Register as a Reviewer

Movie Reviews

Professional reviews and ratings from top critics and publications worldwide

233
Total Reviews
88
Movies Reviewed
24
Reviewer Categories
Active filters: Category: News Channel ×
Showing 37-48 of 233 reviews
Clear all filters
5.0
out of 10
‘మురారి’ శైలిలోనే రాజవంశానికి 200 ఏళ్ల నాటి శాపం, ప్రతీ 33 ఏళ్లకు ఒకరి మరణం అనే కాన్సెప్ట్‌తో వచ్చిన చిత్రమే ‘మహేంద్రగిరి వారాహి’. లైన్ ఒకటే అయినా, దర్శకుడు సంతోష్ ప్రెజెంటేషన్ పూర్తి భిన్నంగా ఉంటుంది.సినిమా ప్రామిసింగ్ ఆరంభంతో, మంచి ఇంటర్వెల్ సస్పెన్స్‌తో ఆకట్టుకుంటుంది. అనవసరమైన రొమాంటిక్ ట్రాక్స్ లేకుండా కేవలం పాయింట్‌కే కట్టుబడి తీయడం బిగ్ ప్లస్. సిద్ధూ నటన, ఐశ్వర్య రాజేష్ క్యామియో సీన్స్, ప్ర...

‘మురారి’ శైలిలోనే రాజవంశానికి 200 ఏళ్ల నాటి శాపం, ప్రతీ 33 ఏళ్లకు ఒకరి మరణం అనే కాన్సెప్ట్‌తో వచ్చిన చిత్రమే ‘మహేంద్రగిరి వారాహి’. లైన్ ఒకటే అయినా, దర్శకుడు సంతోష్ ప్రెజెంటేషన్ పూర్తి భిన్నంగా ఉంటుంది.


సినిమా ప్రామిసింగ్ ఆరంభంతో, మంచి ఇంటర్వెల్ సస్పెన్స్‌తో ఆకట్టుకుంటుంది. అనవసరమైన రొమాంటిక్ ట్రాక్స్ లేకుండా కేవలం పాయింట్‌కే కట్టుబడి తీయడం బిగ్ ప్లస్. సిద్ధూ నటన, ఐశ్వర్య రాజేష్ క్యామియో సీన్స్, ప్రీ-క్లైమాక్స్ ట్విస్టులు బాగా వర్కవుట్ అయ్యాయి.


అయితే, కొన్ని సీన్లలో లాజిక్ మిస్ అవ్వడం, ల్యాగ్, ప్రమోషన్స్‌లోనే ఐశ్వర్య పాత్రను రివీల్ చేయడం వల్ల థియేటర్ థ్రిల్ కొంత తగ్గింది. స్క్రీన్‌ప్లే ఇంకాస్త పకడ్బందీగా ఉంటే నెక్స్ట్ లెవల్‌లో ఉండేది.


ఫైనల్ వర్డిక్ట్: థ్రిల్లర్ లవర్స్‌కు ఒక డీసెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ వాచ్!


Sep 16, 2026 Telugu
6.0
out of 10
అనగనగా ఓ ఊరు.. ఆ ఊళ్ళో ఓ గుడి.. రాజవంశానికి శాపం.. ప్రతీ 33 ఏళ్ళకు ఒకరి మరణం.. 200 ఏళ్లుగా సాగుతున్న ఆనవాయితీ.. ఇదంతా వింటుంటే మురారి సినిమా కథ గుర్తుకొస్తుంది కదా..? అలాంటి కథతోనే మహేంద్రగిరి వారాహి కూడా వచ్చింది. కాకపోతే కాన్సెప్ట్ ఒకేలా అనిపించినా.. ట్రీట్‌మెంట్ డిఫెరెంట్‌ గా ఉంది.. వారాహి మొదలవ్వడమే చాలా ప్రామిసింగ్‌ గా మొదలైంది.. మధ్యలో కొన్ని ల్యాగ్ సీన్స్ అనిపించినా.. ఇంటర్వెల్ ముందు సెట్ అ...

