Movie Reviews
Professional reviews and ratings from top critics and publications worldwide
Maa Inti Bangaram Movie Review
By Cinema Picha
ఇప్పుడే మా ఇంటి బంగారం సినిమా చూసి రావడం జరిగింది. సినిమా గురించి సింపుల్ గా చెప్పాలంటే... మన రాజ్ డీకే గారు తీసిన ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ని, సిటాడెల్ సిరీస్ ని రెండింటిని కలిపి కొడితే వచ్చిన సినిమాయే మా ఇంటి బంగారం అనిపిస్తుంది. సినిమాలో ఫ్యామిలీ సెంటిమెంట్, ఎమోషన్స్, ఆక్షన్, ఫన్ అన్ని బాగానే ఉన్నాయి. అండ్ సినిమాలో సమంత ప్రతి ఫ్రేమ్ లో, అన్ని సీన్స్ లోనూ చితగ్గొట్టిందని చెప్పాలి. సింపుల్ గా సినిమాలో హీరోయిన్ ది ఒకటే ఎజెండా. ఫ్యామిలీని మెప్పించి కోడలిగా తన స్థానం ఫిక్స్ చేసుకోవాలి.
ఇక ఫస్ట్ హాఫ్ బాగానే ఉన్నా, ఎక్కడో స్లో అయిందేమో అనిపిస్తుంది. అండ్ సినిమాలో సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి కామెడి కన్నా, సామ్ తన ఐడెంటిటీని ఎలా సేవ్ చేసుకుంటూ, మ్యానేజ్ చేస్తూ అందర్నీ ఎలా కన్విన్స్ చేస్తుందో అదే సినిమా స్టోరీగా తీసారని చెప్పొచ్చు. అండ్ అక్కడక్కడా సమంత యాక్షన్ చేస్తుంటే కూడా ఫ్యాన్స్ కి అరుపులు వచ్చే లాంటి హై సీన్స్ కూడా ఉన్నాయి. ఓ భీభత్సమైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా, సినిమాను నార్మల్ ఎక్స్పెక్టేషన్స్ తో చుస్తే బెటర్ మూవీ ని చూసేయొచ్చు. సింపుల్ గా ఒక మంచి మూవీని చూసి వచ్చాము అన్నట్టు ఉంటుంది సినిమా.
Maa Inti Bangaram Movie Review
మా ఇంటి బంగారం.. రీసెంట్ గా నాకు నచ్చిన ట్రైలర్స్ లో ఇది కూడా ఒకటి. ఇక సమంత - నందిని రెడ్డి కాంబో లో ఈ సారి మంచి కంటెంట్ ఇస్తారని హోప్ తో వెళ్ళాను. అండ్ సినిమా ఫస్ట్ హాఫ్ వరకు అదే మైంటైన్ చేస్తూ, మంచి ఫన్ జెనరేట్ చేశారు. బట్ సినిమా సెకండ్ హాఫ్ లో క్లైమాక్స్ తప్ప, మొత్తం డల్ అయిపొయింది. ఓవరాల్ గా వన్ టైం వాచబుల్ అనిపిస్తుంది.
సినిమా 90స్ బ్యాక్ డ్రాప్ లో నడుస్తుంది. సమంత పెర్ఫార్మన్స్ అదిరిపోయింది. అండ్ ఫిమేల్ ఓరియెంటెడ్ డైలాగ్స్ కూడా బాగున్నాయి. బట్ మైనస్ పాయింట్స్ గురించి చెప్తే, ఫ్యామిలీ డ్రామా నుండి, ఆక్షన్ డ్రామాకి ఎప్పుడైతే షిఫ్ట్ అవుతుందో అప్పటినుండి సినిమా రొటీన్ టెంప్లెట్ కి వెళ్ళిపోతుంది. ఫైనల్ గా ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ సినిమా నచ్చుతుంది. ఫ్రెష్ నెస్ కోరుకుంటే కష్టమే.
Maa Inti Bangaram Movie Review
మా ఇంటి బంగారం.. సినిమా ఎలా ఉంది రా అంటే.. ఎక్కువ లేదు, తక్కువ లేదు అలానే ఉంది. ఫస్ట్ ఏం వర్కౌట్ అయ్యాయి అంటే కామెడీ. సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ రోల్ చేసిన ఆవిడ బాగా చేసింది. అలాగే హీరొయిన్ ఫన్ కూడా బాగుంది. అండ్ సినిమాలో కొన్ని సీన్స్ అయితే లాజిక్ లెస్ గా ఉన్నాయి. స్పెషల్లీ ఫైట్స్ హీరోయిన్ కి కొన్ని బాగున్నా, ఇంకొన్ని సూట్ కాలేదనిపిస్తుంది. అండ్ సినిమాలో సెట్స్ కూడా అంత బాగా లేవు.
