Movie Reviews
Professional reviews and ratings from top critics and publications worldwide
దర్శకుడు ఎంచుకున్న కథాంశం చాలా సింపుల్ అయినప్పటికీ.. దానిని తెరపై ఆవిష్కరించిన విధానం బాగుంది.. స్క్రీన్ ప్లే ఫాస్టుగా ఉండటంతో "గాయపడ్డ సింహం" పర్లేదు అనిపిస్తుంది. సినిమా ఆద్యంతం వినోదాత్మకంగా సాగేలా దర్శకుడు చేసిన ప్రయత్నం చాలా వరకు ఫలించింది. అయితే కథను ముందుకు నడిపించే ఇతర కీలక సన్నివేశాలు, క్యారెక్టరైజేషన్స్ విషయంలో ఆశించిన స్థాయిలో పట్టు కనిపించలేదు. సినిమా చూస్తున్నంత సేపు ఒక సన్నివేశం తర్వాత మరో సన్నివేశం అలా సాగిపోతుందే తప్ప, ప్రేక్షకుడు ఉత్కంఠగా ఎదురుచూసేలా కథనంలో వేగం లేదు.
అలాగే సినిమాలో కేవలం వినోదం మాత్రమే కాపాడిన ఈ స్క్రీన్ ప్లే లో.. ఎమోషన్స్ కు ఇంకాస్త స్పేస్ ఇచ్చుంటే దర్శకుడికి మంచి మార్కులు పడేవి. స్వీకర్ అగస్తి అందించిన సంగీతం, పాటలు వినడానికి బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదనిపిస్తుంది. ఓవరాల్ గా దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్ ఆలోచన, టేకింగ్ బాగున్నప్పటికీ.. దాన్ని అంతే సమర్థవంతంగా స్క్రీన్ ప్లే గా మలచడంలో కాస్త తడబడ్డాడు. ఇటు నిర్మాతలు కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని బాగా ఖర్చుపెట్టారు. ఓవరాల్ గా ఈ గాయపడ్డ సింహం.. సింపుల్ అండ్ ఎంటర్‌టైనింగ్ గా ఆడియన్స్ ని మెప్పించే అవకాశం ఉంది.
కశ్యప్ శ్రీనివాస్ డైరెక్షన్ లో తరుణ్ భాస్కర్ మెయిన్ లీడ్ లో నటించిన లేటెస్ట్ మూవీ 'గాయపడ్డ సింహం'. కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలో మానసచౌదరి, ఫరియా అబ్దుల్లా హీరోయిన్లుగా నటించగా, థియేటర్లలో మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. కథ పాయింట్ వరకు 'గాయపడ్డ సింహం' చిన్న స్టోరీగా యావరేజ్ గా అనిపించగా, దాన్ని ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కించడంలో డైరెక్టర్ తడబడ్డాడు. సినిమాలో ట్రంప్ మీద రివేంజ్ తీర్చుకోవాలని అనుకోవడం, అదీ చేతబడి చేయాలని హీరో ట్రై చేయడంలో మంచి ఫన్ జెనరేట్ అయింది. కానీ అది కాసేపటికే రొటీన్ ఫీల్ వస్తుంది.
ఇటు డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్ రైటింగ్ పరంగా ఫెయిల్ అయినా... స్టయిలిష్ ఫిల్మ్ మేకింగ్ వరకు కొంత బావుంది. ఇక తరుణ్ భాస్కర్ తన పాత్రకు తగ్గట్టు బానే నటించాడు. అలాగే శ్రీ విష్ణు రోల్ కూడా కొంత ఫన్ గా ఉన్నా ఏం పెద్దగా ఉపయోగపడలేదు. సినిమాకి సంబంధించి సింపుల్ గా కథ బాగున్నప్పటికీ స్పీడు లేకపోవడం వల్ల ఆడియన్స్ బోర్ ఫీల్ అవుతారు, అలాగే కన్ఫ్యూజ్ అవుతారు. ఓవరాల్ గా ఈ గాయపడ్డ సింహం సిల్లీ కామెడీతో ఒక వర్గం ఆడియన్స్ ని నవ్విస్తుంది.