అనగనగా ఓ ఊరు.. ఆ ఊళ్ళో ఓ గుడి.. రాజవంశానికి శాపం.. ప్రతీ 33 ఏళ్ళకు ఒకరి మరణం.. 200 ఏళ్లుగా సాగుతున్న ఆనవాయితీ.. ఇదంతా వింటుంటే మురారి సినిమా కథ గుర్తుకొస్తుంది కదా..? అలాంటి కథతోనే మహేంద్రగిరి వారాహి కూడా వచ్చింది. కాకపోతే కాన్సెప్ట్ ఒకేలా అనిపించినా.. ట్రీట్‌మెంట్ డిఫెరెంట్‌ గా ఉంది.. వారాహి మొదలవ్వడమే చాలా ప్రామిసింగ్‌ గా మొదలైంది.. మధ్యలో కొన్ని ల్యాగ్ సీన్స్ అనిపించినా.. ఇంటర్వెల్ ముందు సెట్ అయిపోతుంది. సెకండాఫ్‌ కు చాలా ప్రశ్నలు వదిలేసి సస్పెన్స్ మెయింటేన్ చేసారు. అమ్మవారి శాపం నుంచి తప్పించుకోలేక వచ్చే మరణాలు చూస్తుంటే.. కచ్చితంగా దానివెనక ఏదో రహస్యం ఉందనే విషయం అర్థమైపోతుంది. క్లైమాక్స్ వరకు ట్విస్ట్ రివీల్ కాకుండా బాగానే లాక్కొచ్చాడు దర్శకుడు సంతోష్.. 


కానీ మరీ ఊహించలేనంత ట్విస్టులు మాత్రం ఉండవు.. ఆ టైమ్‌కు పాస్ అయిపోతాయి. సిద్ధూతో పాటు ఐశ్వర్య రాజేష్ క్యామియో బాగుంది.. ఇక అనవసరమైన రొమాంటిక్ ట్రాక్స్ లాంటివి ఇరికించకుండా తీసుకున్న పాయింట్‌ కే కట్టుబడి ఉండటం మెచ్చుకోదగ్గ విషయం. ఇక ప్రీ క్లైమాక్స్, ముగింపు సన్నివేశాల్లో రివీల్ అయ్యే ట్విస్టులు, వాటిని రాసుకున్న తీరు ఎంతో ఆకట్టుకుంటాయి. ఇక సినిమాలో కొన్ని సీన్లకు సరైన వివరణ ఇవ్వకుండా వదిలేయడం నిరాశపరుస్తుంది. ఇక ప్రమోషన్స్‌ లోనే ఐశ్వర్య రాజేష్ పాత్రను బయట పెట్టేయడం వల్ల థియేటర్లో ఆ థ్రిల్ చాలా వరకు మిస్ అవుతుంది. స్క్రీన్‌ప్లేను ఇంకొంచెం పకడ్బందీగా, లాజిక్స్‌తో రాసుకుని ఉంటే ఈ మిస్టిక్ థ్రిల్లర్ స్థాయి మరింత పెరిగి ఉండేది.

ఓవరాల్‌గా మహేంద్రగిరి వారాహి.. డీసెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ మిస్టిక్ థ్రిల్లర్..!


Sep 16, 2026 Telugu
5.0
out of 10
సినిమా విషయానికి వస్తే.. ఓ ఆలయం, ఊళ్ళో చనిపోవడం, అంతా దేవుడి వల్ల అనుకోవడం, కానీ దాని వెనక ఏదో ఉండటం.. లాంటి కథలతో కార్తికేయ, సుబ్రహ్మణ్యపురం.. లాంటి అనేక సినిమాలు వచ్చాయి. ఈ మహేంద్రగిరి వారాహి కూడా అదే కథ.సుమంత్ చావుల వెనక రీసెర్చ్ చేసే పాత్రలో బాగానే నటించాడు. సిద్ధూ జొన్నలగడ్డ, ఐశ్వర్య రాజేష్, మాళవిక నాయర్ గెస్ట్ అప్పీరెన్స్ లు బాగుంటాయి.పాత కథే అయినా కొత్త దేవతని తీసుకొని రొటీన్ కథనంతోనే ఊహించ...

సినిమా విషయానికి వస్తే.. ఓ ఆలయం, ఊళ్ళో చనిపోవడం, అంతా దేవుడి వల్ల అనుకోవడం, కానీ దాని వెనక ఏదో ఉండటం.. లాంటి కథలతో కార్తికేయ, సుబ్రహ్మణ్యపురం.. లాంటి అనేక సినిమాలు వచ్చాయి. ఈ మహేంద్రగిరి వారాహి కూడా అదే కథ.


