాక్టర్స్‌తో ఇంత పెద్ద స్కేల్ ఉన్న స్పై డ్రామాను హెవీ రేంజ్‌లో ప్లాన్ చేయడం గుడ్ ఎఫర్ట్!
ఫస్ట్ హాఫ్ నుండి కథలో వచ్చే ట్విస్ట్‌లు, స్పై ఏజెన్సీ మిషన్స్, అండ్ ఫ్రెండ్‌షిప్ జర్నీని చూపించిన తీరు బాగుంది. నటీనటులు కొత్తవారైనా తమ రోల్స్‌కి న్యాయం చేశారు. కానీ, స్పై థ్రిల్లర్ అని వెళ్లిపోతే మాత్రం కొంత డిసప్పాయింట్ అవ్వక తప్పదు. స్క్రీన్ ప్లే చాలా చోట్ల లాజిక్ మిస్ అయింది. ఏజెన్సీ కమ్యూనికేషన్ లేకపోవడం, కథకి సంబంధం లేకుండా టర్న్‌లు తీసుకోవడం కొంచెం అసహజంగా అనిపిస్తాయి.
ఓవరాల్‌గా ఇది ప్యూర్ స్పై యాక్షన్ ఫిల్మ్ కాకుండా, ఫ్రెండ్‌షిప్ చుట్టూ తిరిగే ఓకే-ఒకే డ్రామా. దేశభక్తి అండ్ స్పై ఎలిమెంట్స్ ఇష్టపడేవారు ఒకసారి క్యాజువల్‌గా ట్రై చేయొచ్చు!
'డీజే టిల్లు'తో బ్లాక్‌బస్టర్ అందుకున్న దర్శకుడు విమల్ కృష్ణ నుంచి వచ్చిన 'అనుమాన పక్షి' బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచింది. వినోదాత్మక చిత్రంగా ప్రచారంలోకి వచ్చినప్పటికీ, సినిమాలో కనీస స్థాయిలో కూడా కామెడీ పండకపోవడం గమనార్హం. బలహీనమైన కథ, అస్పష్టమైన కథనం ఈ సినిమాకి ప్రధాన బలహీనతలుగా మారాయి.
నటుడు రాగ్ మయూర్ తన పాత్రకు పూర్తి న్యాయం చేసినా, దానికి తగిన ప్రతిఫలం దక్కలేదు. సునీల్ కుమార్ ఛాయాగ్రహణంలో కాశ్మీర్ లొకేషన్లు అత్యంత సుందరంగా, రిచ్‌గా కనిపిస్తాయి. నాసిరకం కంటెంట్‌ని సైతం తన ఎడిటింగ్ నైపుణ్యంతో గాడిలో పెట్టేందుకు చోటా కే ప్రసాద్ గట్టిగానే ప్రయత్నించారు. నిర్మాణ విలువలు ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నప్పటికీ, సరైన కథనాన్ని ఎంచుకోవడంలో నిర్మాతలు విఫలమయ్యారు. మొత్తానికి, 'అనుమాన పక్షి' ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో పూర్తిగా విఫలమైంది.
‘అనుమాన పక్షి’ మూవీ రివ్యూ: 'డీజే టిల్లు' ఫేమ్ విమల్ కృష్ణ నుంచి వచ్చిన 'అనుమాన పక్షి' అత్యంత నాసిరకం కథ, కథనాలతో తీవ్రంగా నిరాశపరిచింది. ఇది కామెడీ సినిమా అయినప్పటికీ ప్రేక్షకులకు ఒక్క క్షణం కూడా నవ్వు రాకపోవడం గమనార్హం. రాగ్ మయూర్ ఎంత కష్టపడినా స్క్రిప్ట్ వీక్‌గా ఉండటంతో ఫలితం దక్కలేదు. సునీల్ కుమార్ కాశ్మీర్ విజువల్స్ రిచ్‌గా ఉన్నప్పటికీ, చోటా కే ప్రసాద్ ఎడిటింగ్, నిర్మాతల గ్రాండ్ ప్రోడక్షన్ వాల్యూస్ కూడా ఈ సినిమాను కాపాడలేకపోయాయి.