డైరెక్టర్ చెప్పినట్టు ఇదేదో బాషా టెంప్లేట్, అని అనుకుంటే ఫ్లాష్ బ్యాక్ అయితే ఉంది గాని, ఎమోషనల్ అయితే లేదు. స్పెషల్లీ ఫ్యామిలీస్ మధ్య సీన్స్ సరిగా ఎస్టాబ్లిష్ చేయలేదు. అండ్ సినిమాలో విలన్ కూడా స్ట్రాంగ్ గా లేడు. మొత్తం అతడు సినిమాని ఫిమేల్ వెర్షన్ లో దించినట్టుంటుంది. ఫైనల్ గా సినిమా గురించి చెప్పాలంటే నేననుకున్న ఎమోషన్, కనెక్ట్ సినిమా నుండి అయితే రాలేదు. బట్ ఓవరాల్ గా కొంతమందికి నచ్చోచ్చేమో, ఓవరాల్ గా ఓసారి ట్రై చేయొచ్చు అన్నట్టుంది.
Maa inti Bangaram movie Review
By Ideal Brain
ఇంటికి అందరు మహాలక్ష్మిలు కానక్కర్లేదు. కాళికా కూడా దేవతే.
#MaaIntiBangaram is a well-made entertainer that showcases both Samantha’s star power and her acting prowess.
Director Nandini Reddy and creator Raj Nidimoru deliver an action-packed story rooted in strong family emotions, striking a fine balance between commercial appeal and sentiment.
One of the film’s unique highlights is Samantha appearing in sarees throughout the film - even during the action sequences- which adds a distinctive touch to her character.
Instagram influencer Manjusha shines in a well-written role as the protagonist’s friend and delivers a confident performance. Sreemukhi is equally impressive and leaves a mark with her presence.
I loved the way old classic “muthyamantha pasupu” song is fully used at the beginning of the film.
I particularly loved the moment where Sreelakshmi reads the “Nenu Rachayitri…” poem from a magazine - a delightful meta reference to her iconic track in Chantabbai.
The climax works wonderfully and provides a satisfying payoff.
A cameo by Vennela Kishore towards the end feels like the perfect dessert after a satisfying meal.
Samantha delivers with full force, and it feels like the good days are back for Telugu cinema this June.
A blockbuster!
వెరీ ఫస్ట్ థింగ్ ఏంటంటే మా ఇంటి బంగారం అనేది కొత్త కథ కాదు.. ఎన్నో సినిమాలలో మనం చూసిన ఓల్డ్ ఫార్మేట్ కమర్షియల్ కథ. ప్రతిసారి హీరో ఓరియంటెడ్ లో జరిగే కథను ఇక్కడ హీరోయిన్ ఓరియంటెడ్ గా మార్చేశారు. అది సినిమాకు కాస్త కొత్తదనం తీసుకొచ్చి పెట్టింది. పైగా బాషా ఫ్లాష్ బ్యాక్ సినిమాలు తెలుగు ఇండస్ట్రీలో కొత్త కాదు.. సమంత మా ఇంటి బంగారం కూడా అలాంటి ఒక సినిమానే.
అయితే ఎన్నో సినిమాల్లో చూసిన కథనే మళ్లీ రాసాడు రాజ్. తన స్టార్ పవర్ తో చాలావరకు ఈ సినిమాను తన భుజాల మీద మోసింది సమంత. దర్శకురాలు నందిని రెడ్డి స్క్రీన్ ప్లే పై ఇంకాస్త ఫోకస్ చేయాల్సింది. కానీ తన వరకు బెస్ట్ అవుట్ ఫుట్ ఇవ్వడానికి ట్రై చేసారు. ఓవరాల్ గా మా ఇంటి బంగారం.. యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్.. సమంత కోసం..!
సమంత తన కెరీర్‌లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. యశోద సినిమాతో లేడి సూపర్ స్టార్ ఇమేజ్‌ను తెచ్చుకొన్నారు. ఇక ఈ మా ఇంటి బంగారం సినిమాతో డిఫరెంట్ షేడ్స్ ఉన్న స్వర్ణ క్యారెక్టర్ లో ఉండే ఛాలెంజ్‌ను చాలా సులభంగా ఫేస్ చేశారు. కథా కథనాలు రొటీన్ గానే ఉన్నా, ఫిమేల్ వెర్షన్ లో సినిమా ఫ్రెష్ గా అనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్, మ్యూజిక్ బాగున్నాయి.