సుమంత్ చావుల వెనక రీసెర్చ్ చేసే పాత్రలో బాగానే నటించాడు. సిద్ధూ జొన్నలగడ్డ, ఐశ్వర్య రాజేష్, మాళవిక నాయర్ గెస్ట్ అప్పీరెన్స్ లు బాగుంటాయి.పాత కథే అయినా కొత్త దేవతని తీసుకొని రొటీన్ కథనంతోనే ఊహించని ట్విస్టులతో తెరకెక్కించాడు దర్శకుడు. ఎడిటింగ్ లో మాత్రం ఫస్ట్ హాఫ్ కొంత ల్యాగ్ సీన్స్ కట్ చేస్తే బెటర్. నిర్మాణ పరంగా కూడా బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది.


మొత్తంగా ‘మహేంద్రగిరి వారాహి’ 200 ఏళ్ళ క్రితం రాజవంశానికి ఇచ్చిన శాపం, దాంతో జరిగే చావులతో సస్పెన్స్ డివోషనల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన సినిమా. 

Sep 16, 2026 Telugu
5.0
out of 10
మిస్టరీ, మైథాలజీ, థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో వచ్చిన మహేంద్రగిరి వారాహి మొదటి నుంచి ఒక ఇంట్రెస్టింగ్ వరల్డ్‌ లోకి తీసుకెళ్తుంది. సుమంత్ తన పాత్రలో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్‌ తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా సెకండాఫ్‌ లో ఆయన యాక్టింగ్, ఇన్వెస్టిగేషన్ సీన్స్ సినిమాకు ప్లస్‌ గా నిలుస్తాయి.అయితే ఫస్ట్ హాఫ్‌ లో కథనం కొంచెం స్లోగా సాగడం, కొన్ని సీన్స్ ముందే ఊహించేలా ఉండటం మైనస్. కథలో ఉన్న మైథాలజికల్ బ్యాక్‌ డ్రాప్...

మిస్టరీ, మైథాలజీ, థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో వచ్చిన మహేంద్రగిరి వారాహి మొదటి నుంచి ఒక ఇంట్రెస్టింగ్ వరల్డ్‌ లోకి తీసుకెళ్తుంది. సుమంత్ తన పాత్రలో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్‌ తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా సెకండాఫ్‌ లో ఆయన యాక్టింగ్, ఇన్వెస్టిగేషన్ సీన్స్ సినిమాకు ప్లస్‌ గా నిలుస్తాయి.

అయితే ఫస్ట్ హాఫ్‌ లో కథనం కొంచెం స్లోగా సాగడం, కొన్ని సీన్స్ ముందే ఊహించేలా ఉండటం మైనస్.


కథలో ఉన్న మైథాలజికల్ బ్యాక్‌ డ్రాప్, విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మంచి ఇంపాక్ట్ ఇస్తాయి. క్లైమాక్స్ వైపు వెళ్లే కొద్దీ సినిమా గ్రిప్ పెరుగుతుంది.

మొత్తానికి కొత్త కాన్సెప్ట్ టచ్ ఉన్నప్పటికీ, స్క్రీన్‌ ప్లే ఇంకా షార్ప్‌ గా ఉంటే సినిమా రేంజ్ మరింత పెరిగేది. సుమంత్ ఫ్యాన్స్, మైథాలజీ థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి ఓసారి ట్రై చేయొచ్చు.


Sep 15, 2026 Telugu

Mandaadi movie review

Sakshi

By Sakshi

6.0
out of 10
కోలీవుడ్ నటుడు సూరి, మన టాలీవుడ్ యాక్టర్ సుహాస్ కాంబినేషన్‌లో సముద్రపు పడవ పందాల నేపథ్యంలో వచ్చిన యాక్షన్ డ్రామా 'మండాడి'. కళింగపట్నంలో స్నేహితులైన ముత్తుకాళి (సూరి), సట్టా పులి (సుహాస్) పగలు, ప్రతికారాల వల్ల శత్రువులుగా మారి పడవ రేసుల్లో ఎలా తలపడ్డారనేదే ఈ చిత్ర కథ.స్క్రీన్ ప్రెజెన్స్‌ తో సూరి అదరగొడితే, నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్‌లో సుహాస్ సరికొత్తగా మెప్పించాడు. ముఖ్యంగా జి.వి. ప్రకాష్ కుమార్ బీ...