కంటెంట్ లేని కథను ఎంచుకుని దర్శకుడు విమల్ కృష్ణ పూర్తిగా ఫెయిల్ అయ్యారు. ఇక సినిమాను రెండు గంటల లోపే ఎడిట్ చేయడం చిన్న రిలీఫ్. ఫైనల్ గా నిర్మాణ సంస్థ పెట్టిన ఖర్చు స్క్రీన్ మీద కనిపించినా, సరైన కథ లేకపోవడంతో అది వృధా ప్రయాసగానే మిగిలిపోయింది. ఫైనల్ వర్డ్.. చివరగా నవ్వించడంలో తడబడ్డ అనుమాన పక్షి.
నాని ఇటీవల ఫ్యామిలీ హీరో నుంచి మెల్లిమెల్లిగా యాక్షన్ హీరోగా మారుతున్న సంగతి తెలిసిందే. హిట్ 3 నాని కెరీర్ లో ఎక్కువ యాక్షన్, వైలెన్స్ అనుకుంటే దాన్ని మించిన వైలెన్స్ తో ది ప్యారడైజ్ అనే సినిమాతో వచ్చాడు. అయితే ఈ కథ కొత్తదేమీ కాదు. గుర్తింపు లేని మనుషుల కోసం పోరాటం చేయడం గతంలో అనేక సినిమాల్లో చూసాము. ఇటీవల వచ్చిన పెద్ది సినిమా మెయిన్ పాయింట్ కూడా అదే. కాకపోతే కథ పాతదే అయినా కథనం మాత్రం కొత్తదే. స్క్రీన్ ప్లేలో కథని ఆరు చాఫ్టర్స్ గా చెప్పారు. మాములు స్క్రీన్ ప్లే తో ఈ కథ చెప్పొచ్చు కానీ దర్శకుడు అలా చెప్పాలనుకున్నాడేమో.
ఈ సినిమాతో నాని పూర్తి స్థాయిలో యాక్షన్ హీరోగా మారిపోయాడు అని చెప్పొచ్చు. రెండు జడలు, పర్ఫెక్ట్ జిమ్ బాడీతో, ముక్కుపుడకలు, గొలుసులు, స్పెషల్ డ్రెస్సులతో ఒక సరికొత్త లుక్ లో కనపడటమే కాక యాక్టింగ్ కూడా అదరగొట్టేసాడు. మోహన్ బాబు చాన్నాళ్ల తర్వాత పూర్తి నెగిటివ్ పాత్రలో విలనిజం చూపిస్తూ అదరగొట్టారు. కిల్ సినిమాతో తెలుగు వాళ్లకు కూడా దగ్గరైన బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయల్ కూడా ఇందులో నెగిటివ్ షేడ్స్ తో మెప్పించాడు. ఓవరాల్ గా హీరోయిన్ ట్రాక్, సెకండ్ హాఫ్ లో కొంత ల్యాగ్ ఎడిటింగ్ లో కట్ చేస్తే బెటర్. కథ పాతదే అయిన కొత్త కథనంతో కొత్త ప్రపంచం సృష్టించి సాంకేతికంగా బాగానే తెరకెక్కించాడు దర్శకుడు. మొత్తంగా ‘ది ప్యారడైజ్’ ఓ కొత్త ప్రపంచంలో సవారీల జాతి గుర్తింపు కోసం జరిగే యాక్షన్ ఎమోషనల్ కథ.