స్పూఫ్ లేదా పేరడీ ప్రధాన ఉద్దేశం ప్రేక్షకులను నవ్వించడం. స్పూఫ్ సీన్ వచ్చినప్పుడు థియేటర్లలో విజిల్స్, క్లాప్స్, నవ్వులు వినిపించ లేదంటే రైటింగ్ పరంగా మేజిక్ మిస్ అయినట్టే. 'గాయపడ్డ సింహం' విషయంలో జరిగింది అదే. 'జల్సా' నుంచి మొదలు పెడితే... 'కేజీఎఫ్', 'అర్జున్ రెడ్డి', 'బొమ్మరిల్లు' వంటి పలు సినిమాలను స్పూఫ్ చేశాడు. ఒక్క స్పూఫ్ కూడా వర్కవుట్ అవ్వలేదు. కథగా చూస్తే... 'గాయపడ్డ సింహం' పాయింట్ లో మంచి పొటెన్షియల్ ఉంది. ట్రంప్ మీద రివేంజ్ తీర్చుకోవాలని అనుకోవడం, అదీ చేతబడి చేయాలని హీరో ట్రై చేయడంలో తెలియని అమాయకత్వం ఉంది. అయితే స్పూఫ్స్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యారు. కానీ, వర్కవుట్ అవ్వలేదు.
ఇటు డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్ సిట్యువేషనల్ హ్యూమర్ మాత్రమే కాదు... పంచ్ డైలాగ్ కామెడీని కూడా మిస్ చేశారు. అయితే రైటింగ్ పరంగా ఫెయిల్ అయినా... స్టయిలిష్ ఫిల్మ్ మేకింగ్ కొంత బావుంది. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ కొంత మేరకు ఆకట్టుకున్నాయి. ఇక తరుణ్ భాస్కర్ తన పాత్రకు తగ్గట్టు నటించారు. పెర్ఫార్మన్స్ స్కోప్ ఉన్న రోల్ కాదు. హీరోయిన్లు మానసా చౌదరి, ఫరియా అబ్దుల్లా... కథలో ఇద్దరి పాత్రలు పరిమితమే. బ్రూటల్ ధర్మగా జేడీ చక్రవర్తి పాత్రకు విపరీతమైన బిల్డప్ ఇచ్చారు. కానీ ఆయన్ను సరిగ్గా వాడుకోలేదు. శ్రీ విష్ణు కనిపించే సన్నివేశాలు తక్కువ. కథగా చూస్తే 'గాయపడ్డ సింహం'లో పాయింట్ బావుంది. కానీ, ఎగ్జిక్యూషన్ ఫెయిల్ అయ్యింది. కామెడీ వర్కవుట్ కాలేదు. డ్రామా పండలేదు. సరదాగా నవ్వుకోవచ్చని వినోదం ఆశించి థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకుల ఆశలకు గాయం చేస్తుందీ సినిమా.
తరుణ్ భాస్కర్ హీరోగా తెరకెక్కిన ‘గాయపడ్డ సింహం’ తాజాగా చిత్రం ప్రేక్షకుల ముందుకు రాగా, ఆడియన్స్ నుండి మిస్క్డ్ రెస్పాన్స్ అందుకుంది. హీరోగా తరుణ్ భాస్కర్ తన పాత్రలో సహజంగా నటించినా, ప్రేక్షకులు ఆయన నుంచి మరింత ఎక్స్‌పెక్ట్ చేసినట్లు అనిపిస్తుంది. హీరోయిన్‌లు ఫరియా అబ్దుల్లా, మానస చౌదరిలు వాళ్ళ రోల్స్ కి తగ్గట్టు నటించారు. ఇక సినిమాలో కీలక పాత్రగా చెప్పుకున్న J. D. Chakravarthy పాత్ర డిజైన్ బాగున్నప్పటికీ, ప్రచారంలో చెప్పినంత ప్రాధాన్యం సినిమాలో కనిపించలేదు. Sree Vishnu తాంత్రికుడిగా కనిపించిన పాత్రలో తనదైన నటనతో ఆకట్టుకున్నాడు.
టెక్నికల్ విషయాల్లో సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదనిపిస్తాయి. అయితే కథనం సాధారణంగా ఉండటం, వినోదం పరిమితంగా ఉండటం సినిమాకు మైనస్‌గా మారాయి. ఓవరాల్ గా ‘గాయపడ్డ సింహం’ ఎలాంటి అంచనాలు లేకుండా వెళితే కొంతవరకు ఆకట్టుకోవచ్చు. కానీ ఎక్కువ కామెడీ ఆశించి వెళితే మాత్రం ప్రేక్షకుడి మనసు గాయపడగా తప్పదు.