కోలీవుడ్ నటుడు సూరి, మన టాలీవుడ్ యాక్టర్ సుహాస్ కాంబినేషన్‌లో సముద్రపు పడవ పందాల నేపథ్యంలో వచ్చిన యాక్షన్ డ్రామా 'మండాడి'. కళింగపట్నంలో స్నేహితులైన ముత్తుకాళి (సూరి), సట్టా పులి (సుహాస్) పగలు, ప్రతికారాల వల్ల శత్రువులుగా మారి పడవ రేసుల్లో ఎలా తలపడ్డారనేదే ఈ చిత్ర కథ.


స్క్రీన్ ప్రెజెన్స్‌ తో సూరి అదరగొడితే, నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్‌లో సుహాస్ సరికొత్తగా మెప్పించాడు. ముఖ్యంగా జి.వి. ప్రకాష్ కుమార్ బీజీఎమ్, ఎస్.ఆర్. కథిర్ సినిమాటోగ్రఫీ, హై-వోల్టేజ్ పడవ పందాల సీక్వెన్సెస్ సినిమాకి మెయిన్ హైలైట్‌గా నిలిచాయి. అయితే, మంచి కాన్సెప్ట్ ఉన్నప్పటికీ, నెమ్మదించిన స్క్రీన్‌ప్లే, సాగదీత సన్నివేశాలు ఆడియన్స్‌కు కాస్త బోర్ కొట్టిస్తాయి. సుహాస్ అభిమానులకు ఆయన పాత్ర కొంత నిరాశ కలిగించవచ్చు.


ఫైనల్ వర్డిక్ట్: ఆకట్టుకునే నటన, మాస్ ఎలిమెంట్స్ ఉన్నా.. స్లో నెరేషన్ వల్ల ఓ మోస్తరుగా మిగిలిన యాక్షన్ డ్రామా ఇది. రెగ్యులర్ కమర్షియల్ మూవీ లవర్స్ ఒకసారి చూడొచ్చు!

Sep 15, 2026 Tamil +1
‘90s – A Middle Class Biopic’ వెబ్ సిరీస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆదిత్య హాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘Epic’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ఈ చిత్రం ప్రేమ, కుటుంబం, కెరీర్ అంశాల చుట్టూ సాగుతుంది. సినిమా కోసం కలలు కనే ఆదిత్యను కుటుంబం లండన్ పంపించడంతో కథ కొత్త మలుపు తిరుగుతుంది. అక్కడ కడలితో పరిచయం, ఆ తర్వాత ప్రేమ అతని జీవితాన్ని ఎలా ప్రభావితం...

‘90s – A Middle Class Biopic’ వెబ్ సిరీస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆదిత్య హాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘Epic’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ఈ చిత్రం ప్రేమ, కుటుంబం, కెరీర్ అంశాల చుట్టూ సాగుతుంది. సినిమా కోసం కలలు కనే ఆదిత్యను కుటుంబం లండన్ పంపించడంతో కథ కొత్త మలుపు తిరుగుతుంది. అక్కడ కడలితో పరిచయం, ఆ తర్వాత ప్రేమ అతని జీవితాన్ని ఎలా ప్రభావితం చేసిందనేది ప్రధాన కథాంశం.


సినిమా ప్రారంభంలో వచ్చే కుటుంబ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఆనంద్ దేవరకొండ సహజమైన నటనతో మెప్పించగా, వైష్ణవి చైతన్య కూడా తన పాత్రకు న్యాయం చేసింది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుంది. శివాజీ, వాసుకి సన్నివేశాలు కూడా కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. హేశం అబ్దుల్లా సంగీతం, నేపథ్య సంగీతం సినిమాకు బలంగా నిలిచాయి.


అయితే కథ, కథనం విషయంలో దర్శకుడు మరింత శ్రద్ధ తీసుకోవాల్సింది. కొన్ని సన్నివేశాలు రొటీన్‌గా అనిపించడంతో పాటు, సినిమా అక్కడక్కడా నెమ్మదిస్తుంది. ప్రేమకథను కూడా మరింత బలంగా చూపించి ఉంటే ఫలితం మెరుగ్గా ఉండేది. మొత్తంగా మంచి ప్రయత్నంగా నిలిచిన ‘Epic’.. అంచనాలు తగ్గించుకుని చూస్తే ఓసారి ఓకే అనిపిస్తుంది.