ది పారడైజ్ ఫస్ట్ అఫ్ చూసిన తర్వాత నాని కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు అనిపించింది.. కానీ సెకండ్ హాఫ్ దారి తప్పాడు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. అంత పెద్ద ఇంటర్వెల్ సీక్వెన్స్ తర్వాత సెకండ్ హాఫ్ సరిగా డీల్ చేయలేకపోయాడు. ఫస్టాఫ్ లో వర్కవుట్ అయిన ఎమోషన్ సెకండ్ హాఫ్ లో కుదరలేదు. దానితోడు అనవసరపు రాజకీయాలు సినిమాలో ఇరికించినట్టు అనిపించింది.. క్లైమాక్స్ కూడా పూర్తిగా రాజకీయం చేయడం అసంపూర్తిగా అనిపించింది. నాని తన వరకు అద్భుతంగా నటించాడు.. తన దర్శకుడు ఏం చెప్తే అది చేశాడు. మోహన్ బాబు ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్.. కానీ ఆయనను కూడా ఇంకాస్త వాడుకొని ఉంటే బాగుండేది అనిపించింది. రాఘవ్ జుయల్ ఉన్నంతసేపు బాగున్నాడు. మరొక కీలక పాత్రలో సోనాలి కులకర్ణి బాగా నటించింది.
ఈ సినిమాకు మెయిన్ హీరో అనిరుద్.. ఒక్క ముక్కలో చెప్పాలంటే సినిమా కోసం ప్రాణం పెట్టాడు. చాలా చోట్ల అనిరుద్ సంగీతం సినిమాను కాపాడింది. నవీన్ నూలి సెకండ్ హాఫ్ మీద ఫోకస్ చేసి ఉండాల్సిందే. సినిమాటోగ్రఫీ బాగుంది. శ్రీకాంత్ ఓదెల తనకు వచ్చిన గోల్డెన్ ఛాన్స్ ఇంకాస్త బాగా యూస్ చేసుకొని ఉండాల్సింది. సెకండ్ హాఫ్ మీద ఫోకస్ చేసి ఉంటే ప్యారడైజ్ చాలా మంచి మాస్ సినిమా అయి ఉండేది. ఇప్పటికీ అదిరిపోయే ఫస్ట్ ఆఫ్ ఈ సినిమాను మాస్ లోకి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఓవరాల్ గా ది ప్యారడైజ్.. గుర్తింపు కోసం పోరాటం..!
భారీ అంచనాల నడుమ థియేటర్లలోకి వచ్చిన న్యాచురల్ స్టార్ నాని 'ది ప్యారడైజ్' (The Paradise) పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా నిలిచింది! 'దసరా' కాంబో శ్రీకాంత్ ఓదెల - నాని మళ్లీ స్క్రీన్ పై మాస్ విధ్వంసాన్ని సృష్టించారు. దర్శకుడు రాసుకున్న విలనిజం, హీరోయిజం ఎలివేషన్స్ నెక్స్ట్ లెవెల్! మైండ్ బ్లోయింగ్ ఇంటర్వెల్ ఫైట్, అమ్మోరు ఆవాహించినట్టు ఉండే యాక్షన్ సీన్, మోహన్ బాబు స్ట్రాంగ్ రోల్ సినిమాకు హైలైట్. దీనికి తోడు అనిరుధ్ అందించిన ఊరమాస్ BGM సింగిల్ స్క్రీన్లలో విజిల్స్ వేయించింది!
but తెలంగాణ యాస, కొన్ని ఎమోషనల్ సీన్లు అనుకున్నంతగా పండకపోవడం చిన్న మైనస్. సెకండాఫ్ కాస్త మందగించి, పొలిటికల్ లింకులు, logics మిస్ అవ్వడంతో ముగింపు కొంత తేలిపోయింది. overall లాజిక్స్ పక్కనబెడితే... నాని నటన, అనిరుధ్ మ్యూజిక్, ఊరమాస్ యాక్షన్ సీన్స్ కోసం ఓసారి థియేటర్లో చుసేయోచ్చు.
క్రూరుడైన విలన్, నలిగిపోయే ప్రజా సమూహం, వారి రక్షణ కోసం తిరగబడే కథానాయకుడు... "ది ప్యారడైజ్" (The Paradise) కథాంశం పాతదే అయినా, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దానిని ఆవిష్కరించిన తీరు super. విలనిజం, హీరోయిజం సమపాళ్లలో మేళవించి తెరపై ఊరమాస్ విధ్వంసం సృష్టించారు.