గాయపడ్డ సింహం అంటూ ఆడియన్స్ ముందుకొచ్చిన తరుణ్ భాస్కర్ ఈసారి వాళ్ళ పల్స్ పట్టుకోవడంలో తడబడ్డాడు. అంటే పూర్తిగా కాదు గాని, తన మార్క్ చూపించడంలో తడబడ్డాడు. అయితే సినిమాలో దరహాస్ గా నటించిన తరుణ్ భాస్కర్ తన పెర్ఫార్మన్స్ వరకు బానే ఇచ్చాడు. కానీ ఆడియన్స్ ఇంకా ఎక్స్పెక్ట్ చేసారు. ఫరియా అబ్దుల్లా కూడా శాలిని పాత్రకు న్యాయం చేసింది. అక్కడక్కడా కాస్త ఓవర్‌గా అనిపిస్తుంది. మానస చౌదరి కనిపించింది రెండు మూడు సీన్లలోనే అయినా మెప్పించింది.
ఇక సినిమాకు ఎంతో కీలకమైన పాత్రగా చెప్పుకొన్న జెడి చక్రవర్తి పాత్ర డిజైన్ బాగానే ఉంది. కానీ ప్రమోషన్స్‌లో ఆయన చెప్పినంతగా ఆ పాత్రలో ఏమీ లేదు. దర్శకుడు కూడా ఈ చిత్రంలో ఓ పాత్ర పోషించారు. యాక్టింగ్ లోనూ డైలాగ్ డెలివరీలోనూ ఆయనకు పేరు పెట్టక్కర్లేదు. భైరవ్ గా శ్రీవిష్ణు ఓ తాంత్రికుడిగా కనిపించారు. ఆ పాత్రకు న్యాయం చేశారు. విద్యాసాగర్ చింతా సినిమాటోగ్రఫీ బావుంది. నేపథ్య సంగీతం అలరించింది. అయితే వినోదాన్ని కోరుకునే వారికి మాత్రం ఈ సినిమా కాస్త ఊరటను ఇస్తుంది. అంతకుమించి ఎక్స్‌పెక్ట్ చేయడానికి ఈ సినిమాలో ఏమీ లేదు. ఇందులో శ్రీవిష్ణు పోషించిన పాత్రను కంటిన్యూ చేస్తూ 'పోరాడే సింహం' టైటిల్‌తో సీక్వెల్ ప్లాన్ చేసినట్లు లీడ్ ఇచ్చారు. కానీ ఆ అవకాశం దర్శక నిర్మాతలకు ప్రేక్షకులు ఇవ్వకపోవచ్చు.
తరుణ్ భాస్కర్ నటించిన గాయపడ్డ సింహం థియేటర్లలో మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. కథా, కథనాలు రొటీన్ గానే ఉన్నా, డైరెక్టర్ జనరంజకంగా తెరకెక్కించడానికి ట్రై చేసాడు. అయితే సినిమాలో కథనంలో వేగం లేకపోవడంతో కాస్త నెమ్మదిగా కథలోకి వెళ్లినట్టు అనిపిస్తుంది. ఎప్పుడైతే బ్రూటల్ ధర్మ క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తుందో అప్పటి నుంచి కథలో వేగంగా కదలికలు చోటు చేసుకొని రకరకాల ట్విస్టులతో ప్రేక్షకుడిని ఎంగేజ్ చేసిన తీరు బాగుంటుంది. ఇక భైరవ దాస్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత సినిమా మరింత ఊపందుకుంది.
అలాగే కథలో భాగంగా క్లైమాక్స్‌ను ముగించిన తీరు ఫీల్ గుడ్‌గా ఉంటుంది. అలాగే పార్ట్ 2 సినిమాకు పోరాట సింహం అంటూ శ్రీవిష్ణు క్యారెక్టర్ కు ఇచ్చిన లీడ్ బాగుంది. ఓవరాల్ గా చిన్న పాయింట్‌ను లాగి లాగి కథను నడిపించినా.. దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్ కంటెంట్ మీద పెట్టిన శ్రద్ద ప్రతీ ఫ్రేమ్‌లోను కనిపిస్తుంంది. ఈ సినిమాకు విద్యా సాగర్ చింతా సినిమాటోగ్రఫి స్టోరీ మూడ్ ను, క్యారెక్టర్ల ఇంపాక్ట్ ను బాగా క్రియేట్ చేసింది. ఓవరాల్ గా ఈ వారం చూడాల్సిన సినిమాల జాబితాలో గాయపడ్డ సింహాం సినిమాను చేర్చుకోవచ్చు. వినోదంతోపాటు యాక్టర్ల పెర్ఫార్మెన్స్‌ను బాగా ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంది.