Sep 11, 2026 Telugu
ఎపిక్ సినిమా విషయానికి వస్తే... పేరెంట్స్ కచ్చితంగా ఈ సినిమాని చూడాలి. విదేశాలకు వెళ్లి వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు? వాళ్ళ పిల్లల ఆలోచనలు, ఆశలు ఏంటి అని తెలుసుకోడానికి ఈ సినిమా చూడాలి. అయితే యు/ ఏ ఇచ్చే సినిమాకు A సర్టిఫికెట్ ఎందుకు ఇచ్చారో సెన్సార్ వాళ్ళకే తెలియాలి. టీజర్, ట్రైలర్స్ లో చూపించిన కొన్ని షాట్స్ సినిమాలో లేవు. ఈ సినిమా దర్శకుడు ఆదిత్య హాసన్ కూడా వనపర్తి నుంచి యూకేకి వెళ్లి అక్కడ చద...

ఎపిక్ సినిమా విషయానికి వస్తే... పేరెంట్స్ కచ్చితంగా ఈ సినిమాని చూడాలి. విదేశాలకు వెళ్లి వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు? వాళ్ళ పిల్లల ఆలోచనలు, ఆశలు ఏంటి అని తెలుసుకోడానికి ఈ సినిమా చూడాలి. అయితే యు/ ఏ ఇచ్చే సినిమాకు A సర్టిఫికెట్ ఎందుకు ఇచ్చారో సెన్సార్ వాళ్ళకే తెలియాలి. టీజర్, ట్రైలర్స్ లో చూపించిన కొన్ని షాట్స్ సినిమాలో లేవు. ఈ సినిమా దర్శకుడు ఆదిత్య హాసన్ కూడా వనపర్తి నుంచి యూకేకి వెళ్లి అక్కడ చదువుకొని ఇక్కడకు వచ్చి దర్శకుడు అయ్యాడు. ప్రమోషన్స్ లో దర్శకుడి లైఫ్ లో, యూకే లో చూసిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీశారు అన్నారు 


కానీ సినిమా చూస్తే ఇది దర్శకుడి బయోపిక్ అనిపిస్తుంది. ఇది ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్. క్లైమాక్స్ లో కథ పూర్తి కాకుండా పార్ట్ 2 ఎపిక్ – ఫైనల్ సెమిస్టర్ కి లీడ్ ఇవ్వడం గమనార్హం. దర్శకుడు తన లైఫ్ లో జరిగిన సంఘటనలను తీసుకొని బాగానే రాసుకొని తెరకెక్కించినా సెకండ్ హాఫ్ లో కాస్త తడబడ్డాడు. డైలాగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. సెకండ్ హాఫ్ లో కొన్ని ల్యాగ్ సీన్స్ ఎడిటింగ్ లో కట్ చేయాల్సింది. నిర్మాణ పరంగా ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది. మొత్తంగా ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ సినిమా విదేశాల్లో చదువుకోడానికి వెళ్లి ఒకే రూమ్ లో జీవించిన ఒక అమ్మాయి – అబ్బాయి మధ్య జరిగే కథ. 

Sep 11, 2026 Telugu
‘90s – A Middle Class Biopic’ ఫేమ్ ఆదిత్య హాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘Epic’ సినిమా థియేటర్లలో మిక్స్‌డ్ రెస్పాన్స్ అందుకుంటోంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య లీడ్ రోల్స్‌లో నటించిన ఈ మూవీ.. లవ్, కెరీర్, ఫ్యామిలీ నేపథ్యంలో సాగుతుంది. ఫస్ట్ హాఫ్‌లో ఫ్యామిలీ సీన్స్, కామెడీ, ఆనంద్–వైష్ణవి కెమిస్ట్రీ ఆకట్టుకుంటాయి. ఆనంద్ తన ఇన్నోసెంట్ క్యారెక్టర్‌లో నేచురల్‌గా మెప్పించగా, వైష్ణవి కూడా మంచి నటన కనబర...