కథానాయకుడి తెలంగాణ యాస కొంత తడబడినట్లు అనిపించినా, అంతగా ప్రభావం చూపకపోయినా... ఇంటర్వెల్ లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ మాత్రం అల్టిమేట్! థియేటర్లలో సీట్ల అంచున కూర్చోబెడుతుంది. సెకండాఫ్ కాస్త మందగించినా, అనిరుధ్ అందించిన విశ్వరూప బిజిఎమ్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది.
overall కథలో కొత్తదనం లేకపోయినా, ఊపిరిసలపని రా యాక్షన్ ఎలివేషన్స్‌తో మాస్ ఆడియన్స్, నాని అభిమానులకు ఈ చిత్రం I feast. ఫైనల్ గా ది ప్యారడైజ్ బిర్యానీ బాగుంది.. కానీ ఎదో మిస్సయింది.
రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తీసిన సినిమా అని ప్రమోట్ చేయడం, పాటలు బాగుండటం, విశ్వక్సేన్ సినిమా ప్రమోషన్స్ కి రావడంతో కాగితం పడవలు సినిమాపై ఆసక్తి వచ్చింది. అయితే సినిమాలో ఫస్ట్ హాఫ్ హీరో – హీరోయిన్ లు చిన్నప్పటి నుంచి ప్రేమ సీన్స్, ఫ్రెండ్స్ సీన్స్ తో బాగా సాగదీశారు. చిన్నప్పటి స్కూల్ ఏజ్ కథ అంత సాగదీయాల్సిన అవసరం లేదు. ఇక మూవీలో రాజేష్ – స్వప్న ప్రేమ ఇంట్లో వాళ్లకు తెలిసాక కులం వేరని పెద్దలు చేసే అరాచకాలతో బోలెడన్ని పాత సినిమాలు గుర్తుచేశారు. ఇక క్లైమాక్స్ లో కులం మీద ఓ నాలుగు డైలాగ్స్ వేసి ముగించారు.
పెద్ద మైనస్ ఏంటంటే... సినిమా ఓపెనింగ్ స్కూల్ పిల్లలతో ఒక వరస్ట్ సీన్ తో మొదలు పెట్టారు. లవ్ సీన్స్ మాత్రం క్యూట్ గా రాసుకున్నారు. అన్ని లవ్ సీన్స్ బాగున్నాయి. రెండు ప్రేమ జంటలకు లవ్ సీన్స్ బాగానే రాసుకున్నారు. క్లైమాక్స్, క్లైమాక్స్ లో ఇచ్చే ఒక ట్విస్ట్ రెండూ ఊహిస్తాము. అసలు ఈ సినిమాకు కాగితం పడవలు అనే టైటిల్ ఎందుకు పెట్టారో దర్శకుడికే తెలియాలి. పరువు హత్యలు నేపథ్యంలో అనేక సినిమాలు వచ్చాయి. అందులో ఇదొకటి అంతే. మొత్తంగా ‘కాగితం పడవలు’ పరువు హత్యల నేపథ్యంలో తెరకెక్కిన ఓ ప్రేమకథ. ఈ సినిమాకు 2.25 రేటింగ్ ఇవ్వొచ్చు.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో విశేష ఆదరణ పొంది, రికార్డు కలెక్షన్లు సాధించిన మైలురాయి వెబ్ సిరీస్ ‘మీర్జాపూర్’. కాగా, ఇదే కథాంశంతో వెండితెరపై చలనచిత్రంగా రూపాంతరం చెందడం ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేసింది.
అయితే దర్శక-నిర్మాతలు గుర్మత్ సింగ్ వెబ్ సిరీస్ డిజైన్‌ను అచ్చంగా అనుకరించకుండా, కేవలం కథలోని ప్రధానాంశాన్ని మాత్రమే తీసుకుని సరికొత్త సన్నివేశాలు మరియు పాత్రలతో ఒక ఆసక్తికరమైన కొత్త ప్రయోగాన్ని ముందుకు తీసుకువచ్చారు. కాళీన్ భయ్యాగా పంకజ్ త్రిపాఠి, మున్నా భయ్యాగా దివ్యేందు, గుడ్డుగా అలీ ఫజల్ తమ నటనతో మరోసారి మెప్పించగా, రసిక దుగల్ పాత్రను మునుపటి కంటే భిన్నంగా ఆవిష్కరించిన తీరు ప్రశంసనీయం.