తరుణ్ భాస్కర్, మానస చౌదరి, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘గాయపడ్డ సింహం’ సినిమా తాజాగా థియేటర్లలోకి రాగా… ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. మెయిన్ లీడ్ లో నటించిన తరుణ్ భాస్కర్, కీ రోల్ చేసిన శ్రీ విష్ణు ఎవరి స్టైల్ లో వాళ్ళు బానే నటించారు. ఎంటర్టైన్ చేయడానికి సినిమా మొత్తం ట్రై చేస్తారు. కానీ ఎక్కడో కాస్త బెడిసికొట్టింది. ఇక జెడి చక్రవర్తి సినిమాలో ఉన్నంత వరకు బెస్ట్ ఇచ్చాడు. అలాగే సినిమా రిలీజ్ టైం లో ఆయన చేసిన ప్రమోషన్స్ మెచ్చుకుతీరాలి.
ఇటు కంటెంట్ లో ట్రంప్ పై క్రియేట్ చేసిన కామెడీ సీన్లకు మంచి ఫన్ జనరేట్ అవుతుంది. ఓవరాల్ గా గాయపడ్డ సింహం ఈ సమ్మర్ లో నవనవలాడే మామిడిపండులా అనిపిస్తున్నా, ఆడియన్స్ కి కాస్త పులుపు ఫీలింగ్ నే ఇచ్చింది. సింపుల్ గా చెప్పాలంటే ఇది గాయపడ్డ సింహం అనుకుంటే, సినిమా వరకు గాయపడ్డ కథగా మారింది.
తరుణ్ భాస్కర్, మానస చౌదరి, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘గాయపడ్డ సింహం’ సినిమా తాజాగా థియేటర్లలోకి రాగా… ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దర్శకుడు Kashyap Srinivas తీసుకున్న కథ, స్క్రీన్ ప్లే పూర్తిగా రొటీన్ గా ఉండి పెద్దగా ఇంపాక్ట్ ఇవ్వలేకపోయాయి. సినిమాలో కొన్ని కామెడీ సీన్స్, ముఖ్యంగా Sree Vishnu గెస్ట్ రోల్ ఉన్న ట్రాక్ కాస్త రిలీఫ్ ఇచ్చినా… అవి కూడా మొత్తం సినిమాను మోసేంత బలం చూపించలేకపోయాయి. కథలో కొత్తదనం లేకపోవడం, సింపుల్ స్టోరీని కూడా ఆసక్తికరంగా చెప్పలేకపోవడం పెద్ద మైనస్‌గా మారింది.
టెక్నికల్ గా ప్రొడక్షన్ వాల్యూస్ ఓకే అనిపించినా… సంగీతం పెద్దగా ప్రభావం చూపలేదు. అలాగే సాగదీత సీన్స్ ఎక్కువగా ఉండటం వల్ల సినిమా బోర్ ఫీల్ కలిగిస్తుంది. ఎడిటింగ్‌లో ఇంకా కట్స్ అవసరమనే ఫీలింగ్ వస్తుంది. ఓవరాల్ గా ‘గాయపడ్డ సింహం’ = Routine story + slow narration! కొన్ని కామెడీ సీన్స్ తప్ప… సినిమా మొత్తంగా డిసప్పాయింట్ చేస్తుంది. కొత్తదనం ఆశించే వారికి ఇది పూర్తిగా మిస్ అయ్యే అవకాశం ఉంది.