‘90s – A Middle Class Biopic’ ఫేమ్ ఆదిత్య హాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘Epic’ సినిమా థియేటర్లలో మిక్స్‌డ్ రెస్పాన్స్ అందుకుంటోంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య లీడ్ రోల్స్‌లో నటించిన ఈ మూవీ.. లవ్, కెరీర్, ఫ్యామిలీ నేపథ్యంలో సాగుతుంది. ఫస్ట్ హాఫ్‌లో ఫ్యామిలీ సీన్స్, కామెడీ, ఆనంద్–వైష్ణవి కెమిస్ట్రీ ఆకట్టుకుంటాయి. ఆనంద్ తన ఇన్నోసెంట్ క్యారెక్టర్‌లో నేచురల్‌గా మెప్పించగా, వైష్ణవి కూడా మంచి నటన కనబరిచింది.


హేశం అబ్దుల్లా మ్యూజిక్, BGM సినిమాకు ప్లస్. అయితే కథ, స్క్రీన్‌ప్లే అంతగా బలంగా లేకపోవడం, రొటీన్ సీన్స్, ల్యాగ్ మైనస్‌గా మారాయి. కాన్సెప్ట్ ఆసక్తికరంగా ఉన్నా ఎగ్జిక్యూషన్ మాత్రం నిరాశపరుస్తుంది. ఓవరాల్‌గా టైమ్‌పాస్ ఎంటర్టైన్మెంట్ కోరుకునే వారికి ‘Epic’ ఓకే అనిపించొచ్చు.

Sep 11, 2026 Telugu

Sardar 2 movie review

Sakshi

By Sakshi

4.0
out of 10
కార్తీ హీరోగా తెరకెక్కిన సర్దార్ 2 పై మొదటి భాగం కారణంగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఆ అంచనాలను ఈ సీక్వెల్ అందుకోలేకపోయింది. పార్ట్ 1లో ఆకట్టుకున్న స్పై ఎలిమెంట్స్, యాక్షన్ సన్నివేశాలు, ఎమోషనల్ కంటెంట్ ఈసారి పెద్దగా ప్రభావం చూపించవు. కథనం రొటీన్ ఫార్ములాలో సాగుతూ, చాలా సందర్భాల్లో ముందే ఊహించే విధంగా ఉంటుంది.కొన్ని ఆసక్తికరమైన అంశాలు ఉన్నప్పటికీ.. వాటిని బలమైన స్క్రీన్‌ప్లేతో నడిపించడంలో దర్శకు...

కార్తీ హీరోగా తెరకెక్కిన సర్దార్ 2 పై మొదటి భాగం కారణంగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఆ అంచనాలను ఈ సీక్వెల్ అందుకోలేకపోయింది.


పార్ట్ 1లో ఆకట్టుకున్న స్పై ఎలిమెంట్స్, యాక్షన్ సన్నివేశాలు, ఎమోషనల్ కంటెంట్ ఈసారి పెద్దగా ప్రభావం చూపించవు. కథనం రొటీన్ ఫార్ములాలో సాగుతూ, చాలా సందర్భాల్లో ముందే ఊహించే విధంగా ఉంటుంది.


కొన్ని ఆసక్తికరమైన అంశాలు ఉన్నప్పటికీ.. వాటిని బలమైన స్క్రీన్‌ప్లేతో నడిపించడంలో దర్శకుడు విఫలమయ్యారు. కొన్ని సన్నివేశాలు లాజిక్‌కు దూరంగా అనిపిస్తాయి. కార్తీ తన నటనతో సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేసినా.. బలహీనమైన రైటింగ్ కారణంగా పూర్తిస్థాయిలో ఫలితం కనిపించదు.


overall.. భారీ అంచనాలతో వచ్చిన ‘సర్దార్ 2’ రొటీన్ కథనం, బలహీనమైన స్క్రీన్‌ప్లేతో నిరాశపరిచింది. పార్ట్ 1తో పోలిస్తే ఇది స్పష్టంగా డౌన్‌గ్రేడ్ సీక్వెల్.

Sep 10, 2026 Tamil +1

Sardar 2 Movie Review

5.0
out of 10
సర్దార్ సినిమా సూపర్ హిట్ కావడంతో.. అవే అంచనాలు సీక్వెల్ మీద కూడా ఉన్నాయి. అందుకే దర్శకుడు మిత్రన్ అసలు కథను ఎక్కడా పక్కదారి పట్టించకుండా సూటిగా పాయింట్‌లోకి తీసుకెళ్లడం సినిమాకు పెద్ద ప్లస్. ముఖ్యంగా స్పై థ్రిల్లర్‌కు కావాల్సిన అంశాలన్నీ బాగానే రాసుకున్నా కూడా వాటిని సరిగ్గా స్క్రీన్ మీదకు తీసుకురావడంలో అంతగా ఆకట్టుకోలేదు దర్శకుడు మిత్రన్. సర్దార్‌లో ప్లాస్టిక్ వాటర్ బాటిల్ నుంచి కలిగే నష్టాల గుర...