ఇక జాన్ స్టీవార్డ్ అందించిన నేపధ్య సంగీతం మరియు 'గూమార్' పాట విజువల్స్ సినిమాకి అదనపు బలాన్ని చేకూర్చాయి. వెబ్ సిరీస్‌లో ఉన్న అత్యంత తీవ్రమైన వయలెన్స్ మరియు మాస్ కిక్ ఈ వెండితెర వెర్షన్‌లో కాస్త తగ్గినప్పటికీ, ఓవరాల్‌గా ఒక కొత్త కథనాన్ని చూసిన అనుభూతిని ఇది కలిగిస్తుంది. ఫైనల్లీ మీర్జాపూర్ నిడివి ఒక్కటి ఓర్చుకుంటే.. థియేటర్లో మంచి గ్యాంగ్స్ స్టర్స్ డ్రామా ఎక్స్పీయరెన్స్ గ్యారెంటీ.
ఇండియన్ ఓటీటీ సెన్సేషనల్ సిరీస్ మీర్జాపూర్ బిగ్ స్క్రీన్ పై సినిమాగా విడుదలై కూడా మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. పైగా
వెబ్ సిరీస్ తో ప్రేక్షకులకు అలవాటైన తుపాకుల మోతలు, రక్తపాతం, బూతులు, పగలు, ప్రతీకారాలు సినిమా వెండితెరపై మరింత భారీగా కనిపిస్తాయి. దర్శకుడు ఈ మిర్జాపూర్ ప్రపంచాన్ని థియేటర్ ఎక్స్‌పీరియన్స్ కు తగ్గట్లుగా భారీ కాన్వాస్‌పై ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు. అయితే ఓటీటీలో మాదిరిగా మూడు గంటల పాటు ప్రేక్షకులను థియేటర్లలో కట్టిపడేయడంలో కాస్త తడబడ్డారు.
మొదటి సగంలో పాత పాత్రల మధ్య వైరం, కొత్త క్యారెక్టర్ల ఎంట్రీతో స్క్రీన్‌ప్లే ఆసక్తికరంగానే సాగుతుంది. కానీ సెకండాఫ్‌కి వచ్చేసరికి అనవసరమైన ట్రాక్‌లు, రొమాంటిక్ పాటలు రావడం వల్ల అసలు కథ పక్కదారి పడుతుంది. క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్స్ కూడా లాజిక్‌కు దూరంగా సాగాయి. అలాగే సినిమా అంతా మోస్ట్ పవర్ ఫుల్‌గా, భయంకరంగా కనిపించిన బబ్బన్ బబువా పాత్రను క్లైమాక్స్ లో చాలా సింపుల్ గా తేల్చేయడం ఫ్యాన్స్‌కు ఏమాత్రం రుచించదు. ఇక ఓటీటీలో ఉన్నంత స్వేచ్ఛ లేకపోవడం వల్ల సెన్సార్ కత్తెరకు భయపడి హింసను, బూతులను బాగా తగ్గించేశారు.
ఏడుగురు విభిన్న వయస్కులైన మహిళల ఫ్రాన్స్ పర్యటన నేపథ్యంలో తెరకెక్కిన రోడ్-కామెడీ డ్రామా ‘హ్యాపీ జర్నీ’. వినోదం, ఫ్యామిలీ ఎమోషన్స్ కలబోతగా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. కథ పరంగా సింపుల్ గా ఉన్నా, ఎంటర్టైన్మెంట్ కే డైరక్టర్ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. గోవింద్, అప్పారావు పాత్రల పరిచయంతో వేగంగా మొదలయ్యే ప్రథమార్ధం, ఫ్రాన్స్ అందాలు మరియు 'ఎవడి గోల వాడిదే' శైలిలో సాగే హాయిగా నవ్వించే కామెడీతో సాగిపోతుంది.