తరుణ్ భాస్కర్, మానస చౌదరి, ఫరియా అబ్దుల్లా హీరో, హీరోయిన్లుగా నటించిన సినిమా గాయపడ్డ సింహం. తాజాగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమాను కశ్యప్ శ్రీనివాస్ డైరెక్ట్ చేయగా, శ్రీవిష్ణు గెస్ట్ రోల్ లో నటించాడు. ఇక సినిమా విషయానికి వస్తే.. కథ స్క్రీన్ ప్లే రొటీన్ గా ఉండి కాస్త డిస్సపాయింట్ చేయగా... సినిమాలో ట్రంప్ – శ్రీవిష్ణు ట్రాక్స్ అండ్ కొన్ని కామెడీ సీన్స్ బాగున్నాయి. నటీనటుల నటన కూడా బాగానే ఉంది. ఐతే, కొన్ని రెగ్యులర్ సీన్స్ అండ్ సింపుల్ స్టోరీ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి.
ఇక ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయ్. సంగీతం పర్లేదు. సాగదీత సీన్లు ఎడిట్ చేయాల్సింది. అయితే ఓవరాల్ గా ఈ గాయపడ్డ సింహం సినిమాలో కామెడీ ఎలిమెంట్స్ మాత్రమే ఆడియన్స్ కి కనెక్ట్ అవుతాయి. థియేటర్లలో ఒకసారి రెగ్యులర్ మూవీ లవర్స్ చూసేయొచ్చు. కానీ కొత్తదనం కోరుకునే వారికీ కనెక్ట్ అయ్యే ఛాన్స్ లేదు.
కర’ సినిమా చూసాక ఒకే ఫీలింగ్… “బేస్ బాగుంది… కానీ ప్యాకేజింగ్ కాస్త వీక్!” హీరోగా Dhanush తనదైన స్టైల్‌లో నేచురల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కొన్ని సీన్స్‌లో ఆయన యాక్టింగ్ నిజంగా హైలైట్. కానీ సినిమా మొత్తం అదే ఎనర్జీని మెంటైన్ చేయలేకపోయింది. డైరెక్టర్ Vignesh Raja తీసుకున్న కాన్సెప్ట్ మాత్రం సాలిడ్. చాలా సీన్లు రియలిస్టిక్ గా ఉంటాయి. కానీ ప్రీ క్లైమాక్స్ వచ్చేసరికి మరీ సినిమాటిక్ లిబర్టీని ఎక్కువగా తీసుకున్నారు. అందువల్ల ఆడియన్స్ కి మరీ ఇంత ఎమోషన్స్ ఏంట్రా తట్టుకోలేకపోతున్నాం అన్న ఫీల్ వస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే కొంచెం ఎమోషనల్ ఓవర్‌డోస్‌గా అనిపిస్తుంది.
కొన్ని సీన్స్ బాగా హిట్ అవుతాయి… కానీ వెంటనే ఫ్లో బ్రేక్ అవ్వడం వల్ల ఆడియెన్స్ కనెక్ట్ మిస్ అవుతుంది. జివి ప్రకాష్ బీజీఎమ్ కూడా బాగుంది. ఓవరాల్ గా కర ఒక స్లో పేస్డ్ ఫిలిం. కానీ సెటప్ చాలా స్ట్రాంగ్ గా ఉంటది. విజువల్స్ కూడా బావుంటాయి. కానీ ఫ్రెష్ నెస్ కోరుకుంటే డిస్సపాయింట్ అవుతారు. రెగ్యులర్ మూవీ లవర్స్ కి అయితే ఒకే గాని, లవ్ స్టోరీస్, యాక్షన్ మూవీస్, ఎంటర్టైన్మెంట్స్ ఇష్టపడే వాళ్లకయితే పెద్దగా సినిమా నచ్చకపోవచ్చు.
‘కర’ సినిమాను ఒక స్ట్రాంగ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కించారని మొదట్లోనే అర్థమవుతుంది. రైతులు, బ్యాంక్ లోన్స్, అన్యాయాలు వంటి సీరియస్ అంశాలను తీసుకున్న దర్శకుడు Vignesh Raja వాటిని ఎక్కువ ఎమోషన్‌తో ప్రెజెంట్ చేయాలని ప్రయత్నించాడు. కానీ అదే ఎమోషన్ కొన్ని చోట్ల ఓవర్ డోస్ అయి, కథనం స్లోగా మారినట్టు అనిపిస్తుంది. హీరోగా Dhanush తనదైన నేచురల్ యాక్టింగ్‌తో కొన్ని సన్నివేశాల్లో మెప్పించినా, మొత్తం సినిమాను బలంగా లిఫ్ట్ చేయలేకపోయాడు.