సర్దార్ సినిమా సూపర్ హిట్ కావడంతో.. అవే అంచనాలు సీక్వెల్ మీద కూడా ఉన్నాయి. అందుకే దర్శకుడు మిత్రన్ అసలు కథను ఎక్కడా పక్కదారి పట్టించకుండా సూటిగా పాయింట్‌లోకి తీసుకెళ్లడం సినిమాకు పెద్ద ప్లస్. ముఖ్యంగా స్పై థ్రిల్లర్‌కు కావాల్సిన అంశాలన్నీ బాగానే రాసుకున్నా కూడా వాటిని సరిగ్గా స్క్రీన్ మీదకు తీసుకురావడంలో అంతగా ఆకట్టుకోలేదు దర్శకుడు మిత్రన్. సర్దార్‌లో ప్లాస్టిక్ వాటర్ బాటిల్ నుంచి కలిగే నష్టాల గురించి చెప్పినట్లే.. ఇందులో కృత్రిమ మాంసాహారం, శరీరానికి మందులు విపరీతం అలవాటు చేస్తున్న విధానం గురించి చూపించారు. 


అయితే ఫస్ట్ పార్ట్ చూసి చాలా ఏళ్లవడంతో కాస్త కన్ప్యూజన్స్ కూడా వస్తుంటాయి. మొదటి భాగానికి లింక్ పెడుతూ రాసుకున్న సన్నివేశాలు మళ్లీ గుర్తు చేసుకోవడం కష్టం. ఇక మూవీలో చివర్లో వచ్చే భారీ యాక్షన్ ఎపిసోడ్స్, క్లైమాక్స్ ఫైట్స్ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా డిజైన్ చేశారు. స్క్రీన్‌ ప్లేలో నిడివి కొంచెం తగ్గించి, ఎమోషన్స్‌ను ఇంకొంచెం బలంగా ఎస్టాబ్లిష్ చేసి ఉంటే ఈ స్పై థ్రిల్లర్ రేంజ్ మరింత పెరిగి ఉండేది. ప్రొడక్షన్ వాల్యూస్ సినిమా స్థాయికి తగ్గట్లుగా చాలా రిచ్‌ గా ఉన్నాయి. కాకపోతే విజువల్ ఎఫెక్ట్స్ క్వాలిటీపై ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే అవుట్‌ పుట్ ఇంకా అద్భుతంగా వచ్చేది. ఓవరాల్‌ గా సర్దార్ 2.. యావరేజ్ స్పై థ్రిల్లర్..!


Sep 10, 2026 Tamil +1

Sardar 2 movie review

5.0
out of 10
Sardar 2 Review :సర్దార్ 2 పై భారీ అంచనాలతో థియేటర్‌ కి వెళ్లిన ఆడియన్స్‌ కి మాత్రం నిరాశ తప్పదనే చెప్పాలి. పీఎస్ మిత్రన్ మరోసారి పార్ట్ 1 టెంప్లేట్‌ నే కొనసాగించినప్పటికీ, మొదటి భాగంలో ఆకట్టుకున్న యాక్షన్, స్పై ఎలిమెంట్స్, ఎమోషన్స్ ఈసారి అదే స్థాయిలో వర్కౌట్ కాలేదు. కథనం చాలా సాదాసీదాగా, ముందుగానే ఊహించగలిగే విధంగా సాగుతుంది. కొన్ని ఆసక్తికరమైన ఆలోచనలు ఉన్నప్పటికీ, వాటికి తగినంత ఇంపాక్ట్ ఇవ్వలేకప...