ఈ సినిమా గురించి ఫైనల్ గా చెప్పాలంటే.. అన్ని వర్గాల ప్రేక్షకులకు, ఫ్యామిలీ ఆడియెన్స్ కు ఫుల్ మీల్స్ లాంటింది. సమంత ఫ్యాన్స్ కు, రాజ్ నిడిమోరు, నందిని రెడ్డి వర్క్ ను అభిమానించే వారికి ఈ సినిమా పిచ్చపిచ్చగా నచ్చేస్తుంది. ఈ వారం చూడాల్సిన సినిమాల జాబితాలో తప్పకుండా చేర్చుకోవాల్సిన సినిమా. మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ ఉన్నచిత్రం.. థియేటర్‌లోనే ఈ సినిమాను ఆస్వాదించండి.
Maa Inti Bangaram Movie Review
సమంత మూడేళ్ల గ్యాప్ తర్వాత కమ్ బ్యాక్ ఇస్తూ నటించిన మూవీ `మా ఇంటి బంగారం`. నందిని రెడ్డి దర్శకత్వంలో రాజ్ నిడిమోరు నిర్మించిన ఈ మూవీ తాజాగా విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. ఇక సినిమాలో సమంత వన్ విమెన్ షోగా మంచి పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకుంది. కానీ కథ విషయంలో అంత స్ట్రాంగ్ గా అనిపించలేదు. దర్శకురాలు నందిని రెడ్డి డైరేక్షన్ వరకు బాగానే హ్యాండిల్ చేసినా, బలమైన కథా, కథనాలు అందించడంలో విఫలమయ్యారు.
ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ బాగుంది. ఎడిటింగ్ కాస్త చేయాల్సింది. ఓవరాల్ గా నటిగా సమంతకిది కమ్ బ్యాక్ మూవీ అవుతుంది. కానీ సినిమాగా కమ్ బ్యాక్ ఇవ్వలేకపోయింది. ఓవరాల్ గా ఈ సినిమా మా ఇంటి బంగారం కాలేకపోయింది.
కథ ప రంగా చూస్తే ఇది కొత్త టెంప్లేట్ కాదు. గతం నుంచి తప్పించుకుని కొత్త జీవితం మొదలుపెట్టిన ఓ మహిళ చుట్టూ కథ తిరుగుతుంది. అయితే సినిమా మొత్తం సమంత వన్ ఉమెన్ షోలా సాగుతుంది. యాక్షన్ సన్నివేశాల్లో ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, అటిట్యూడ్ సినిమాకు ప్రధాన బలం.
కథలో పెద్దగా సర్‌ప్రైజ్‌లు లేకపోయినా, సమంత ఎంటర్‌టైన్ చేస్తుంది. దర్శకుడు కథ కంటే సమంతను ఎలివేట్ చేయడంపైనే ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు అనిపిస్తుంది. మాస్ యాక్షన్, షీరోయిజం ఇష్టపడే వారికి సినిమా కనెక్ట్ అవుతుంది. ఫైనల్ వెర్డిక్ట్: కథ రొటీన్... కానీ సమంత మార్క్ యాక్షన్ అండ్ ఫామిలీ ఎంటర్టైనర్.
తెలుగు ప్రేక్షకులకు హీరో లేదా హీరోయిన్ గతం చుట్టూ తిరిగే కథలు కొత్త కాదు. గతాన్ని వెనక్కి నెట్టి ప్రశాంతమైన జీవితాన్ని ప్రారంభించిన ప్రధాన పాత్రను పాత జీవితంలోని వ్యక్తులు, సంఘటనలు మళ్లీ వెంబడించడం అనేది చాలా సినిమాల్లో కనిపించే అంశం. ఆ గతం కారణంగా కొత్త జీవితంలో ఎదురయ్యే ప్రమాదాలను ఎలా ఎదుర్కొన్నారు? తమకు ప్రియమైన వారిని ఎలా కాపాడుకున్నారు? అనే కథాంశంతో మా ఇంటి బంగారం మూవీ తెరకెక్కింది.
అయితే సినిమాలో కథ కంటే ఎక్కువగా ఆకట్టుకునేది సమంత నటన మరియు ఆమె యాక్షన్ ప్రెజెన్స్. తెరపై ఆమె చూపించిన ఆత్మవిశ్వాసం, యాక్షన్ సన్నివేశాల్లో కనిపించిన ఎనర్జీ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. కథ పరంగా చూస్తే పెద్దగా కొత్తదనం లేకపోయినా, సమంత స్క్రీన్ ప్రెజెన్స్ దానికి బలంగా నిలుస్తుంది. అయితే సెకండ్ హాఫ్ కథను మరింత బలంగా రాసుకుని ఉంటె, సినిమా రేంజ్ మరోలా ఉండేది.
తెలుగు ప్రేక్షకులకు బాషా టెంప్లేట్ కొత్త కాదు. హీరోకి ఓ గతం ఉంటుంది. గతాన్ని వదిలి కొత్త జీవితాన్ని ప్రారంభించిన హీరోని నీడలా వెంటాడుతూ గతం జీవితం తాలుకా వ్యక్తులు వస్తారు. కొత్త జీవితంలో మనుషులకు గతం జీవితంలో మనుషుల నుంచి ఎదురయ్యే ప్రమాదం నుంచి హీరో ఎలా కాపాడాడు? అనేది ఈ తరహా సినిమాల్లో కనిపించే పాయింట్. సేమ్ తరహా కథతో ఫిమేల్ లీడ్ రోల్ నేపథ్యంలో నడిచే సినిమా మా ఇంటి బంగారం.