అయితే ఫస్టాఫ్ మెప్పించినప్పటికీ, ద్వితీయార్ధంలో నాటకీయత ఎక్కువవ్వడం, పాతకాలపు భావోద్వేగాలు మరియు బలవంతపు సామాజిక అంశాల వల్ల కథనం కాస్త ట్రాక్ తప్పుతుంది. ఎమోషనల్ సీన్లు అనుకున్నంతగా పండలేదు. చివరిలో వచ్చే ఊహించని క్లైమాక్స్ ట్విస్ట్, కుటుంబ విలువల సందేశం సినిమాను సరైన ముగింపు వైపు నడిపించాయి. సెకండాఫ్ లోపాలను కాస్త పక్కన పెడితే, వినోదం మరియు క్లైమాక్స్ కోసం ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ క్లీన్ డీసెంట్ ఎంటర్‌టైనర్!
హ్యాపీ జర్నీ మూవీ విషయానికి వస్తే... కొంతమంది గ్రూప్ గా ఏదో ఒక ట్రిప్ కి వెళ్లడం, అక్కడ జ్ఞాపకాలు, ఎమోషన్స్ అనే డైలాగ్స్ తో గతంలో అనేక సినిమాలు వచ్చాయి. అలా ఓ ఏడుగురు ఆడవాళ్లు డిఫరెంట్ ఏజ్ ఉన్నవాళ్లు వెళితే ఎలా ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కో కథ, ఎమోషన్ పెట్టి ఈ హ్యాపీ జర్నీ సినిమాని తీశారు. అయితే సినిమా అంతా వీరి ట్రావెలింగ్ నడుస్తూనే మధ్యమధ్యలో కామెడీ నడుస్తూనే ఒక్కొక్కరి కథ, వ్యథ, కన్నీటి గాధ చూపించారు. ఇవి చూస్తుంటే ఈ కాలంలో ఆడవాళ్లు మగవాళ్ళని దాటేసి, తోసేసి ముందుకు వెళ్లిపోతున్నా ఇంకా దర్శకుడు ఎక్కడో పదేళ్ల క్రితమే ఆగిపోయి అప్పటి సమస్యలని చూపించాడు అనిపిస్తుంది.
అయితే సినిమాలో ఒక్కో పాత్ర ఒక్కోలా బిహేవ్ చేస్తుంది. ఈ ఆడవాళ్ళ మధ్య గొడవలు అవుతాయి. ఆ గొడవలు కూడా కామెడీగానే చూపించారు. అయితే సెకండ్ హాఫ్ అంతా ఎటెటో వెళ్ళిపోతుంది అనుకునే సమయానికి క్లైమాక్స్ లో గోవింద్ ఇచ్చిన ట్విస్ట్ తో హమ్మయ్య బతికించారు అనిపిస్తుంది.ఇక సినిమా చూస్తుంటే వెంకటేష్ జయం మనదేరా ఫస్ట్ హాఫ్ గుర్తుకు రావడం ఖాయం. అలాగే ఫ్రాన్స్ దేశం ట్రావెల్ వ్లోగ్ కూడా చూసినట్టు ఉంటుంది. మొత్తంగా ‘హ్యాపీ జర్నీ’ ఇళ్లల్లో ఉండే ఆడవాళ్లు ఫ్రాన్స్ దేశానికి ట్రిప్ కి వెళ్తే అక్కడ ఏం చేశారు, వాళ్ళ కథేంటి అని కామెడీగా ఎమోషనల్ గా చెప్పే ప్రయత్నం చేశారు.
Browse by Reviewer Category
Discover reviews from different types of critics and publications
News Channel
Movie-specific media and publications
Twitter Channel
Website
Youtube Channel
CA/Advocate
Corporate (Non IT) Employee
Doctor/Health Worker
Freelancer & Consultant
Homemaker / Housewives
Women managing households
Influencer
IT Employee
Journalists & Critics
Private Employee
Small Business Owner
Less than 20 team size
Students & Youth
School students, college students, young viewers