Sardar 2 Review :


సర్దార్ 2 పై భారీ అంచనాలతో థియేటర్‌ కి వెళ్లిన ఆడియన్స్‌ కి మాత్రం నిరాశ తప్పదనే చెప్పాలి. పీఎస్ మిత్రన్ మరోసారి పార్ట్ 1 టెంప్లేట్‌ నే కొనసాగించినప్పటికీ, మొదటి భాగంలో ఆకట్టుకున్న యాక్షన్, స్పై ఎలిమెంట్స్, ఎమోషన్స్ ఈసారి అదే స్థాయిలో వర్కౌట్ కాలేదు. కథనం చాలా సాదాసీదాగా, ముందుగానే ఊహించగలిగే విధంగా సాగుతుంది. కొన్ని ఆసక్తికరమైన ఆలోచనలు ఉన్నప్పటికీ, వాటికి తగినంత ఇంపాక్ట్ ఇవ్వలేకపోయారు.


కార్తీ తన అద్భుతమైన నటనతో సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేసినా, బలహీనమైన రైటింగ్ కారణంగా అది పూర్తిస్థాయిలో ఫలించలేదు. ఎస్.జే. సూర్యను కూడా ఆశించిన స్థాయిలో ఉపయోగించుకోలేకపోయారు. మొత్తంగా చూస్తే.. మంచి పెర్ఫార్మెన్స్ ఉన్నా, ఎంగేజింగ్ రైటింగ్ లేకపోవడంతో ‘సర్దార్ 2’ ఒక డిసప్పాయింటింగ్ సీక్వెల్‌గా మిగిలింది.

Sep 10, 2026 Tamil +1

Sahaa movie review

సహ (Sahaa) 2026 News Channel
6.0
out of 10
నవతరం ప్రేమకథల్లో మునుపెన్నడూ చూడని విభిన్నమైన ఎమోషనల్ డెప్త్‌తో దర్శకుడు నిశాంత్ దోటి తెరకెక్కించిన చిత్రం 'సహ' (లైఫ్ ఆఫ్ సంజు). పూర్తిగా నాయకానాయికల కోణం నుంచే సాగే ఈ కథ, ప్రేమలో తీవ్రమైన అనుబంధం పెంచుకుని ఆ బంధం తెగిపోయాక ఒక యువకుడు ఎదుర్కొనే మానసిక సంఘర్షణను, డిప్రెషన్ మరియు ట్రామాను ఎంతో సహజంగా ఆవిష్కరించింది. సంజు, సహ పాత్రల్లో నటించిన శివ కుమార్, శ్వేత లక్ష్మణ్ తమ సహజసిద్ధమైన నటనతో పాత్రలకు...

నవతరం ప్రేమకథల్లో మునుపెన్నడూ చూడని విభిన్నమైన ఎమోషనల్ డెప్త్‌తో దర్శకుడు నిశాంత్ దోటి తెరకెక్కించిన చిత్రం 'సహ' (లైఫ్ ఆఫ్ సంజు). పూర్తిగా నాయకానాయికల కోణం నుంచే సాగే ఈ కథ, ప్రేమలో తీవ్రమైన అనుబంధం పెంచుకుని ఆ బంధం తెగిపోయాక ఒక యువకుడు ఎదుర్కొనే మానసిక సంఘర్షణను, డిప్రెషన్ మరియు ట్రామాను ఎంతో సహజంగా ఆవిష్కరించింది.


సంజు, సహ పాత్రల్లో నటించిన శివ కుమార్, శ్వేత లక్ష్మణ్ తమ సహజసిద్ధమైన నటనతో పాత్రలకు నూటికి నూరుపాళ్లు ప్రాణం పోయగా, చివరి 20 నిమిషాల క్లైమాక్స్ సన్నివేశాలు ప్రేక్షకుల హృదయాలను తీవ్రంగా కలచివేస్తాయి. అయితే, కథనంలో కొన్ని చోట్ల లాజిక్ లోపించడం, కథ ముందుకు వెళ్లే కొద్దీ వాతావరణం అత్యంత భారంగా మారడం వల్ల ఈ చిత్రం అందరినీ ఆకట్టుకోకపోవచ్చు.


కేవలం తీవ్రమైన ఎమోషనల్ డ్రామాలను ఆస్వాదించే ప్రత్యేక వర్గం (ఓ సెక్షన్) ప్రేక్షకులకు మాత్రమే పరిమితమయ్యే ఈ చిత్రాన్ని చూడటానికి కాస్త ఓపిక, సహనం తప్పనిసరి. ఫైనల్లీ.. గుండెల్ని పిండేసే ఎమోషన్స్ తో సహా ఫీల్ గుడ్ డ్రామా. 


Sep 09, 2026 Telugu
Why MRO?