అయితే యాక్షన్ సినిమాలు కొన్ని చూసినప్పుడు హీరో వన్ మ్యాన్ షో గురించి చెబుతాం. మా ఇంటి బంగారం చూశాక… సమంత షో కనబడుతుంది. థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సమంత యాక్షన్ మాత్రమే గుర్తు ఉంటుంది. రొటీన్ టెంప్లేట్ కథను షీరోయిజంతో గట్టెక్కించాడు. కథ కంటే సమంతను హైలైట్ చేయడం కోసమే సినిమా తీశారని అనిపిస్తుంది. సామ్ అభిమానులకు నచ్చేలా, మెచ్చేలా తీసిన చిత్రమిది.
‘మా ఇంటి బంగారం’ ప్రాజెక్ట్ మీద ఎన్నో అంచనాల్ని సమంత పెట్టుకున్నారు. రాజ్ నిడిమోరు అందించిన కథ కావడం, నందినీ రెడ్డి దర్శకత్వం, సమంత ప్రధాన పాత్రను పోషించడమే కాకుండా నిర్మిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ మీద సహజంగానే అంచనాలు క్రియేట్ అయ్యాయి. కాగా తాజాగా థియేటర్లలో విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది.
అయితే ఎక్కడా కూడా థ్రిల్లింగ్ గా, వావ్ ఈ సీన్ కొత్తగా ఉందే అని అనిపించదు. ప్రతీదీ ప్రేక్షకుడి ఊహకు తగ్గట్టుగానే సాగుతుంది. అయినా కూడా ఎక్కడా బోర్ కొట్టించకుండా ఫ్యామిలీ ఆడియెన్స్‌కి కావాల్సిన ఫన్, ఎమోషన్ ఇలా అన్నింటినీ కథలో జొప్పించారు. ఓవరాల్ గా ‘మా ఇంటి బంగారం’ కథ, కథనం పరంగా ఎక్కడో ఆగిపోయినట్టు అనిపించినా.. సమంత మాత్రం మ్యాజిక్ చేస్తుంది. సమంత ఫ్యాన్స్ కి ఓ ట్రీట్ లా ఈ సినిమా అనిపిస్తుంది. మరి సమంత బాక్సాఫీస్ స్టామినా ఏంటి? కలెక్షన్స్ పరంగా, కమర్షియల్ గా ఎలా ఉంటుందనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
Transfer Trimurthulu Movie Review
By 123telugu
ఫ్యామిలీ ఆడియన్స్‌లో మంచి క్రేజ్ ఉన్న హీరో వడ్డే నవీన్. అయితే సినిమా కెరీర్ లో లాంగ్ బ్రేక్ తీసుకుని దాదాపు 15 ఏళ్ళ తర్వాత "ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు" అనే మూవీతో హీరోగా మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చాడు. వడ్డే నవీన్ స్వయంగా నిర్మించిన ఈ మూవీలో రాశీ సింగ్ హీరోయిన్ గా నటించగా, తాజాగా థియేటర్లలో విడుదలయి బీలో యావరేజ్ టాక్ అందుకుంది.
ఓవరాల్ గా ‘ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు’ అంటూ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ చిత్రంలో.. వడ్డే నవీన్ నటనతో పాటు ఆయన క్యారెక్టరైజేషన్ మరియు యాక్షన్ సీన్స్ బాగానే ఉన్నాయి. ఐతే, సినిమాలో బలమైన ఎమోషన్, కాన్ ఫ్లిక్ట్ మిస్ అయ్యాయి. పైగా ఉన్న ఎమోషన్ లో, ఉన్న కాన్ ఫ్లిక్ట్ లో ప్రేక్షకుడు పూర్తి స్థాయిలో ఇన్ వాల్వ్ అయ్యేంతగా.. అవి సరిగ్గా ఎస్టాబ్లిష్మెంట్ కాలేదు. ఓవరాల్ గా ఈ సినిమా ఆకట్టుకోదు.
Browse by Reviewer Category
Discover reviews from different types of critics and publications
News Channel
Movie-specific media and publications
Twitter Channel
Website
Youtube Channel
CA/Advocate
Corporate (Non IT) Employee
Doctor/Health Worker
Freelancer & Consultant
Homemaker / Housewives
Women managing households
Influencer
IT Employee
Journalists & Critics
Private Employee
Small Business Owner
Less than 20 team size
Students & Youth
School students, college students, young viewers