కానీ కొన్ని పాయింట్స్ మాత్రం చెత్తగా అనిపిస్తాయి. దొంగతనాలు చేయడమే తప్పంటే.. అవి చేస్తున్న ప్రతిసారి హీరో దేవుడ్ని ప్రార్థిస్తాడు, అలాగే హీరో దొంగతనాలు చేయడం తప్పు కాదన్నట్టు పోర్ట్ ట్రే చేస్తునట్టుంటుంది. తమిళ సినిమాల్లో ఇలాంటివి బాగానే చూపిస్తారు. బట్ నటీనటుల పెర్ఫార్మన్స్ కి అయితే పేరు పెట్టలేం. అందరూ బానే చేసారు. స్పెషల్లీ కెఎస్ రవికుమార్. ఆయన తన రోల్ లో జీవించేసారు. ఇక టెక్నికల్ గా చూస్తే విజువల్స్ 90ల వాతావరణాన్ని బాగా రీక్రియేట్ చేశాయి. అయితే ఎడిటింగ్ ఇంకా షార్ప్ గా ఉంటే సినిమా నెరేషన్ మరింత టైట్ గా ఉండేదనే భావన కలుగుతుంది. మొత్తంగా ‘కర’ మంచి ఐడియాతో వచ్చిన సినిమా అయినప్పటికీ, ప్రెజెంటేషన్ మరియు పేస్ కారణంగా పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.
ధనుష్ నటించిన 'కర' సినిమా విషయానికి వస్తే... ఒక ఇంట్రెస్టింగ్ ఐడియాతో స్టార్ట్ అవుతుంది. రైతులు, బ్యాంక్ లోన్స్, అన్యాయాలు… ఇవన్నీ కలిపి ఒక స్ట్రాంగ్ బేస్ తీసుకున్నాడు దర్శకుడు Vignesh Raja. కానీ ఆ ఐడియాను ఎంత ఎమోషనల్‌గా, ఎంత ఎంగేజింగ్ గా స్క్రీన్ పై చూపించాలి అన్న విషయంలో మాత్రం సినిమా పూర్తిగా వర్క్ అవ్వలేదని అనిపిస్తుంది. హీరోగా Dhanush తన పాత్రలో ఎప్పటిలాగే నేచురల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కొన్ని సన్నివేశాల్లో ఆయన యాక్టింగ్ స్ట్రాంగ్‌గా కనెక్ట్ అవుతుంది. కానీ సినిమా నెరేషన్ స్లోగా ఉండడం, కొన్ని చోట్ల ఎమోషన్ ఓవర్‌డోస్ అవ్వడం వల్ల ఆ ఇంపాక్ట్ కంటిన్యూ కాలేదు.
ఇక కథలో ఉన్న రివేంజ్ ఎలిమెంట్, “ముల్లుని ముల్లుతోనే తీయాలి” అన్న కాన్సెప్ట్ బాగానే ఉంది. కానీ ఆ పాయింట్ ను మరింత టైట్ స్క్రీన్ ప్లే తో, ఎంగేజింగ్ నెరేషన్ తో తీసుకెళ్లి ఉంటే సినిమా రిజల్ట్ ఇంకో లెవెల్‌లో ఉండేది. ‘కర’ = Strong concept, but underwhelming execution. మెసేజ్ ఉంది… కానీ ప్రెజెంటేషన్ కొంచెం బలహీనంగా అనిపిస్తుంది. ఒక్క ముక్కలో కర గురించి చెప్పాలంటే ఒక ప్రాపర్ కమర్షియల్ సినిమాలాగా ఉంది. అంటే తెలుగు సినిమాల్లా నాలుగు పాటలు, ఫైట్లు లా కాకుండా, తమిళ సినిమాల్లో ఎలాంటి కాన్సెప్ట్ ఉన్న మూవీస్ ఉంటాయో అలాంటి ఛాయలు కర లో ఉన్నాయి.
Browse by Reviewer Category
Discover reviews from different types of critics and publications
News Channel
Movie-specific media and publications
Twitter Channel
Website
Youtube Channel
CA/Advocate
Corporate (Non IT) Employee
Doctor/Health Worker
Freelancer & Consultant
Homemaker / Housewives
Women managing households
Influencer
IT Employee
Journalists & Critics
Private Employee
Small Business Owner
Less than 20 team size
Students & Youth
School students, college students, young viewers